కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం

హన్మకొండ,నేటిధాత్రి:ప్రముఖ షాపింగ్ మాల్ కళ్యాణలక్ష్మి హన్మకొండ బ్రాంచీలో అగ్నిప్రమాదం జరిగింది.ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా మూతబడిన షాపింగ్ మాల్ ప్రమాదవశాత్తూ ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది.ఫైర్ సిబ్బందికి విషయం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నప్పటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పేట్ట లేకపోయారు.మాల్లో ఏర్పడిన ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి సరైన మార్గం లేకపోవడంతో చేసేదేమీ మిన్నకుండిపోయారు.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గుండు సుధారాణి

వరంగల్ అర్బన్,నేటిధాత్రి :రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ గుండు సుధారాణి అన్నారు.శనివారం స్థానికంగా ఉన్న మంగలికుంట, దేశాయిపేట వీవర్స్ కాలనీ, బాలాజీ సంఘం ప్రాంతాలకు చెందిన 200మంది మహిళా చేనేత కార్మికులు మరియు కండెలు చుట్టే మహిళా కార్మికులకు ఆమె నిత్యావసర వస్తువులను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ వలన చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశం మేరకు గత అయిదు రోజుల నుండి ఈరోజు వరకు వరంగల్ నగరంలోని 1000 మంది చేనేత కార్మికులకు, మహిళా చేనేత కార్మికులు, కండెలు చుట్టే మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ , రాష్ట్ర మంత్రి కేటిఆర్ లు అండగా ఉంటారని, లాక్ డౌన్ వలన పేద ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండడం కొరకు దేశం లోనే అందరి ముఖ్యమంత్రుల కంటే ముందే కేసిఆర్ స్పందించి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 1500 రూపాయలతో పాటు ప్రతీ వ్యక్తికి 12 కిలోల బియ్యం అందించి పేద ప్రజల గుండెల్లో నిలిచి పోయారన్నారు.
ఈరోజు కార్యక్రమంలో కుడా డైరక్టర్ యెలుగం శ్రీనివాస్, 29వ డివిజన్ కార్పోరేటర్ కావేటి కవిత తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా లో గాలివాన భీభత్సం….

మాదాపూర్ లో కుప్పకూలిన రైసుమిల్లు

కోటి రూపాయల ఆస్తినష్టం

జగిత్యాల
లో కూలిన భారీ బోర్డులు

తృటిలో తప్పిన ప్రమాదాలు

ఐకేపి సెంటర్లలో కొట్టుకుపోయిన వరిధాన్యం

తడిసి ముద్దయిన వడ్లు

నేలరాలిన మామిడి కాయలు

జగిత్యాల జిల్లా ప్రతినిధి, (నేటి ధాత్రి)

జగిత్యాల జిల్లాలో శనివారం సాయంత్రం
పట్టుమని 30నిమిషాలు కూడా కురవని గాలివాన నానా భీభత్సం సృష్టించింది. జిల్లా అంతటా రైతులను, ప్రజలను అతలాకుతలం చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ బోర్డులు కుప్పకూలాయి. సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో తృటిలో ఘోర ప్రమాదాలు తప్పాయి. అలాగే మెట్ పల్లి, కోరుట్ల పట్టణాలతో పాటు పరిసర గ్రామాల్లో కోటి రూపాలకు పైగా ఆస్తినష్టం జరిగేలా చేసిందని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. శనివారం సాయంత్రం గాలివాన,
భారీగా వీచిన ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని అనేక గ్రామాల్లో మండలాల్లోని పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. మండలంలోని మాదాపూర్ శివార్లలో గల విఘ్నేశ్వర రైస్ మిల్లులో భారీగా వీచిన ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రేకుల షెడ్డు పూర్తిగా కుప్ప కూలి పోయింది. నిల్వ చేసిన ధాన్యం బస్తాలు తడిసి పోవడంతో భారి నష్టం వాటిల్లింది.
అదే విధంగా వెంకటాపూర్ లో సింగిల్ విండో గోదాం రేకులు ఎగిరి పోయాయి.
నిల్వచేసిన ధాన్యం బస్తాలు తడిసి ముద్దైపోయాయి.
జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లోని ఐకెపి సెంటర్లలో రైతుల వరి ధాన్యం తడిసి నీళ్లలో వరిధాన్యం కొట్టుపోయింది.
కొన్ని గ్రామాల్లో గాలులకు పేద ప్రజల రేకుల షెడ్డులు లేచిపోయాయి.
ప్రాణనష్టం జరుగకున్నా ఆస్తినష్టం జరుగడంతో జగిత్యాల జిల్లా రైతులు, ప్రజలు లబోదిబో మంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు కోట్లల్లో నష్టం వాటిల్లిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి ఈరోజు మంత్రి కే తారకరామారావు కార్యాలయం ద్వారా అందిన విరాళాల వివరాలు

ఈ రోజు మొత్తం 8 కోట్ల 30 లక్షల విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందాయి.

ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ మరియు సీఈవో కేవీ బి రెడ్డి, మూడు కోట్ల విలువైన పీపీ ఈ లతోపాటు, యన్ 95 మస్కులను హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కే తారకరామారావు కి ఈరోజు అందించారు

ఐ టి సి సి ఎం డి సంజీవ్ పూరి ఇచ్చిన రెండు కోట్ల రూపాయల చెక్కుని మంత్రి కేటీఆర్ కి సంజయ్ సింగ్ సీఈఓ తెలంగాణ ఐటిసి అందించారు

పోచంపాడ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల విలువైన పిపి ఈ కిట్లను మంత్రి కేటీఆర్ కు అందించింది.

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ 36 లక్షల 71 వేల రూపాయల చెక్కులను అందించింది

ఇండియన్ బ్యాంక్ ఎండి మరియు ceo పద్మజా చుండూరు 30 లక్షల రూపాయలను, ఈవెంట్స్ నౌ ప్రైవేట్ లిమిటెడ్ 28 లక్షల రూపాయలను, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్ఫండ్ ప్రెసిడెంట్ జి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలను, tollplus ఇండియా లిమిటెడ్ 25 లక్షల రూపాయలను, రాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం తరఫున 23 లక్షల రూపాయలను, త్రిబుల్ లైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్ కి అందించారు.

నిరు పేదలకు నిత్యావసరాల పంపిణీ

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం

వరంగల్ సిటి నేటిధాత్రి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గత కొన్ని రోజులుగా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్న విషయం తెలిసిందే గతంలో పారిశుద్ధ్య కార్మికులు , ఆశా వర్కర్లు, టైలర్స్ , ఆటో డ్రైవర్లు , హిజ్రాలు , మెకానిక్స్ , రిక్షా కార్మికులు , ఇలా అన్ని రంగాల పేదలకు కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో భాగంగా శనివారం సుమారు 150 మంది ఇళ్లలో పనిచేసే కార్మికులకు , సుద్ద (ముగ్గు) అమ్ముకుని జీవించే కార్మికులకు
వంట బియ్యం , నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన పశ్చిమ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల,కార్మికుల పక్షపాతి అని కార్మికుల కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. దాదాపు 55 రోజులుగా లాక్ డౌన్ మూలంగా అనేక మంది అసంఘటిత రంగ కార్మికులు తమ జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లాక్ డౌన్ మూలంగా కరోనా వైరస్ భయంతో ఇళ్లలో పనిచేసే వారిని యజమానులు తమ ఇళ్లలోకి రనివ్వటం లేదని దాంతో వీరందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి వారికి నిత్యావసర సామాగ్రి అందజేయడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో టీఆరెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

*లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాల అప్పగింత*

 

*వరంగల్ పోలీస్* *కమిషనర్ డా.వి.రవీందర్*

*లాక్ డౌన్ సమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను వాహనదారులు తిరిగి అందజేసే ప్రక్రియ నేటి నుండి ప్రారంభిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రకటించారు.*

కరోనా నేపధ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన కారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత వాహన యజమానులను తిరిగి అందజేసే ప్రక్రియ జురుగుతున్న తీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ రోజు ఉదయం హన్మకొండ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా వాహనాలను తిరిగి అందజేసే తీరుపై పోలీసు కమిషనర్ సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాహనానికి సంబంధించిన ద్రువ ప్రతాలను అందజేసిన వాహనయజమానికి పోలీస్ కమిషనర్ వాహన తాళాలను అందజేయసారు.
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రకటించిన తేదినాటి నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 13917 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో *13040* *ద్విచక్ర వాహనాలు, *554* *ఆటోలు,* *281కార్లు,* *42 ట్రాక్టర్ లాంటి ఇతర వాహనాలను* స్వాధీనం చేసుకోవడంతో పాటు, 24,492 ఈ పెట్టీ కేసులు, 575 ఎఫ్.ఐ.ఆర్ కేసులు నమోదు చేయడం జరిగిందని.

సీజ్ చేసిన వాహనాలను వాహన యజమానులు తిరిగి పొందేండుకు గాను రాష్ట్ర పోలీస్ డీ.జీ.పీగారి మార్గ దర్శకాలను అనుసరించి రహదారులపై తనీఖీల క్రమంలో స్వాధీనం చేసుకున్న వాహనాలపై ఐ.పి.సి 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఈ విధంగా స్వాధీనం చేసుకున్న వాహనాలను పొందేందుకు యజమానులు ఆధార్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాల సంబంధించిన జిరాక్స్ కాఫీలతో పాటు, న్యాయస్థానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వాహనాన్ని ప్రవేశ పెడతామని వాహన యజమాని ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ ఇంచార్జ్ అదనపు డి.సి.పి మల్లారెడ్డి, హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్ దయాకర్, ఎస్.ఐలు శ్రీనివాస్,
కోమురెల్లితో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

*రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కే తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్*

• కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను అభినందించిన మంత్రి

• ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచన

• త్వరలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోన వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరిన మంత్రి కేటీఆర్

• పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి బేసి ఈ విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనించాలి

• ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్యశాఖ తో కలిసి మునిసిపల్ శాఖ ఈ రోజు విడుదల చేస్తుంది.

• ప్రస్తుతం పాటిస్తున్న మాస్కుల ఉపయోగం, భౌతిక దూరం పాటించడం, సనిటైజర్ల వినియోగం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరిన మంత్రి

• కరోనా పరిస్థితులను సమీక్షించిన తరువాత రానున్న వర్షాకాలనికి సంబంధించిన మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పైన పురపాలక మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు

• ప్రస్తుతం పట్టణాల్లో తాగునీటికి కొరత ఎక్కువగా లేదని తెలిపిన మున్సిపల్ కమిషనర్లు

• ఇప్పటికే పురపాలక శాఖ ఆరోగ్య శాఖ తో కలిసి తయారు చేసిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్ను ఆధారంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశం

• ఇప్పటి నుంచే వర్షాకాలంలో రానున్న డెంగ్యూ వంటి వ్యాధుల నివారణ పైన చర్యలు చేపట్టాలని ఈ మేరకు గతంలో వారం కొకసారి యాంటీ లార్వా ఆక్టివిటీస్ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని తిరిగి రేపటి నుంచి ప్రారంభించాలని కోరిన మంత్రి కేటీఆర్

 

• రేపటి నుంచి డెంగ్యూ నివారణ లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న పురపాలక శాఖ

• ఇందులో బాగంగా యాంటీ డెంగ్యూ చర్యలను తీసుకోవాలని సూచన.

• ప్రతి పట్టణంలోని మురికి కాలువలను పరిశుభ్రం చేసి ఆ చెత్తను తరలించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ కార్యక్రమాలను ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశం

• ప్రతి పట్టణంలోని మ్యాన్ హోల్ మరమ్మతులు పూర్తి చేయాలని సూచన

• పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కవచాలు మాస్కులు బ్లౌజు ల లేకుండా పని చేయరాదు. ఒకవేళ పారిశుద్ధ్య కార్మికులు ఇవి లేకుండా కార్య క్షేత్రం లో కనిపిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్ లదే అవుతుందన్న మంత్రి కేటీఆర్.

• పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలి

• ఇప్పటిదాకా పట్టణాలకి పట్టణ ప్రగతి ద్వారా 830 కోట్ల రూపాయలను విడుదల చేశాం. ఈ నిధులతో చేపట్టిన కార్యక్రమాల పైన ఒక నివేదికను రూపొందించి వెంటనే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్

 

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో  మదన్‌వాడా  ఎస్సై ఎస్‌.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47, రెండు 315 బోర్‌ రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నట్టు రాజ్‌నందగాన్‌ ఏఎస్పీ జీఎన్‌ బాఘెల్‌ తెలిపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

కడుపు నింపుతున్న *కన్నతల్లి* ఫౌండేషన్

* పేద ప్రజల సేవలో వ్యవస్థాపక అధ్యక్షులు

* ‘కొండ’ అంత ప్రేమతో పేదల ముందుకు

*ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,అధికారులు

వరంగల్ సిటి నేటిధాత్రి

యావత్ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న మహమ్మారి కరోనా ఎవరి నోట విను కరోనా అలాంటిది కరోనా భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వరంగల్ పేద ప్రజలు కార్మికులు పని చేస్తే కానీ కుటుంబాన్ని పోషించని స్థితిలో ఉన్న ప్రజానీకానికి కడుపు నింపటానికి ముందుకొచ్చింది కన్నతల్లి ఫౌండేషన్ అనతి కాలంలోనే ఎనలేని సేవలు చేసి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తన ఖాతాలో వేసుకున్న ఘనత కన్నతల్లి ఫౌండేషన్ ది ఎన్నో ఒడిదుడుకుల మధ్య కష్ట నిష్టూరాలకోర్చి స్థాపించి సేవలు చేస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్నారు కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండమీది రాజన్ బాబు సేవే పరమావధిగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో పేదల ఆకలి తీర్చే దిశలో పనిచేస్తున్నారు కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు 2019 లో స్థాపించి సంవత్సరం లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించిన ఘనత కన్నతల్లి ఫౌండేషన్ దే అని చెప్పొచ్చు స్థాపించిన నాటినుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ మొదలుకుని మెగా హెల్త్ క్యాంపులు విద్యార్థులకు శుభ్రంగా ఉండాలని చేతులు శుభ్రంగా కడుగుకోవాలని తెలుపుతూ ప్రజల్లో వివిధ రకాలుగా అవగాహనలు కల్పిస్తున్న కన్నతల్లి ఫౌండేషన్ అధ్యక్షులను అధికారులు నాయకులు అభినందిస్తున్నరు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్బంగా రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటలతో ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆటలతో పాటు మేధస్సు పెంచే విధంగా వివిధ రకాల వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి విద్యార్థులలో చైతన్యం నింపారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా కోవిడ్ వైరస్ తో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులను చూసి చలించిపోయిన కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రోడ్ల పై కూరగాయలు పండ్లు అమ్ముకునే వారికి గ్లౌస్ లు మాస్క్ లు పంపిణీ చేశారు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు భోజన ఏర్పాట్లు చేసి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు నగరంలోనే కాక గ్రామాల్లో పోలీస్ అధికారుల పిలుపు మేరకు ఆత్మకూరు మహమ్మద్ గౌస్ పల్లి గ్రామంలో పేద ప్రజలకు భోజన ఏర్పాట్లు చేసి వారి కడుపు నింపారు. అదేవిధంగా కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వారి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని మాస్క్ లు సానీటైజర్ ఎండలో పనిచేసే సిబ్బందికి నీళ్ల బాటిల్స్ అందించి వారి దాహార్తిని తీర్చారు. వరంగల్ నగరంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను కట్టడి చేస్తున్న కమిషనరేట్ పరిధిలో వివిధ కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మాస్కులు అందించారు.గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న సానిటరీ సిబ్బందికి అల్పాహారాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ వారి ఆకలి తీర్చిన ఘనత కన్నతల్లి ఫౌండేషన్ కే దక్కుతుంది. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఒక కరపత్రాన్ని తూర్పు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనుదినం పేద ప్రజలకు మాంసాహారం,బిర్యానీ, టమాటా,ఆలు కుర్మా, వివిధ రకాల రుచికరమైన భోజనం అందిస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతున్నారు.ఇటు రాజకీయ నాయకులతో పోలీస్ అధికారులతో పారిశుధ్య కార్మికులతో కరోనా వైరస్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న అదికారులతో మమేకమై అనుదినం ప్రజలకు సేవలు చేస్తున్న కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండమీది రాజన్ బాబు సేవలు ఆమోఘమైనవని చెప్పవచ్చు. ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పేద ప్రజలకు సేవలు చేస్తున్నవారికి ఒక్కడు తానై తానే ఒక్కడై ప్రజా సేవలో తరిస్తూ మొదటిసారి ప్రజా సేవకులకు వివిధ రకాల అవార్డులు ఇచ్చిన ఘనత కన్నతల్లి ఫౌండేషన్ ది అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికి పేద ప్రజలకు అనునిత్యం సేవలు చేస్తూ కరోనా కష్ట కాలంలో డాక్టర్లు ప్రాణాలను కాపాడినట్టు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేసినట్టు, పారిశుద్ధ్య కార్మికులు పరిసరాలు శుభ్రంగా ఉంచినట్టు, కన్నతల్లి పేదవారి కడుపు నింపుతుంది. అని కన్నతల్లి వ్యవస్థాపక అధ్యక్షులు కొండమీది రాజన్ బాబు తెలపడం పేద ప్రజల పాలిట వరమని అనుకోవాలి కన్నతల్లి ఫౌండేషన్ సేవలు ఆమోఘమని వివిధ వర్గాల ప్రజలు బహిరంగంగానే చర్చించుకోవటం చాలా ఆనందంగా ఉందని అధికారుల సహాయ సహకారాలతో మున్ముందు పేద ప్రజానీకానికి సేవలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్తానని కొండమీది రాజన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

కొప్పుల ఇలాకాలో కోరలు చాచుతున్న కాలుష్యం

ధర్మపురి, (నేటి ధాత్రి):

దక్షిణ కాశీగా పేరు గాంచిన ప్రముఖ శ్రీ లక్మి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం, ప్రక్కనే పవిత్రమైన గోదావరి నదీ తీరం, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకా అయిన ధర్మపురిలో కాలుష్యం కోరలు చాచుతోంది. ఈ ప్రాంత వాసులు బయటకు రావాలంటే కరోనా వైరస్ కంటే ఎక్కువగా జంకుతున్నారు. జగిత్యాల జిల్లా లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ ముందర రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ధర్మపురి నుండి ఈ మెయిన్ రహదారి గత రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఉండిపోయిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పక్కనే మైనార్టీ స్కూల్, రోడ్డును ఆనుకొని కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉండగా స్కూల్ పిల్లలు, బ్యాంక్ వినియోగదారులు ఈ ధూళికి శ్వాస పీల్చుకోలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పట్టణంలో డ్రైనేజీలు ఉన్నా వాటిని కూల్చివేసి మళ్లీ డ్రైనేజీలు నిర్మిస్తున్నారని,
రోడ్డు అవసరం లేని గల్లీలలో రోడ్లు వేస్తున్నారని ఇదంతా నిధుల మింగి అవినీతికి పాల్పడడం కోసమేనని ధర్మపురి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మెయిన్ రహదారిపై గత రెండు సంవత్సరాలుగా ఇదే దుస్థితి ఉందని తెలిసినా నాయకులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ఈ విషయం మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి వెళ్లినా ఏమాత్రం స్పందించడం లేదని ధర్మపురి పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంత చెప్పినా స్థానిక నాయకులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ, చివరికి మంత్రి కూడా దీనిని పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు రోదిస్తున్నారు. స్వయానా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకాలో అది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి నివాసం ను ఆనుకొని ఉన్న ప్రక్క రోడ్డు, ధర్మపురి పోలీస్ సర్కిల్ కు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితే ఇలా ఉంటే ఇక నియోజక వర్గంలోని గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందోనని ధర్మపురి పుణ్యక్షేత్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

*మీకోసం..మీ సేవకై..మీ ఎమ్మెల్యే..*

తూర్పు 25 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే సాయం

దాతలు, ఎమ్మెల్యే సొంత ఖర్చులతో పేదలకు త్వరలో నిత్యావసర సరుకులు

నియోజకవర్గం పేదవారికి ఇబ్బంది రానివ్వను..

సాయి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాట్లను పరిశీలించిన నన్నపునేని

*వరంగల్ సిటి నేటిధాత్రి*

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరోనా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్యచరణ రూపొందించారు నియోజకవర్గంలోని 25 వేల మంది పేద కుటుంబాలకు త్వరలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయనున్నారు కొందరు దాతల సహాకారంతో ఎమ్మెల్యే నరేందర్ స్వంత ఖర్చులతో ఈ పంపిణీ చేపడుతున్నారు అందుకు సంబందించిన సరుకుల ప్యాకింగ్ పనులను శుక్రవారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య నాయకులతో కలిసి పర్యవేక్షించారు

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ నేపద్యంలో ఏ ఒక్కపేదకుటుంబం ఆకలితో అలమటించద్దనే ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల స్పూర్తితో నియోజకవర్గంలోని పలువురు దాతలు తన సొంత ఖర్చులతో రెక్కాడితేగాని డొక్కాడని 25 వేల పేదకుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి కార్యచరణ రూపొందించామన్నారు.అందుకు సంబందించిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.తాను పేదింట పుట్టి ఎన్నో ఇబ్బందులు దాటి వచ్చిన వాడినని ఉపాది లేకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తనకు తెలుసన్నారు.. పేదవారి ఆకలి తీర్చడం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన బాద్యత అని,ఈ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు నా కర్తవ్యం అన్నారు. అందుకే పేదలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం రూపొందించామని,త్వరలో ఈ నిత్యావసర సరుకుల పంపిణీ చేపడతామని ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు

*పాన్ మసాలా ముసుగు లో గుట్కాల తయారీ*

ముడి పదార్ధాలను,యంత్రాలను స్వాధీనం

నేరస్తుల అరెస్ట్

వరంగల్ సిటి నేటిధాత్రి

శుక్రవారం పాన్ మసాలా పేరుతో నిషేధిత గుట్కాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ నందిరామ్ సిబ్బంది కలిసి శివనగర్ లోని వల్లాల రాజమల్లు ఇంటిని తనిఖీ చేయగా తన ఇంట్లో సదరు వ్యక్తి కొంతకాలము నుండి గుట్కాలు తయారీకి ఉపయోగించే కీమామ్, జర్ధా, పొగాకు, తదితర ముడి పదార్ధాలను వాడి గుట్కాలు తయారు చేస్తున్నాడు. ఈ రకంగా తయారైనటువంటి గుట్కాలు *21 పాన్ మసాలా, 999 పాన్ మసాలా, కేకే పాన్ మసాలా పేరుతో నగరంలోని పాన్ షాపులలో, కిరాణా షాపుల్లో సరఫరా చేసి అమ్ముకుంటున్నాడు* ఇక్కడ తయారు చేసినటువంటి గుట్కాలను, తయారు చేయడానికి ఉపయోగించే యంత్రాలను స్వాధీన పరచుకోవడం జరిగింది. తయారు చేసిన తరువాత పుప్పాల గుట్ట లోని ఒక ఇంటిని కిరాయి కి తీసుకొని ఆ ఇంట్లో వాటిని ప్యాకింగ్ చేస్తున్నట్టు వాటిని స్వాధీన పరచుకున్న అనంతరం పుప్పాల గుట్టలోని తన కిరాయి ఇల్లు ను సోదా చేయగా ప్యాకింగ్ యంత్రంతో పాటు ఇతర యంత్రాలను స్వాధీన పరచుకోన్నట్టు నందిరామ్ నాయక్ తెలిపారు వీరిపై తగు చర్యలకై మిల్స్ కాలనీ ఎస్సై సతీష్ కి అప్పచెప్పినట్టు ఆయన తెలిపారు

నేరస్తుడి వివరాలు

1. *వలాల రాజమల్లు* తండ్రి. కిష్టయ్య, 58, పద్మశాలి, నివాసం. శివ నగర్, వరంగల్.

*స్వాధీన పరచుకున్న వస్తువుల వివరములు*

1. భైలర్ మిషన్

2. మిక్సింగ్ మిషన్

3. ప్యాకింగ్ మిషన్

4. మసాలా, పొగాకు, కీమామ్, కవర్లు, జర్ధా,వక్కలు, మిక్స్ డ్ మసాలా తదితర వస్తువులు.

5. కేకే పాన్ మసాలా కవర్లు
6. 999 పాన్ మసాలా కవర్లు
7. 21 పాన్ మసాలా కవర్లు.

*మొత్తం స్వాధీన పరచుకున్న వాటి విలవ 17, 40,000/- ఉంటుంది.*

పాన్ మసాలా ముసుగులో గుట్కా తయారీ ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నంది రాం, సిబ్బంది శ్రీనివాస్.కె క్రాంతి. వీరిని వరంగల్ కమీషనర్, డా. రవీందర్ ప్రత్యేకముగా అభినందించారు.

*నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ*

పాలకుర్తి (జనగామ):నేటి ధాత్రి,
కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న
మండలంలోని బొమ్మెర గ్రామంలోని నిరుపేదలకు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లకు గ్రామస్థుడు పేరపు కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్ పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం అందించిన పేరపు కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, రాపాక సత్యనారాయణ, బత్తిని సురేష్, కుంట శ్రీనివాస్, మంద లింగమ్మ, గాదె ఎల్లమ్మ, ఒగ్గుల పావని, సుడిగల అర్చన, జంపాల లక్ష్మీ, సురుగు శేఖర్. మాడరాజు యాకయ్య, పెంతల రమేష్, కొంఢ శ్రీను, యాదగిరి, మల్లెష్ తదితరులు పాల్గొన్నారు.

గంజాయ్, గుట్కా, గుడుంబా నియంత్రణపై పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం.

భూపాలపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మకాలు జరగకుండా సంయుక్తంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో గుడుంబా, గుట్కా, గంజాయి అమ్మకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో జిల్లాలో గుడుంబా, గుట్కాల అమ్మకం జరుగుతున్నాయని అదేవిధంగా కాటారం మండలంలో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి యువతకు గంజాయి అమ్ముతున్నారని సమాచారం వస్తుంది కాబట్టి జిల్లా అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి నేతృత్వంలో పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులు సంయుక్తంగా గుడుంబా, గుట్కాలు, గంజాయి అమ్ముతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో నిఘా ఉంచి ప్రత్యేకంగా దాడులు చేసి అవి అమ్మకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గుట్కాలు తినడం, గుడుంబా గంజాయి సేవించడం కూడా కరోనా వ్యాధి లాగానే చాలా అపాయకరమైనవని వీటి నుండి జిల్లాలోని యువతను కాపాడేలా అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీధర్ రెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

*రైతుల పట్ల చిన్నచూపు తగదు – టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి *

జమ్మికుంట *నేటి ధాత్రి* (ఇళ్లందకుంట) : ఆరుగాలం కష్టపడి పండించిన రైతాంగం పంటలను విక్రయించే సమయంలో తెరాస ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నదాత పట్ల చిన్నచూపు తగదని టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిండ్రు. రైతుల తోటి మాట్లాడి పలు సమస్యల గురించి తెలుసుకున్నాడు వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఎలక్షన్ లు లేవు రాజకీయం చేయడానికి అసలు రాలే… తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవసాయం ఉత్పత్తుల కొనుగోలు విషయంలో తెరాస ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది.వాళ్ల అసమర్థత వల్ల తెలంగాణ వ్యాప్తంగా రైతు నష్టపోతున్నాడు అనే ఉద్దేశంతో మేము ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చి అసలు విషయం కనుక్కుని అది జనంలోకి తీసుకెళ్లాలి,ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకెళ్లాలి అని చెప్పి..పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి,కౌశిక్ రెడ్డిల ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది.వరి,మొక్కజొన్న, కందులు తదితర విషయాలల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది.రైతులకు న్యాయం జరగడం లేదు,వాళ్ళు కష్టపడి పండించి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను సరిఅయిన రేట్లతో కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ పర్యటనలు చేస్తున్నాము. జనవరి నెలలో కొన్న కందుల డబ్బులు ఒక్కరికి కూడా చెల్లించలేదు.కొనుగోలు చేసిన ధాన్యానికి కొద్దిమందికి మాత్రమే డబ్బులు చెల్లించినారు. ఎం ఎస్ పి మీద కొనుగోలు చేయాలి.కొనుక్కున్న దానికి తొందరగా డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చాలా స్పష్టంగా 40 కిలోల వరి ధాన్యం బస్తాకి అధికారికంగా ఈ కేంద్రంలో ని రైతు దేవేందర్ రెడ్డికి చెందిన ఆ వడ్లను ఒక బస్తాకి నలభై రెండు కిలోల 150 గ్రాములు ఎందుకు అంతా కోలిచిండ్రు,ఎవరు ఆదేశాలు ఇచిండ్రు… ఎవరు ఆదేశాలు ఇచ్చినా ఇది చట్ట వ్యతిరేకం,రైతు వ్యతిరేకం దీనికి ముఖ్యమంత్రే జవాబు చెప్పాలే.ఎందుకంటే ఈ నష్టం మీరు పూర్తిగా లెక్క పెడితే కోటి మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం లో ఎంత నష్టమో ఆలోచన చేయండి.అదే విధంగా మీల్లుకి వెళ్ళిన్నంక అక్కడ మళ్ళీ బస్తాకి కిలోన్నర మళ్లీ తీస్తున్నారు అంటే ఒక క్వింటాకి సుమారు 10 కిలోలు తరుగు పేరిట దోచుకుంటున్నారు. రైతుకు ఈ స్థాయిలో నష్టం ఎవరు కలిగిస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారంలో ఉన్న పెద్ద మనుషులు,మంత్రులకి రైస్ మీల్లర్లతో ఏమైనా సంబంధం ఉందా… దీంట్లో ఏమైనా లాలూచీ ఉందా.. తప్పనిసరిగా ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. మొన్న తాలూగాళ్ళు అన్నారు.ఎవడు తాలూ గాడో ఇప్పుడు జవాబు చెప్పాలి.మరి ఎందుకు రైతులను అవమాన పరుస్తున్నారో,ఎందుకు ఈ విధంగా అవమానపరుస్తున్నారో, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు తప్పకుండా 40 కిలోలు అంటే నలభై కిలోలే జోకాలే..అదేవిధంగా రైతు పేరుమాండ్ల శ్రీనివాస్ 20 రోజులు అయింది.ఈ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి.టోకెన్స్ ఇష్టమట ముదనష్టపు తెరాస ప్రభుత్వంలో రైతు 20 రోజులు అయినా ఇంకా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు..అంటే వడ్లు ఎండలో ఎండాలే,వానలో తడువాలే,మళ్ళీ ఎండలో ఎండలే రైతు నష్టపోవాలే ఇలా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. ఇది ప్రభుత్వ అసమర్థత కేసీఆర్ ముఖ్యమంత్రి అసమర్థత కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ సెంటర్ కు వచ్చి ప్రభుత్వ పెద్ద మనుషులు జవాబు చెప్పాలి అని నేను అడుగుతున్నా.మేము ఇంకో డిమాండ్ చేస్తున్నాము.మొత్తం ఐకెపి సెంటర్లు నడిపించే సామ్ బావ సంఘాలకీ ఎంత కమిషన్ రావాలో క్వింటాల్ కు 32 రూపాయలు చొప్పున వెంటనే విడుదల చేయాలి. హమాలీ చార్జీలు క్వింటాలుకు 40 రూపాయలు ప్రభుత్వమే భరించాలి.ఇది కూడా వెంటనే అమలు చేయాలని అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,నేను ఈ ఇల్లందకుంట టెంపుల్ దగ్గర నుండి ముఖ్యమంత్రి కి సవాల్ చేస్తున్న,మీరు వస్తారా లేక మీ మంత్రులను మా దగ్గరికి పంపుతారా..చత్తీస్ఘడ్లో ఈరోజు కూడా రైతుల ధాన్యాన్ని 2500 రూపాయలకు కొంటున్నారు.మేము ఇక్కడ 2500 రూపాయలు అడగలే ధాన్యాన్ని నిబంధనల ప్రకారంగా కోణాలని రైతులను దోపిడికి గురి చేయవద్దని చెబుతున్నానని అన్నారు. ఎం ఎల్ సి టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ,రైతంగం యొక్క సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చినాము.రైతులతో వివరాలు సేకరించడంతోని ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది.క్షేత్రస్థాయిలో రైతుకు న్యాయం జరిగేలా,దాని గురించి ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శ పాడి కౌశిక్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, జనగాం,పెద్దపెల్లి జగిత్యాల జిల్లాల డిసిసి అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి,ఈర్ల కొమురయ్య,లక్ష్మణ్,కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం,సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్,కాంగ్రెస్ నాయకులు పోల్నేని సత్యనారాయణరావు,పొడేటి రామస్వామి,ఎక్కటి సంజీవ రెడ్డి,పత్తి కృష్ణారెడ్డి,కాసుబోజుల వెంకన్న,గూడెపు సారంగపాణి,గాజుల భాస్కర్,సాయిని రవి,దరుగుల రాకేష్,పెద్ది కుమార్,కనుమల్ల సంపత్,పోడేటి వేణు తదితరులు పాల్గొన్నారు.

ప్రాణం తీసిన అతివేగం

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాల గ్రామ శివారులో ద్విచక్రవాహనదారుడు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జఫర్ గడ్ మండలం కు చెందిన మాదరాసీ నర్సింగరావు(52)గా గుర్తించినట్లు తెలిపారు.విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి భార్య సునీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.

*గడ్డపార దించిన ఎర్రబెల్లి*

 

*కూలీలతో కులిగా… జాలీగా…*

*గడ్డపార పట్టి, మట్టి ని పెకిలించి, పెళ్ళలు తీసి…*

*న‌ర్స‌రీని ఆక‌స్మిక త‌నిఖీ చేసి…మొక్క‌ల‌కు నీళ్ళు ప‌ట్టి…*

*మాస్కులు పంపిణీ చేస్తూ…*

*కూలీల‌తో మ‌ట్టిలో కూర్చునే ముచ్చ‌ట్లు… ప‌నుల తీరుపై ఆరా*

*కూలీల‌తో క‌లిసి ఉపాధి హామీ పనులు చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*

*ప్ర‌తి ఒక్క‌రికీ ఉపాధి ప‌నులు-క‌నీసం దిన‌స‌రి వేత‌నం రూ.200*

*న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి తిరిగి వ‌చ్చిన వాళ్ళ కోసం కొత్త‌గా కూలీల న‌మోదు*

*ఉపాధి హామీ పనులు కోసం సీఎం కెసిఆర్ గారు రూ.170 కోట్లు విడుదల చేశారు*

*అంద‌రికీ ప‌ని క‌ల్పనే తెలంగాణ ప్ర‌భుత్వ ల‌క్ష్యం*

*రాష్ట్రంలోని 2,438 న‌ర్స‌రీల ద్వారా 22 కోట్ల మొక్క‌లు*

*అట‌వీశాఖ ద్వారా ఉపాధి హామీ కింద మ‌రో 3కోట్ల మొక్క‌లు*

*న‌ర్స‌రీల‌ను త‌నిఖీ చేసి, ప‌రిశీలించి… మొక్క‌ల‌కు నీళ్ళు ప‌ట్టిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు*

ప‌ర్వ‌త‌గిరి, రాయ‌ప‌ర్తి (వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా), మే 8ః

క్లాస్ కి క్లాస్… మాస్ కి మాస్… త‌న రూటే సెప‌రేటు అని మ‌రోసారి నిరూపించారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కూలీలతో కులిగా… జాలీగా… గడ్డపార పట్టి, మట్టి ని పెకిలించి, పెళ్ళలు తీసి ఉపాధి హామీ పనులు చేశారు. మ‌రోవైపు కూలీల‌కు మాస్కులు పంపిణీ చేసి, సామాజిక‌, భౌతిక దూరం పాటించాల‌ని, క‌రోనా నుంచి కాపాడుకోవాల‌ని ఉద్బోధించారు. ప‌నులు బాగా న‌డుస్తున్నాయా? ప‌ని దినాలు క‌లుగుతున్నాయా? అంటూ ఆరా తీశారు. కూలీలంద‌రికీ ప‌ని క‌ల్పించాల‌న్న‌దే ప్ర‌భుత్వ సంక‌ల్పం, అందుకే ఈ క‌రోనా క‌ష్ట కాలంలోనూ,ఆర్థిక సంక్షోభంలోనూ సిఎం కెసిఆర్ రూ.170 కోట్లు విడుద‌ల చేశార‌ని కూలీల‌కు భ‌రోసా క‌ల్పించారు. ఈ క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల నుంచి గ్రామాల‌కు చేరిన వాళ్ళ‌కు కూడా ప‌నులు క‌ల్పించే బాధ్య‌త‌ని ప్ర‌భుత్వం తీసుకుంద‌ని చెప్పి, అంద‌రికీ ప‌ని క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇంకోవైపు రాయ‌ప‌ర్తి న‌ర్స‌రీని ఆక‌స్మికంగా సంద‌ర్శించి, త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ట్రాక్ట‌ర్ తో వ‌చ్చిన నీటిని మొక్క‌ల‌కు ప‌ట్టి, అక్క‌డి కూలీలు, అధికారుల‌ను ఆశ్చ‌ర్య ప‌రిచారు.

రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి జ‌న నేత‌గా, జ‌నంలోకి చొచ్చుకుని పోయే నేత‌గా మంచి పేరుంది. ఆ పేరుకు త‌గ్గ‌ట్లుగానే అవ‌కాశం చిక్కితే చాలు జ‌నంతో ఇట్టే క‌లిసిపోతారు. వాళ్ళ‌ల్లో ఒక‌డిగా మారిపోతారు. శుక్ర‌వారం వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తిలో నిర్వ‌హించే ర‌క్త‌దాన శిబిరానికి హాజ‌ర‌వ‌డానికి బ‌య‌లుదేరారు. ప‌ర్వ‌త‌గిరిలోని ఆవు కుంట లో ఉపాధి హామీ ప‌నులు జ‌రుగుతున్నాయి. దాదాపు 500 మంది ప‌నులు చేస్తున్నారు. వెంట‌నే కారు ఆపి, ఆ కూలీల ద‌గ్గ‌ర‌కు దూసుక‌పోయారు. వాళ్ళ‌తో మాట క‌లిపారు. ప‌నులు ఎలా జ‌రుగుతున్నాయి? ఏయే పనులు చేస్తున్నారు? కూలీ ఎంత గిడుతున్న‌ది? సామాజిక దూరం పాటిస్తున్నారా? ‌మాస్కులు ధ‌రిస్తున్నారా? అంటూ ఆరా తీశారు. వెంట‌నే త‌న వ‌ద్ద ఉన్న మాస్కుల‌ను అక్క‌డి కూలీల‌కు తానే స్వ‌యంగా పంపిణీ చేశారు. గ‌డ్డ‌పార ప‌ట్టి మ‌ట్టిని పెకిలించారు. ఆ మ‌ట్టి పెల్ల‌ల‌ని తొల‌గించారు. కాసేపటి త‌ర్వాత‌ అక్క‌డే ఉన్న మ‌ట్టి మీదే కూర్చున్నారు. ఉపాధి కూలీల‌తో మాట్లాడారు.

సిఎం కెసిఆర్ ప్ర‌తి ఒక్క‌రికీ ప‌ని క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో ఉన్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి కూలీల‌కు చెప్పారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి వ‌చ్చిన వాళ్ళు కూడా కూలీ ప‌నులు చేసుకునే విధంగా, ఉపాధి కూలీల న‌మోదు చేప‌డ‌తామ‌న్నారు. అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామ‌ని, అలాగే కూలీల పనుల కోసం ఇప్ప‌టికే సీఎం కెసిఆర్ రూ.170 కోట్ల‌ను విడుద‌ల చేశార‌ని చెప్పారు. అయితే కూలీలు త‌మ‌కు భ‌విష్య‌త్తులోనూ ఉప‌యోగ‌ప‌డే విధంగా వ్య‌వ‌సాయానుబంధ ప‌నులు చేసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం, సీఎం కెసిఆర్, తాను కూడా కేంద్రానికి ప‌దే ప‌దే విన్న‌విస్తున్నామ‌ని చెప్పారు. ఉపాధి హామీ ప‌నుల‌ను వ్య‌వ‌సాయ‌నుబంధంగా మార్చాల‌ని చెప్పామ‌న్నారు. అనేక చోట్ల ఉపాధి హామీ ప‌నుల్లో భాగంగా కాలువ‌ల ప‌నులు చేసుకుంటున్నార‌ని చెప్పారు.

*రాష్ట్రంలోని 2,438 న‌ర్స‌రీల ద్వారా 22 కోట్ల మొక్క‌లు*
*అట‌వీశాఖ ద్వారా ఉపాధి హామీ కింద మ‌రో 3కోట్ల మొక్క‌లు*

మ‌రోవైపు రాయ‌ప‌ర్తిలోని న‌ర్స‌రీని మంత్రి ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి, ప‌రిశీలించారు. అక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు. కూలీల‌తో మాట్లాడారు. ట్రాక్ట‌ర్ తో వ‌చ్చి న నీటిని మొక్క‌ల‌కు ప‌ట్టారు. అనంత‌రం కూలీల‌తో మంత్రి మాట్లాడారు. 25 కోట్ల మొక్క‌ల‌ను రాష్ట్రంలోని 2,438 న‌ర్స‌రీల ద్వారా పెంచుతున్న‌ట్లు చెప్పారు. ఇదంతా హ‌రిత హారంలో భాగంగా జ‌రుగుతున్న‌దంటూ, మొక్క‌ల్లో 90శాతం మొక్క‌లు మ‌న‌గ‌లుగుతున్నాయ‌ని మంత్రి చెప్పారు..

Exit mobile version