ఇండోర్‌లో కలుషిత నీరు.. గిల్ చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..

ఇండోర్‌లో కలుషిత నీరు.. గిల్ చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..

 

భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆదివారం మూడో వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. అయితే.. ఇటీవల ఇండోర్‌లో కలుషిత నీరు తాగడం వల్ల పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Shubmఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచులు జరగ్గా.. ఇరుజట్లు 1-1తేడాతో సమంగా కొనసాగుతున్నాయి. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది. బలమైన కివీస్ జట్టును టీమిండియా ఎదుర్కొని సిరీస్ పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే.. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్‌లో ఇటీవల కలుషిత తాగునీటి వల్ల పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆటగాళ్లున్న ఫైవ్ స్టార్ హోటల్, మైదానంలో పరిశుభ్రమైన నీరందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. తాను బస చేస్తున్న హోటల్‌లోని తన గదిలో రూ.3లక్షలు ఖరీదు చేసే వాటర్ ప్యూరిఫయర్‌ను బిగించుకున్నట్లు సమాచారం. ఈ పరికరానికి ఆర్వో వాటర్, ప్యాకేజ్డ్ వాటర్‌ను కూడా మళ్లీ ప్యూరిఫై చేసే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.

విరాట్ ఎప్పటి నుంచో..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటి నుంచో తాను తాగే నీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అతడు ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి సేకరించే ప్రత్యేక వాటర్‌ను మాత్రమే వినియోగిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే.

అది మీకే తెలియాలి.. సెలక్టర్లపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం…

అది మీకే తెలియాలి.. సెలక్టర్లపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం

 

న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన జట్టులో సీనియర్ పేసర్ షమీని ఎంపిక చేయలేదు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్ జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో సీనియర్ పేసర్‌ మహ్మద్ షమీకి మరోసారి చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన షమీ, అప్పటి నుంచి సెలెక్షన్‌కు దూరంగానే ఉన్న
గాయాల నుంచి కోలుకున్న అనంతరం కూడా షమీని ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లకు పక్కనపెట్టారు. ఆపై ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక కాలేదు. ఇప్పుడు బ్లాక్‌క్యాప్స్‌తో వన్డే సిరీస్‌కూ అతడికి నిరాశే ఎదురైంది. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో షమీ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ షమీని ఎంపిక చేయకపోవడంపై మాజీ భారత ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్ పఠాన్‌(Irfan Pathan) స్పందించాడు.షమీ(Mohammed Shami ) నిన్న మొన్న వచ్చిన ఆటగాడు కాదు. 450-500 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్‌. 400కి పైగా వికెట్లు పడగొట్టిన ఆటగాడిని పక్కనపెట్టి ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతి ఆటగాడికీ ఫిట్‌నెస్ పరీక్షలు సహజమే. కానీ షమీ ఇప్పటికే 200 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అన్ని ఓవర్లు వేసిన తర్వాత కూడా ఫిట్‌నెస్ సరిపోదంటే.. ఇంకా ఏ అతడు ఏం చేయాలి? అది సెలెక్షన్ కమిటీకే తెలియాలి’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.

నేనే షమీ స్థానంలో ఉంటే..

‘నేనైతే షమీ స్థానంలో ఉంటే ఐపీఎల్‌లో ఆడి విధ్వంసం సృష్టిస్తాను. కొత్త బంతితో నా పాత రిథమ్ చూపిస్తాను. దేశవాళీ క్రికెట్‌ను గుర్తిస్తారు కానీ ఐపీఎల్‌లో ప్రదర్శన ఇస్తే ప్రపంచమే చూస్తుంది. అక్కడ రాణిస్తే ఎవరూ పట్టించుకోకుండా ఉండలేరు. అతడి కోసం తలుపులు పూర్తిగా మూసేయకూడదు’ అని స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version