అరక పట్టిన ఎమ్మెల్యే కోరం కనకయ్య…
నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల
పంచె కట్టుతో పత్తి చేనులో అరక పట్టి పాటు చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య. తన స్వగ్రామం టేకులపల్లి మండలంలోని కోయగూడెం గ్రామంలో తన వ్యవసాయ భూమిలో అరక పట్టి పత్తి చేనులో పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట సిఐ తాటిపాముల సురేష్, ఎస్ఐలు రవీందర్, శ్రీకాంత్, ఆత్మకమిటి చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, రావూరి సతీష్, భద్రం,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.