ఇఫ్తార్ విందులో పాల్గొన్న నాయకులు….

ఇఫ్తార్ విందులో పాల్గొన్న నాయకులు….

◆-: మాజీ ఎంపీటీసీ హఫీజ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీనియర్ నాయకుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

చీలేపల్లి మాజీ ఎంపీటీసీ హఫీజ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కార్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ హనుమంతరావు పాటిల్, ఉజ్వల్ రెడ్డితో పాటు వివిధ మండల పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ లు, గ్రామ అధ్యక్షులు, నాయకులు మరియు పత్రికా మిత్రులు పాల్గొన్నారు. 
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఖజూర్ పండును తినిపిస్తూ ఇఫ్తార్ విరమించారు. ఈ సందర్భంగా

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కార్,మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.మత సామరస్యాన్ని కాపాడుతూ అందరం కలిసి ముందుకు సాగితేనే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు.అల్లా దయ అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని,రాష్ట్ర ప్రజలు మరియు జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ప్రజలు సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని
వరితో ప్రార్థనలలో పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి ప్రేమ విందులో ప్రార్థించారు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు సాయంత్రం సంగారెడ్డి జిల్లా పారామెడిక్స్ ఆర్.ఎం. పి , పి.ఎం .పి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మైనారిటీ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version