ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు.

ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝారసంగం మండలంలో రైతుబంధు ఆయిల్ పామ్ మరియు మామిడి పంటల మీద ఆహ్వాన సదస్సు నిర్వహించడం జరిగింది ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది మరియు సంగారెడ్డి జిల్లాలో 3000 ఎకరాల oil palm సాగులో ఉంది ఈ సంవత్సరం 3750 ఎకరాలు ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించబడినది అదే విధంగా ఝరాసంగం మండలంలో 160 ఎకరాలకు సాగులో ఉంది మరియు కొత్తూరు D నర్సరీలొ 150000 మొక్కలను,ఆయిల్ పామ్ పంటని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు మరియు కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త శైలజ గారు మామిడిలో చేపట్ట వలసిన యాజమాన్య చర్యలు మరియు సస్యరక్షణ చర్యల మీద వివరించడం జరిగింది. తదుపరి మామిడి తోటలో చేపట్ట వలసిన కొమ్మ కత్తిరింపులను క్షేత్రం లో చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి సునీత రోజు గారు వ్యవసాయ అధికారి వెంకటేష్ గారు కెవికె సైంటిస్ట్ శిరీష గారు మరియు ఏపీవో రాజ్ కుమార్ గారు ఏఈఓ జ్ఞానం గారు గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రతినిధులు కొండలరావు గారు, రాజేష్ రెడ్డి, దినేష్ మరియు డ్రిప్పు ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

నేటి ధాత్రి -గార్ల :-

వాణిజ్య పంటలో అధిక లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ పంటలను రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందాలని గార్ల వ్యవసాయ అధికారి కావటి రామారావు తెలిపారు.శనివారం మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో డోర్నకల్ ఉద్వాన వన అధికారి శాంతి ప్రియ,ఏఈఓ రాజ్యలక్ష్మి లతో కలిసి ఆయిల్ ఫామ్ పంట క్షేత్ర సందర్శన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితిలు ఉన్నాయన్నారు.ఆయిల్ ఫామ్ పంట దిగుబడి వచ్చేంతవరకు అంతర పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.వరి,పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి,తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయని, నాలుగవ సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుందని అన్నారు.రైతులు ప్రతి ఏటా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం అవలంబించుకుంటూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను,నికర ఆదాయం లభించే పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర ఆదాయం పొందడమే కాకుండా భూసారం కాపాడుకోవచ్చు అన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ ఫామ్ కు మంచి డిమాండ్ తో పాటు రవాణా, మార్కెట్,ప్రాసెసింగ్ సౌకర్యంతో పాటు గిట్టుబాటు ధర ఉందని తెలిపారు.ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటలను నాలుగు సంవత్సరాల వరకు వేరుశనగ, మొక్కజొన్న,కూరగాయలు మరియు నాలుగు సంవత్సరాల తర్వాత పైనాపిల్,కోకో వంటి పంటలను సాగు చేసుకుని అధిక ఆదాయం పొందవచ్చు అని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట సాగుకు చీడపీడల బెడద ఉండదని, కోతుల సమస్య రాదని,అకాల వర్షాలు,వడగండ్ల వాన ఇబ్బందులు ఉండవని అన్నారు.ఎకరా మొక్కలకు 11600, అంతర పంటలకు ప్రతి సంవత్సరంకు 4200 చొప్పున నాలుగు సంవత్సరాలకు 16,800, బిందు సేద్యానికి 22518 మొత్తము కలిపి 50 వేల 918 రూపాయలు రాయితీ పొందవచ్చు అని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది

భద్రాద్రి కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి కిషోర్
డివిజన్ అధికారి రాధాకృష్ణ

చర్ల నేటి ధాత్రి:

చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో ఆయిల్ ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ చేశారు
మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హార్టీ కల్చర్ అధికారి కిశోర్ మరియు డివిజన్ అధికారి రాధాకృష్ణ పిలుపుమేరకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్ల మండలంలోని రైతులకు పూర్తి సబ్సిడీ పై పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు చర్ల మండలంలో దాదాపు 300 ఎకరాలు సాగు లో ఉండగా విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లను వినియోగించుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులు పిలుపునిచ్చారు మొక్కలకే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పై కూడా సబ్సిడీ వస్తుందనీ తెలియజేశారు అంతే కాకుండా ఎకరానికి రూ 4200 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది అంతర్గత పంటలపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు వికాస్ సత్యనారాయణపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఎమ్ శ్రీనివాసరాజు ఆదర్శ రైతు సాగి శ్రీనివాసరాజు మరియు రైతులు చలపతి వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు   పాల్గొన్నారు

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ.

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు

సేద్యం పనుల్లో రైతులు బిజీ బిజీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుకోసం రైతులు సేద్యం పనుల్లో బిజీబిజీగా మారారు. మండ లంలో రెండు వేల హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయాధి కారులు పేర్కొంటున్నారు జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ మండలంలో నాలుగు రోజులుగా వర్షాలు కురు స్తుండటంతో వ్యవసాయ పొలాల్లో ట్రాక్టర్ల సాయంతో దుక్కిళ్లు చేస్తున్నారు. పొలాల్లో, గట్టుపై పెరిగిన పిచ్చిమొక్కలు, రాళ్లు తొలగించడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ యేడాది ముందస్తు వర్షాలు కురవడంతో వేరుశనగ పంట సాగుచేసేందుకు మండలంలోని రైతులు ఆసక్తి చూపుతున్నారు.

రైతులకు భవిష్యత్తు భరోసాగా ఆయిల్ ఫామ్ తోటల సాగు.

రైతులకు భవిష్యత్తు భరోసాగా ఆయిల్ ఫామ్ తోటల సాగు

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని రాయపర్తి రైతు వంతడుపుల సుజాత వారి ఆయిల్ ఫామ్ తోటలో ఉద్యానశాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ 100% భరోసా కల్పిస్తుంది,
రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష్ నారాయణ మాట్లాడుతూ ఇంకా విస్తీర్ణం పెంచేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. సాగు చేసే రైతులకు ఆయిల్ ఫామ్ టన్నుకు ధర 21000 ఉంది. త్వరలోనే
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము.అదేవిధంగా
నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన,ఆయిల్ ఫామ్ తోటలకు డ్రిప్పు ద్వారా ఎరువులు పంపే విధానాన్ని రైతులకు వివరించడం జరిగింది.
ఆయిల్ ఫామ్ సాగు చట్టబద్ధతతో కూడుకున్నది మంచి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడికి కృషి చేయాలని రైతులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి మధులిక, హెచ్ ఓ టెక్నికల రాకేష్, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష్ నారాయణ,ఫీల్డ్ ఆఫీసర్ భరత్ తదితర రైతులు పాల్గొన్నారు.

రైతులకు బయోచార్ మరియు పత్తి సాగుపై శిక్షణ.!

రైతులకు బయోచార్ మరియు హెచ్ డి పి సి పత్తి సాగుపై శిక్షణ కార్యక్రమానికి పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం రైతు వేదికలో ఆరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ ద్వారా నిర్వహించబడిన రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మరియు పత్తి సాగులో తాజా మార్పులపై దృష్టి సారించాలన్నారు..
ఈ సందర్భంగా అరణ్య సీఈఓ శ్రీమతి పద్మ కోప్పుల మాట్లాడుతూ, వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే బయోచార్ ప్రయోజనాలను వివరించారు. “బియోచార్ మట్టిలో పోషకాలు మరియు నీటిని నిలిపే సామర్థ్యాన్ని పెంచుతుంది, సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది, రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది,” అని ఆమె చెప్పారు. “ఇది మట్టిలో కార్బన్ను వందల సంవత్సరాలపాటు నిలుపుతుంది. ఇది వాతావరణానికి మేలు చేసే పరిష్కారం.” రైతులు బయోచార్తో కంపోస్టింగ్ ప్రారంభించాలని ఆమె సూచించారు. “మీ మట్టి, మొక్కలు మరియు భూమి మిమ్మల్ని ధన్యవాదాలు చెబుతాయి,” అని ఆమె అన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి (డి ఏ ఓ ) శ్రీ కె. శివప్రసాద్ హెచ్ డి పి సి పత్తి సాగుపై వివరాలు పూర్తి వివరాలు తెలియచేశారు.
“ఎకరాకు ఎక్కువ విత్తనాలు వేసి, తక్కువ దూరంతో సాగు చేస్తే దిగుబడి బాగా పెరుగుతుంది,” అని ఆయన అన్నారు. “దేశంలో పెరుగుతున్న పత్తి డిమాండ్ను తీర్చడానికి, తక్కువ దిగుబడిని అధిగమించడానికి హెచ్ డి పి సి సరైన మార్గం” అని ఆయన పేర్కొన్నారు.
సహాయ సంచాలకులు బిక్షపతి మాట్లాడుతూ పాత పద్ధతి వ్యవసాయం నూతన పద్ధతిలో వ్యవసాయం గురించి తేడాలను రైతులకు వివరించడం జరిగింది.
మండల వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ గత ఏడాది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి గత ఏడాది వచ్చిన సమస్యల గురించి వాటికి ఏ విధంగా అధిగమించాలని రైతులకు సూచించడం జరిగింది, అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ సోమవారం నుండి చేయడం జరుగుతుంది అని తెల్పడం జరిగింది,
రైతులకు ఉచితంగా బయోచార్ను అందిస్తూ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ పనిచేస్తోందని తెలిపారు.
నూజీవీడు సీడ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, హెచ్ డి పి సి పత్తి సాగు రైతుల్లో మంచి ఆదరణ పొందుతోందన్నారు.
ఈ పద్ధతిలో సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల ఎక్కువ పత్తి దిగుతుంది. ఈ సీజన్లోనే 59 జిల్లాల్లో 35,000 ఎకరాల్లో హెచ్ డి పి సి పత్తి నమోదు చేయడం దీనికి నిదర్శనం అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ దిగుబడులు మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్థిరమైన సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు కీలకమైన అడుగు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు బిక్షపతి మరియు మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఆరణ్య ఎన్జీవో సీఈవో పద్మ నూజివీడు సీడ్స్ నరసింహారెడ్డి, ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version