ప్రాథమిక పాఠశాల ఝాన్సీ లింగాపూర్ బీసీకాలనీ లో స్వయం పరిపాలన దినోత్సవం…

ప్రాథమిక పాఠశాల ఝాన్సీ లింగాపూర్ బీసీకాలనీ లో స్వయం పరిపాలన దినోత్సవం…

రామాయంపేట మార్చి 9 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ బీసీ పాఠశాలలో సోమవారం నాడు స్వయంపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు సహార్శ్ డి ఈ ఓ గా నందీశ్వర్ ఎంఈఓ గా మనీష్ గౌడ్ హెడమాస్టర్ గా యశ్వంత్ పి ఈ టి గా రామకృష్ణ శివప్రసాద్ శివతేజలు ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులుగా నందిత తేజస్విని అవంతిక రిషిక మరియు శ్రీనిధి విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి నరసింహారావు ఉపాధ్యాయులు రవికుమార్ పాల్గొని ఉపాధ్యాయులైన విద్యార్థులను అభినందించి బహుమతులు ఇవ్వడం జరిగింది.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీలోని విలేజ్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాఠశాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించి మండల విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా,ఉపాధ్యాయులుగా మరియు ఇతర బాధ్యతలను చేపట్టి ఒకరోజు పాటు పాఠశాల కార్యకలాపాలను నిర్వహించారు. డి ఈ ఓ గా బానోతు సూర్య తేజ, ఎం ఈ ఓ గా గట్ల మనీషా,ప్రధానోపాధ్యాయులుగా గుండెబోయిన సుస్మిత, ఉపాధ్యాయులుగా లకావత్ ఇందు, గుండెల బిందు, బట్టి దివ్య, భూక్య ధీరజ్, నిమ్మల శ్రీ వేణి, మహమ్మద్ రెహనా, మహమ్మద్ రియాజ్, లకావత్ చరణ్, అటెండర్ గా కోడి రాకేష్ విధులు నిర్వర్తించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తరగతులు బోధించడం, అసెంబ్లీ నిర్వహించడం మరియు పాఠశాల వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్నా హరినాధ్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులందరికీ చికెన్ కూరతో మధ్యాహ్న భోజనం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుండు సురేందర్, వీసం నర్సయ్య, వెలమాల భాస్కర్ భాస్కర్, , అప్పాల నాగరాజు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version