ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు.!

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు తల్లిదండ్రులారా ఆలోచించండి

ట్రైనింగ్ పొందిన టీచర్స్

చదువులో అనుభవం ఉన్న టీచర్స్

పిల్లలకు అనుగుణంగా చదువు చెప్పే టీచర్స్

పిల్లలలోని ప్రతిభను గుర్తించే టీచర్స్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల బస్వ రాజు పల్లి పాఠశాల లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు . ప్రభుత్వ పాఠశాల లో బోదించే ఉపాధ్యాయులు మంచి ప్రతిబావంతులు ఉన్నారు ప్రజలు వారి పిల్లలని తమ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అనవసరంగా డబ్బులు ప్రయివేట్ విద్యా సంస్థలకి వృధా చేసుకోవద్దని తీన్మార్ మల్లన్న టీమ్ గణపురం మండల అధ్యక్షులు గండు కర్ణాకర్ ప్రజలకి సూచించారు. తాను కూడా తమ గ్రామం బస్వరాజపల్లి లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి అతని కూతురుని పంపిస్తూన్నానని ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలల వైవు చూడాలని, ముక్యంగా వివిధ పార్టీల నాయకులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని డిమాండ్ చేసారు. ఇలా చేస్తే ప్రజలకి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందని చెప్పారు

శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసిన విత్తనాలనే… మేలు

శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసిన విత్తనాలనే… మేలు

కేసముద్రం/ నేటిదాత్రి

 

 

 

 

కేసముద్రం రైతు వేదిక యందు,నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి, వరి మరియు పెసర మూల విత్తనాల కిట్లను, కేసముద్రం మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల రైతులకు, ప్రతి రెవిన్యూ గ్రామం నుంచి ముగ్గురు అభ్యుదయ రైతులకు ప్రతి రెవెన్యూ గ్రామానికి రెండు వరి మరియు ఒక పెసర మిని కిట్లను, కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న అధ్యక్షతన, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్, గంటా సంజీవరెడ్డి మరియు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గంటా సంజీవరెడ్డి, మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి, నాణ్యమైన వరి మరియు పెసర విత్తనాలను, అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటువంటి విత్తనాలను గ్రామస్థాయిలో అభ్యుదయ రైతులు శాస్త్రవేత్తల సలహా సూచనలతో ఉత్పత్తి చేసి గ్రామంలో ఉన్న రైతులకు పంపిణీ చేసి వచ్చే సీజన్లో తక్కువ ఖర్చుతో విత్తనాలను సరఫరా చేయాలని వారు సూచించారు దీనివలన విత్తన ఖర్చులు తగ్గి రైతుకు మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చి,నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. అదేవిధంగా రైతులు విత్తన కంపెనీల మీద ఆధారపడకుండా వారి యొక్క విత్తనాలను వారి గ్రామంలోని స్వతహాగా తయారు చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మాట్లాడుతూ కేసముద్రం మండలానికి 15 రెవెన్యూ గ్రామాలకు గాను 30 వరి కిట్లను, 15 పెసర కిట్లను అభ్యుదయ రైతులకు పంపిణీ చేశామని తెలిపారు అదే విధంగా రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విత్తనం వేసినప్పటినుంచి పంట చేతికి వచ్చే వరకు విత్తన ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేసముద్రం, ఉపాధ్యక్షులు, అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు మహబూబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ రావుల మురళి, మరియు సొల్లేటి జయపాల్ రెడ్డి , బండారు వెంకన్న , కదిరే సురేందర్ , గుగులోతు దశ్రు నాయక్ , వివిధ గ్రామాల అభ్యుద రైతులు, కేసముద్రం మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, డి రాజేందర్, శ్రీనివాస్, సాయిచరణ్ రవి వర్మ, లావణ్య లు పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన…..

రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)

 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెరుగైన విద్యా బోధన అందించడం జరుగుతుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంగ్లీష్, జువాలజీ అధ్యాపకులు యాదగిరి, స్వామి అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధనపై వారికి అవగాహన కల్పించారు. రామాయంపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవం గల అధ్యాపకుల తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. విశాలమైన తరగతి గదులతో పాటు ఇతర వసతులు ఉన్నాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరాలని వారు సూచించారు. ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు బస్ పాస్ సౌకర్యం ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కళాశాలలో బైపిసి, ఎంపీసీ, సి ఈ సి, హెచ్ ఈ సి గ్రూపులతో పాటు ఒకేషనల్ విభాగంలో ఎలక్ట్రికల్, ఆఫీస్ అసిస్టెంట్ షిప్, అకౌంటెంట్ టాక్సేషన్ గ్రూపులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయని విద్యార్థులకు వివరించారు. అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలలో చేరి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు. ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా లెక్చరర్లు తెలిపారు.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి మెరుగైన వైద్యం అందించాలి- కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తీవ్ర ఎండతో ఉపాధి హామీ పనులకు వెళ్లి పడిపోయిన సిరిసిల్ల గణపతికి మెరుగైన వైద్యం అందించి వారికీ ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆడుకోవాలని బికెయంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

శనివారం తీవ్ర ఎండతో పడిపోయిన గణపతిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చగా వారిని పరమార్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.

ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో రోజులాగే ఉపాధి హామీ పనికి వెళ్లిన కార్మికులు పని ప్రదేశం గట్టిగా ఉండడం వల్ల ముందు రోజే ఆప్రదేశంలో నీటితో తడిపి శుక్రవారం రోజున పనికి వెళ్లగా ఎండ తీవ్రంగా ఉండడం వల్ల నీటితో పని ప్రదేశాన్ని తడిపిన చెట్ల పొదలు ఎంత తీసిన రాకపోయే సరికి ఇంటికి వెళ్లి గడ్డపార తీసుకు రావడానికి వెళ్ళుతుండగా ఎండ ఎక్కువ ఉండడంతో అక్కడే కల్లు తిరిగి పడిపోవడంతో 108కు ఫోన్ చేయగా అంబులెన్సు వచ్చి కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చారని, ఇప్పటికి సంబంధిత అధికారులు అస్పత్రికి రాలేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కూలికి ప్రమాదం జరిగిన ఇప్పటివరకు అధికారులు బాధితున్ని పరమార్శించకపోవడం బాధ్యత రహిత్యమని, ఆగ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం అని వేంటనే ఉపాధి హామీ అధికారులు స్పందించి వారికీ మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకోవాలని అన్నారు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణి చేయాలని, ఎండ ప్రమాదాల నుండి కూలీలకు రక్షణ కల్పించాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రాహ్మణపల్లి యుగేందర్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, రాజయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు.!

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు ఫోటో కాన్ కరాటే మాస్టర్ సిద్దు స్వామి.

జహీరాబాద్.నేటి ధాత్రి:

ఝరాసంగం,ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు వ్రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోటో కాం కరాటే మాస్టర్ సిద్దు స్వామి మార్గదర్శనం చేశారు. బుధవారం ఝరాసంఘం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2024 – 25 విద్యా సంవత్సరానికి చెందిన 10 తరగతి విద్యార్థునులకు ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరాటే మాస్టర్ సిద్దు స్వామి10వ తరగతి విద్యార్థునులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ మేరకు పదవ తరగతి విద్యార్థునులకు పరీక్ష ప్యాడులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలో మెరుగైన వసతులు కల్పించాలి

నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల కు మెరుగైన వసతులు కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
నర్సంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలను గురువారం కలెక్టర్ సందర్శించి ఆసుపత్రి ఆవరణతో పాటు కళాశాల లెక్చర్ హాల్, హాస్టల్ యందు పర్యటించి వైద్య విద్యార్థులలో మాట్లాడి వారికి అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది సంబంద అంశాలు తన దృష్టికి రావడం జరిగిందని శానిటేషన్ గురించి నర్సంపేట మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయనున్నట్లు,హాస్పిటల్ యందు ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి పేషెంట్ సేవలు అందించేందుకు చర్యకు చేపడతామని అన్నారు.అధికారులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు.
అంతకు ముందు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో గల డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నిర్వహిస్తున్న రిజిస్టర్ ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య కళాశాల నియంత్రణలోకి తెస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టి వి వి పి)ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఇందుకు సంబంధించిన విషయాలతో పాటు వైద్య కళాశాలలో పూర్తి స్థాయిలో చేయాల్సిన ఏర్పాట్లపై త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.మోహన్ దాస్ ప్రో.రమేష్,ఎమ్మార్వో రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version