టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్…

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

 

పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఇషాన్ కిషన్(77) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి పాక్ బౌలర్లను వణికించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ఇషాన్ కిషన్ సంచలన ఇన్నింగ్స్‌కు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత వికెట్ ‌కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి పాక్‌ను పూర్తిగా కట్టడి చేశారు. ఈ విజయంతో భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది.

నమ్మకం ఉంది..

మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్ కిషన్ మాట్లాడాడు. ‘వికెట్ అంత సులభంగా లేదు. కానీ నా బలాల మీద నమ్మకం పెట్టుకున్నాను. ఆఫ్‌సైడ్ ఆటపై ఎక్కువగా శ్రమించాను. పెద్ద గ్రౌండ్ కావడంతో గ్యాప్‌లను ఉపయోగించుకునే ప్రయత్నం చేశాను. 160-170 స్కోరు సరిపోతుందని ముందే అనుకున్నాను’ అని తెలిపాడు.

భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్….

భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్..

 

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. భారత్ నిర్దేశించిన 176 పరుaమదాస స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది (India vs Pakistan T20 World Cup).
ఈ మ్యాచ్ చూసేందుకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు పాకిస్థాన్ మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరయ్యారు. గ్యాలరీ నుంచి చాలా సేపు మ్యాచ్ వీక్షించారు. అయితే ఛేజింగ్‌లో పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోవడంతో నిరాశకు లోనయ్యారు. పాక్ పరాజయం తప్పదని తెలియడంతో మ్యాచ్ పూర్తి కాకముందే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ముందుగా ప్రతిపాదించింది నఖ్వీ అనే సంగతి తెలిసిందే (Mohsin Naqvi stadium exit).

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం….

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం.. అతడు అనర్హుడు: షోయబ్ అక్తర్

 

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై విమర్శలు చేశాడు (Akhtar on Pakistan loss).
‘మేము మ్యాచ్‌లో ఏ దశలోనూ పోటీలో లేము. షాహీన్ 125 కి.మీ./గం. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇంత వేగం ఆధునిక క్రికెట్‌కు అవసరం లేదు. వీరు ఒత్తిడిని తట్టుకునే ప్రతిభావంతులు కాదు. మ్యాచ్ జరిగిన తీరు చూస్తే ఏ దశలోనూ భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేము. గత 15-20 సంవత్సరాలుగా క్రికెట్‌పై మేం నిజాయితీగా పెట్టుబడి పెట్టలేదు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించలేదు’ అని అక్తర్ పేర్కొన్నాడు 

ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు…

ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు

డీఆర్‌డీఏ సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంస

డీఆర్‌డీఏ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌
చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఈ-సైకిళ్ల పంపిణీలో ప్రతిభ కనబరిచిన డీఆర్‌డీఏ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రశంసించారు. శనివారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో పీడీ శ్రీదేవితో కలిసి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశాశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కుప్పం పట్టణం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి నమోదయ్యేలా 24 గంటల వ్యవధిలో  ఈ-సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈవిషయంలో సంతోషం వ్యక్తం చేశారన్నారు. స్వచ్ఛంద కార్యక్రమాలు, మహిళా సంఘాలను బలోపేతం లాంటి కార్యక్రమాల అమలుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ డీపీఎంలు, ఏపీఎంలు, ఏపీఎంసీసీ, సభ్యులు పాల్గొన్నారు.

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్…

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్

 

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. అమెరికా బౌలర్ల ధాటికి పేకమేడల్లా కుప్పకూలింది. ఒకానొక సందర్భంలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నాక్ ఆడాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో ఏకంగా 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య ఒంటరి పోరాటం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 161 పరుగుల చేసింది. 162 పరుగులతో ఛేదనకు దిగిన అమెరికా.. 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్‌కు విజయం లాంఛనమైంది.

విధ్వంసకర బ్యాటింగ్‌కు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం సూర్య జట్టు గెలుపుపై మాట్లాడాడు. ‘నేనెంత ఒత్తిడి అనుభవించానో.. నేను మాత్రమే చెప్పగలను. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతానని నాకు తెలుసు. నేను చివరి వరకు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా మారుతుందని నా మీద నాకు నమ్మకముంది. పిచ్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంది. కానీ ఎప్పుడు పరుగులు వేగంగా రాబట్టాలో మాకు తెలుసు.క్యురేటర్ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. పిచ్‌ను రూల్, వాటరింగ్ చేయడానికి సరైన సన్‌లైట్ కూడా లేదు. ఈ పిచ్ మీద 180, 190 పరుగులు చేయలేమని ముందే అనిపించింది. 140 పరుగుల వికెట్ ఇది. 14 ఓవర్ల తర్వాత వచ్చిన బ్రేక్‌లో గౌతీ భాయ్ నాకు అదే విషయం చెప్పాడు. చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించు.. నువ్వు ఏ సమయంలోనైనా కవర్ చేయగలవు అన్నాడు. ఆ బ్రేక్ మాకు కలిసొచ్చింది. ముఖ్యంగా నేను ముంబైలో చాలా క్రికెట్ ఆడాను. ఇక్కడి పిచ్‌ల గురించి నాకు ఓ అవగాహన ఉంది’ అని సూర్య చెప్పుకొచ్చాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version