ఎస్సీ ఎస్టీ కేసులను నిర్వీర్యం చేస్తున్న అధికారులు…

ఎస్సీ ఎస్టీ కేసులను నిర్వీర్యం చేస్తున్న అధికారులు

ఎమ్మార్పీఎస్ ఎస్సీ ఎస్టీ జిల్లా కమిటీ సభ్యుడు అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం ఎక్స్ రోడ్ రేగుల గూడెం గ్రామానికి చెందిన కలువల బాలాజీ కుటుంబంపై జరిగిన దాడి జరిగిన అనంతరం దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ కావడం జరిగింది కానీ సంవత్సరం కాలం నుండి నేటి వరకు నిందితులను అరెస్టు చేయలేకపోయారు దానికిగాను జిల్లా కేంద్రంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ ని అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో బాధితులతో కలిసి అడిషనల్ ఎస్పీ కి బాలాజీ కుటుంబం పై జరిగిన ఘటన గురించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
నోముల శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు
గాజుల బిక్షపతి మాదిగ
ఎం ఎస్ పి
భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్
దోర్నాల రాజేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు
అంతడుపుల సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్
వేమునూరు జక్కన్న మాదిగ సీనియర్ నాయకులు
నమూళ్ళ సంపత్ మాదిగ
మంద తిరుపతి మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు
చిరుపంగ చంటి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు
మంతెన చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస తదితరులు పాల్గొన్నారు

పల్లె ప్రకృతి వనంలో శుభ్రత పరిశుభ్రత….

పల్లె ప్రకృతి వనంలో శుభ్రత పరిశుభ్రత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన. ప్రణాళికలో భాగంగా మండే పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో. గ్రామపంచాయతీ మరియు ప్రభుత్వ అధికారుల తో ప్రజల అందరితో మమేకమై కలిసి ప్రకృతి వనంలో పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రజలు ఏమైనా అవసరాలు ఉన్నచో సమస్యలు వచ్చినచో ప్రజా పాలన. ప్రణాళికలో భాగంగా 99 రోజు ల. యాక్షన్ ప్లాన్ ఉంటుందని. ప్రజలు ఏమైనా అవసరాలు సమస్యలు ఉన్నచో తమ దృష్టికి గాని అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించ.వలసిందిగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. తంగళ్ళపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ. కార్యదర్శి ముందoప్రశాంత్. ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య. గ్రామపంచాయతీ పాలకవర్గం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రమాదంలో మృతి కుటుంబాన్ని పరామర్శించిన కేటీ రామారావు….

ప్రమాదంలో మృతి కుటుంబాన్ని పరామర్శించిన కేటీ రామారావు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన.సాయిల.కిషన్ కొన్ని రోజుల క్రితం కుల వృత్తిలో భాగంగా తాటి .చెట్టు.పై.కళ్ళు గీస్తుండగా.ప్రమాదవశావాస్తు మరణించడం జరిగింది. ఈ రోజు జిల్లెల్ల గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు మృతి.నీ. కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం ఇచ్చి గీత కార్మికుడిగా వృత్తి నిర్వహిస్తూ వృత్తిలో భాగంగా తాటి చెట్టు పై ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని. వారి కుటుంబానికి సంపూర్ణ సానుభూతి తెలియజేశారు అలాగే కిషన్ చిత్రపటానికి నివాళులర్పించి వారి ఆత్మ శాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేశారు మరణించిన కిషన్ పిల్లలకు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు కిషన్ ఇద్దరి పిల్లలకు ఒక్క ఒక్కరికి.లక్ష రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్.చేయిస్తానని హామీ ఇచ్చి. బి ఆర్ ఎస్ ప్రభుత్వం రాగానే కుటుంబ వారికి ఉద్యోగం ఇప్పించే విధంగా కృషి చేస్తానని మృతుని.భార్యకు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో. బి. ఆర్. ఎస్ .పార్టీ. నాయకులు. మాజీ సర్పంచ్ .మాట్లమధు. దుబ్బాక .రమేష్.శ్యాగా. దేవేందర్.సిలివేరి.చిరంజీవి. నాయకులు కార్యకర్తలు మృతుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి-డాక్టర్ లతవిశ్వజన్….

మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి-డాక్టర్ లతవిశ్వజన్

చొప్పదండి, నేటిధాత్రి:

 

జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలోని అక్షయ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ లతవిశ్వజన్ మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, అదేవిధంగా మహిళలందరూ ఉన్నత విద్యను అభ్యసించి, అన్ని రంగాల్లో ముందుండాలన్నారు రానున్న రోజుల్లో మహిళలు అందరూ రాజకీయంగా ఎదగాలని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి పాఠశాల సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో అక్షయ పాఠశాల కరస్పాండెంట్ తమ్మిడి కనుకరాజు, ప్రిన్సిపాల్ శ్రీమతి, హుజురాబాద్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అక్షయ్, సిద్ధెంకి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందికి సన్మానం…

గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడి ఆశ వర్కర్, వార్డ్ మెంబర్ సభ్యులను సన్మానించిన-సుంకే రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో మహిళా దినోత్సవ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు, మహిళా వార్డు మెంబర్లు, గ్రామపంచాయతీ మహిళా సిబ్బంది, తదితర మహిళ మునులను శాల్వతో సన్మానించిన చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు లేనిదే మనగడ లేదన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోడీ రవీందర్, ఉప సర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం…

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి నుండి వయా రుద్రారం, రంగసాయిపల్లె, దత్తోజిపేట, లక్ష్మీపూర్, గ్రామాల నుండి గుండి గ్రామం వరకు రోడ్ వేయాలని మరియు బస్ రెగ్యులర్ గా నడవాలని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా వెంటనే స్పందించి పంచాయతీరాజ్ డిఈకి మరియు ఆర్టిసి ఆర్ఎమ్ కీ ఫోన్ చేసి వెంటనే పనులు ప్రారంభించి, సమస్య పరిష్కరించాలని ఆదేశించిన మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణ రెడ్డి, సర్పంచులు ద్యావ అనంతరెడ్డి, గుడ్ల శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాంరెడ్డి, బీమా ఈశ్వర్, గంటల రవీందర్ రెడ్డి, కట్ల వెంకటేశ్, బండారి పర్సారాములు, పిట్టల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం…

ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం.

చిట్యాల, నేటిదాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రాపూర్ మరియు కైలాపూర్ గ్రామ శివారులో సోమవారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. అలాగే డ్రిప్ పరికరాల పనితీరుపై జైన్ డ్రిప్ కంపెనీ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరించాల్సిన మెలకువలు మరియు పంటల యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు.అదేవిధంగా ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు.
ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల సాగు ద్వారా మార్కెట్‌లో మంచి ధర లభించి రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించడం ద్వారా నీటి పొదుపు జరిగి పంటల ఉత్పత్తి పెరుగుతుందని వివరించారు.ఈ సందర్భంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం తెలంగాణ సూక్ష్మ నీటి పారుదల పథకం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ వంటి పథకాల ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలను రైతులకు వివరించారు. అదేవిధంగా రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని సూచించారు.కార్యక్రమం అనంతరం జైన్ డ్రిప్ కంపెనీ జోనల్ మేనేజర్ భవాని ప్రసాద్ రైతులకు డ్రిప్ వ్యవస్థ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణ పద్ధతులు మరియు నీటి పొదుపు ద్వారా పంటల ఉత్పత్తి పెంపు గురించి వివరించారు.
అలాగే కార్యక్రమం అనంతరం తెలంగాణ ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు కూరగాయల మినీ కిట్లను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి రామాచారి, రామచంద్రాపూర్ సర్పంచ్, ఆయిల్ పామ్ ఇన్‌చార్జ్ వాసు, ఫినోలెక్స్ కంపెనీ ప్రతినిధి శ్యాం కుమార్, రైతులు వల్లకొండ లింగారెడ్డి, సమ్మిరెడ్డి, గంపల రమేష్, మధుకర్, సతీష్, ఆయిల్ పామ్ మండల ప్రతినిధులు సాయి, ప్రీతం తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక పాఠశాల ఝాన్సీ లింగాపూర్ బీసీకాలనీ లో స్వయం పరిపాలన దినోత్సవం…

ప్రాథమిక పాఠశాల ఝాన్సీ లింగాపూర్ బీసీకాలనీ లో స్వయం పరిపాలన దినోత్సవం…

రామాయంపేట మార్చి 9 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ బీసీ పాఠశాలలో సోమవారం నాడు స్వయంపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు సహార్శ్ డి ఈ ఓ గా నందీశ్వర్ ఎంఈఓ గా మనీష్ గౌడ్ హెడమాస్టర్ గా యశ్వంత్ పి ఈ టి గా రామకృష్ణ శివప్రసాద్ శివతేజలు ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులుగా నందిత తేజస్విని అవంతిక రిషిక మరియు శ్రీనిధి విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి నరసింహారావు ఉపాధ్యాయులు రవికుమార్ పాల్గొని ఉపాధ్యాయులైన విద్యార్థులను అభినందించి బహుమతులు ఇవ్వడం జరిగింది.

కుషాయిగూడ కాటమయ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే…

కుషాయిగూడ కాటమయ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే

నేటిధాత్రి

 

కుషాయిగూడలోని కాటమయ్య దేవాలయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే కి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ,స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యనికి గురైన అంబేద్కర్ జంక్షన్…

నిర్లక్ష్యనికి గురైన అంబేద్కర్ జంక్షన్

కొద్దినెలలుగా నిలిచిపోయిన వాటర్ ఫౌంటెన్

ఫౌంటెన్ చుట్టూ పేరుకుపోయిన చెత్త

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు

పరకాల,నేటిధాత్రి

 

పట్టణ సుందరీకరణలో భాగంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయింది.పట్టణానికి మరింత అందాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఫౌంటెన్ కొన్ని నెలలుగా పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఫౌంటెన్ పనిచేయకపోవడంతో అందులో టీ గ్లాసులు,ప్లాస్టిక్ కప్పులు,ఇతర చెత్త చెదారం పేరుకుపోయి దయనీయ స్థితికి చేరిందని ప్రజలు వాపోతున్నారు.పట్టణం మధ్యలో ఉన్న ముఖ్యమైన ప్రదేశంలో ఈ విధంగా ఫౌంటెన్ నిరుపయోగంగా ఉండటం సరికాదని స్థానికులు అంటున్నారు.అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రతిరోజూ అనేక మంది ప్రజలు,ప్రయాణికులు, యువత రాకపోకలు సాగిస్తుంటారు.అలాంటి ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ఈ విధంగా నిలిచిపోవడం వల్ల పట్టణ సుందరీకరణకు మచ్చలా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు వృథా కాకుండా ఉండాలంటే అధికారులు వెంటనే స్పందించి ఫౌంటెన్‌ను మరమ్మతులు చేయించి తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అలాగే ఫౌంటెన్ చుట్టూ పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.సంబంధిత అధికారులు దృష్టి సారించి ఫౌంటెన్‌ను పునరుద్ధరించి పట్టణ సుందరీకరణకు మళ్లీ ప్రతీకగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.

ఈ ప్రదేశాన్ని నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం

డిఎస్పీ పట్టణ అధ్యక్షులు బొచ్చు నాగరాజు

పట్టణ సుందరికరణ నిమిత్తం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ పై అధికారులు పాలకులు చూపుతున్న నిర్లక్ష్య వైఖరి సరికాదు.గతంలో సాయంకాలం అవ్వగానే కనుసొంపుగా ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా కల్లు చెమ్మగిల్లే లైట్లతో సుందరంగా ఉండేది కానీ ఇప్పుడు పనిచేయని పరిస్థితిలో కనపడటం పాలకులు అధికారులు కన్నెత్తి ఇటు చూడకపోవడం బాధాకరం.ఫౌంటెన్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రతను నిర్వహించాలి వాటర్ ఫౌంటెన్ మళ్లీ పనిచేసేలా వెంటనే చర్యలు తీసుకొని అంబేద్కర్ సర్కిల్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలి.

రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పు తొడిగిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి..

రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పు తొడిగిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పాషా
మెట్ పల్లి మార్చి 9 నేటి ధాత్రి

 

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పులు తొడిగిన నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా కోరారు ఈ సందర్బంగ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహనికి చెప్పులు తొడగడం క్షమించరాని చర్య అని, నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణా ఉద్యమ సమయంలో రాజీవ్ గాంధి విగ్రహాన్ని ఉద్యమకారులు ధ్వంసం చేసారని, స్థానిక కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఇటీవల బాగుచేయించామని, ఈ క్రమంలో ఇలాంటి చర్యలు చేపట్టడం అనైతిక చర్య అన్నారు. భారత దేశానికి వన్నె తెచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీ అని, రాష్ట్రాన్ని ప్రగతిపతంలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నిందితులను ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు.

బస్టాండుకు మోక్షం కలిగేనా….

బస్టాండుకు మోక్షం కలిగేనా…..?

“◆-: ఇబ్బందుల్లో ప్రయాణీకులు

“◆-: కన్నెత్తి చూడని ఆర్టీసీ అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు అస్తవ్యస్తంగా వయారైంది. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రజాప్రతిని ధులు, అధికారులు బస్టాండ్ నిర్మాణానికి పూనుకున్నారు. 1991 మార్చి 28న అప్పటి మంత్రి సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ బస్టాండు నిర్మాణం పూర్తి చేసు కున్న తర్వాత ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. 1997 జూన్ నెలలో అప్పటి ఎమ్మెల్యే జంగల్ బాగన్న మెదక్ ఎంపీ స్వర్గీయ బాగారెడ్డి చేతుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సు ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధులు అలసత్వం వల్ల బస్టాండు పూర్తిగా వాడుకలోకి రాలేదు. దీంతో బస్సులు బస్టాండ్లోకి రాకుండానే నేరుగా ఝురాసంగంలోని చౌరస్తా వద్ద బస్సులు

ఆటోలు నిలుపుతున్నారు.ఆర్టీసీ బస్టాండు ఉన్నప్పటికీ ఐస్టాండ్లోకి ప్రయాణికులు రాకపో వడంతో చౌరస్తా నుండే ప్రయాణీకులను తీసుకెళ్తున్నారు. బస్టాండ్ లో సరైన సదుపా యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బస్టాండ్ లో రెండు దురాణాలు, మరుగుదొడ్లు, బస్సులు నిలిచేందుకు స్టేజీలు, దాంతోపాటు కూర్చు నేందుకు దిమ్మెలు కూడా ఏర్పాటు చేశారు. బస్టాండ్ లోకి బస్సులు వెళ్లకపోవడం, ఆర్టిసీ అధికారులు బస్టాండ్ వైపు కన్నెత్తి చూడకపో వడంతో బస్టాండ్ లోని రెండు దుకాణాల షటర్లు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.

వీటితోపాటు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన దిమ్మెలతో పాటు ఫోరింగ్ కు వేసిన శాబాద్ బండలను సైతం తీసుకెళ్ళారు. అయినప్పటికీ ఆర్టిసీ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించ డంతో బస్టాండ్ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో పేరుకుపోయింది. గీత రెండు సంవత్సరాల క్రితం బస్టాండ్ ముందు ప్రైవేటు వ్యక్తులకు సిమెంటు స్తంబాలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధి కారులు లీజుకి ఇచ్చినప్పటికీ బస్టాండ్ మాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. చౌరస్తా వద్ద దుకాణాల సముదా యాలు ఉండడం వల్ల బస్సులు, ఆటోలు ఆపడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుకుంది

ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం,

ఝరాసంగం బస్టాండ్ నిర్వహణ పై
జహీరాబాద్ డిపో మేనేజర్ స్వామి మాట్లాడుతూ గత నెల రోజుల క్రితమే మహా శివరాత్రి పర్వదినం రోజున బస్టాండ్ ను శుభ్రం చేశామని, అక్కడికి బస్సులు వచ్చి పోతున్నాయని చెప్పడం గమనార్హం. బస్టాండ్ లోని రెండు దురా ణాల సముదాయాలకు సంబంధించి షట్టర్లు లేవని ఆడగగా తాము ఎప్పటిక ప్పుడు బస్టాండ్ ను పరిశీలిస్తున్నట్లు. తమతో పాటు తమ సిబ్బంది కూడా బస్టాండ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

-స్వామి, ఆర్టీసీ మేనేజర్

సిరిసిల్లలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్ నిర్వహణ…

సిరిసిల్లలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్ నిర్వహణ

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం ఉదయం 5కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కూడలి నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన ఈ రన్‌లో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బతుకమ్మ ఘాట్ వద్ద ప్రజా పాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో పారిశుధ్య నిర్వహణకు ప్రతి పౌరుడు బాధ్యతగా సహకరించాలని కోరారు. గతంలో సిరిసిల్ల పట్టణం సాధించిన అవార్డులను మళ్లీ సాధించేందుకు ప్రజలందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని స్వచ్ఛమైన, పర్యావరణ హిత పట్టణంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిల్ సభ్యులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిల్లేపల్లి గ్రామ సర్పంచ్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న నాయకులు…

చిల్లేపల్లి గ్రామ సర్పంచ్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న నాయకులు

◆-: తెలంగాణ రాష్ట్రసెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఝరాసంఘం మండలం చీలపల్లీ గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి గారీ కూతురు నవీత-సాయిరాం రెడ్డి గార్ల వివాహం న్యాల్కల్ ముంగి క్రాస్ రోడ్డు శ్రీఆదిలక్ష్మీ కళ్యాణ మండపం లో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్దం.ఉజ్వల్ రెడ్డి గార్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఝరాసంఘం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్,మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,కౌన్సిలర్ అరుణ్ కుమార్,ఉదయ్ శంకర్ పాటిల్,అశ్విన్ పాటిల్,హఫీజ్,జగదీశ్వర్ రెడ్డి,నర్సింహా యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

హద్నూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి..

హద్నూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని స్థానికులు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ను కోరారు. హద్నూరు గ్రామ శివారులో జరుగుతున్న 26వ ఉజ్జీవ కూటముల జాతరోత్సవాల్లో పాల్గొన్న ఎంపీకి గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు వినతి పత్రాన్ని అందజేశారు. మండలం విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, హద్నూర్ను మండల కేంద్రంగా ప్రకటిస్తే పరిసర గ్రామాలకు అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. అలాగే హద్నూర్ రామతీర్థం, హద్నూర్ తాండాలకు చెందిన పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి, గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీని విజ్ఞప్తి చేశారు.

దళితులకు అభయ హస్తం పథకం అమలు చేయాలి…

దళితులకు అభయ హస్తం పథకం అమలు చేయాలి

ఈనెల 18న దళిత మహాసభ విజయవంతం చేయండి

ఎం హెచ్ పి ఎస్ జిల్లా కన్వీనర్ తిక్కరాజు మాదిగ పిలుపు

భూపాలపల్లి నేటిధాత్రి

ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షల రూపాయలు పథకం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న హన్మకొండలోని హరిత కాకతీయ లో జరుగు దళిత మహాసభను విజయవంతం చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ తిక్క రాజు మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో దళిత మహాసభకు సంబంధించినటువంటి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిక్క రాజు మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చేవెళ్లలో జరిగిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలో అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 12 లక్షల రూపాయలు పథకాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దళితులకు ఇచ్చిన హామీ ఏమైనాట్లని ప్రశ్నించారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో దళితులకు దళిత బంధ పేరుతో 10 లక్షల రూపాయలు అందించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఈ పథకం అమలు చేయకుండా దళితులను మోసం చేస్తున్నారన్నారు ఎస్సీ కార్పొరేషన్ ను మూడు విభాగాలుగా విభజించి తక్షణమే కార్పొరేషన్ చైర్మన్ ల నియమించాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో జరిగే దళిత మహాసభ దళితులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టేవాడ సమ్మయ్య, తిక్క మల్లయ్య, రడపాక సారయ్య, మొలుగూరి సారయ్య, కార్తీక్, నర్సింహులు, విజయ్, రాజారాం, లక్ష్మీ, లావణ్య లు పాల్గొన్నారు.

ఆపదలో అండగా నిలిచిన మాధవి.. కన్నీళ్ల కుటుంబానికి ధైర్యం..

ఆపదలో అండగా నిలిచిన మాధవి.. కన్నీళ్ల కుటుంబానికి ధైర్యం..

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్.. దుఃఖంలో ఉన్న కుటుంబానికి మాధవి అండ..

కన్నీళ్ల మధ్య మానవత్వం.. బాధిత కుటుంబానికి మాధవి సహాయం..

కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఆకస్మికంగా దూరమైతే ఆ ఇంట్లో మిగిలేది కన్నీళ్లు… నిస్సహాయత మాత్రమే. అలాంటి దుఃఖంలో మునిగిపోయిన కుటుంబానికి ఓదార్పుగా నిలబడుతూ, “ప్రజాప్రతినిధి అంటే ఇదే” అని మరోసారి నిరూపించారు రామాయంపేట 10వ వార్డు కౌన్సిలర్ మద్దెల మాధవి రమేష్. మాట ఇచ్చినప్పుడు మాత్రమే కాదు… ఆపద వచ్చినప్పుడు కూడా ప్రజలతోనే ఉంటానని చూపిస్తూ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు.

 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపల్ పరిధిలోని ఉప్పరి బస్తీకి చెందిన ముజరేకర్ నివాస్ ఈ నెల 15-02-2026న ప్రమాదవశాత్తు మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి ఒక్కసారిగా దూరమవడంతో భార్యా పిల్లలు సహా కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆ ఇంటి గడప దాటిన ప్రతి ఒక్కరి కళ్లలోనూ కన్నీళ్లు… హృదయాల్లో బాధ మాత్రమే కనిపించింది.
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే 10వ వార్డు కౌన్సిలర్ మద్దెల మాధవి రమేష్ స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన “ఆపద సంపద” హామీని నిలబెట్టుకుంటూ రూ.5,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టసమయంలో అండగా నిలిచిన ఆమె చర్యకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాధవి రమేష్ మాట్లాడుతూ… ప్రజలు ఇచ్చిన బాధ్యత తనకు పదవి మాత్రమే కాదని, అది సేవ చేసే అవకాశం అని అన్నారు. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ముందుండి సహాయం చేయడం ప్రజాప్రతినిధిగా తన కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లోనే ప్రజాప్రతినిధి నిజమైన బాధ్యత బయటపడుతుందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆపద సమయంలో అండగా నిలిచిన కౌన్సిలర్ మాధవి రమేష్ మానవత్వాన్ని చాటిన ఈ సంఘటన స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
మానవత్వమే పెద్ద రాజకీయమని… ఆపదలో చేయి అందించినవారే నిజమైన ప్రజా ప్రతినిధులని మరోసారి గుర్తు చేసింది ఈ ఘటన.

మండుతున్న సూర్యులు….మండుతున్న ఎండలు…

మండుతున్న సూర్యులు….మండుతున్న ఎండలు…

◆-: ఫిబ్రవరిలోనే సుర్రుమంటున్న సూర్యుడు

◆-: 40 డిగ్రీలకు చేరువలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

◆-: రాత్రి పూటా పెరుగుతున్న టెంపరేచర్‌

◆-: అధికమవుతున్న కరెంట్‌ వినియోగం

◆-: వాతావరణ మార్పులతో వ్యాధులకు అవకాశం

◆-: జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల మేర ఎకువగా రికార్డవుతున్నాయి. తేమ శాతం తగ్గడంతో జనం ఉకపోతతో ఇబ్బంది పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈసారి అప్పుడే భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఉకిరిబికిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండని చూసి ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలో ఇలా ఉంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేటలో 37 డిగ్రీలు, ఆలేరులో 36.9, బీబీనగర్‌, రామన్నపేటలో 36.6 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.8 డిగ్రీలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 20 రోజుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే రికార్డ్‌ అయ్యాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. మండే ఎండలకు తోడు గాలిలో తేమ శాతం కూడా పడిపోతున్నది.

మొదలైన ఏసీలు, కూలర్ల వాడకం

జిల్లాలో కరెంట్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో విరివిగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. గత నెలలో రోజుకు 8 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ వాడగా, ఇటీవల 9 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. ఎండలు, ఉకపోత ధాటికి తాళలేక ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. ఈ నెలాఖరులో 10 మిలియన్‌ యూనిట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సీజనల్‌ వ్యాధులకు ఆసారం..

చలి కాలం పోయి, వేసవి వచ్చేస్తున్నది. దీంతోపాటు సీజనల్‌ వ్యాధులు కూడా దరి చేరే ప్రమాదం ఉంది. జ్వరం, జలుబు, అతిసారం, నీళ్ల వీరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో వచ్చే ఆటలమ్మ(చికెన్‌ పాక్స్‌), కామెర్లు వచ్చే ఆసారం ఉంది. గవద బిళ్లలు, టైఫాయిడ్‌ , పొంగు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ద్రవ పదార్థాలు తీసుకోవాలి..

ఎండలు ఎకువగా ఉండటంతో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరు బయట పనిచేసే వారు సూర్యరశ్మి కాపాడుకునేలా జాగ్రత్త పడాలి. తరుచూ నీళ్లు తాగాలి. ఎకువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తెలుపు రంగు, లేత రంగులు పలుచని కాటన్‌ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. చంటిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వడగాల్పులకు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. కాఫీలు, టీలు అధిక వేడి సమయంలో తీసుకోకూడదు.

పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి

చలి కాలం ముగుస్తున్నది. వేసవి సమీపిస్తున్నది. కాలం మారుతుండటంతో సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నీరు ఎంత ఎకువ తీసుకుంటే అంత మంచిది. ఎండలో ఎకువగా తిరిగితే డయేరియా రావొచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా చూసుకోవాలి.

– డాక్టర్‌ రమ్య ఝరాసంగం మండల వైద్యాధికారి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు సాయంత్రం సంగారెడ్డి జిల్లా పారామెడిక్స్ ఆర్.ఎం. పి , పి.ఎం .పి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మైనారిటీ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్…

టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్

 

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. తన కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల్లో జై షా కూడా ఉన్నారని గంభీర్ వెల్లడించాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) విశ్వవిజేతగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే. నిన్న(ఆదివారం) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి, మొత్తంగా మూడుసార్లు టైటిల్ అందుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎమోషనలయ్యాడు. ఈ ట్రోఫీని ఇద్దరు వ్యక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ… ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. రాహుల్ భారత జట్టును ఈ స్థాయికి తీసుకువచ్చాడని, అలాగే లక్ష్మణ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో యువ ఆటగాళ్లకు బలమైన మార్గాన్ని నిర్మించాడని గంభీర్ వివరించాడు. అదే విధంగా తాను సోషల్ మీడియాలోని జనాలకు కాదని, జట్టుకు మాత్రమే జవాబుదారీనని గంభీర్ పేర్కొన్నాడు. అందుకే జనాలు చేసే విమర్శలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఒక కోచ్ అనే వాడు తన జట్టు ఎంత గొప్పగా ఆడితే అంత గొప్పగా కనిపిస్తాడని, తనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది ఆటగాళ్లేనని గంభీర్ అన్నాడు.
error: Content is protected !!
Exit mobile version