మినీ మేడారం ఉత్సవాల విజయానికి అధికారుల సేవలు ప్రశంసనీయం

ఉత్సవాల విజయంలో అధికారుల సేవలు మరువలేనివి

ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నా రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్ళపల్లి రెండు గ్రామాల పరిధిలో శ్రీ సమ్మక్క సారక్క ఉత్సవాల విజయంలో అధికారుల సేవలు మరువలేనివని మినీ మేడారం సమ్మక్క సారాలమ్మ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి, అన్నారు. శనివారం సాయంత్రం కోయ పూజారులు అమ్మవార్లను ఆదివాసుల సంస్కృతి సంప్రదాయం ప్రకారం వన ప్రవేశ కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం, మొగుళ్ళపల్లి ములకలపల్లి సర్పంచులు చాట్ల విజయ రవీందర్ నాంపల్లి శ్రీవాణి రమేష్ లు మాట్లాడుతూ.

జాతర ఉత్సవంలో ముఖ్యంగా మొగుళ్లపల్లి ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం విధుల్లో పాల్గొని జాతర విజయంలో కీలక పాత్ర పోషించారని సర్పంచులు తెలిపారు. అనంతరం మొగుళ్ళపల్లి ఎస్సై. బొరగల అశోక్, పోలీస్ సిబ్బంది జ్యోతి, మమత, సునిత,హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, విజయ్, విద్యుత్ శాఖ అధికారులు, వెంకటేష్, రఘు, రమేష్, కిరణ్,ప్రసాద్ లను రెండు గ్రామాల సర్పంచులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్సాని నరసింగా రావు, నీల రాజు, కొడారి ఓదెలు, బండారి రామస్వామి, కట్ల శీను బాబ్జి, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్ అమ్మవార్లను దర్శనం

అమ్మవార్లను దర్శించుకున్న ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్ దంపతులు
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరను మొగుళ్ళపల్లి ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్ దంపతులు శనివారం సందర్శించి, అమ్మవార్లకు మొక్కులను సమర్పించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో ముచ్చటించారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో అద్భుతంగా జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ అనుగ్రహంతో..అమ్మవార్ల దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో కుటుంబ సభ్యులంతా కలిసి సుఖంగా జీవించాలని వారు అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం జాతర ఉత్సవాలను నిరంతరం పర్యవేక్షిస్తూ..జాతర ఉత్సవాలు సజావుగా జరిగేలా ఉత్సవ కమిటీకి తోడ్పాటునందిస్తూ..జాతర ఉత్సవాలను నిరంతరం పర్యవేక్షిస్తూ..జాతర ఉత్సవ కమిటీకి వారి సూచనలతో జాతర విజయవంతంలో భాగస్వాములైన తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డి, ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్, ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి, దేవదాయ శాఖ అధికారి వెంకటయ్యలకు జాతర ఉత్సవ కమిటీ పక్షాన చదువు అన్నారెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

మినీ మేడారం జాతరలో భక్తులకు ఉచిత మంచినీటి వసతి

భక్తులకు ధాహం తీర్చేందుకే ఉచిత మంచినీటి వసతి ఏర్పాటు

మొగుళ్ళపల్లి ఎస్ బి ఐ బ్రాంచ్. మేనేజర్ బి. నవీన్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి, మొగుళ్ళపల్లి రెండు గ్రామాల మధ్య పెద్దవాగు, చిన్నవాగు ప్రవహిస్తున్న ప్రదేశం. చుపరులను కట్టిపడేసే ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో అత్యంత వైభావంగా ఆదివాసులు జరుపుకునే మేడారం సమ్మక్క సారాలమ్మ మినీ మేడారం జాతర ఉత్సవాలను కమిటీ సభ్యులు జరిపించిన నేపథ్యంలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొగుళ్ళపల్లి బ్రాంచ్ మేనేజర్ బి. నవీన్ ఫీల్డ్ ఆఫీసర్ బి రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతరకు వచ్చిన భక్తులకు దాహం తీర్చేందుకు ఉచిత మంచినీటి వసతినీ ఏర్పాటు చేశారు.ఎస్ బి ఐ మేనేజర్ మాట్లాడుతూ.

గత పదిహేను సంవత్సరాలనుండి మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి రెండు గ్రామాల ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించే జాతరలో భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి ఏర్పాట్లు చేశామని భక్తజనం ఇంత పెద్ద మొత్తంలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం అనందంగా ఉందని అన్నారు. అనంతరం ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ బి నవీన్,వనదేవతలైన శ్రీ సమ్మక్క , సారాలమ్మ లను ఆయన దర్శించుకున్నారు.ఉచిత మంచినీటి వసతి కల్పించడం పట్ల ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి ఉపాధ్యక్షులు మల్సాని నరసింహారావు కొడాలిఓదెలు భక్తులు బ్యాంకు సిబ్బంది కిప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం…

మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం

28 నుంచి 31 వరకు వనదేవతల మహాజాతర

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ శివారులో గల శ్రీ సమ్మక్క -సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసాం,ఈ నెల 28 నుంచి 31 వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు,మేడారం తరువాత అత్యంత వైభవంగా జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో అతిపెద్ద జాతర కంఠాత్మకూర్ మినీ మేడారం జాతరకు లక్షల్లో భక్తులు వచ్చి వనదేవతలు అమ్మవార్లను దర్శించుకోవడం అనవాయితీ,జాతర ఆధునికరణ కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ కొంగంటి తిరుపతి కృషి,పట్టుదలతో జాతర ఏర్పాట్లకు కొన్ని మార్పులు చేర్పులు చేసాం గద్దేల చుట్టూ ఐరన్ పైపులు గ్రిల్స్, నూతన బోర్ లు ఏర్పాటు చేసాము,అంతే కాకుండా జాతర కమాన్ నుంచి గద్దేల వరకు మొరం పోయించి భక్తులకు రోడ్డు సౌకార్యం కల్పించాము,అంతే కాకుండా నిరంతరం విద్యుత్,త్రాగునిటీ సౌకార్యం,స్థానాల గట్టాలు, మరుగుదోడ్లు,సౌండ్ సిస్టం, లైటింగ్,క్యూలైన్లు,మెడికల్ ఎమర్జెన్సీ,పోలీస్ బందోబస్తు, వాహనాల పార్కింగ్, జాతరకు మూడు కిలోమీటర్ల లోపు అన్ని వైపుల నుంచి ఆర్టీసీ బస్సు ఏర్పాట్లు,ఆటో రవాణా సౌకర్యం,అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. భక్తులు ఉమ్మడి పరకాల మండలం వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి వనదేవతలు అమ్మవార్లను దర్శించుకుని మీ యొక్క కోరికలు నెరవేరాలని అమ్మవార్ల ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని జాతర కమిటీ వైస్ చైర్మన్లు భాషిక శ్రీనివాస్,కుమ్మరి నరేష్ తెలిపారు.

జిల్లాలో మినీ మేడారం జాతరలకు ఏర్పాట్లు చేయాలి…

జిల్లాలో మినీ మేడారం జాతరలకు ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లాలో నిర్వహించనున్న మినీ మేడారం జాతరలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ రాజ్, విద్యుత్, ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమ శాఖ, తహసీల్దార్లు,
ఎంపీడీఓలు తదితర శాఖల అధికారులతో మినీ మేడారం జాతరల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జాతర ప్రాంగణంలో పొదలు, పిచ్చి మొక్కలు తొలగించాలని, భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. జాతర సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ ద్వారా పరిశుబ్రమైన త్రాగునీరు అందించాలని ఆదేశించారు. జాతరలు జరిగే మార్గాల్లో రోడ్లకు ఇరువైపుల పొదలు, పిచ్చి మొక్కలు తొలగించాలని, మూల మలుపుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా స పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓలు జాతర జరిగే ప్రదేశాలను పరిశీలించి చేయాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జాతరలు నిర్వహించే మండలాల్లో మండల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, భూపాలపల్లి మండలంలో కమలాపూర్, గుర్రంపేట ప్రాంతాల్లో రెండు జాతరలు జరుగు తున్నందున ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మినీ మేడారం జాతరలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ బాబురావు, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారులు సునీల్, బాబురావు, విద్యుత్ శాఖ డీఈ రాజిరెడ్డి, ఆర్డీవో హరికృష్ణ, డీఎల్పీఓ మల్లికార్జున రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version