అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల పట్ల పిర్యాదు.

*అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల పట్ల డిఈఓ పిర్యాదు *

పాఠశాలలను సీజ్ చేయాలి…గడ్డం నాగార్జున

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలని కోరుతూ ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కు ఆయన కార్యాలయంలో మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతూ నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25 ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్ ఉంటే , అనధికారికంగా 14 ప్రైవేట్ పాఠశాలలు అందులో గీతాంజలి స్కూల్, డఫోడిల్స్ హై స్కూల్ , విజ్డమ్ హై స్కూల్, మదర్స్ లాండ్ హై స్కూల్ , కేఎస్ఆర్ శ్రీఅభ్యాస్ హై స్కూల్, ఎస్.పి.ఎస్ హై స్కూల్ తదితరుల స్కూలు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టా రాజ్యాంగ వివరిస్తున్న కూడా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు చూసి చూడకుండా వదిలేయడం సిగ్గుచేటని అన్నారు.

Education Officer.

 

పట్టణంలో అనధికారికంగా నడపబడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై డిఈఓ సమగ్ర విచారణ జరిపించి తక్షణమే వాటిని మూసివేసి,విద్య శాఖను తప్పుదోవ పట్టిస్తున్న ఆ స్కూల్ యాజమాన్యాలపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి,జిల్లా నాయకులు పోలబోయిన రాజు, జావాజి శ్రిజిత్ తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గది, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. 

విద్యార్థులకు మ్యాథ్స్ పాఠ్యాంశాలు బోధించి.. ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదవాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాలయం ఎస్ఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి.

“ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి”

ఎస్సై లెనిన్.

బాలానగర్ నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఎస్సై లెనిన్ విద్యార్థులకు కమ్యూనిటీ పోలీసింగ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు అవలంబించాల్సిన పద్ధతులు ప్రవర్తన విధానంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్ లింగం, అధ్యాపకులు అనురాధ, వినోద్, సునీల్, చంద్రకాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు.!

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు తల్లిదండ్రులారా ఆలోచించండి

ట్రైనింగ్ పొందిన టీచర్స్

చదువులో అనుభవం ఉన్న టీచర్స్

పిల్లలకు అనుగుణంగా చదువు చెప్పే టీచర్స్

పిల్లలలోని ప్రతిభను గుర్తించే టీచర్స్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల బస్వ రాజు పల్లి పాఠశాల లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు . ప్రభుత్వ పాఠశాల లో బోదించే ఉపాధ్యాయులు మంచి ప్రతిబావంతులు ఉన్నారు ప్రజలు వారి పిల్లలని తమ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అనవసరంగా డబ్బులు ప్రయివేట్ విద్యా సంస్థలకి వృధా చేసుకోవద్దని తీన్మార్ మల్లన్న టీమ్ గణపురం మండల అధ్యక్షులు గండు కర్ణాకర్ ప్రజలకి సూచించారు. తాను కూడా తమ గ్రామం బస్వరాజపల్లి లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి అతని కూతురుని పంపిస్తూన్నానని ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలల వైవు చూడాలని, ముక్యంగా వివిధ పార్టీల నాయకులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని డిమాండ్ చేసారు. ఇలా చేస్తే ప్రజలకి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందని చెప్పారు

ప్రైవేట్ పాఠశాలను తలపిస్తున్న సర్కార్ బడి.

ప్రైవేట్ పాఠశాలను తలపిస్తున్న సర్కార్ బడి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

 

ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలో మండల్ పరిషత్ పాఠశాల గత ఏడాది జూన్ నెలలో 20. మంది పిల్లలతో ఉన్న బడి ఈ సంవత్సరం 70.విద్యార్థులతో ప్రవేట్ పాఠశాలకు దీటుగా కేవలం ఒక సంవత్సరంలో పాఠశాలక మారిపోయింది ప్రమోషన్ ద్వారా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన అచ్చ విజయ్ భాస్కర్ కేవలం సంవత్సర కాలంలోనే పూర్తిగా మార్చుకున్నారు దీని కొరకు గ్రామంలో ఇంటింటికి తిరిగి పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేట్లు భరోసా ఇవ్వగలిగాడు వెంటనే గ్రామ పెద్దలను కలిసి బడికి కావలసిన అవసరాలపై చర్చించి ఒక్కొక్కటిగా రాబట్టుకునే ప్రయత్నం చేశాడు మొదట గ్రామ ఎంపీటీసీ పోనుకంటి చిన్న వెంకట్ పిల్లలకు టై. బెల్ట్. ఐడి కార్డు ఇచ్చారు తరగతి లో పాఠ్యాంశ బోధనకు గ్రామంలోకి తీసుకుపోయే విధంగా యూట్యూబ్ ఛానల్ లలో ఏర్పాటు చేశారు తద్వారా బడిని గ్రామానికి అనుసంధానం చేయడంలో సఫలం అయ్యారు అంతటితో ఆగకుండా గ్రామంలోని పెద్దలను. మరియు యువతను సభ్యులుగా చేస్తూ ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి బడిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని గ్రామంలోకి తీసుకువెళ్లారు దీనితో బడి వైపు దాతలు ముందుకు వచ్చారు జియో ఫైబర్.

 

బడికి అవసరం కొరకు ప్రింటర్ మరియు బడి రక్షణ కొరకై సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు ఈ దశలో దుబాయిలో ఉండే గ్రామ నివాసి మంగలి పెళ్లి మహిపాల్.

 

private school

 

 

దృష్టికి తీసుకువెళ్లారు బడి డెవలప్మెంట్ కోసం ఏమన్నా సహాయం చేయాలని కోరారు అతను వెంటనే స్పందించి బడికి టాయిలెట్స్ రిపేరు మరియు రన్నింగ్ వాటర్ కొరకు 110.000లక్ష పది రూపాయలు మరియు అంతేకాకుండా మరమూర్తులకు బడి ప్రైవేట్ పాఠశాల లాగా కనపడే విధంగా 90 వేల రూపాయలతో పెయింటింగ్. మరియు పిల్లలకు ఆడుకునేటట్లు పాట వస్తువులకు 80000 రూపాయలతో పాటవస్తులు ఏర్పాటు చేశారు ప్రజల ఉపాధ్యాయుల గదిలో 5000 రూపాయలతో దేశ నాయకుల ఫోటోలు ఏర్పాటు చేశారు అలాగే బడి వార్షికోత్సవ కార్యక్రమానికి పదిహేడు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం కలిపి 300000 రూపాయలు తన సొంత డబ్బులతో పాఠశాలకు ఖర్చు చేశారు సొంత గ్రామ బడిని నిలబెట్టిన మంగలి పెళ్లి మహిపాల్ గ్రామస్తులు అభినందించారు లో ఉండేది మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్నప్పటి పరిస్థితుల నుండి ఈ సంవత్సరం 70 మంది విద్యార్థులతో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా కేవలం ఒక సంవత్సరంలోనే పాఠశాల మారిపోయింది

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే.

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని ఎంఈఓ జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.

కల్వకుర్తి నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సామాజిక సేవలో ముందుంటున్న మిత్ర ఫౌండేషన్ మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కల్వకుర్తి పట్టణానికి చెందిన అరవింద్ చారి యొక్క ఇద్దరు పిల్లలను శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం లో పదవ తరగతి చదివే వరకు వారి విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులను మిత్ర ఫౌండేషన్ భరిస్తుందని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దే దిశగా మిత్ర ఫౌండేషన్ విద్యా భరోసా కృషి చేస్తుంది.ఈ కార్యక్రమంలో ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షులు రసూల్ ఖాన్, పాఠశాల యాజమాన్యం, మిత్ర సభ్యులు శ్రీకాంత్ నేత, నరేష్, శ్రీనేష్, కార్తీక్, హలీం ,తరుణ్, మహేష్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడిబాట కార్యక్రమంలో భాగంగా బడంపేట ప్రాథమికున్నత పాఠశాలలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం పాఠశాల పరిధిలో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ జాకీర్ హుస్సేన్ (ప్రత్యేక అధికారి) మాట్లాడుతూ పాఠశాల పరిధిలో పచ్చదనం స్వచ్ఛదనంతో పాటు స్వచ్ఛమైన గాలి రావడంతో పిల్లలు ఆరోగ్యంగా మరియు మంచి నీడనిచ్చి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (FAC) కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ వినోద్ సార్ తదితరులు పాల్గొనడం జరిగింది

సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు.

సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు

ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు.

మరిపెడ నేటిధాత్రి:

 

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు జోరందు కున్నాయి. ఇటీవల ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు తీసుకున్న చర్యలు, బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. స్కూళ్లు ప్రారంభమైన వారం రోజుల్లోనే కొత్త అడ్మిషన్లు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం ప్రాథమిక పాఠశాలలో 30 నూతన అడ్మిషన్లు రావడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్ తెలిపారు కొత్త అడ్మిషన్లలో సగానికి పైగా ఒకటో తరగతిలో 18 మంది విద్యార్థులు, 2 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 3 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 4 వ తరగతి లో 1, 5 వ తరగతి లో 1 చొప్పున మొత్తం 30 మంది విద్యార్థులు నూతన అడ్మిషన్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు అయితే, ఇంకా కొంత మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది అని వారు తెలిపారు, ఈ నెల 12 నుంచి 2025-26 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపునకు ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందన్నారు.

ఫలితాలిస్తున్న సర్కారు నిర్ణయాలు.

ఇటీవల బడుల బలోపేతానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా పదివేల కు పైగా టీచర్లను నియమించగా, ఖాళీగా ఉన్న చోట్ల బదిలీలు నిర్వహించి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చింది. దీనికితోడు 1.10లక్షల మంది టీచర్లకు ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. దీనికితోడు బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతులు, చదువులో వెనుకబడిన స్టూడెంట్ల కోసం పలు బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ సహకారంతో పాఠాలు బోధించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి అన్నారు,మరోపక్క బడులు తెరిచిన రోజే ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు యూని ఫామ్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గువ్వడి లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి, గణేష్,ఎస్ఎంసి చైర్ పర్సన్ పసుపులేటి శోభ,విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డి తన వ్యక్తిగత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త కె. ప్రసాద్ రెడ్డి ఈరోజు తన వ్యక్తిగత ఖర్చుతో, కోహిర్ మండలంలోని సజాపూర్ గ్రామంలోని అమీరి పాఠశాలకు అనుబంధంగా ఉన్న 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రి, ముఖ్యంగా నోట్‌బుక్‌లు మరియు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, విద్యార్థులు విద్య ద్వారా మాత్రమే పురోగతి సాధించగలరని మరియు సమాజంలో మంచి పౌరులుగా నిరూపించుకోగలరని ఆయన అన్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటే వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలనే తన దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశానని ఆయన అన్నారు. ఈ చొరవకు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కె. ప్రసాద్ రెడ్డిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఝరాసంగం.

మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఝరాసంగం, మండల విద్యార్థినికి స్టేట్ ర్యాంక్

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

విడుదల అయిన ఇంటర్ ఫలితాల్లో పురం అక్షిత రెడ్డి D/o పురం బసిరెడ్డి MPC(మొదటి సంవత్సరంలో)466/470 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు ఉత్తమ సాధించింది.ఈ సందర్భంగా విద్యార్థిని పురం అక్షిత రెడ్డికి ప్రిన్సిపల్ టీ తేనావతి మరియు అధ్యాపక బృందం మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు .

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు

-MEO లింగాల కుమారస్వామి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :

 

shine junior college

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడ పాఠశాల నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలను గురువారం మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి తెలిపారు. మంగళవారం మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సన్నద్ధత సమావేశoలో ఆయన మాట్లాడారు. ఎంపికు వచ్చే అభ్యర్థుల వయస్సు 8 నుండి 9 సంవత్సరాలలోపు (అనగా 01.09.2016 నుండి 31.08.2017 వరకు) ఉండాలని తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని, మండల స్థాయిలో ఎంపికలు తేది 19.06.2025న మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పాఠశాల స్టడీ సర్టిఫికెట్,
లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో( కలర్).మూడవ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ జిరాక్స్ఆధార్ కార్డు జిరాక్స్.కమ్యూనిటీ సర్టిఫికెట్ జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని కోరారు.
మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఎం.ఆర్.సీ, సీ.సీ.వో వేణును 9866744719 చరవాణిలో
సంప్రదించాల్సిందిగా తెలిపారు. ఈ సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, మహేష్, సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి దాత్రి

 

shine junior college

 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలువల యందు
జిల్లా విద్యశాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించబడినది.

ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కేసముద్రం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి, మరియు జిల్లా విద్యశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.

ప్రభుత్వ బడులు సామాజిక వారసత్వ సంపదను పెంపొందిస్తాయని, పేర్కొన్నారు.

ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందుతుందని, పైసా ఖర్చు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ మరియు నోట్ పుస్తకాలు అందించడం జరుగుతుందని, తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అలాంటి ఊరుబడిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము అందించే ఉచిత పథకాలను ఆదరించిన విధంగానే ప్రభుత్వ బడులను కూడా ఆదరించాలని, ప్రజలందరూ తమ పిల్లలను ఊరి పాఠశాలలోనూ చేర్పించాలని కోరారు. కలువల ప్రాథమిక పాఠశాలలో తమ పిల్లవాణ్ణి చేర్పించిన యుపిఎస్ నరసింహుల గూడెం ఉపాధ్యాయులు ఎస్ కే సయ్యద్ను ఘనంగా సన్మానించడం జరిగింది.అదేవిధంగా కలవల ఉన్నత పాఠశాల పదవ తరగతి టాపర్స్, కే తేజస్విని, వై వెన్నెల మరియు జి శివాని లను కూడా అభినందించారు. గణితంలో వందకు వంద మార్కులు సాధించిన
వై వెన్నెలకు పాఠశాల గణిత ఉపాధ్యాయులు తండా సదానందం వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందజేయగా, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, 3016 రూపాయలు అందజేశారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో 65 అడ్మిషన్లు చేసిన ప్రధానోపాధ్యాయులు వీరారెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ ను, మిగతా ఉపాధ్యాయులను డిఇఓ రవీందర్ రెడ్డి ,సంజీవరెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం, బడిబాట ర్యాలీ తీయడం జరిగింది. గ్రామ కూడలిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గిద్దె రాం నరసయ్య మరియు బండ వెంకన్నల బృందం ఆటపాట కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు ఆజాద్, అప్పారావు మండల విద్యాధికారి కాలేరు యాదగిరి, ఉపాధ్యాయులు ఏకాంబరం, తండా సదానందం, ఎం యాకాంబరం, ఆర్ బిక్షపతి బాలషౌరెడ్డి , వి రాజేంద్ర చారి, కే రాములు, మార్గం శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్ ,
వి రాము, కే పార్వతి, ఎండి జుబేర్ అలీ,
జి నాగరాజు,ఏ లింగయ్య,.,గోపి ..స్వరూప, శ్రీదేవి, హరికృష్ణ, కృష్ణ, మోహనకృష్ణ సిఆర్పి ఉదయ్, రాధ..నవీన్ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మునికుంట్ల ఐలేష్, ఎం భరత్, పరమేష్, బి .యాద గిరి, డప్పు యుగంధర్, వంగూరి శ్రీనివాసరావు, దేశెట్టి ప్రవీణ్ కుమార్ , అశ్విని, అనిల్, కవిత తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళీ వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు.

భద్రకాళీ వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు.

నేటిధాత్రి, వరంగల్.

 

shine junior college

 

 

 

వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానమునందలి శ్రీ భద్రకాళీ సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయమునందు వైదిక స్మార్త ఆగమము, తైత్తరీయ కృష్ణయజుర్వేదాధ్యయనంలో ప్రవేశం కొరకు ఆసక్తి గల విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవని దేవస్థాన కార్యనిర్వహణాధికారి/సహాయ కమీషనర్ కె. శేషుభారతి తెలిపారు. మాతృభాషలో చదవగలిగి, రాయగలిగిన విద్యార్థులు 8 నుండి 12 యేళ్ళ మధ్య వయస్సు గలిగి ఉపనయన సంస్కారం, ఉపాకర్మోత్సర్జనములు పూర్తి ఐనవారు సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞంలు కంఠస్థం అయివుండి స్వయముగా అనుష్ఠానము జరుపుకోగలిగినవారు అలాగే 10 సంస్కృత శబ్ధములు (7 విభక్తులు) కంఠస్థం అయివున్నవారు పాఠశాలలో అధ్యయనము చేయుటకు అర్హులని తెలిపారు. దరఖాస్తు ఫారాలను భద్రకాళి దేవస్థానం, వరంగల్ వారి వేదపాఠశాల యందు తేది: 18-06-2025 నుండి అందుబాటులో ఉంటాయని , విద్యార్థులు పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను 25-06-2025 వరకు వేదపాఠశాల కార్యాలయము నందు అందజేయగలరు అని ఈవో ఒక ప్రకటనలో తెలియచేశారు.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

◆ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అవడంతో అఘాయిత్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

జహీరాబాద్: ఇంటర్మీడియట్లో ఫెయిల్అయి
నందుకు మనస్థాపానికి గురై వెంకట రమణ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ పట్టనంలో నివాసం ఉంటున్న రాయిపల్లి కృష్ణ కుమారుడు వెంకటరమణ (19) డాక్టర్ ఆర్ఎల్ఆర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మృతుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాశాడు. సోమవారం మధ్యానం 12 గంటలకు ఇంటర్ సప్లి రిజల్ట్స్ రావడంతో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంకట రమణ తల్లి వెంకటరమ ణకు ఫోన్ చేస్తే లిఫ్ట్చేయడంలేదని స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి చూడమని చెప్పింది.దీంతో తన స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఉరేసు కుని ఉన్నారు. స్నేహితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీ క్షించిన వైద్యులు వెంకట రమణ మృతిచెందినట్లు ధృవీకరించారు. వెంకట్ రమణ మృతిపై తండ్రి కృష్ణ జహీరాబాద్ టౌన్ పీఎస్ లో ఎలాంటి అను మానాలు లేవని పేర్కొన్నట్లు ఎస్ఐ. కె. వినయ్ కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో.

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో ఉచిత విద్యను అందించాలి

టి ఎస్ జి యు ఎన్యుజే ఇండియా.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

shine junior college

మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రయివేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించి ఉచిత విద్యను అందించాలి అని,మహబూబాబాద్
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు తెలంగాణా స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా నేతలతో కలసి వినతి పత్రం అందించిన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ ధీర్, వారు మాట్లాడుతూ రాత్రానకా పగలనక నిరంతరం వార్తల కోసం తిరుగుతూ,ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరి శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు తప్పకుండా కల్పించాలని,మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యా భోధన అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు,జిల్లా విద్యా శాఖా అధికారి రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందించామని తెలిపారు.ఇటీవల టి ఎస్ జే యు ఎన్యుజే ఇండియా పోరాటంతో ములుగు జిల్లా కమిటీ అక్కడి జర్నలిస్టుల పిల్లలకు వందశాతం ఫీజు రాయితీ కల్పించిన సంగతి గుర్తు చేస్తూ కాపీ వినతిపత్రానికి జత చేసినట్లు కలెక్టర్ ,విద్యా శాఖాధికారి సత్వరం ఈ వినతి పై సానుకూల స్పందన ప్రకటించాలని కోరారు.

Private Schools.

కార్యక్రమంలో డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్,జిల్లా టీయస్ జేయూ నేతలు పోతుగంటి సతీష్,గాండ్ల కిరణ్,జెల్లీ శ్రవణ్, మల్లారపు నగేష్ శెట్టి వెంకన్న,మిట్టగడుపుల మహేందర్,తాడూరి ఉమేష్ శర్మ,
కేసముద్రం మండల అధ్యక్షులు మంద విక్రం ప్రధాన కార్యదర్శి గంధసిరి యాకాంబరం, ఉపాధ్యక్షులు కందుకూరి రాజేందర్,సతీష్,జన్ను శ్రీనివాస్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి…

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జెసికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ కు భూపాలపల్లి టౌన్ పరిధిలోని బాల బాలికలకు వాహన సౌకర్యాలు కల్పిస్తే నీరు పేదలు అనగారిన కులాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల చెందిన పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
దీనిని ఉద్యేసించి జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ తెలిపారు ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కూలినాటి చేసుకునే నిరుపేద కుటుంబాలకు వాళ్లకు పిల్లలు చదువుకునే కళ నెరవేరకపోగా పైసలు కట్టలేక అనేక రకాల ఇబ్బందులకు గురై ఆ పిల్లలు చదువుకు దూరమై అనేక రకాల వ్యసనాలకు బానిసవుతున్నారు వీటి నుంచి దూరం కావాలంటే ఇప్పుడే స్టార్టింగ్ స్కూలు ప్రారంభ దశలో ఉంది గనుక పిల్లలందరికీ వాహన సౌకర్యం కల్పిస్తే ఖచ్చితంగా స్కూలుకు వస్తారు ప్రభుత్వ స్కూళ్లలో మంచి చదువుకొని గొప్పవాళ్ళు అవుతారు భూపాలపల్లి టౌన్ లో వివిధ కాలనీలకు ప్రభుత్వ స్కూలు తరఫున వాహన సౌకర్యం గనుక కల్పిస్తే ఖచ్చితంగా బడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. దీనికి కలెక్టర్ ఎమ్మెల్యే సురవ తీసుకొని కచ్చితంగా వాహన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తునాం
ఈ కార్యక్రమం జిల్లా కమిటీ నాయకులు చిట్యాల శ్రీనివాస్ మందా రమేష్ పుల్ల అశోక్ జన్నే లక్ష్మణ్ పంగ మహేష్ చిర్ర శ్రీకాంత్ రవీందర్ పాల్గొన్నారు

ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గా బోలి బాబు నియామకం.

ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గా బోలి బాబు నియామకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

 

ఎమ్మార్పీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఇన్చార్జిగా బోలి బాబు మాదిగను నియమించడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ లు పోగు వెంకటేశ్వరరావు మాదిగ, రుద్రారపు రామచంద్ర మాదిగ, సుంచు రాజు మాదిగలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బోలి బాబు మాదిగ సొంత గ్రామము జయశంకర్ జిల్లా ఘన్పూర్ మండల్ వాస్తవాడైన ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్ర మొగిలి మాదిగ, జిల్లా సీనియర్ మాదిగ, నోముల శ్రీనివాస్ మాదిగ, దోర్నాల రాజేందర్ మాదిగలకు ఎమ్మార్పీఎస్ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ..

 

Shine Junior Colleges

 

 

 

గౌరవ శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలను నేను పాటిస్తున్న రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాలను వమ్ము చేయకుండా చిట్యాల మండలంలో మండలంలో అన్ని గ్రామాలు సందర్శించి..

 

 

గ్రామ కమిటీల పునర్మానం చేపట్టి..

 

గ్రామ గ్రామాన జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ జెండా పండుగను విజయవంతం జరిగేలా కృషి చేస్తానన్నారు.

సొంత డబ్బులతో నోట్ బుక్స్ పంపిణీ.

సొంత డబ్బులతో నోట్ బుక్స్ పంపిణీ

నిజాంపేట నేటి ధాత్రి:

 

విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఉపాధ్యాయులు దశరథం అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు దశరథం తన సొంత డబ్బులతో 200 నోట్ బుక్స్, పెన్సిల్, పెన్నులను విద్యార్థులకు అందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. విద్యార్థులు బౌషత్తులో మంచి స్థాయిలో ఉండలని కోరుకుంటున్ననారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు గణేష్, షాదులు కార్యదర్శి భాగ్యలక్ష్మి, మ్యాదరి నర్సిములు తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ బ్యాగుల పంపిణీ.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ బ్యాగుల పంపిణీ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్లలో ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 పాఠశాలలో చదివే 300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వారి చేతులమీదుగా జరిగింది.

వీటితోపాటు, ప్రతి విద్యార్థికి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్స్ అందజేయడం జరిగింది.

పాఠశాల పూర్వ విద్యార్థులైన మదన్ కుమార్, మ్యాన శ్రీధర్, చేరాల నారాయణ, నాగుల అమరేందర్, సురేష్, మల్లేశం, ఈశ్వర్, రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి 300 స్కూల్ బ్యాగులను స్పాన్సర్ చేశారు.

 

ఇట్టి కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులు గెంటియాల శ్రీనివాస్ మనోహర స్వామి, గుజ్జే పురుషోత్తం, దశరథం, పాషా, దేవరాజు, సురేందర్, స్వామి, సురేష్, బాలకిషన్ తదితరులు ముఖ్య అతిథులుగా వచ్చారు.

 

అతిథులు విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని ఇంత చక్కటి పాఠశాలలో చదువుతున్నందుకు సంతోషం వారి ముఖంలో కొట్ట వచ్చినట్లు కనిపిస్తుందని, పూర్వ విద్యార్థులు అందరూ కలిసి స్కూల్ బ్యాగ్ లు అందజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు.

మాజీ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయిన డాక్టర్ చకినాల శ్రీనివాస్ నేతృత్వంలో పాఠశాల పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నదని తెలియజేశారు.

పాఠశాల అన్ని రంగాలలో సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థులు అన్ని రంగాలలో పాఠశాలను ముందుకు నడిపిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులందరూ

ఈ పాఠశాలలోని సౌకర్యాలను కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ వాటన్నింటినీ సక్రమంగా వినియోగించుకొని ఉన్నతులుగా ఎదగాలని కోరారు.

ప్రస్తుతం మన పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో వివిధ రకాల పోటీలలో గెలుపొందుతూ పాఠశాల పేరును రాష్ట్రవ్యాప్తం చేశారు వారందరికీ అభినందనలు.

ఈ కార్యక్రమంలో పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ గారు పాఠశాల ఉపాధ్యాయులు బైరి రవీందర్, టి తిరుపతి, వి రవీందర్, బి శకుంతల, రాజగోపాల్ రెడ్డి, డేవిడ్సన్, రమాదేవి రాజేశం ఉమాకర్ విజయలక్ష్మి ఇప్పప్పుల దేవేందర్ ఉపేందర్ అనిల్ రాజు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version