ఆర్టీసీ బస్టాండ్ పట్ల బీజేపీ నాయకుల నిరసన
ధర్నాలొ పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు నాయిని అనూష అశోక్,
నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నాయిని అనుష అశోక్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నాయిని అనూష అశోక్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బస్టాండ్ ప్రాంగణం పూర్తిగా బురదమయంగా మారి, ప్రయాణికులకు ముఖ్యంగా మహిళలు వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడం, బస్సులు నిలవడానికి కూడా అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వర్షపు నీరు నిలిచిపోయి, బురదతో నిండిన బస్టాండ్‌లో ప్రయాణించడం ప్రజలకు కష్టంగా మారిందని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బస్ స్టేషన్ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దామచర్ల రామారావు, శ్రీరంగం సంపత్, సుదానపు సారయ్య ,ప్రధాన కార్యదర్శి రాంపల్లి రాజగోపాల్, కార్యదర్శి మల్లంమల్లేష్ పద్మ ,సీనియర్ నాయకులు తాళ్లూరి లక్ష్మయ్య, మాజీ మండల అధ్యక్షులు సింగారపు సురేష్, నీలం ఎలేందర్ , నాయకులు కుడికాల సుధీర్, తదితరులు పాల్గొన్నారు.