ములుగు మండల సమస్యలపై తహశీల్దార్ కు బిజెపి నాయకుల వినతి పత్రం
ములుగు టౌన్ నేటి ధాత్రి
ములుగు మండలంలోని పలు సమస్యలపై బిజెపి నాయకులు తహశీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ రోజు మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు గారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వగా, ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మండలంలోని గ్రామాల్లో ఎక్కడా వీధి దీపాలు వెలగడం లేదని
డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం వలన నీరు నిలిచి, పారిశుద్ధ్యం లోపించి, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయని
గ్రామాలలో తాగునీరు, విద్యుత్ సమస్యలు, గుంతల రహదారులు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని
ములుగు పట్టణంలోని 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు
అదేవిధంగా, పట్టణంలోని పలు వీధుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడం వలన రవాణా కష్టాలు ఏర్పడుతున్నాయని, ములుగు పట్టణానికి వచ్చే ప్రజలకు విశ్రాంతి కోసం పబ్లిక్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు
తద్వారా ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రాజీవ్ యువ వికాస్ కింద లోన్లు,
గృహలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి ₹2500,
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు —
తప్పనిసరిగా అమలు చేయాలని, లేకుంటే బిజెపి మండల & జిల్లా ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాష్ట్ర ప్రతినిధి స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలమంతుల రవీంద్రాచారి, ఉపాధ్యక్షులు జినుకల కృష్ణారావు, జిల్లా ప్రతినిధి సూర్యదేవర విశ్వనాథ్, కోశాధికారి గంగిశెట్టి రాజ్ కుమార్, కార్యాలయ కార్యదర్శి దొంతి రవి రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఇమ్మడి రాకేష్ యాదవ్, జిల్లా నాయకులు లవన్ కుమార్, నగరపు రమేష్, ఎలుకతుర్తి శ్రీహరి, యాద సంపత్, ప్రమోద్, మండల ప్రధాన కార్యదర్శులు లకావత్ రాజ్ కుమార్, కుక్కల పవన్, ఉపాధ్యక్షుడు ఏరువ పాపిరెడ్డి, నాయకులు ఒజ్జల కిరణ్, ఆకుల రాజేందర్, బండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు