విద్యుత్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా వేల్పుల రాజేశం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా వేల్పుల రాజేశం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి తెలిపారు.ఆదివారం బెల్లంపల్లి చౌరస్తా ఆవరణలో
మంచిర్యాల సర్కిల్ స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘం
(621/2014) అధ్యక్షులు కుమారస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అనంతరం మంచిర్యాల జిల్లా నూతన ఎస్సీ,ఎస్టీ విద్యుత్ శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.అధ్యక్షులుగా వేల్పుల రాజేశం (ఏడిఈ), కార్యదర్శిగా పసరగొండ శ్రీనివాస్ (ఏ ఏ ఓ),ఎన్నికైన సందర్భంగా జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ జెడ్ ఉత్తమ్,బి.రాజన్న (డి /ఓ పి) బెల్లంపల్లి,కైసర్ (డి /ఓ పి)
అభినందనలు తెలిపారు.