సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న గుర్తింపు సంఘం నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని బాతాల రాజు భవన్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయం లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ
సింగరేణిలో ఎన్నికల జరిగి 19, నెలలు గడుస్తుంది ఇంకోక్క 5, నెలలో ఎన్నికల గడువు ముగియనుంది
గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న ఏఐటియుసి డైరెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తు కాలం వెళ్లతీస్తుంది
సర్కార్ సంఘమైన ఐ ఎన్ టు యు సి సంఘం గనుల పైన నల్ల బ్యాడ్జీలతో జిఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేపడుతుంది వీరు చేసే కృత్తిమ ఉద్యమాలను కార్మిక వర్గం నమ్మే పరిస్థితిలలో లేరు
ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మేనిఫెస్టాలతో కార్మిక వర్గం ముందుకు వచ్చి కార్మిక ఓట్లతో గెలిచిన అనంతరం వారి ఆర్థిక రాజకీయ సభవాల కోసమే పనిచేస్తున్నారు
ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు
మెడికల్ బోర్డును (విఆర్ఎస్ )పాత పద్ధతిలో కొనసాగించి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికున్ని అన్ఫిట్ చేసి వారి వారసులకు ఎలాంటి ఆర్థిక దోపిడీ లేకుండా
ఉద్యోగాలు కల్పిస్తామని
సింగరేణి కార్మికుల మారు పేర్ల సమస్యను పరిష్కరిస్తామని వారి వారసులకు ఉద్యోగాలు ఇపిస్తామని హామీ ఇచ్చారు
సింగరేణి కార్మికుల చిరకాల కోరిక 300 గజాలఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామన్న హామీ
సింగరేణిలో నూతన భూగర్భ గనులు తవ్వి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని
సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఆదరిత పరిశ్రమలు సింగరేణి కారిడర్ ఏర్పాటు చేస్తామన్నారు
సింగరేణిలో దాదాపు 28 వేల మంది కాంటాక్ట్ కార్మికులను పెర్మనెంట్ చేపిస్తామని వారికి తగిన పనికి తగిన వేతనాలు ఇప్పిస్తామన్నరు
సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఖాళీలు క్లారికల్ ఎంవి డ్రైవర్స్ సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ సింగరేణి సెక్యూరిటీ పోస్టుల తో పాటు ఇతర కాలిలను బర్తి చేయుట కొరకు
సింగరేణిలో ఉన్న హాస్పిటల్ లను కార్పొరేటర్ హాస్పటల్గాగా మారిచి పూర్తిస్థాయిలో డాక్టర్లను నియమిస్తామన్నారు
డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ
కూడా ఇప్పటివరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరింపబడలేదు
మళ్లీ సింగరేణిలో ఎన్నికల రాబోతున్నాయి సింగరేణి కార్మికులకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రెండు సంఘాలనుగనుల పైన కార్మిక వర్గం నిలదీయాలని గట్టయ్య మాట్లాడారు
ఈ సమావేశంలో పాల్గొన్నవారు
టీఎస్ యూఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్
కాసర్ల ప్రసాదరెడ్డి
నామాల శ్రీనివాస్
రాళ్ల బండి బాబు
జయశంకర్
నరసింహారెడ్డి
ఎస్.కె సాజిత్
ఎస్ కె సలీం
ఓదెలు
సిహెచ్ లక్ష్మీనారాయణ
తదితరులు పాల్గొన్నారు