సిరిసిల్లలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్ నిర్వహణ…

సిరిసిల్లలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్ నిర్వహణ

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం ఉదయం 5కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కూడలి నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన ఈ రన్‌లో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బతుకమ్మ ఘాట్ వద్ద ప్రజా పాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో పారిశుధ్య నిర్వహణకు ప్రతి పౌరుడు బాధ్యతగా సహకరించాలని కోరారు. గతంలో సిరిసిల్ల పట్టణం సాధించిన అవార్డులను మళ్లీ సాధించేందుకు ప్రజలందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని స్వచ్ఛమైన, పర్యావరణ హిత పట్టణంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిల్ సభ్యులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి..

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి

పలు వార్డులలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ 20 వ వార్డులో
భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య మున్సిపల్ కమిషనర్ ఉదయ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ దేవన్ కౌన్సిలర్లు రాజు నాయక్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్డులలో ఈరోజు పర్యటించడం జరిగింది సైడ్ కాలువలను డ్రైనేజీలను శుభ్రం చేయడం వార్డులలో చెత్త చెదారం లేకుండా మున్సిపాలిటీ సిబ్బంది పనిచేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వారు అన్నారు

ములుగు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా…

ములుగు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.

#అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి.

#ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న….

#రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి :

 

నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీనీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో శనివారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశామని, పలు అభివృద్ధి పనులకు ఇప్పటికే 15 కోట్ల రూపాయలతో టెండర్లు జరిగాయని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగకల్యాణి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా, 5వ వార్డు కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య సుజన్, వార్డుల కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి హనుమకొండ జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు…

నేటి నుండి హనుమకొండ జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు

#డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏ. అప్పయ్య

#99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కార్యక్రమం

#నలుగు దశల్లో వైద్య సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు

#ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

హన్మకొండ, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు నాలుగు దశల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
మొదటి దశలో స్పెషలిస్ట్ వైద్య సేవలు మొదటి దశలో భాగంగా ఈనెల 6 నుండి 31 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్పెషలిస్ట్ వైద్యులతో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎంజీఎం, ప్రసూతి ఆసుపత్రుల నుండి స్త్రీ వైధ్య, శిశు వైధ్య, జనరల్ ఫిజీషియన్, కంటి మరియు ఎముకల వైద్య నిపుణులు ఈ శిబిరాల్లో అందుబాటులో ఉంటారు.
ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తారు.
పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు
ఆర్.బి.ఎస్.కె బృందాల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. బాలికల పాఠశాలల్లో స్త్రీ వైద్య నిపుణులతో ప్రత్యేక అవగాహన సదస్సులు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణకు తోడ్పడే సిపిఆర్ పై శిక్షణ ఇస్తారని డీఎంహెచ్‌ఓ వివరించారు.
ప్రారంభమైన శిబిరాలు – షెడ్యూల్ వివరాలు
నేడు అయినవోలు పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన మొదటి వైద్య శిబిరాన్ని వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్. నాగరాజు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి శిబిరాల షెడ్యూల్ ఇలా ఉంది:
| మార్చి 7 | కడిపికొండ |
| మార్చి 9 | కమలాపూర్ |
| మార్చి 10 | కొండపర్తి |
| మార్చి 11 | ముల్కనూర్ |
| మార్చి 12 | శాయంపేట |
| మార్చి 13 | సిద్దాపూర్ |
| మార్చి 14 | ఉప్పల్ |
| మార్చి 16 | వేలేరు |
| మార్చి 17 | దామెర |
| మార్చి 18 | హసన్పర్తి |
| మార్చి 20 | వంగర |
| మార్చి 23 | రాయపర్తి |
మార్చి 24న బోడగుట్ట, 25న లష్కర్ సింగారం, 26న పెద్దమ్మగడ్డ, 28న పోచమ్మకుంట/శాయంపేట, 30న సోమిడి/వడ్డేపల్లి, 31న తిరిగి పోచమ్మకుంట మరియు వడ్డేపల్లిలో శిబిరాలు జరుగుతాయి.
మహిళా సమాఖ్య సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, కావున ప్రజలందరూ తమ ఆరోగ్య పరిరక్షణకై ఈ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని డాక్టర్ అప్పయ్య కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version