విద్యార్థి స్వయం పాలన: పాఠశాలలో ఒక వినూత్న కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం శంషల్లాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో, విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు అధికారుల పాత్రలను పోషించడం ద్వారా పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి ఉపాధ్యాయులు కవిత నందినిల పర్యవేక్షణలో విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు ఆసక్తికరంగా పాఠాలు బోధించారు.విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
