సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చేది ఎప్పుడు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి కార్మిక సమస్యలపై అనేకసార్లు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా పలు మార్లు స్ట్రక్చర్ మీటింగ్ లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు పరిష్కరించడంలో యాజమా న్యం విఫల మైందని, కార్మిక సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె కైనా సిద్ధమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కార్మిక సమస్యలపై అనేకసార్లు ఇన్కమ్ టాక్స్, మెడికల్ బోర్డు, సొంతింటి పథకం మారుపేర్ల, డిస్మిస్ కార్మికుల, మైనింగ్ స్టాప్ సమస్యలను పరిష్కరించాలని అనేక అంశాలపై స్ట్రక్చర్ మీటింగ్లలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగ్ అంగీకరించిన ఏ సమస్యను పరిష్కరించలేదని దాటవేసే ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. మెడికల్ బోర్డు నిర్వహణలో యాజమాన్యం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందన్నారు. అట్లాగే ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా అనేక అంశాలపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన కార్మికుల సొంతింటి పథకం అమలు చేయడంలో విఫలమైందన్నారు. అట్లాగే పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ తగ్గించాలని, మైనింగ్ స్టాప్ సమస్యలు తోపాటు ఎన్నికల డ్యూటీలో విధులు నిర్వహించిన కార్మికుల ఆన్ డ్యూటీ గా పరిగణించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని,వాటిని పెడచెవిన పెట్టిన యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి రెండో వారంలోపు సమస్యలు పరిష్కరించకుంటే సింగరేణిలో సమ్మె చేయడం తప్పదని రాజ్ మార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి గురిచేపల్లి సుధాకర్ రెడ్డి, జి శ్రీనివాస్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు
