ఓట్లు సీట్లపై ఉన్నయావ ప్రజా సమస్యలపై లేదు
ఎన్నికల హామీలను విస్మరించిన పార్టీలను మట్టి కరిపించాలి
ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ
నర్సంపేట,నేటిధాత్రి:
ఓట్లు, సీట్లు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టడం తప్ప పట్టణ సమస్యలపై పాలకపార్టీకి కనీస చిత్తశుద్ధిలేదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ డివిజన్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన పాలక పార్టీలను ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంసీపీఐ(యు) పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కేశెట్టి సదానందం అధ్యక్షతన నర్సంపేట ఓంకార్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాపరంగా పట్టణ విస్తృతి పెరిగిన అభివృద్ధి పరంగా అందుకు తగిన విధంగా లేదని ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. నర్సంపేట పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని ప్రచారఆర్భాటం చేస్తున్నప్పటికి ఆచరణలో పట్టణ అవసరాలకనుగుణంగా ప్రణాళిక రూపొందించడంలో వైఫల్యం చెందారని ఎద్దేవా చేశారు.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చిత్తశుద్ధితో అభివృద్ధికి బాటలు వేసే విధంగా నీతిగా నిజాయితీగా పట్టుదలతో పనిచేసే అభ్యర్థులను ఆదరించాలని, డబ్బులు మద్యం ఇతర ప్రలోభాలతో ఓట్లను కొనుగోలు చేసి గెలిచి దోచుకోవాలనే అభ్యర్థులను మట్టికరిపించాలని కోరారు.నీతిగా నిజాయితీగా సమస్యల పరిష్కారానికి పట్టణాభివృద్ధికి తోడ్పడే ఎంసిపిఐ(యు) అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించాలని కార్యకర్తలు అందుకు అనుగుణంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ మాషుక్, పార్టీ పట్టణ నాయకులు మోటం సురేష్, అనుమల రమేష్, బండారి మల్లేష్, సాంబన్న,రవి,రథం తదితరులు పాల్గొన్నారు.
