గని సమస్యలపై సిఐటియు వినతి పత్రం…

గని సమస్యలపై సిఐటియు వినతి పత్రం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా గనిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మికుల అందరి చేత మూడు షిఫ్ట్ లలో సంతకాల సేకరణ చేసి శనివారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తుమ్మల రాజారెడ్డి కార్మికుల సహకారంతో ఐకే వన్ ఎ ఓసిపి మేనేజర్ కోటయ్యకి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ కట్టర్ సపోర్ట్ మెన్ లకు నాణ్యమైన బిట్లు ఇప్పించాలని రీకండేషన్ డ్రిల్ రాడ్స్ రాకుండా చూడాలని, షార్ట్ ఫైర్ కు రెగ్యులేషన్ ప్రకారము మూడు నెలలకు ఒకసారి కేబుల్ ను అందించాలన్నారు.మైన్ ఆవరణలో గల చర్మ రోగాలతో ఉన్న కుక్కలను వెంటనే ఇక్కడ నుండి తరలించాలని కోరారు.ఆర్ ఎల్ సి నిర్వహించిన రెండు సంవత్సరాల ఎన్నికల కాల పరిమితి ముగిసినందున అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.కార్మికులు ఏ యాక్టింగ్ చేసినా కూడా వారి యొక్క జీతం చిట్టి లలో సి4 అని రావడం వలన కార్మికులకు ప్రమోషన్ రావడంలో గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉందని ఏ యాక్టింగ్ అయితే ఆ యాక్టింగ్ కు సంబంధించిన క్యాటగిరిని మాత్రమే పొందుపరచాలని,కాలం చెల్లిన ఎస్ డి ఎల్ యంత్రాలను తొలగించి వాటి స్థానంలో కొత్త మెషిన్లను ఏర్పాటు చేసి కార్మికుల పని భారాన్ని తగ్గించాలని,సులబ్ కాంప్లెక్స్ కు వెళ్లడానికి కూడా సరియైన దారి ఏర్పాటు చేయాలని,మైన్ ఆవరణలో లైటింగ్ సౌకర్యం కల్పించాలని, షార్ట్ ఫైర్ కు కేబుల్ ను రెగ్యులేషన్ ప్రకారం ఇప్పించాలని, ట్రామర్లకు సరైన రెస్ట్ రూమ్ కల్పించి అందులో లాకర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యజమాన్యం మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని గెలిచిన సంఘాల అసమర్ధతను యజమాన్యం అలుసుగా తీసుకొని ఉత్పత్తిపై దృష్టి పెట్టి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ ఎన్. వెంకట్రెడ్డి,బ్రాంచ్ నాయకులు కిషన్ రెడ్డి,నవీన్,ప్రశాంత్,కృష్ణ, అనిల్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా అభ్యాస కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు…

ఘనంగా అభ్యాస కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

నర్సాపూర్ ప్రాంతంలోని అభ్యాస కిడ్స్ స్కూల్ లో శనివారం ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విద్యా భూషణ్ డాక్టర్ సుధతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.చదువుతో పాటు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం ద్వారా పిల్లలలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.పాఠశాలలు విద్యార్థుల సర్వాంగ అభివృద్ధికి వేదికలుగా నిలవాలని తెలిపారు.అనంతరం విద్యా,క్రీడా, ఇతర కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కవితా బాపురెడ్డి అభ్యాస కిడ్స్ ప్రిన్సిపల్ కవిత బాపిరెడ్డి,గౌరవ అతిథి రమణ,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థులు,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

 

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది.

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్‌లోనే. సూపర్-8 దశలో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది (Ahmedabad pitch conditions).

కాగా, ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్, గతంలో టీమిండియా ఓడిపోయినప్పుడు ఉపయోగించిన పిచ్‌ల కంటే చాలా భిన్నంగా ఉందట. పిచ్‌ను పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చేశారట. పిచ్ మీద గడ్డిని పూర్తిగా తొలగించి ఫ్లాట్‌గా మార్చేశారట. ప్రస్తుత పిచ్ చక్కటి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందట. అలాగే దూకుడుగా ఆడే స్ట్రోక్‌ప్లేయర్లకు స్వర్గధామంగా ఉంటుందట. అయితే పిచ్ పూర్తి ఫ్లాట్‌గా ఉండడం వల్ల స్పిన్నర్ల విషయంలో కెప్టెన్లు ఇద్దరూ ఆలోచనలో పడ్డారట (IND vs NZ final pitch analysis).

ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ లీడర్ హెచ్చరిక…

ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ లీడర్ హెచ్చరిక

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇరాన్ జాతీయ భద్రతా మండలి సెక్రెటరీ అలీ లారిజానీ తాజాగా వార్నింగ్ ఇచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ (Ali Larijani) తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీ, ప్రజల రక్తం చిందినందుకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో కన్నుమూసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సన్నిహితుల్లో ఒకరిగా అలీ లారిజానీకి పేరుంది.

అమెరికా సైనికులు కొందరు తమకు చిక్కారని కూడా అలీ లారిజానీ సంచలన ప్రకటన చేశారు. వారు ప్రస్తుతం జైళ్లల్లో ఉన్నారని అన్నారు. ఇరాన్ దాడుల్లో ఆరుగురు అమెరికన్ సైనికులే మరణించారంటూ ట్రంప్ ప్రపంచాన్ని తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఇరాన్ దాడుల్లో 500 మందికి పైగా అమెరికన్లు మరణించారని అన్నారు. సమయం గడిచే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతుందని హెచ్చరించారు. అయితే, అమెరికా మాత్రం ఈ ప్రకటనలను ఖండించింది. ఇరాన్ మోసాలు, అసత్య ప్రకటనలకు ఇది నిదర్శనమని పేర్కొంది.

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారం: సీఎం రేవంత్‌రెడ్డి…

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారం: సీఎం రేవంత్‌రెడ్డి

 

 

 

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

 ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు.వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు.తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, తగిన ఫలితం లేదన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని తెలిపారు. అమెరికాలో కూడా వివక్ష ఉంది.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందన్నారు. ఇక్కడ మాత్రం కష్టపడేవారికి గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు.

లిటిల్ ఫ్యాన్ ఆవేదన.. చిన్నారికి విజయ్, రష్మిక ఆహ్వానం…

లిటిల్ ఫ్యాన్ ఆవేదన.. చిన్నారికి విజయ్, రష్మిక ఆహ్వానం

 

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ లిటిల్ ఫ్యాన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియో విజయ్, రష్మికల దృష్టికి వెళ్లింది. కొత్త జంట చిన్నారి ఫ్యాన్ వీడియోపై స్పందించింది.

ఇంటర్‌నెట్ డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో అతి కొద్ది మంది బంధు, మిత్రుల మధ్య ఈ పెళ్లి జరిగింది. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో పెళ్లి రిసెప్షన్ అత్యంత ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. రిసెప్షన్‌కు కంటే ముందు విజయ్, రష్మికల జంట దేశ వ్యాప్తంగా అభిమానుల కోసం స్వీట్లు పంపిణీ చేసింది. విరోష్ టీమ్ ఎంపిక చేసిన పలు నగరాల్లో చిన్న చిన్న స్వీట్ బాక్స్‌లు పంచి పెట్టింది.

వైరల్ వీడియోపై స్పందించిన విరోష్

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ లిటిల్ ఫ్యాన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ‘విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి అయింది కదా.. అప్పుడు మనల్ని కూడా పిలవొచ్చు కదా పెళ్లికి. ఫ్యాన్స్‌కు లడ్డూలు పంచారు.. అన్నదానం చేశారు. నేను కూడా ఫ్యాన్సే కదా.. మీరు కూడా రీల్సే చేస్తున్నారు కదా.. నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా.. పిలిస్తే ఏమైతుందంట. ఈ వీడియో వాళ్లకు షేర్ చేయండి.’ అని ఆ చిన్నారి అంది. ఈ వీడియో వైరల్‌గా మారి విజయ్, రష్మికల దృష్టికి వెళ్లింది. కొత్త జంట ఈ వీడియోపై స్పందించింది. ‘బుజ్జితల్లీ.. ఇంటికి పిలుస్తా లంచ్‌కి.. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు. అన్నీ ఇంటిలో చేపించి మంచిగా తిందాము’ అని విజయ్ దేవరకొండ కామెంట్ చేశారు. ‘అయ్యో.. నీకు స్పెషల్‌గా ఇంట్లో చేపిద్దాం’ అంటూ ఇన్‌స్టాలో రష్మిక ఓ స్టోరీ పెట్టారు. ఓ చిన్నారి ఫ్యాన్ రిక్వెస్ట్‌పై విజయ్, రష్మిక స్పందించటం.. భోజనానికి పిలవటంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఊరించే వరుగులు….

ఊరించే వరుగులు

 

కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్‌ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది.

కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్‌ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది. నీటిని పిండేసి, ముక్కల్ని ఎండలో ఒరగబెడ్తే బాగా ఎండుతాయి. లేదా, ఉప్పు వేసిన నీళ్లలో ఉడకబెట్టి నీటిని వార్చేసి ఎండబెడతారు. ఒరగబెట్టి ఎండించినవి కాబట్టి వరుగులు. ఈ ముక్కల్ని ఎండించే మేదరి తట్టని ‘దాగర’ (ప్రసేవం) అంటారు.

ఇప్పటి కాలంలో ‘డీప్‌ ఫ్రీజర్‌’లో ఉంచి ఫ్రోజెన్‌ చేసి కూరగాయల్ని అన్‌ సీజన్లో వాడు కునే సౌలభ్యం వచ్చింది. కానీ, మన పూర్వులు ఉప్పులో ఊరవేసి ఎండించి నిలవబెట్టుకునేవాళ్లు. ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఆహార కొరత రాకుండా చూసుకునే వాళ్లు. ఫ్రోజెన్‌ చేయటం కన్నా వరుగుల పద్ధతిలో ఎక్కువ పరిమాణంలో నిలవబెట్టుకోవచ్చు.

ఎండబెట్టిన ఒరుగులను ఒక రేకు డబ్బాలో పోసి, మూత బిగించి, అటకమీద భద్రపరుస్తారు, ఊష్మం ఎక్కువగా ఉండి ఫంగస్‌ పట్టకుండా ఉంటాయని! ఎండబెట్టే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి, ఆమ్‌ చ్యూర్‌లా ఇతర కూరగాయల వరుగుల్ని కూడా వ్యాపార పరంగా తయారు చేసి అందించడానికి అవకాశం ఉంది

ఎండించినందువలన కూరగాయలు నీటి భాగాన్ని, కొంతవరకూ ‘సి- విటమిన్‌’ ని కోల్పోయినా, ఖనిజాలు, ఇతర విటమిన్లూ, పీచు పదార్థాలు (ఫైబర్‌) చాలావరకు నిలిచే ఉంటాయి. చలికాలంలోనూ, వర్షాకాలంలోనూ వీటిని కొద్దిగా నూనె వేసి వేగించి వేపుడు కూరలు చేసుకుంటారు. కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి పప్పు, ఇగురు కూర, పచ్చడి కూడా చేసుకుంటారు. దప్పళం, పులుసు, సాంబారు ల్లోకి వరుగులు అనుకూలంగా ఉంటాయి. వరుగుల్ని, వడియాల్ని నూనెతో వేగించి పెట్టిన పచ్చిపులుసు రుచిగా ఉంటుంది. వరుగుల్ని మిక్సీ పట్టిన పొడితో సూపు కాచుకోవచ్చు, చారు కూడా కాచుకోవచ్చు.

వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, కాకర, మామిడి, కామంచి, ఆదొండ, ఆగాకర, దోస, మిరప, టమాటా, ఆలు, పెండలం,కంద… వీటితో వరుగులు పెట్టుకుంటారు. ఈ వరుగులకి ఆ కూరగాయల లక్షణాలే ఉంటాయి. కాకపోతే ఆర్ద్రత (నీటి శాతం) కోల్పోయి శుష్కత్వం పొందుతాయి కాబట్టి, ఇవి శరీరాన్ని శుష్కింప చేస్తాయి. అందుకని డైటింగ్‌ చేసే వారికి అనుకూలం. శరీరంలో అదనంగా పేరుకున్న నీటిని పీల్చేసే గ్రాహి స్వభావం కలవి కాబట్టి, నీరుపట్టినవారికి వరుగులు మేలు కలిగిస్తాయి. నీళ్ళ విరేచనాల్లో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. కఫాన్ని వేడినీ పోగొడతాయి. కానీ వాతాన్ని పెంచుతాయి. కీళ్లవాత రోగులు తక్కువ తినాలి.

ఆదొండకాయ వరుగులు వేడిని కలిగిస్తాయి. కాకర వరుగులు కఫాన్ని తగ్గిస్తాయి. గజ్జల్లో ఏర్పడే హెర్నియాని తగ్గిస్తుందని భోజన కుతూహలం పేర్కొంది. నేలములక కాయల తోనూ వరుగులు పెట్టుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. ఊపిరితిత్తుల్ని శుభ్రపరుస్తాయి. వాతవ్యాధుల్లో తినదగినవి.

తక్కువ ఖరీదులో కూరగాయలు దండిగా దొరికినప్పుడు వరుగులు పెట్టుకుంటే, ఎక్కువ ఖరీదుకి కూరలు కొనాల్సిన పరిస్థితి వచ్చిన ప్పుడు వాడుకోవటానికి ఉపయోగపడతాయి. మధ్యతరగతి మందహాసానికి వరుగులు ఒక సాక్ష్యం. మిగిలిపోతున్న, వడిలిపోతున్న, పండి పోతున్న కూరగాయల్ని పాడైపోకమునుపే పారేసే పరిస్థితి రాకుండా వరుగులుగా మార్చుకోవటం అనేది మన పూర్వులు పాటించిన ఆచారం. మన కాలానికీ అవసరమైన ఉపాయమే!

మటన్ బిర్యానీ సింపుల్ రెసిపీ.. ఈ విధంగా చేస్తే సూపర్ టేస్ట్….

మటన్ బిర్యానీ సింపుల్ రెసిపీ.. ఈ విధంగా చేస్తే సూపర్ టేస్ట్

 

మటన్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రత్యేక వేడుకలు, పండుగలలో ఈ వంటకాన్ని ఎక్కువగా తయారు చేస్తారు. సరైన పదార్థాలు, సరైన విధానం పాటిస్తే హోటల్‌ స్టైల్ మటన్ బిర్యానీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ డెస్క్: మటన్ బిర్యానీ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకం. ప్రత్యేక సందర్భాలు, పండుగలు లేదా కుటుంబ వేడుకల్లో ఎక్కువగా మటన్ బిర్యానీ తయారు చేస్తారు. హోటల్‌లో తినే రుచిని ఇంట్లోనే పొందాలంటే సరైన పదార్థాలు, సరైన విధానం పాటించడం చాలా ముఖ్యం. మరి ఇంట్లోనే రుచికరమైన మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు
  • మటన్ – 500 గ్రాములు
  • బాస్మతి బియ్యం – 2 కప్పులు
  • ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
  • టమాటాలు – 2
  • పెరుగు – 1 కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి – 4
  • కారం పొడి – 1 టీస్పూన్
  • పసుపు – అర టీస్పూన్
  • బిర్యానీ మసాలా – 1 టీస్పూన్
  • ధనియాల పొడి – 1 టీస్పూన్
  • పుదీనా ఆకులు – కొద్దిగా
  • కొత్తిమీర – కొద్దిగా
  • నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
  • నెయ్యి లేదా నూనె – అవసరమైనంత
  • ఉప్పు – రుచికి సరిపడా
  • దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు – కొద్దిగా

తయారు చేసే విధానం

  • ముందుగా మటన్‌ను బాగా కడిగి ఒక పాత్రలో పెట్టాలి. అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా వేసి బాగా కలపాలి. కనీసం 30 నిమిషాలు మెరినేట్ అయ్యేలా ఉంచాలి.
  • బాస్మతి బియ్యాన్ని కడిగి 20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. తరువాత నీటిని వంపేయాలి.
  • కుక్కర్‌లో నూనె లేదా నెయ్యి వేడి చేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు వండాలి. ఇప్పుడు మెరినేట్ చేసిన మటన్ వేసి కొంతసేపు వేయించాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి మటన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
  • మటన్ ఉడికిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. సరిపడా నీరు పోసి ఉప్పు చూసి కలపాలి. తరువాత పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై బియ్యం పూర్తిగా ఉడికే వరకు వండాలి. ఆ తర్వాత కొద్దిసేపు దమ్‌లో ఉంచితే బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది.
  • వేడివేడిగా మటన్ బిర్యానీని ఉల్లిపాయ, ఉడికించిన గుడ్లు లేదా సలాడ్‌తో వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది.
  • ఇలా సులభంగా ఇంట్లోనే రుచికరమైన మటన్ బిర్యానీని తయారు చేసుకుని కుటుంబంతో ఆనందంగా ఆస్వాదించవచ్చు.

తరచూ ఛాతీ నొప్పి వస్తుందా? కారణాలు తెలుసుకోండి..

తరచూ ఛాతీ నొప్పి వస్తుందా? కారణాలు తెలుసుకోండి..

ఇటీవల చాలామంది ఛాతీ నొప్పి వచ్చినప్పుడు వెంటనే గుండెపోటు వస్తోందేమో అని భయపడుతున్నారు. అయితే ప్రతి ఛాతీ నొప్పి గుండె సమస్యకే సంబంధించినదిగా ఉండదు. మరి ఛాతీ నొప్పికి గుండెపోటు కాకుండా ఉండే ఇతర కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల చాలా మంది తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఛాతీ నొప్పి వస్తే చాలామంది వెంటనే గుండెపోటు వస్తోందేమో అని భయపడతారు. కానీ వాస్తవానికి ఛాతీ నొప్పి రావడానికి గుండె సమస్య మాత్రమే కారణం కాదు.

రైతమ్మలకు జేజేలు..

రైతమ్మలకు జేజేలు

మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే… ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది.

మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే… ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ఇది ప్రపంచ వ్యవసాయ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. పొలాల్లో విత్తనాలు చల్లటం నుంచి, కుటుంబాన్ని నడిపించే దాకా… వ్యవసాయ రంగాన్ని నిశ్శబ్దంగా మోస్తున్న ఎందరో రైతమ్మల కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపు ఇది. నేడు (మార్చి 8) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా కొందరు మహిళా రైతుల విజయగాథలకు నీరాజనాలు పలుకుదాం…

ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు మండలం సొవ్వ, కరకవలస గ్రామాల్లో 45 మంది మహిళా రైతులు… 13 పురాతన దేశీయ వరి రకాలను సాగు చేయడంతో పాటు, కరకవలస గ్రామంలో గెడ్డ వాగు వరదలకు మునిగిపోకుండా తట్టుకునే 4 నుంచి 6 అడుగుల వరకు పెరిగే దేశీయ వరిని సాగు చేస్తున్నారు. ఇక్కడి కుటుంబాలకు ఎకరం నుంచి రెండు ఎకరాలకు మించి ఉండదు. ‘‘ఇవి దేవుడు ఇచ్చిన ధాన్యపు రకాలు అని మా నమ్మకం. బస్నా సోప్పూర్‌, బుడమ ధాన్యం, దేశీ పెద్దధాన్యం, దేశీ రాజముడి, ఎర్ర ధాన్యం, గుడుం ధాన్యం, ఇసుకరవ్వలు, జోజోర్కి ధాన్యం, మాస్టర్‌ ధాన్యం, నల్ల ధాన్యం, పసుపు సన్నాలు, సోర్‌ ధాన్యం, తేటం ధాన్యం ఇలా 13 రకాలు పండిస్తున్నాం.

దారుణం.. ముగ్గురు కూతుళ్లను పోషించలేక హత్య చేసిన తండ్రి…

దారుణం.. ముగ్గురు కూతుళ్లను పోషించలేక హత్య చేసిన తండ్రి

కామారెడ్డిలో అదృశ్యమైన ముగ్గురు పిల్లలను తండ్రి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.

కామారెడ్డి: జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన ముగ్గురు పిల్లలను కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తట్టుకోలేక తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కామారెడ్డి ఏఎస్‌పీ చైతన్య రెడ్డి ఏబీఎన్‌కు వివరాలు వెల్లడించారు. ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లను పెద్ద చెరువులో తోసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం ఏమి తెలియనట్లు నటిస్తూ, తన భార్యతో కలిసి పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై అనుమానం కలిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. కుటుంబ పోషణ భారంతో పాటు అప్పుల ఒత్తిడితోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఇస్మాయిల్ విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో గోసంగి కాలనీలో ఇద్దరు బాలురు కనిపించకుండా పోయిన ఘటనపై కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వారిని కనుగొంటామని పోలీసులు తెలిపారు.

ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనం ప్రారంభం…

ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనం ప్రారంభం

హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్…

అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్

యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయిపోయారు. యుద్ధం ముగిశాక అమెరికా వెంట వస్తామనే వారు తమకు అవసరం లేదని సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌పై (Keir Starmer) మండిపడ్డారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికాల మిలిటరీ చర్యలకు మొదట్లో సహకరించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు (Donald Trump). ఘర్షణలు మొదలైన ఇన్నాళ్లకు యూకే ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్య ప్రాచ్యంలో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరించిందని చెప్పారు. అయితే, యుద్ధంలో తాము గెలిచామని, ఇప్పుడు సాయపడతామని వచ్చే వారు తమకు అవసరం లేదంటూ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోమని కూడా చెప్పారు.

ఇరాన్‌పై సైనిక చర్యకు మద్దతుగా యూకే తొలుత రంగంలోకి దిగకపోవడాన్ని ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల సమర్థించుకున్నారు. ఈ చర్యలకు న్యాయపరమైన, ప్రణాళికా పరమైన సంసిద్ధతను నిర్ధారించుకునేందుకు కొంత సమయం పట్టిందని చెప్పారు. ఇరాన్ మిసైల్ నిల్వలపై బ్రిటన్ స్థావరాల నుంచి దాడులకు కూడా అనుమతించామని తెలిపారు.

ఇక యూకే ప్రధానిపై గతంలోనూ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయన విన్‌స్టన్ చర్చిల్ లాంటి ప్రధాని కాదని అన్నారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో ఓవల్ ఆఫీస్‌లో ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.

మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు….

మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేస్తున్నామని వ్యాఖ్యానించారు.

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా సీఎం ట్వీట్‌ పెట్టారు. మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం..

‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోంది. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి (ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం), దీపం-2 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం), ఎన్టీఆర్ భరోసా (వితంతు పింఛన్లు) వంటి పథకాలను అమలు చేస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని… ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశాం. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ…. కేంద్ర ప్రభుత్వంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాం. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు మీ అందరి సహకారం, భాగస్వామ్యం కావాలి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల గౌరవ, మర్యాదలతో మెలగాలి: సీఎం చంద్రబాబు..

ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల గౌరవ, మర్యాదలతో మెలగాలి: సీఎం చంద్రబాబు

పశ్చిమ బెంగాల్‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ కల్పించనలేదని ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandra babu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా సీఎం ట్వీట్‌ పెట్టారు. ఇంటర్ నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ కల్పించనలేదని ప్రశ్నించారు.

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్…

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో మ‌హిళా పారిశ్రామిక‌వేత్తను త‌యారు చేసే ప్రణాళికలు అమ‌లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతి వేదికగా లోకేశ్ మాట్లాడారు.

మూసీ ప్రాజెక్టుపై మాటల యుద్ధం

· బీఆరఎస్ ప్రణాళిక నీటిశుద్ధి, కొన్ని ప్రాంతాల సుందరీకరణకే పరిమితం

· ప్రపంచ స్థాయి రివర్‌బెడ్‌గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రణాళిక

· ఈ కారణంగానే ప్రాజెక్టు ఖర్చు పెరిగింది: ప్రభుత్వం

· కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం బఫర్‌జోన్ 50 మీటర్లు తప్పనిసరి

· వరదలనుంచి రక్షణకు ఇది అవసరం

· ఆ పరిధిలో వున్న ఇళ్లను తొలగించాల్సి వచ్చినా తప్పదు

· స్పష్టం చేస్తున్న నిబంధనలు

· పునరావాస ప్యాకేజీతో ప్రభుత్వం ముందుకు

· బాధితులతో చర్చించకుండా ముందుకెళ్లడమేంటన్నది విమర్శకుల వాదన

· 10 నుంచి 15వేల ఇళ్లకు తొలగింపు గండం

హైదరాబాద్, నేటిధాత్రి: 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు మొత్తం వివాదాల్లో చిక్కుకుంది.ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నదని ఆరోపించడమే కాదు “మూసీ దండి మార్చ” వంటి ర్యాలీలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టును కేవలం రూ.16800 కోట్లతో పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు రచించామని, పేదల ఇళ్లను కూల్చే పరిస్థితే ఉత్పన్నం కాకుండా మొత్తం మూసీనది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని బీఆరఎస్ ఆరోపిస్తోంది. మూసీ సుందరీకరణకు పేదల ఇళ్లు కూలగొట్టాల్సిన అవసరం లేదన్నది హరీష్‌రావు, కేటీఆర్‌ల వాదన. కేవలం రూ.15వేలనుంచి రూ.16వేల లోపు ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.1.5లక్షలకు పెంచేసిన రేవంత్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నదనేది వారి వాదన.

నిజానికి ఈ మూసీ రివర్ ప్రాజెక్టు పొడవు 55 కిలోమీటర్లు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో విస్తరించిన కారిడార్ ఇది. ప్రాజెక్టు తొలిదశలో ఉస్మాన్ సాగర్, హిమయత్‌సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్టు పనులు చేపడతారు. ప్రస్తుత ప్రభుత్వం మొదట్లో రూ.58వేల కోట్ల అంచనాల తో ఈ మొత్తం ప్రాజెక్టును మొదలుపెట్టినప్పటికీ, అంతర్‌సిటీ మౌలిక సదుపాయాలు, మెట్రోరైల్‌విస్తరణ వంటివి కూడా జతచేయడంతో ప్రాజెక్టు ఖర్చు ఏకంగా రూ.1.5లక్షల కోట్లకు చేరింది.అయితే గత బీఆరఎస్ ప్రభుత్వం ప్రధానంగా మూసీనది నీటిని ప్రక్షాళన చేయడానికి ప్రాధాన్య తనిచ్చింది. ఇందుకోసం 31 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించి నీటిని శుద్ధి చేయడం తర్వాత గోదావరి జలాలను మూసీలోకి తరలించడం ద్వారా దీన్ని ఒక జీవనదిగా మార్చాలన్న ఉద్దే శంతో ముందుకెళ్లింది. ఈ సీవేజ్ ప్లాంట్లతో నగరాలనుంచి విడుదలవుతున్న 1200 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేయవచ్చునని బీఆరఎస్ నేత కేటీఆర్ చెబుతున్నారు. 57.5 కిలోమీటర్ల పొడవునా నదికి ఇరువైపులా గోడలను నిర్మించడం ద్వారా వరదలను నివారించవచ్చన్నది ఆయన వాదన. 

ఇందుకు ఉదాహరణగా నాగోల్ నుంచి ఉప్పల్ భగాయత్ వరకు 5 కిలోమీటర్ల మేర ఇళ్లు కూలగొట్టకుండానే తాము అభివద్ధి చేసిన ప్రాంతాన్ని చూపుతున్నారు. అందువల్ల ఇళ్లు కూలగొట్ట కుండానే, మూసీనది పర్యావరణ వ్యవస్థను శుద్ధి చేయడం లక్ష్యంగా తమ ప్రణాళిక కొనసాగిం దని బీఆరఎస్ నేతలు చెబుతున్నారు.ఇందులో భాగంగానే స్ట్రాటిజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఎసఎన్‌డీపీ)కింద డ్రైనేజీ, వరద నిర్వహణపై బీఆరఎస్ ప్రభుత్వం తొలిదశలో దష్టి కేంద్రీకరించడం వల్ల బుల్డోజర్‌లకు పనిచెప్పాల్సిన అవసరం రాలేదు. కాగా సింగపూర్‌కు చెందిన మె యిన్‌హార్‌దత్ కన్సార్టియమ్‌ను ఈ ప్రాజెక్టు డిపీఆర్, మాస్టర్ ప్లాన్ తయారుచేయడానికి నియమించడాన్ని బీఆరఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇతరదేశాల్లో ఆర్థిక అవకతవకలు పాల్పడిన ఆరోపణలతో పాటు, లీగల్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్న ఈ కంపెనీకి మాస్టర్‌ప్లాన్, డీపీఆర్ పనులు అప్పగించడమేంటని బీఆరఎస్ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. 

ఈ ప్రాజెక్టు కింద మరో వివాదమేంటంటే బఫర్‌జోన్ పరిధిలో పదివేల నుంచి పదిహేనువేల నిర్మాణాలను కూలగొట్టాలని నిర్ణయించడం నిత్య నిరసనలకు దారితీసింది. దశాబ్దాల తరబడి ఇ క్కడ నివసిస్తూ ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తూ వస్తున్న తాము ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందన్న భయం ఈ ప్రాంత వాసుల్లో నెలకొంది. తగిన పరిహారం, ప్రత్యామ్నాయాలను చూపకుండానే ప్రభుత్వం తమను నిరాశ్రయులను చేస్తుందన్న భయం వీరి ఆందోళనకు, ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం. అదీకాకుండా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) లేదా ప్రజల పునరావాస పాలసీని ప్రకటించకుండానే, అధికార్లు కూలగొట్టాల్సిన ఇళ్లకు మార్కింగ్‌లు వేయడంతో, ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంలేదన్న అభిప్రాయం ఈ ప్రాంత వాసుల్లో నాటుకుపోయింది. ఈ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోయే పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ల వసతి కల్పిస్తామని చెబుతోంది. అసలు విధానానికి తుదిరూపం ఇవ్వకుండా, బాధిత కుటుంబాలతో చర్చించకుం డా ప్రభుత్వం ఏవిధంగా ముందుకెళుతుందని విమర్శకులు లేవనెత్తుతున్న ప్రశ్న. 

ప్రభుత్వం మూసీ నది ఒడ్డున బాపూ ఘాట్ వద్ద “గాంధీ సరోవర”ను అభివద్ధి చేయాలని చూస్తున్నది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఇళ్లు కోల్పోతున్నవారికి సమగ్ర పునరావాస చర్యలు చేపడతా మని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇందులో భాగంగా ఈ మూసీనది ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పో యే పేదలకోసం సుమారు 16వేల ఇందిరమ్మ ఇళ్ల (2బీహెచ్‌కే) యూనిట్లను కేటాయించింది. వీరిలో రివర్‌బెడ్‌లో ఇళ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం మానవతా సహాయంగా ఈ చర్య చేప ట్టింది. అయితే బఫర్ జోన్‌లలో నివాసం వుండేవారు “ఆరఎఫ్‌సీటీఎలఏఆరఆర్ చట్టం`2013” కింద నష్టపరిహారానికి అర్హులు. భూమి మార్కెట్ విలువతో పాటు, ఇంటి నిర్మాణ విలువను కూడా నిర్ణయించి ఆ మొత్తం చెల్లిస్తారు. ఇక ఎటువంటి పట్టాలు లేని భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇందిరమ్మ ఇళ్ల (2బీహెచ్‌కే) కేటాయింపు వుంటుంది. ఇక రివర్‌బెడ్‌లో నివసించే కుటుంబాలు తరలి వెళ్లడానికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.25వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేకాదు ఈవిధంగా తరలించిన వారి జీవనోపాధి, వారి పిల్లలను సమీప స్కూళ్లలో ప్రవేశాలకు ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇక మధు పార్క్‌రిట్జ్ వంటి మధ్యతరగతి ప్రజలు నివాసముండే అపార్ట్‌మెంట్‌లకు రూ.80లక్షల నగదు పరిహారం లేదా ప్రభుత్వం గుర్తించిన 11 గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్‌మెంట్‌ను ఎంచుకోవచ్చు. ఈ రెండు ఐచ్ఛికాల్లో ఏదో ఒకదాన్ని అపార్ట్‌మెంట్ వాసులు ఎంచుకోవాల్సి వుంటుంది. 

ఇక మూసీ ప్రాజెక్టు తొలిదశలో 300 ఎకరాల్లో బాపు ఘాట్‌ను ప్రపంచ స్థాయి ఎక్స్‌పర్‌మెంటల్ కేంద్రంగా అభివద్ధి చేస్తారు. ఇక్కడ 123 అడుగుల ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుతారు. ఇప్పటివరకు పాట్నాలో నిర్మించిన 72 అడుగల ఎత్తయిన విగ్రహం దేశంలోనే ఎత్తయినది గా పరిగణిస్తున్నారు. కాగా ఇక్కడ నిర్మించబోయేదీ దాన్ని అధిగమించనుంది. ఇక్కడే గాంధీ ఫి లాసఫీ, ఆయన సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలతో కూడిన అతిపెద్ద నేషనల్ మ్యూజి యంను నెలకొల్పుతారు. స్థానిక సంప్రదాయ చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు వీలుగా ఒక హ్యాండ్లూమ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. నగరాన్ని వీక్షించేందుకు “లండన్ ఐ స్టెíల్ వీల”ను ఏర్పాటు చేయనున్నారు. ధ్యాన కార్యక్రమాల నిర్వహణకు మెడిటేషన్ విలేజ్‌ను ఏర్పాటు చేస్తారు.బాపు ఘాట్ వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం చేపడతారు. ఇక్కడినుంచి దిగువకు ఫిల్టర్‌చేసి శుద్ధి చేసిన నీటినే దిగువకు వదిలేవిధంగా ఈ నిర్మాణం వుంటుంది. 

తాము ఇళ్లను కూలగొట్టే అవసరం లేకుండానే మూసీనది ప్రక్షాలన చేయవచ్చునని బీఆరఎస్ నేతలు చేస్తున్న వాదనకు సమాధానంగా, 2020 నాటి వరదల విధ్వంసం పునరావతం కాకుండాచూడాలంటే, బీఆరఎస్ చేపట్టిన కార్యక్రమం సరిపోదని, మరింత విస్తరించాల్సిన అవసరం వున్నదని పట్టణ నిపుణులు, అధికార్లు చెబుతున్నారు. అంతేకాదు దీర్ఘకాలంలో నగర భద్రతకు బీఆరఎస్ ప్రణాళిక సరిపోదని వారు స్పష్టం చేస్తున్నారు. కేవలం నదినీటిని శుభ్రం చేస్తే సరిపోదు. నదీ ప్రవాహానికి తగినంత ప్రదేశం వుండాలి. నదీప్రాంతం ఆక్రమణలకు గురికావడం వల్లనీటి ప్రవాహ మార్గానికి అడ్డంకులు ఏర్పడి చుట్టుపక్కల నగర ప్రాంతాలకు ముంపునకు గుర య్యాయన్న సంగతిని వారు 2020 వరదలను ప్రస్తావిస్తూ వివరిస్తున్నారు. మరి బీఆరఎస్ ప్రభుత్వం 2017లో ఈప్రాజెక్టును మొదలు పెడితే ఇంతవరకు 31 సీవేజ్ ప్లాంట్ల నిర్మాణం, నదిలో అతిపెద్ద ఆక్రమణల తొలగింపు వంటివి పూర్తికాలేదన్న సంగతిని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక నదికి 50మీటర్ల బఫర్ జోన్ వుండాలి. వర దలనుంచి రక్షణకు ఈ బఫర్‌జోన్ తప్పనిసరి. ఇందుకోసం ఆయా ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించుకు న్నవారిని అక్కడినుంచి వేరే ప్రదేశానికి తరలించాల్సి వచ్చినా దీన్ని అమలు చేయాల్సిందేనని బఫర్ జోన్ ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా నీటిశుద్ధి, కొన్ని ప్రాంతాల సుందరీకరణ వంటి పరిమిత పనులకు బీఆరఎస్ ప్రణాళిక సరిపోతుంది. కానీ ప్రపంచ స్థాయి రివర్‌ఫ్రంట్‌ను రూపొందించేందుకు పై ప్రణాళిక సరిపోదని, సమగ్రమైన రీతిలో వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని ప్రభుత్వం చెబుతున్నది.

చిన్న మిల్లర్లు పేనుకుంటున్న ఉరితాళ్లు!?

`రాష్ట్ర నాయకుల్లారా ఇప్పటికైనా సిగ్గుపడండి?

`అసలు డిఫాల్టర్ లు మిల్లర్లా! పాలకులా?

`పాలకులను ప్రశ్నించలేని యూనియన్లు ఎందుకు?

`బకాయిల పేరుతో పెరుగుతున్న ఒత్తిళ్ళు?

`చిన్న మిల్లర్ “చితి”కి పోతున్నా యూనియన్ నాయకులు కదలరా?

`500 మంది కోసం 3000 మందికి ఉరితాళ్లు పేనుతారా?

`ఆమె ప్రాణం ఖరీదు.. పెండింగ్ లో వున్న మిల్లింగ్ చార్జీలు కాదా?

`ఈ పాపం యూనియన్ నాయకులది కాదా!

`పదేళ్లుగా మిల్లింగ్ ఛార్జిలను చెల్లించని పాలకులది కాదా?

`గత ప్రభుత్వం చేసిన పాపానికి మిల్లర్లు బలి కావాలా?

`మహిళా మిల్లర్ ఆత్మహత్యకు కారకులెవరు?

`పదేళ్లుగా మిల్లింగ్ చార్జీలు పాలకులు ఇవ్వకుంటే అడగరా?

`ఎవరి ప్రయోజనాల కోసం నాయకులయ్యారు?

`పెద్ద నాయకుల నిర్లక్షానికి చిన్న మిల్లర్లు ప్రాణం తీసుకోవాలా?

`పదేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై నోరేత్తరా?

`చిన్న మిల్లర్లను బలి చేస్తారా? వారి ప్రాణాలు మింగేస్తారా?

`చిన్న మిలర్ల మెడలో డిఫాల్టర్లని బోర్డు వేసి దొంగలను చేస్తారా?

`ప్రాణం తీసుకున్న ఆ “మహిళ మిల్లర” పాడే మోయడానికి అసలు మీరు ఎలా అర్హులవుతారు?

`రాష్ట్ర నాయకుల స్వార్థానికి పాడేనెక్కుతున్న మిల్లర్లు?

`బకాయిలు చెల్లిస్తే ఆమె ప్రాణం తెచ్చిస్తారా?

`కేసులు నమోదు చేస్తామనే అధికారులకు వాస్తవాలు తెలుసా?

`మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన మిల్లింగ్ బకాయిలు ఎప్పుడైనా చూసుకున్నారా?

`మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో నాయకులు?

`ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మాయం చేసిన గజదొంగలు ఎవరు?

`నాయకుల లెక్కల్లోని బొక్కలే చిన్న మిల్లర్ల పాలిట శాపాలు!

`నాయకుల బకాయిల బండారాలు బయట పడతాయానే నోరు మూసుకున్నారా?

`మిల్లు లేని వాడు మిలర్ల నాయకుడా?

`మిల్లు కిరాయికి ఇచ్చినవాడు అధ్యక్షుడై మిల్లర్ల హక్కులు కాపాడతాడా?

`నాయకులుగా చెలామణి అయ్యేందుకు వారికి సిగ్గు అనిపించడం లేదా?

`వారిని నాయకులుగా ఎంచుకోవడానికి మిల్లర్లకు బుద్ధి లేదా?

`మైనింగ్ మాఫియా కు పాలకుల అండదండలా?అన్నం పెట్టే మిల్లర్ల మెడకు బకాయిల గుది బండలా?

`పది సంవత్సరాల పెండింగ్ మిల్లింగ్ బకాయిలు అడగొద్దా?

`బకాయిలు చెల్లించమని చిన్న మిల్లర్లకు వేధింపులా?

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

సీత కష్టం సీతది..పీత కష్టం పీతది అని సామెత. అలాంటివే కొంత మంది చిన్న మిల్లర్ల పరిస్దితి. పైన పటారం లోన లొటారంలా వుంది. తెలంగాణలోని చిన్న మిల్లర్ల జీవితాలు పైకి కనిపించేంత గొప్పగా ఏమీ వుండవు. పైన సిల్స్ షర్టు వేసుకున్నా, లోపల చిరిగిన బనియన్ వెక్కిరిస్తూనే వుంటుంది. అది పైకి కనిపించనట్లే, చిన్న మిల్లర్లు ఎదుర్కొనే కష్టాలు ఎవరికీ కనిపించేవి కాదు. సహజంగా మిల్లర్లు అనగానే ధనవంతులు, భవంతులు, ఆడంuరాలు అని అందరూ అనుకుంటారు. కాని వాళ్లుపడే వేదన, కష్టం ఎవరికీ చెప్ప్పుకోరు. ఎవరికి చెప్ప్పుకున్నా తీరేవి కాదు. అందుకే వారి కష్టం, నష్టం ఎవరికీ చెప్ప్పుకోరు. అందుకే తెలంగాణలోని చిన్న మిల్లర్లు చితికిపోతున్నారు. నలిగిపోతున్నారు. నానా తంటాలు పడుతున్నారు. యాతన పడుతున్నారు. గట్టెక్కే మార్గం లేక కొంత మంది ఉరితాళ్లు పేనుకుంటున్నారు. పరువు కోసం జీవితాలను త్యాగం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగింది. వారికి శత్రువులు ఎవరో కాదు. మర్రిచెట్టులా పాతుకుపోయిన పెద్ద మిల్లర్లు, కనికరం చూపని పాలకుల మూలంగా చిన్న మిల్లర్ల జీవితాలు ఆగమౌతున్నాయి. ఊపిరి తీసుకోలేనంత కష్టం వెళ్లదీస్తున్నారు. దినదిన గండంగా బతుకుతున్నారు. ఇటీవల ఓ మహిళా మిల్లర్ల ఆ కష్టాలను నుంచి బైటపడే మార్గం కనిపించక తనవు చాలించింది. అంటే పరిస్దితి ఎంత దారుణంగా వుందో అర్దం చేసుకోవచ్చు. వాళ్లు చేసిన పాపం లేదు. మోసం లేదు. కాని జీవితాలు బలి చేసుకోవాల్సి వస్తోంది. బలన్మరణాలను కోరుకోవాల్సి వస్తోంది. ప్రాణం తీసుకునేంత పుట్టెడు దుఖం కడుపులో వుంటే తప్ప ఎవరూ అంతటి కఠినమైన నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే చిన్న మిల్లర్ల గోస చూసేవారు లేరు. వారి గోడు వినిపించుకునే వారు లేరు. వారిని పట్టించుకునే నాధుడే కరువుయ్యాడు. అంతటి దౌర్భాగ్య స్దితిలో బతుకులీడుస్తున్నారు. వింటేనే కన్నీళ్లు ఆగడం లేదు. అలాంటి నరకం అనుభవిస్తున్న వారి జీవితాలు ఎంత ఆగమ్య గోచరంగా వున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ వారు చేసిన పాపం ఏమిటి? గత పది సంవత్సరాల కాýంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మిల్లింగ్, ట్రాన్స్‌పోర్టు ఇలా కొన్ని రకాల చార్జీలు అందడం లేదు. ఇదిగో వస్తాయి..అదిగో వస్తాయని పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వడ్లను తీసుకొని మిల్లింగ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి అందిస్తున్నారు. కాని వారికి రావాల్సిన చార్జీలు మాత్రం అందడం లేదు. అందుకే వారు ఆ చార్జీల కోసం చకోర పక్షులుగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లు క్రితం ప్రభుత్వం మారింది. ఇప్పటి ప్రభుత్వమైనా తమను ఆదుకుంటుంది. తమకు రావాల్సిన బకాయి చార్జీలు వస్తాయని చిన్న మిల్లర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినా వాటి జాడ లేదు. చార్జీలు వచ్చింది లేదు. వస్తాయన్న నమ్మకం ఇప్పట్లో కనిపించడం లేదు. పైగా చిన్న మిల్లర్లు కొన్ని సార్లు తప్పని పరిస్తితుల్లో ప్రభుత్వానికి పెట్టాల్సిన బియ్యం పెట్టలేకపోయారు. ప్రభుత్వం నుంచి చార్జీలు రాపోవడంతో వాళ్లు అప్ప్పులు చేశారు. ఆ అప్ప్పులకు వడ్డీలు చెల్లించుకునే స్దితి కూడా లేకపోవడంతో అప్ప్పులు ఇచ్చిన వారితో వేధింపులు పెరుగుతున్న తరుణంలో ప్రభ్వుతం ఇచ్చిన వడ్లకు సరిపడ ధాన్యం పెట్టలేకపోయారు. ఇదొక్కటే మిల్లర్లు చేసిన పొరపాటు. ఆ పొరపాటు కూడా గ్రహపాటు అవుతుందని మిల్లర్లు అనుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వున్న ధాన్యం బకాయిలు ఎప్పటికైనా చెల్లించాల్సిందే. అయితే ఆ బకాయిలుపై కూడా ప్రభుత్వం 25శాతం అదనపు సుంకం విధించడంతో చిన్న మిల్లర్లు లబో దిబో మంటున్నారు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు ఓ వైపు తమకు రావాల్సిన మిల్లింగ్ ఇతర చార్జీలు ఇవ్వడం లేదు. పైగా తామ బకాయిలు చెల్లించమంటూ అధికారులు వేదిస్తున్నారు. కేసులు నమోదు చేస్తామంటున్నారు. జైలు పాలు చేస్తామంటున్నారు. ఆస్దులు జప్తు చేస్తామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి దారి కనిపించడం లేదు. ఇటీవల నల్లగొండ జిల్లాలో పోలీసులు ఓ మిల్లర్ దంపతులను నేరస్ధులను అరెస్టులు చేసి మీడియా ముందు నిలబెట్టినట్లు నిలబెట్టడంతో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా మిల్లర్ మనస్తాపానికి గురయ్యారు. తమ పరిస్దితి కూడా అలాగే వుంటుందేమో అని భయపడ్డారు. ఇంత బతుకు బతికి, దొంగలుగా, నేరస్ధులుగా నిలబడాల్సి వస్తుందా? అని తనలో తానే కుమిలిపోతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో చిన్న మిల్లర్లందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ వంతు కూడా అలాగే వస్తుందా అని భయపడుతున్నారు. ఇందుకు కారకులు పాలకులు కాదా? అది ఎవరైనా సరే గత పాలకులు ఎనమిది సంవత్సరాల పాటు బకాయి చార్జీలు చెల్లించలేదు. ఈ పాలకులు వచ్చి రెండేళ్లయినా వాటిని విడుదల చేయడం లేదు. దాంతో చిన్న మిల్లర్లంతా దిగులుపడుతున్నారు. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చిన్న మిల్లర్ల వున్న బకాయిలు మాత్రమే చూస్తున్నారు. కాని మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిల మీద దష్టిపెట్టడం లేదు. వాళ్ల uకాయిలు క్లియర్ చేస్తామని మాట ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చేదాని గురించి మాట్లాడకుండా, ప్రభుత్వానికి మిల్లర్లు ఇచ్చే దాని గురించే ప్రస్తావిస్తున్నారు. అదికారులు బెదిరిస్తున్నారు. తెలంగాణలో చిన్న మిల్లర్లు సుమారు 3000 మంది వుంటారు. ఆ 3000 మంది పరిస్దితి ఇదే విదంగా వుంది. వీళ్లను డిఫాల్డ్ మిల్లర్లు ముద్ర వేశారు. వారిని దొంగలుగా సమాజం చూపించే స్దితికి తెచ్చారు. కాని అసలు డిఫాల్టర్లు వీళ్లు కాదు. వీళ్ల uకాయిలు ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కాని మొత్తం 3500 మంది మిల్లర్లలో 500 మంది బడా మిల్లర్లు వున్నారు. అసలైన డిఫాల్డ్ మిల్లర్లంతా ఈ 500 మందిలోనే ఎక్కువగా వున్నారు. ఈ 500 మంది పెద్ద మిల్లర్లలో ఓ పది మంది మిల్లర్ల వున్న uకాయిల మొత్తంకూడా ఈ 3000 మంది చిన్న మిల్లర్ల uకాయిలు. చిన్న మిల్లర్ల సంఖ్య ఎక్కువగా వున్నప్పటికీ వారు చెల్లించే బకాయిలు వడ్లలో తాలంత కాదు. కాని తక్కువ మంది వున్న బడా మిల్లర్ల బకాయిలు కొండత. ప్రభుత్వ పెద్దలు, అదికారులు ఆ బడా మిల్లర్ల జోలికి వెళ్లరు. వారి బకాయిల ఊసెత్తరు. ఆ బడా మిల్లర్లు తప్పించుకునేందుకు ఈ చిన్న మిల్లర్లను ఎరగా వేస్తుంటారు. చిన్న మిల్లర్లను చిదిమేస్తున్నారు. వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ చిన్న మిల్లర్ల నాయకులు కూడా బడా మిల్లర్ల యజమానులే. ఈ చిన్న మిల్లర్ల పేరు చెప్పి రాజకీయం చేసే వాళ్లే.. ఈ చిన్న మిల్లర్ల సమస్యను ప్రబుత్వ పెద్దల దష్టికి తీసుకుపోరు. ప్రబుత్వం చిన్న మిల్లర్లను వేదిస్తుంటే చోద్యం చూస్తుంటారు. తమ మీదికి అదికారులు రాకుండా మాత్రం చూసుకుంటారు. దాంతో చిన్న మిల్లర్లే అదికారులకు టార్గెట్ అవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలంటూ చిన్న మిల్లర్ల మీద పడుతున్నారు. యూనియన్ నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్లు కనీసం ఒక్క శాతం చిన్న మిల్లర్ల కోసం పనిచేసినా వారికి ఈ కష్టాలు వచ్చేవి కాదు. పేరుకు మాత్రం మిల్లర్ల యూనియన్ అసోసియేషన్లకు నాయకులు. కాని చిన్న మిల్లర్ల సమస్యలు పట్టించుకోరు. చిన్న మిల్లర్లకు రావాల్సిన మిల్లింగ్ చార్జీలు ఇప్పించరు. తమ తోటి మిల్లర్ల సమస్యలు పరిష్కారం కోసం కషి చేయని నాయకులు ఎందకు? పాలకుల దష్టికి చిన్న మిల్లర్ల సమస్యలు తీసుకెళ్లలేనప్ప్పుడు ఆ నాయకులకు పదవులు ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం నాయకులయ్యారు. ఓ మహిళా మిల్లర్ల బలన్మరణానికి గురైతే కూడా పట్టించుకునే తీరిక లేదా? లేక మీకు మనసు కరుగుతలేదా? పెద్ద నాయకుల నిర్లక్ష్యానికి చిన్న మిల్లర్లు ప్రాణాలు తీసుకోవాలా? ప్రబుత్వం నుంచి చిన్న మిల్లర్లకు రావాల్సిన బకాయిలపై నాయకులు నోరెత్తరా? చిన్న మిల్లర్లను బలి చేస్తారా? వారి ప్రాణాలు మింగేస్తారా? చిన్న చిన్న మిల్లర్లను డిఫాల్లర్లని ముద్రలు వేసి వారిని దొంగలను చేస్తారా? రాష్ట్ర నాయకులు స్వార్ధానికి చిన్న మిల్లర్లు ప్రాణాలు బలి చేసుకుంటున్నారు. అయినా మిల్లే లేని వ్యక్తులు మిల్లర్ల యూనియన్‌కు నాయకులు కావడమేమిటి? తన మిల్లును కిరాయికి ఇచ్చిన వ్యక్తి మిల్లర్ల హక్కులు కాపాడుతారన్న నమ్మకమేమిటి? నాయకులుగా అలాంటి వారిని ఎన్నుకునేందుకు చిన్న మిల్లర్లకు కూడా ఇంగితం లేకుండాపోయిందా? ఇప్ప్పుడు సమస్య ఉరితాడులా వేలాడుతుంటే కూడా మిల్లర్లలో చైతన్యం రాదా???

అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

మహిళలకు ప్రత్యేకమైన రోజుగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మహిళల సాధన,కృషి, విజయాలను గుర్తించి,లింగ సమానత్వం,హక్కులను గుర్తిస్తారు.

మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2026కు సంబంధించి మహిళా సాధికారత,సమానత్వం, నాయకత్వంపై దృష్టి సారిస్తూ థీమ్ రెడీ చేశారు.ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి,సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఈసారి ప్రత్యేక థీమ్ ‘గీవ్ టూ గైన్,అంటే ఒకరికి ఒకరు సహాయం చేస్తే,అందరికీ ప్రయోజనం కలుగుతుందని,సమాజంలో పురోగతి సాధ్యమవుతుందని ఈ థీమ్ సూచిస్తుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట అమెరికాలో 1900లో ప్రారంభమైంది.ఆ కాలంలో మహిళలకు ఎక్కువగా పని గంటలు ఉంటూ జీతం తక్కువగా ఉండేది.ఆ పరిస్థితిని తట్టుకోలేని మహిళలు వారి హక్కుల కోసం తిరుగుబాటు మొదలుపెట్టారు.వారు తగిన వేతనం,పని గంటలు తగ్గించడం, ఓటు హక్కు వంటి అంశాలపై పోరాటాలు చేశారు.1910లో సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరి

error: Content is protected !!
Exit mobile version