లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ లాభాల నుంచి దిగి వచ్చాయి. అయితే ఇప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే కదలాడుతున్నాయి.
గత సెషన్ ముగింపు (81,892)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత భారీ లాభాల్లోకి ఎగబాకింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడి 82,500 మార్క్ దాటింది. అయితే ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో 335 పాయింట్ల లాభంతో 82,199 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 104 పాయింట్ల లాభంతో 25,279 వద్ద కదలాడుతోంది (stock market news today).సెన్సెక్స్‌లో ఆయిల్ ఇండియా, ఎమ్‌సీఎక్స్ ఇండియా, సీజీ పవర్, ఓఎన్జీసీ, వేదాంత మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఏషియన్ పెయింట్స్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఎయిచర్ మోటార్స్, మారికో, బ్రిటానియా మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 293 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.60గా ఉంది.
