గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాపు .

గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాపు .

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్స్ సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ వివేకానంద హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజా ప్రతినిధులకు మార్గనిర్దేశం చేశారు. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమ నిబంధనలు (రూల్ బుక్), రాజ్యాంగ విషయాలపై అవగాహన సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలను మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూధనా చారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, పలువురు సీనియర్ నాయకులు నిర్వహించారు.
గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రదర్శించే పద్ధతి, ప్రభుత్వ విధానాలపై పార్టీ వైఖరిపై ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేశారు.

వృద్ధుల సంక్షేమ చట్టాలపై అవగాహన కల్పించి న్యాయం చేస్తాము…

వృద్ధుల సంక్షేమ చట్టాలపై అవగాహన కల్పించి న్యాయం చేస్తాము

వనపర్తి నేటిదాత్రి .

 

వృద్ధుల చట్టాలపై అవగాహన కల్పించి న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ తెలిపారు.
మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబ ర్ లో వృద్ధులు సీనియర్‌ సిటిజన్స్‌ జిల్లా కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సీనియర్ సిటిజన్స్ సమస్యలపై కమిటీ సభ్యులతో చర్చించారు. సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు సమాజంలో వృద్ధులు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై  పలు కీలక సూచనలను చేశారు సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకునే విధంగా సంరక్షించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ సభ్యులు సూచించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లలపై ఉందన్నారు. జిల్లాలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ప్రభుత్వం తరఫున అట్టి సంవత్సరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. వృద్ధుల సమస్యలపై ఇప్పటి వరకు 127 ఫిర్యాదులు వచ్చాయని 65 పరిష్కరించామన్నారు ఈ సమావేశంలో డి.ఎస్.పి బాలాజీ నాయక్, డిఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి, డి డబ్ల్యు ఓ సుధారాణి, ఆర్డీఏ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేటలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం…

క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 129 వ వర్ధంతి కార్యక్రమాన్ని రామాయంపేట పట్టణంలోని పూలే విగ్రహాల చెంత ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది..

రామాయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)

 

ఈ సందర్భంగా ఫౌండర్ అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద ఆలు పెరగని పోరాటం చేసి మహిళా హక్కులను సాధించిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు.

అలాగే ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి అని, సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి అనేక ప్రయత్నం చేసిన సామాజిక ఉద్యమకారిని సావిత్రిబాయి పూలే అని అన్నారు.

అలాగే మహాత్ములు చూపిన బాటలో యువత నడుస్తూ చెడు మార్గాన్ని వదిలిపెట్టి సన్మార్గంలొ నడుస్తూ మంచి లక్షణాలను అలవాటు చేసుకొని మంచి యువకులుగా ఎదగాలని, సమాజానికి మన వంతుగా ఎంతో కొంత సహాయం చేయాలని, మహనీయుల ఆశయాలను పునికిబుచ్చుకొని మన చుట్టూ ఉన్న ప్రాంతమునకు, ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాతూరి రాజు , కౌన్సిలర్ శంకర్ గౌడ్, అబ్రమైన గంగా రాములు , అల్లాడి వెంకట్, చిలుకా స్వామి, భూమా సిద్ధ రాములు , భూమా కిషన్ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం…..

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం…..

డ్రగ్స్ బారి నుండి బావిభారత పౌరులను రక్షిద్దాం….

ఈగల్ టీం డిఎస్పి ఉపేందర్….

నేటిధాత్రి

 

కమలాపూర్ (హనుమకొండ) బావి భారత పౌరుల జీవితాలను నాశనం చేస్తూ,సమాజానికి పెనుభూతంగా తయారైన డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని ఈగల్ టీం డిఎస్పి ఉపేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలోనీ కమ్యూనిటీ హాల్లో విద్యార్థులు,గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు,వైద్య సిబ్బంది,మండల అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులకు డ్రగ్స్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు యువత డ్రగ్స్ బారినపడి తమ విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని,భవిష్యత్తును కోల్పోతున్నారని, దానికి దూరంగా ఉండాలని

పిలుపునిచ్చారు.ఆర్థికంగా,శారీరకంగా,మానసికంగా క్రుంగి పలువురు తమ జీవితాలన్ మధ్యలోనే బుగ్గి పాలు చేసుకుంటున్నారని,మరి కొందర్ ఆ మత్తులో నేరాలు,ఘోరాలు చేస్తూ సమాజానికి చీడ పురుగులుగా తయారై సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్త పరిచారు.డ్రగ్స్ వాడటం వల్ల కలిగే పలు అనర్థాలను వివరించారు.పిల్లలను డ్రగ్స్ కు దూరంగా ఉండేటట్లు వారిపై దృష్టి సారించాలని తల్లిదండ్రులను,పాఠశాల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం పాఠశాల విద్యార్థి విద్యార్థులచే డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేసి డ్రగ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.డ్రగ్ రహిత గ్రామంగా మార్చేందుకు అందరము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ నవీన్,కమలాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్ తో పాటు వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ వైద్యులు,సిబ్బంది, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మరియు వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

నవతరాన్ని రక్షించు కుందాం డ్రగ్స్ నియంత్రణకు అడుగులు…

నవతరాన్ని రక్షించు కుందాం డ్రగ్స్ నియంత్రణకు అడుగులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద నవ తరాన్ని రక్షించుకుందాం డ్రగ్స్ నిర్మూలనకై ఎస్సై ఆధ్వర్యం లో మహోత్తరమైన కార్య క్రమం చేపట్టారు. నేటి తరం యువతతో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండ డంతో ఆందోళన చెందుతు న్నారు. దీన్ని అరికట్టడానికి డ్రగ్స్ నిరోధక చట్టాలను పదును తేల్చడం, శిక్షణ పెంపుతో పాటు పోలీస్ సిబ్బంది ప్రజలకు డ్రక్స్ వల్ల అనర్ధాలు గురించి వివరంగా తెలపడం జరిగింది. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పపరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది

పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట

ప్రతి మనిషి నిజ జీవితంలో ఎన్నో సవాళ్లు ఒత్తిళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది వాటి నుండి తాత్కాలిక ఉపశమ నం పొందడానికి చాలామంది పిల్లలు డ్రగ్స్ ను ఆశ్రయిస్తు న్నారు. స్నేహితులు బలవం తం పెట్టడంతో డ్రగ్స్ కు అలవాటు పడడం దాని నుండి నిర్మూలన చేసే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, వినోద కార్యక్ర మాల్లో ధూమపానం మద్య పానం డ్రగ్స్ వినియోగాన్ని సాధారణ అంశంగా ఫ్యాషన్ గా చూపుతున్నారు.

మానసిక ఆరోగ్యమే ముఖ్యం
నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో పిల్లలను వ్యసనాలకు దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులు చాలా ఉపయోగపడతారు రోజు కనీసం 10 నిమిషాలైనా ధ్యానంలో నిశ్శబ్దంగా ఉంటూ తమ గురించి తాము తెలుసుకునేలా సెల్ఫ్ ఎవర్నెస్ ప్రోగ్రాం ను ప్రోత్సహించాలి. శారీరిక సమస్యల పరిష్కారానికి, అవగాహన భరోసా పిల్లల్లో కల్పించాలి. ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలనకై సమావేశాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకై విద్యార్థులతో ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ కార్యక్ర మంలో పోలీస్ సిబ్బంది ప్రజలు యాక్ట్ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.

పోతుగల్లు శివార్లో ఇష్టారాజంగా ఇసుక దందా… పర్మిషన్ లేని ఇసుక క్వారీ….

పోతుగల్లు శివార్లో ఇష్టారాజంగా ఇసుక దందా… పర్మిషన్ లేని ఇసుక క్వారీ….
అడుగంటిపోయిన భూగర్భ జలాలు…..

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి…. మారపల్లి మల్లేష్
మొగులపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్లపల్లి మండలం లోని పోతుగల్ గ్రామ శివారులో చలివాగులో ఎలాంటి ఇసుక క్వారీ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు చలివాగులో సుక్క నీరు లేకుండా ఎండిపోయినది చలివాగు ప్రవహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల పొలాల్లో నీరు అందక ఉన్న బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఉన్నది పొలాలు ఇప్పటికే కొన్ని ఎండిపోతా ఉన్నాయి పొట్టకచ్చిన పొలాలకు ఈ సమయంలో నిరంతకపోతే రైతులు ఆరుకాలం పెట్టినటువంటి పెట్టుబడి రాక చేతికి వచ్చిన పొలం ఎండిపోతుంటే రైతులు లబోదిబో అనే పరిస్థితి దాపురించింది కానీ ఇసుక మాత్రం ఇష్టానుసారంగా తరలించడం వల్లనే భూగర్భ జలాలు అడగండి పోయి ఉన్న బోర్లు ఎత్తిపోతవున్నాయి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇసుక దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం .

ఎండిపోతున్న పొలాలకు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రైతులను ఆదుకోవాలని అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక బకాసురుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు… ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మండల కార్యదర్శి అంబాల అశ్వద్ధామ అజయ్ పాల్గొన్నారు

సమ్మె జీతాలు, పేస్కేల్ అమలు చేయాలి…

సమ్మె జీతాలు, పేస్కేల్ అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని, పేస్కేల్ అమలు చేయాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం (టీఎస్ యూటీఎఫ్) పిలుపు మేరకు మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎదుట జరిగిన ఈ నిరసనలో ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిష్కారం లభించకపోతే దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవి, మోహన్, రాజు, గోపాల్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

పెన్షన్ పెంపు కోసం మార్చి 13 న నిరాహార దీక్షలు…

పెన్షన్ పెంపు కోసం మార్చి 13 న నిరాహార దీక్షలు

◆-: ఛలో హైదరాబాద్కు వికలాంగులంతా తరలిరావాలి*

◆-: ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి కొనింటి నర్సిములు*

జహీరాబాద్ నేటి ధాత్రి:

వికలాంగుల పెన్షన్తో పాటు చేయూత పెన్షన్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చి 13 న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కొనింటి నర్సిములు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్న పెన్షన్స్ పెంచడం లేదు. 2023 డిసెంబర్ నుండే పెన్షన్ పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హామీని అమలు చేయకుండా వికలాంగులను మోసం చేశారు.బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రభుత్వం వికలాంగుల పట్ల చిన్న చూపు చూస్తుంది. కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 26 నెలల నుండి చేయూత లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ పెంచుతు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, బడ్జెట్ పెంపు కోసం మార్చి 13 న ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షలో జిల్లాలోని వికలాంగులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

న్యాల్కల్ మండలం రుకుమాపూర్ లోని పురాతన ముస్లిం శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నం…

న్యాల్కల్ మండలం రుకుమాపూర్ లోని పురాతన ముస్లిం శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నం…

◆-: స్థానిక ముస్లింలలో ఆందోళన, భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే బలమైన డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని రుకుమాపూర్ గ్రామంలో ఉన్న పురాతన ముస్లిం శ్మశానవాటికను కొంతమంది భూ కబ్జా మాఫియా కూల్చివేసినట్లు సంచలనాత్మక సంఘటన జరిగింది, దీని తర్వాత స్థానిక ముస్లింలలో తీవ్ర ఆందోళన కోపం ఉంది. మూలాల ప్రకారం, ఈ శ్మశానవాటిక పురాతన కాలం నుండి అక్కడ ఉంది దాని ప్రవేశ ద్వారం ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు గెజిట్‌లో కూడా ప్రస్తావించబడింది. ఈ శ్మశానవాటిక న్యాల్కల్ మండలానికి వెళ్లే ప్రధాన రహదారికి ఎదురుగా ఉంది, ఇక్కడ స్థానిక ముస్లింలు చాలా కాలంగా తమ మృతులను ఖననం చేస్తున్నారు. కొంతమంది భూ వ్యాపారులు తమ భూమికి మార్గం సుగమం చేయడానికి భూమిని కూల్చివేసి స్మశానవాటికను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో, న్యాల్కల్ మండల తహసీల్దార్ హద్నూర్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌కు ఇప్పటికే సమాచారం అందించినప్పటికీ, స్థానికుల ప్రకారం, సకాలంలో ఎటువంటి ప్రభావవంతమైన చర్య తీసుకోలేదు. తరువాత, భూ కబ్జాదారులు స్మశానవాటికలో కొంత భాగాన్ని కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే న్యాల్కల్ తహసీల్దార్ హద్నూర్ పోలీసులకు మళ్ళీ సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన న్యాల్కల్ మండల తహసీల్దార్ ప్రభు, భూ కబ్జాదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్య సందర్భంగా ఒక ట్రాక్టర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా నిరోధించడానికి శ్మశాన వాటిక భూమిని రక్షించాలని ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ముస్లిం ప్రతినిధులు డిమాండ్ చేశారు.

ఝరాసంగం గ్రామంలో 8వ దశ ఎఫ్‌ఎమ్‌డి టీకా కార్యక్రమం…

ఝరాసంగం గ్రామంలో 8వ దశ ఎఫ్‌ఎమ్‌డి టీకా కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామంలో 8వ దశ “ఎఫ్ఎండి” (పాదం మరియు నోటి వ్యాధి) టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్, మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, గ్రామ నాయకులు రాజేందర్ సింగ్, జగదీష్ పటేల్ పాల్గొని ప్రోత్సహించారు.వారి సమక్షంలో, గ్రామంలోని పశువులకు టీకాలు వేయించారు మరియు పశువుల యజమానులకు ఎఫ్‌ఎమ్‌డి వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి వాస్. శివ కుమార్. కృష్ణుడు. రాములు. సులోచనా రాణి. సిబ్బంది. పాల్గొని విజయవంతంగా అమలు చేశారు.

వెలుగుమట్ల బాధితుల సమస్యపై కవిత ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..

వెలుగుమట్ల బాధితుల సమస్యపై కవిత ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

 

వెలుగుమట్ల బాధితుల పట్ల ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్, మార్చి 10: భూదాన్ భూములు అంటేనే పేద వాళ్ళకు ఇచ్చినవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో నిరాహారదీక్ష చేసిన కవితను పోలీసులు అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వెలుగుమట్ల ఇళ్లు కూలగొట్టి అధికారులు కర్కశంగా వ్యవహరించారని మండిపడ్డారు. బాధితులను అంబేద్కర్ భవన్‌లో ఉంచారని.. బాధితుల పట్ల ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ నేత విశారదన్‌తో కలిసి ఉద్యమించామని కవిత అన్నారు.
నిరవధిక దీక్షకు దిగితే తాను టెర్రరిస్ట్ అయినట్లు అరెస్ట్ చేశారని ఫైర్ అయిన కవిత.. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. పెద్ద వాళ్లకు భూములు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. కూలగొట్టిన చోటే వాళ్ళకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ.. వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ యుద్ధం గురించి చర్చ..

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ యుద్ధం గురించి చర్చ..

 

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్ యుద్ధం, చమురు సరఫరాలో అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలైన విషయాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్ యుద్ధం, చమురు సరఫరాలో అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలైన విషయాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్టు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రిముఖ చర్చల గురించి కూడా ఈ సంభాషణలో ప్రస్తావన వచ్చినట్టు సమాచారం (Trump Putin call).

యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ భారీగా నష్టపోతున్నట్టు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారని క్రెమ్లిన్ వెల్లడించింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్‌నకు పుతిన్ సూచించారని తెలిపింది. యుద్ధం ముగింపునకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనలను ట్రంప్‌నకు పుతిన్ సూచించినట్టు రష్యా విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు (Trump Putin phone conversation).

ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి కూడా ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నట్టు యూరి ఉషాకోవ్ తెలిపారు (Ukraine war updates). ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై అమెరికా ప్రతినిధులతో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల గురించి కూడా ట్రంప్‌, పుతిన్ మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌తో పుతిన్ మాట్లాడారని, టెహ్రాన్‌కు రష్యా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారని ఉషాకోవ్ వెల్లడించారు.

ఇఫ్తార్ విందు: మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు…

ఇఫ్తార్ విందు: మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ పట్టణంలోని బీదర్ బేస్ ప్రధాన కూడలిలో ప్రముఖ వ్యాపారవేత్త ముక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. విందు అనంతరం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయని ముస్లిం మత పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాచూరి కనకరత్నం, రాచురి చంద్రశేఖర్, బడంపేట శ్రీనివాస్, రాజేశ్వర్, చాంద్ ఖురేషి, మునవర్ పటేల్, శన్ను, వెంకటేశం, రాధాకృష్ణ, అశోక్ తివారీ, సంగయ్య, వీరారెడ్డి, హాజి సేట్, సర్దార్ సెట్, ముక్రం, అజర్ సెట్, మాన్యయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగింది.

న్యాల్కల్ మండలం రుకుమాపూర్ లోని పురాతన ముస్లిం శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నం…

న్యాల్కల్ మండలం రుకుమాపూర్ లోని పురాతన ముస్లిం శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నం…

◆-: స్థానిక ముస్లింలలో ఆందోళన, భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే బలమైన డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని రుకుమాపూర్ గ్రామంలో ఉన్న పురాతన ముస్లిం శ్మశానవాటికను కొంతమంది భూ కబ్జా మాఫియా కూల్చివేసినట్లు సంచలనాత్మక సంఘటన జరిగింది, దీని తర్వాత స్థానిక ముస్లింలలో తీవ్ర ఆందోళన కోపం ఉంది. మూలాల ప్రకారం, ఈ శ్మశానవాటిక పురాతన కాలం నుండి అక్కడ ఉంది దాని ప్రవేశ ద్వారం ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు గెజిట్‌లో కూడా ప్రస్తావించబడింది. ఈ శ్మశానవాటిక న్యాల్కల్ మండలానికి వెళ్లే ప్రధాన రహదారికి ఎదురుగా ఉంది, ఇక్కడ స్థానిక ముస్లింలు చాలా కాలంగా తమ మృతులను ఖననం చేస్తున్నారు. కొంతమంది భూ వ్యాపారులు తమ భూమికి మార్గం సుగమం చేయడానికి భూమిని కూల్చివేసి స్మశానవాటికను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో, న్యాల్కల్ మండల తహసీల్దార్ హద్నూర్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌కు ఇప్పటికే సమాచారం అందించినప్పటికీ, స్థానికుల ప్రకారం, సకాలంలో ఎటువంటి ప్రభావవంతమైన చర్య తీసుకోలేదు. తరువాత, భూ కబ్జాదారులు స్మశానవాటికలో కొంత భాగాన్ని కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే న్యాల్కల్ తహసీల్దార్ హద్నూర్ పోలీసులకు మళ్ళీ సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన న్యాల్కల్ మండల తహసీల్దార్ ప్రభు, భూ కబ్జాదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్య సందర్భంగా ఒక ట్రాక్టర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా నిరోధించడానికి శ్మశాన వాటిక భూమిని రక్షించాలని ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ముస్లిం ప్రతినిధులు డిమాండ్ చేశారు.

తరాలు తిన్నా తరగని సంపాదనలో తహసీల్దార్లు? ఎపిసోడ్ 1

 

చట్టాలకు తూట్లు.. తహసీల్దార్ల సంపాదన కోట్లు!?

`ఫామ్ ల్యాండ్ల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్లు?

`విచ్చలవిడిగా నిబంధనలు పాతర పెడుతున్నారు?

`రెవిన్యూ వ్యవస్థను కొందరు తహసీల్దార్లు బ్రష్టు పట్టిస్తున్నారు?

`ప్రభుత్వ ఆదేశాలు, రెవిన్యూ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు?

`ఓ వైపు ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేస్తుంటే, తహసీల్దార్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తూనే వున్నారు?

 

`పంచాయతీ రాజ్ 2018 చట్టానికి విరుద్ధంగా వ్యవహారిస్తున్నారు?

`హైడ్రా కమిషనర్ ఆదేశాలను అసలే లెక్క చేయడం లేదు?

 

`20 గుంటలు ఉంటే తప్ప ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయొద్దు?

`గుంట,రెండు గుంటలకు కూడా కొందరు తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు?

`రియల్ వ్యాపారుల కొమ్ము కాసున్నారు?

`ప్రభుత్వ ఆదాయనికి గండి కొడుతున్నారు.

`చట్టాలను యదేచ్చగా ఉల్లంగిస్తున్నారు?

`ప్రజలను మోసం చేస్తున్న రియల్ వ్యాపారుల కొమ్ము కాస్తున్నారు?

`తహసీల్దార్ల అండ చూసుకొని రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు?

`భూములకు రక్షణగా నిలవాల్సిన తహసీల్దార్లే రియల్ వ్యాపారులతో చేతులు కలుపుతున్నారు?

`గుంట,రెండు గుంటలకు కూడా రైతు భరోసా, రైతు భీమా వస్తుందని రియల్ వ్యాపారాలు ప్రచారం చేస్తున్నారు?

`అమాయక ప్రజలకు ఫామ్ ల్యాండ్ పేరుతో భూములు అంట గడుతున్నారు?

`ఈ అక్రమ ప్రచారాలు తెలిసినా తహసీల్దార్లు నిమ్మకు నీరేతినట్లు వుంటున్నారు?

`ఇలాంటి రియల్ వ్యాపారాల మీద చర్యలు తీసుకోవాల్సిన తహసీల్దార్లే చోద్యం చూస్తున్నారు?

`తహసీల్దార్ల కనుసన్నాల్లోనే రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు?

`ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెబుతూనే వున్నారు?

`తహసీల్దార్లు చేయాల్సింది చేస్తూనే వున్నారు?

`ఫామ్ ల్యాండ్ పై రంగనాధ్ ఎంత చెబుతున్నా ప్రజలు మోసపోతూనే వున్నారు?

`ఇలాంటి రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పిసరంతా?

`తహసీల్దార్ల జేబుల్లోకి వెళ్ళేది గుమ్మడికాయంత?

`అక్రమ రిజిస్ట్రేషన్లతో తహసీల్దార్లు కొందరు కోట్లు సంపాదించుకుంటున్నారు?

`ఏసీబీ అధికారులకు దొరకకుండా కొత్త కొత్త ఉపాయలతో లంచాలు తీసుకుంటున్నారు?

`శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు రచిస్తున్నారు?

`ఏసీబీ అధికారులు దాడి ముందే కనిపెడుతున్నారు?

`డబ్బులున్న సూట్ కేసులే రోడ్ల మీదకు విసిరేస్తున్నారు?

`ఎంత తరగని అక్రమ సంపాదన వుంటే అలా సొమ్ము విసిరేయగలరు?

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                             

 కాణి లేనిదే కలం ముట్టని రెవిన్యూ యంత్రాంగం. లంచం లేనిదే సంతకం పెట్టడం లేదు. అక్రమార్కుల కోసం అవినీతి సంతకాలు చేస్తుంటారు? చట్టాలకు పెన్నుతో తూట్లు పొడుస్తున్నారు. ఇంకుతో ఇష్టారాజ్యం సాగిస్తున్నారు. చేతిలో పవన్ వుందని కదా! అని పనికి మాలిన పనులు చేస్తున్నారు. కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అటు జీతాలు, ఇటు లంచాలతో కొంత మంది తహిల్ధార్‌లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇష్టారాజ్యంగా అడ్డూ అదుపులేని అక్రమ సంపాదనలకు తెగబడుతున్నారు. అక్రమ సంపాదనే లక్ష్యంగా కొలువులు చేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ప్రజలనే మోసం చేస్తున్నారు. వ్యవస్ధను నిండా ముంచేస్తున్నారు. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. రియల్ వ్యాపారుల కోసం తమ ఉద్యోగాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బీద బిక్కిని బాధలు పెడుతున్నారు. రియల్ వ్యాపారుల కొమ్ము కాస్తున్నారు. భూములను రక్షించాల్సిన తహిల్ధార్‌లే దగ్గరుండి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. సమాజమంతా చీ అంటున్నా తుడుచుకుపోతున్నారు. పేదల కన్నీళ్లు తాగుతున్నారు. ఓ వైపు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన జీవితాలతో వచ్చిన వెలుగులు చాలవనుకున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో ఇక ఈ ధరణి అంతా మాదే అన్నట్లు అక్రమ రిజిస్ట్రేషన్లకు తెగబడ్డారు. దశాబ్ధ కాలంగా సంపాదించిన సొమ్ము చాలదన్నట్లు, నిత్య సంతర్పణలు లేకుండా బతకలేకపోతున్నారు. లక్షల్లో జీతాలు, నిత్యం లక్షల్లో లంచాలతో ఏటా కోట్లు సంపాదించుకుంటున్నారు. కోట్లాది రూపాయలు కూడబెట్టుకుంటున్నారు. రెవిన్యూ వ్యవస్థలో ఉద్యోగంతో కాసుల పంట పండించుకుంటున్నారు. తిండి గింజలు కూడా పండని భూములతో సతమతమౌతున్న రైతులనుంచి లంచాల రూపంలో లక్షలు తీసుకుంటున్నారు. పేద ప్రజలను వేదించుకు, పీడించుకుతింటున్నారు. మరో వైపు రియల్ వ్యాపారులకు సహకరిస్తూ, ప్రభుత్వ స్పూర్తి, చట్టాలను గంగలో కలుపుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం తెచ్చిన రెవిన్యూ చట్టాలున బుట్ట దాఖలు చేస్తున్నారు. పంచాయితీ రాజ్ 2018 చట్టాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కొత్తగా రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన హైడ్రాకు తహిసిల్ధార్‌లు భయపడడం లేదు. గత రెండేళ్ల కాలంగా హైడ్రా కమీషనర్ రంగనాధ్ ప్రజలు చైతన్యం చేస్తూనే వున్నారు. ఫామ్ లాండ్ పేరిట రియల్ వ్యాపారులు సాగిస్తున్న అక్రమ భూ దందాలను నమ్మకండి అని పదే పదే రెండేళ్లుగా చెబుతూనే వున్నారు. కాని ఆ మాటలు ప్రజలు వినడం లేదా? వినిపించుకోవడం లేదా? రియల్ వ్యాపారులు చెబుతున్న మాటలే నమ్ముతున్నారా? ఇప్పటికే ఎంతో మంది ఇలా ఫామ్ లాండ్స్ కొనుగోలు చేసి ఆగమైన సంఘటనలు అనేకం వున్నాయి. ఎంతో మంది తమ గోడును నిత్యం మీడియాతో పంచుకుంటూనే వున్నారు. హైడ్రా కమీషనర్ దాదాపు నిత్యం పదే పదే ప్రజలను చైతన్యం చేస్తూనే వున్నారు. అదే దారిలో నడవాల్సిన రెవిన్యూ ఉద్యోగులు, ముఖ్యంగా తహసిల్ధార్లు, ఆర్డీవోల అక్రమాలకు తెగబడుతున్నారు. హైడ్రా కమీషనర్ మాటలు కూడా పెడ చెవిన పెడుతున్నారు. ఫామ్ లాండ్ వ్యాపారం అంటే సుమారు 20 గుంటల భూమి వుండాలి. అంటే అర ఎకరం వుంటే తప్ప పామ్ లాండ్‌గా రిజిస్ట్రేషన్ చేయకూడదు. అది చట్టం చెబుతున్న మాట. పదే పదే హైడ్రా కమీషనర్ కూడా మొత్తుకుంటున్న మాట. కాని ఆయన మాటలు కూడా ఎవరూ ఎందుకు వినడం లేదనేది ఇప్పటికీ అర్దం కాకుండాపోతోంది. పైగా భూములకు రక్షణగా వుండాల్సిన రెవిన్యూ వ్యవస్ధ అవినీతి కూపంలో కూరుకుపోయింది. అవినీతి సొమ్ము తినకుండా రోజు గడపలేకపోతోంది. అయితే అందరూ కాదు. కొని అధిక శాతం ఉద్యోగులు లంచాలు లేకుండా కొలువు చేయడం లేదు. దాంతో విచ్చలవిడిగా నిబంధనలను పాతర పెడుతున్నారు. ఎక్కువ శాతం తహిసిల్ధార్‌ల మూలంగానే ఈ వ్యవస్ధ భ్రష్టుపట్టిపోతోంది. 20 గుంటలు వుంటే తేప్ప రిజిస్ట్రేషన్‌కు అవకాశం చట్టాన్ని తహిసిల్ధార్‌లు ఉల్లంఘించడం నేరం కాదా? ఈ దుర్మార్గం పై స్దాయి అదికారులకు కనిపించడం లేదా? అనేక సమస్యలు నిత్యం పత్రికల్లో వస్తూనే వున్నాయి. అయినా పై స్ధాయి అధికారులు కల్లు మూసుకుంటున్నారా? రెండు గుంటలు, ఐదు గుంటలు ఎలా ఫామ్ లాండ్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? చట్టం ఎలా ఒప్ప్పుకుంటుందనుకుంటున్నారు? పైగా ఇలా ఐడు గుంటల భూమికి కూడా రైతు భరోసా వస్తుందని, రైతు భీమాకు అర్హులౌతారని రియల్ వ్యాపారులు మోసం చేస్నున్న సంగతి తహసిల్ధార్‌లకు కనిపించడం లేదా? ఏ ధైర్యంతో రియల్ వ్యాపారులు అలా బ్రోచర్లు ముద్రిస్తున్నారు. వాటిని ఎలా ప్రజలకు పంచుతున్నారు. రెవిన్యూ చట్టాలు ఎంత కఠిన తరంగా వుంటాయో తెలియకుండానే రియల్ వ్యాపారాలు చేస్తున్నారా? తహసిల్ధార్‌లే తమకు అండగా వుండగా చట్టమేమి చేస్తుందని రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారా? ఐదు గుంటలకు రైతు భరోసా అమలు చేస్తారని ప్రచారం చేస్తుంటే తహసిల్ధార్‌లు అడ్డుకోవాల్సిన అసవరం లేదా? ప్రజలను చైతన్యం చేసే బాధ్యత రెవిన్యూ అధికారులది కాదా? ఇలా సాగిస్తున్న రియల్ వ్యాపారం మూలంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆవ గింజంత వుంటోంది. అలా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న తహసిల్ధార్లకు గుమ్మడి కాయంత ముడుతోంది. అంటే పిసరంత ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంటే తహసిల్ధార్‌ల జేబుల్లోకి లక్షలకు లక్షలకు లక్షలు పోతున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే అనంత సులువుగా లంచాలు తీసుకుంటున్నారు. కోట్లకు పడగలెత్తుతున్నారు. పైగా తమను ఏబిసి అధికారులు కూడా పట్టుకోకుండా రకరకాల రూపాల్లో లంచాలు తీసుకుంటున్నారు. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలన్నట్లు, కొత్త కొత్త దారులు వెతుక్కొని మరీ లంచాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్ప్పుకుంటే వ్యవస్ధ ఎంత దిజజారిపోయిందో కూడా తెలుసుకోవచ్చు. ఒక తహసిల్ధార్‌పై కొంత కాలంగా అనేక పిర్యాధులు ఏసిబికి అందాయి? అలా అందుతున్న పిర్యాధులతో ఏసిబి అదికారులు ఆ తహసిల్ధార్‌ను పట్టుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చిక్కిన దాఖలాలు లేవు. ఏదో రకంగా ఆ తహసిల్ధార్ తన అతి తెలివితో తప్పించుకుంటూ వచ్చారు. ఆఖరుకు ఏసిబి అధికారులు ఆ తహసిల్ధార్ ఇంటి మీద దాడులు చేస్తారన్న సమచారాన్ని కూడా తెలుసుకొని, నాలుగు కోట్ల రూపాయల విలువైన డబ్బు, నగలతో కూడిన సూట్‌కేసును రోడ్డు మీద విసిరేశాడంటే? వారి అతి తెలివి తేటలు ఎలా వున్నాయో అర్దం చేసుకోవచ్చు. రోడ్డు మీద నాలుగు కోట్ల రూపాయలను క్షణం ఆలోచించకుండా విసిరిపడేసేందుకు సిద్దమయ్యాడంటే, అతని సంపాదన బైట ఎంత వుంటుందో అంచనా వేసుకోవచ్చు. అలా విచ్చలవిడిగా కొంత మంది తహసిల్ధార్‌లు సంపాదిస్తున్నారు. అయితే ఏసిబి అధికారుల్లో కూడా కొంత మంది అక్రమ తహసిల్ధార్‌లకు కూడా ముందస్తు సమాచారం అందిస్తున్నారన్న సంగతి కూడా తేలిపోతోంది. వ్యవస్ధలు ఇలా అక్రమంగా కుమ్మక్కైతే అవినీతి ఎలా అంతమౌతుంది? లంచాలు లేని వ్యవస్ధ నెలా నిర్మాణమౌతుంది? ఇలా అవినీతి సొమ్ముకు అలవాటు పడిన తహసిల్దార్‌లు తెలంగాణలో అనేక మంది వున్నారు. వారి బండారం నేటిధాత్రి వరుస కధనాలతో బైట పెట్టనుంది. ఎందుకంటే తరాలు తిన్నా తరగనంత సంపాదన కోసం ఓ వైపు పేదల రక్తం తాగుతున్నారు. మరో వైపు చట్టాలను అమలు చేయాల్సిన కర్తవ్యం గాలికి వదిలేస్తున్నారు. తమ బాధ్యతలను విస్మరించి అక్రమ రియల్ వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు. వారి అక్రమ వ్యాపారాలకు కొమ్ము కాస్తున్నారు. వారి నుంచి లక్షల రూపాయలు దండుకొని ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. సహజంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్ల కాకుండా అడ్డదారిలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వాదేశాలను కూడా బేకాతరు చేస్తున్నారు. గుంట కొనుగోలు చేయాలనుకునే వారితో మరో ఐదుగురిని కలిపి ఐదు గుంటలు రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. పాస్ బుక్కులను కూడ జారీ చేస్తూ రియల్ వ్యాపారులకు సహకరిస్తున్నారు. రియల్ వ్యాపారులు చెప్పే అuద్దాలను నిజమని నమ్మేలా తహసిల్ధార్‌లు రిజిస్ట్రేషన్లు చేస్తూ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. తమకు సంపాదనే ధ్యేయమని నిరూపిస్తున్నారు. అమయక ప్రజలను నిండా ముంచుతున్నారు. అలాంటి వారిపై వరుస కథనాలు రేపటి నుంచి మీ నేటిధాత్రిలో….

 

 

`అలాంటి తహసీల్దార్ల అవినీతి బాగోతలపై మీ “నేటిధాత్రి”లో వరుస కథనాలు!

`ఫామ్ హౌస్ రిజిస్ట్రేషన్ లలో ఆ తహసిల్దార్ అవినీతి కిరణాలు? ఎపిసోడ్ 2

పదో తరగతి విద్యార్థులకు మాతృమూర్తుల ఆశీస్సులు.

పదో తరగతి విద్యార్థులకు మాతృమూర్తుల ఆశీస్సులు.
-మర్రిగడ్డలో కన్నులపండువగా వేడుక.
చందుర్తి, నేటిధాత్రి:

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (మర్రిగడ్డ)లో పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో జరిగింది. ‘అమ్మ ఆశీర్వచనం’ పేరుతో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లుల పాదాలకు నమస్కరించి, వారి దివ్య ఆశీస్సులు తీసుకోవడం అందరినీ కదిలించింది.
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులలో మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కన్నతల్లులకు పాదపూజ చేసి, వారి పాదాలకు నమస్కరించారు. అనంతరం మాతృమూర్తులు తమ పిల్లల నుదుట తిలకం దిద్ది, హాల్ టికెట్లను అందజేసి, పరీక్షల్లో ఘనవిజయం సాధించాలని నిండు మనసుతో దీవించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ మాట్లాడుతూ:
“పిల్లల ఎదుగుదలలో మరియు చదువులో తల్లి పాత్ర వెలకట్టలేనిది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, కన్నతల్లి దీవెనలతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నదే మా సంకల్పం. ఈ సంప్రదాయబద్ధమైన కార్యక్రమం విద్యార్థులలో బాధ్యతను, పట్టుదలను పెంచుతుందని మేము విశ్వసిస్తున్నాము” అని పేర్కొన్నారు.
కార్యక్రమ ముఖ్యాంశాలు:
పాద నమస్కారం: విద్యార్థులు తమ తల్లుల పాదాలకు నమస్కరిస్తున్న సమయంలో పాఠశాల ప్రాంగణమంతా ఒక పవిత్రమైన, భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంది.
హాల్ టికెట్ల పంపిణీ: అధికారుల ద్వారా కాకుండా, నేరుగా తమ అమ్మ చేతుల మీదుగా హాల్ టికెట్లు అందుకోవడం తమకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల సంతృప్తి: పాఠశాల యాజమాన్యం పిల్లలలో సంస్కారంతో కూడిన విద్యను అందిస్తున్న తీరుపై తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు గంగ నర్సయ్య, వేణుగోపాల్, కనకయ్య, సావిత్రి, జ్యోతి రాణి, సరోజ, పద్మ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్…

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

బహుమతులు అందజేసిన ఎస్ఐ పవన్ కుమార్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ విజేతలకు ఎస్ఐ పవన్ కుమార్ కళాశాల చైర్మన్ సిరికొండ శ్రీనివాస్ లు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి సిరివెన్నెల,రెండవ బహుమతి ఎస్ఆర్ స్కూల్ ఉతమ్ శెట్టి,ప్రభుత్వ పాఠశాల నుండి మొదటి బహుమతి అక్షయలు బహుమతులు అందుకున్నారు.ఈ సందర్బంగా అతిధులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి వారి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని అలాగే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.మార్చి పద్నాలుగు నుండి జరగబోయే పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి భయం లేకుండా మంచిగా రాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ ఇన్చార్జి కల్పన,పద్మ, ధనలక్ష్మి,విద్యార్థులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి పారిశుద్ధ్యం ముఖ్యము ఎమ్మెల్యే జీఎస్సార్….

మున్సిపాలిటీ అభివృద్ధికి పారిశుద్ధ్యం ముఖ్యము ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 20వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్‌ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు బట్టు కరుణాకర్ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వార్డులో శుభ్రత పనులను చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పట్టణాల అభివృద్ధికి పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని సూచించారు.
పట్టణంలోని ప్రతి వార్డులో మున్సిపల్ అధికారులు సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్య పనులను వేగవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రమైన వాతావరణం అవసరమని, మురుగు కాలువలు, చెత్త నిల్వలు లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రత పనులు చేపట్టాలని, ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ అందించే సదుపాయాలను వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు శ్రమతో పనిచేస్తూ వార్డులో చెత్తను తొలగించడం, కాలువలను శుభ్రపరచడం వంటి పనులు నిర్వహించారు. ఎమ్మెల్యే మరియు ఇతర ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్మికులను అభినందించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగి, శుభ్రమైన భూపాలపల్లి నిర్మాణానికి దోహదపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు వార్డు కౌన్సిలర్స్ రాజు నాయక్ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

బిఆర్ఎస్. పార్టీ నాయకుల ఆధ్వర్యంలోమోడల్ స్కూల్లోప్యాడ్లు పెన్నులు పంపిణీ…..

బిఆర్ఎస్. పార్టీ నాయకుల ఆధ్వర్యంలోమోడల్ స్కూల్లోప్యాడ్లు పెన్నులు పంపిణీ…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తగలపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా. ఇద్దరమ్మ.కాలనీ ఉపసర్పంచ్ అల్వాల.సాయిరాం మరియు బి ఆర్ ఎస్.పార్టీ నాయకులు ఆధ్వర్యంలో. తంగళ్ళపల్లి మండలం. టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలోని మోడల్ స్కూల్లో 10.వ తరగతి చదువుతున్న 91 మంది విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు. అందజేయడం జరిగిందని తెలియజేస్తూ. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా. 10.వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గిఫ్ట్. ఏ .స్మైల్. లో. భాగంగా. బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు చిరు.కానుకగా తన వంతుగా. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ తన నియోజకవర్గంలో పరీక్ష ప్యాడ్లుపెన్నులు అందించడం జరుగుతుందని. గత పది రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుందని. అందులో భాగంగా ఈరోజు టెక్స్టైల్ పార్క్ మోడల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ప్యాడ్స్ పెన్నులు అందించడం జరిగిందని. అలాగే కేటి రామారావు తన సిరిసిల్ల నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి.విద్యార్థులందరికీ. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఉత్తమ ఫలితాలు సాధించాలని. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చదువులో మంచి ఫలితాలు సాధించాలని మనో ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులు కేటీ రామారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ మాజీ ఉపసర్పంచ్.అల్వాల. సాయిరాం. మాజీ సర్పంచ్ వేముల శ్రీమతి. కల్వకుంట్ల నాగేశ్వరరావు. వేముల కిషన్. మామిడాలశ్రీనివాస్. వేముల వెంకటేశం.మెరుగు శేఖర్. మెరుగు తిరుపతి. సదానందం.గడ్డం కిరణ్. కుచనసాయి. వేముల రవి తదితరులు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version