చెట్టుపై నుండి కిందపడి.. గీత కార్మికుడు మృతి.

నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ మండలం నాగనూలు గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ (58) రోజు మాదిరిగానే.. శనివారం తమ కుల వృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తన వ్యవసాయ పొలానికి వెళ్ళాడు. ఈత చెట్టు పైకి ఎక్కి కల్లు తీస్తున్న సమయంలో ఒక్కసారిగా చెట్టుపై నుండి కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో శ్రీనివాస్ గౌడ్ ను హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాస్ గౌడ్ కి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

– మీ సేవల సెంటర్ల ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు, చేర్పులకు అవకాశం

– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల(నేటి ధాత్రి):

జిల్లాలోని అర్హులైన వారందరూ నూతన రేషన్ కార్డు కోసం తమ సమీపంలోని మీ సేవల సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపునకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ తమ సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అధికారులు విచారణ చేసి కార్డులు జారీ చేస్తారని, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ చేపడుతారని తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

మంచినీటిపై ప్రత్యేక దృష్టి.

• ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నీటి పరీక్షలు

నిజాంపేట: నేటి ధాత్రి

వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటిని వృధా చేయవద్దని మిషన్ భగీరథ అధికారులు సూచించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఉదయం మిషన్ భగీరథ అధికారులు ఇంటింటికి వెళ్లి నీటి నమూనాలను సేకరించి క్లోరోస్కోప్ అనే పరికరం తో పరీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ఏఈ ఆదేశాల మేరకు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు నీటిని అందించడం జరుగుతుందన్నారు. బ్లీచింగ్ పౌడర్ ట్యాంక్ కెపాసిటీ 10 వేలు ఉంటే 40 గ్రాములు కలపడం జరుగుతుందన్నారు. ట్యాంక్ నుండి నీటిని విడుదల చేసే 30 నిమిషాల ముందు పౌడర్ ను కలపడం జరుగుతుందన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి మంచి నీటిని అందించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పరశురాములు, నర్సింలు ఉన్నారు.

చెంచు ఆదివాసి గ్రామాలకు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి.

చెంచు ఆదివాసి గ్రామాలకు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి.

National Adivasi Preservation Samithi President Karam Sitaramanna Dora (Delhi Babu)

జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి అధ్యక్షులు కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు )

“నేటిధాత్రి” ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల.

ప్రకాశం జిల్లా, పెద దోర్నాల మండలం, పెద్ద చామ గ్రామంలో శనివారం నాడు జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి అధ్యక్షులు
కారం సీతారామన్న దొర(ఢిల్లీ బాబు) పర్యటించారు.
ఈ సందర్భంగా సీతారామన్న దొర మాట్లాడుతూ ఆదివాసీ చెంచు గిరిజన గ్రామాలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు,
చీకటి బతుకులు బతుకుతున్న చెంచుల నివాస ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు,గిరిజన పాఠశాలలు ఆధునీకరణ చేయాలన్నారు,

National Adivasi Preservation Samithi President Karam Sitaramanna Dora (Delhi Babu)

చెంచు గూడాలలో రోడ్డు సదుపాయం లేక గిరిజనుల పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసామని చెంచు గ్రామాలలో వెంటనే రోడ్డు, రవాణా సదుపాయం కల్పించాలన్నారు, చెంచు గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలలో మెరుగైన సదుపాయాలతో పౌష్టిక ఆహారం అందించాలన్నారు, చెంచు ఆదివాసీల ఉపాధికై (MGNREGS) ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు, చెంచు ఆదివాసీల అభివృద్ధికి ట్రై కార్ రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలి అన్నారు, చెంచు గిరిజనులు సేకరించుకుంటున్న అటవీ ఫలాలను అమ్ముకోకుండా అడ్డుపడుతున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని,

National Adivasi Preservation Samithi President Karam Sitaramanna Dora (Delhi Babu)

పక్కా భూములు కలిగి ఉన్న ఆదివాసీలకు వ్యవసాయం చేసుకొనుటకు నీటి సదుపాయం లేకపోవడంతో బీడు పట్టిన భూములలో సాగు చేసుకోవటం కోసం 500 అడుగులు పైన గల లోతు బోర్లు ప్రభుత్వం వెంటనే కేటాయించాలన్నారు , ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తానని కారం సీతారామన్న దొర( ఢిల్లీ బాబు) అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంరక్షణ సమితి నాయకులు కారం గంగాధర్ రావు, కాక శివశంకర్ ప్రసాద్ మరియు గ్రామస్తులు
దాసరి వెంకన్న, మల్లి గురవయ్య, దంసం లక్ష్మన్న, దాసరి పెద గురవయ్య,చిన గురవయ్య , దంసం చిన పెద్దన్న, దంసం గురవమ్మ, , దాసరి వెంకట లక్ష్మి, , దాసరి రామయ్య మొదలగు వారు పాల్గొన్నారు.

National Adivasi Preservation Samithi President Karam Sitaramanna Dora (Delhi Babu)

ఆర్మూర్ పట్టణంలో పట్టభద్రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ

నేటిధాత్రి  నిజామాబాద్ జిల్లా :

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
నేషనల్ హైవే వద్ద నరేందర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పొద్దుటూరు వినయ్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రముఖ విద్యావేత్త అయిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ని పట్టబద్రులు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కరీంనగర్ లో జరిగే నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ….
కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ బరిలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రాడ్యుయేట్లు తనకు అండగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార గంగారెడ్డి, అయ్యప్ప శ్రీనివాస్ లతోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దాం

– టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ ఆర్. లెనిన్
– వరంగల్ జిల్లా టియూడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం

వరంగల్, నేటిధాత్రి

జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నారు. గురువారం వరంగల్ లోని వరంగల్ తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం భవనంలో టియూడబ్ల్యూజే, టెంజు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీ యూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మిట్ట నవనీత్ గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది. కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు
సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం, యూనియన్ ఐడి కార్డుల పంపిణీ, డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్ కొనసాగింపు, ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ లో ఇప్పించేందుకు కృషి, వరంగల్లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకారం, గుర్తింపు ఉన్న సంస్థల్లో పనిచేసే వారికే యూనియన్ సభ్యత్వాలు.అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించట
సమావేశంలో పై తీర్మానాలను ఆమోదించిన
అనంతరం బి ఆర్. లెనిన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో డెస్క్ జర్నలిస్టులను గుర్తించి అల్లం నారాయణ అక్రిడిటేషన్లు ఇప్పిస్తే… ప్రస్తుత ప్రభుత్వం కోత పెట్టేందుకు సిద్ధమైందని, ఒక వేళ అదే జరిగితే పోరాటాలకు సిద్ధమని తెలిపారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులను అల్లం నారాయణ నేతృత్వంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కడుపులో పెట్టుకుని కాపాడుకుందని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించి జర్నలిస్టులకు మనోధైర్యాన్ని నింపిన ఘనత మన యూనియన్ కు దక్కుతుందని అన్నారు. యూనియన్ బలోపేతం అయితే ప్రెస్ క్లబ్ లను సునాయసంగా గెలుచుకోవచ్చన్నారు. అందుకుగాను వరంగల్ జిల్లా కమిటీ యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు. ఇకమీదట యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ నిర్మాణాత్మకంగా పనిచేస్తూ సభ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాడ్ల వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరిపై పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిటిషన్ ను ప్రెస్ క్లబ్ కమిటీ వెనిక్కి తీసుకుని, వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. టి యు డబ్ల్యూ జే 143 లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి యూనియన్ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి వారికి అండగా ఉండేందుకు కృషి చేస్తామన్నారు. నూతన సభ్యత్వాల నమోదును పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గుర్తింపు ఉన్న సంస్థల్లో పనిచేసే వారికే యూనియన్ సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు యూనియన్లు, అసోసియేషన్లు, ఫెడరేషన్ల పాత్ర కీలకంగా ఉంటుందని గుర్తు చేశారు. జర్నలిస్టులందరికీ ఎమ్మెల్యేల పరిధిలో ఇళ్ల స్థలాలు లేదా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ఇప్పటివరకు మీడియా అకాడమీ కనీసం జర్నలిస్టులందరికీ నూతన అక్రిడేషన్లు ఇప్పించలేకపోయారని తెలిపారు. ఇంటి స్థలాలపై జర్నలిస్టులకు భరోసా ఇవ్వలేని పరిస్థితిలో పోటీ యూనియన్ ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాంకిడి శ్రీనివాస్, కోశాధికారి రాపల్లి ఉపేందర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మిట్ట నవనీత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నీలం శివ, కోశాధికారి శ్రీనివాస్,
ఉపాధ్యక్షుడు తౌటి కామేష్ , కంది భరత్, కమటం వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ బండి రవి టెంజు ఉపాధ్యక్షుడు పిండం విజయ్, అమీర్, విద్యాసాగర్, వేణు, జాయింట్ సెక్రెటరీ కిరణ్, ప్రభాకర్, అనిల్ ,రమేష్, సనత్, ప్రదీప్, ఈసీలు, చందు, సంతోష్, కృష్ణ, యుగేందర్, నరేందర్, రాజు, రాజేష్,

జమ్మికుంట పట్టణంలోని లోటస్పాండ్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నిలువు దోపిడి

జమ్మికుంట: నేటిధాత్రి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధిక పీసులు వసూలు చేస్తున్నారని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కంప్లైంట్ మెరకి విద్యార్థి సంఘాలు స్కూల్ యొక్క యజమాన్యాన్ని అడగగా వారితో దురుసుగా ప్రవర్తించడంతోపాటు ఇష్టానుసారంగా మాట్లాడుతూ విద్యార్థి సంఘాలపై కేసు పెట్టానని పోలీసులతో విద్యార్థి సంఘాలను బెదిరిస్తూ రాజకీయ వ్యవస్థను స్కూల్ పై తీసుకొచ్చి స్కూల్ యొక్క వ్యవస్థా బ్రస్ట్ పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాల పోరాటం విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కష్టార్జితం దోపిడీ చేస్తున్నారని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి విద్యార్థి సంఘాలు లోటస్పాండ్ స్కూల్ ముందు నిరసనకు దిగి ఆందోళన చేపట్టారు లోటస్పాండ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి వద్ద స్కూల్ యొక్క ఫీజు హాస్టల్ యొక్క ఫీజుకి 35 వేలకి మాట్లాడుకోగా విద్యార్థి యొక్క తల్లిదండ్రుల వద్ద 46 వేల రూపాయలు వసూలు చేయడం పట్ల నిరసిస్తూ ధర్నా చేపట్టారు దీనిపై లోటస్పాండ్ ఒక యజమాన్యంకి పోలీసులకు 100 డయల్ చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘాలని అదుపులోకి తీసుకున్నారు తదనానంతరం యాజమాన్యాన్ని పోలీస్ స్టేషన్కు పిలిపించగా యజమాన్యం విద్యార్థి సంఘాలకు క్షమాపణ కోరారు విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ ఇలా అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని మళ్లీ పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఏదైతే విద్యార్థి తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజు తీసుకున్నారు 10000 రూపాయలు విద్యార్థి యొక్క తండ్రికి అప్పజెప్పడం జరిగింది విద్యార్థి సంఘాల పోరాటం విద్యార్థుల తల్లిదండ్రులకు దక్కుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు

మైలేజీ మాయం..డ్యామేజీ ఖాయం.!

 

`పడిపోయిన పవన్‌ ర్యాంకు!

`ఆర్భాటమెక్కువ..ఆచరణ తక్కువ!

`ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ

`పవన్‌తో మేలు కన్నా, నష్టమే ఎక్కువ?

`కొంత మంది మంత్రుల కన్నా తగ్గిన పని పవన్‌ పనితనం

`రాజకీయం వేరు..పరిపాలన వేరు

`రోజూ రాజకీయాలే చేస్తామంటే జనం ఒప్పుకోరు

`పవన్‌ దూకుడులో ఇప్పటికీ నోటి దురుసు

`రాజ్యాంగ బద్దమైన పదవిలో వుంటూ అడ్డగోలు వ్యాఖ్యలు

`ప్రభుత్వానికి మైలేజ్‌ తేకపోగా డ్యామేజ్‌ అవుతోంది

`పదే పదే డబ్బులు లేవంటూ పవన్‌ మాటలు ప్రభుత్వానికి ఇబ్బందికరం

`సాటి మంత్రులు ఇరుకున పడేలా పవన్‌ వ్యాఖ్యలు

`మొదటి సారి ర్యాంకుతో రెచ్చిపోయిన పవన్‌

`పదో ర్యాంకుతో అంతా సైలెన్స్‌

`దూకుడు ఎన్నికలలో మేలు చేసింది

`ఎల్లకాలం పని చేయదని పవన్‌కు తెలిస్తేనే మంచిది

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పాత్రపై రకరకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల కాలంలో పవన్‌ తన పంథాను మార్చుకొని తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాన్ని ఆది నుంచి గమనిస్తే, మొదట్లో ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతనవుండదు. ఎప్పటికప్పుడు తన మార్గం మార్చుకోవడంలో పవన్‌ కళ్యాన్‌ను మించిన నాయకుడు లేడని చెప్పొచ్చు. పవన్‌ కళ్యాన్‌ రాజకీయం మొదలు పెట్టినప్పుడు చెగువేరా సిద్దాంతం అన్నాడు. తిరుగుబాటు విధానంతో ముందుకు సాగాడు. తన అభిమానులంతా చెగువేరా టీషర్టులు వేసుకునేదాకా వచ్చింది. మోటార్‌ సైకిళ్లు,కార్లమీద చెగువేరా బొమ్మతోపాటు పవన్‌ ఫోటోలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో తనలో కమ్యూనిజం బావాలున్నాయన్నారు. గద్దర్‌ పాటలంటే తాను చెవికోసుకుంటానన్నారు. గద్దర్‌ లాంటి వారి బావజాలంతో తాను చైతన్యం పొందానన్నారు. పవన్‌ కల్యాణ్‌ తండ్రి ఓసారి నెల్లూరు గద్దర్‌ వచ్చినప్పుడు వెళ్లి ఆయన పాటలు వినమని చెప్పారని కూడా చెప్పుకున్నారు. అలా సాగినంత కాలం పవన్‌ కళ్యాన్‌ రాజకీయం ముందుకు సాగలేదు. దాంతో ఆయన తన రాజకీయ పంధాను మార్చుకున్నారు. ఒక్కసారిగా బిజేపికి దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో బిజేపితో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ, బిజేపి, జనసేన మూడు పార్టీలు కలిసి విజయంసాదించాయి. కాని ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కాని కూటమికి మద్దతు పలికి ఆనాడు తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదరపడ్డారు. కాకపోతే అతి కొద్ది రోజుల్లోనే ఆయన తన మద్దతుతోనే తెలుగుదేశం గెలిచిందని అంటూ వచ్చారు. కొద్దికాలానికి బిజేపితో కూడా తెగదెంపులు చేసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును బిజేపి నాశనం చేసిందంటూ విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి మోసం చేశారని ఎలుగెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించారు. తనపార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసుకున్నారు. కాని అటు సినిమాలు, ఇటు పార్టీ రెండిరటినీ ఏక కాలంలో మేనేజ్‌ చేయలేకపోయారు. పార్టీని పటిష్టం చేయలేకపోయారు. కాని పవన్‌ ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా వచ్చారు. దాంతో 2019 ఎన్నికల్లో పవన్‌ ఒంటరిగా పోటీ చేశారు. స్వయంగా ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. కాని ఆయన గెలవలేదు. పార్టీ మాత్రం ఒక్కటే సీటు గెలిచింది. దాంతో పవన్‌కు జ్ఞానోదయమైంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్దితులకు తిరుగుబాటు సిద్దాంతం కరక్టు కాదని తెలుసుకున్నాడు. దేశ వ్యాప్తంగా బిజేపికి పెరుగుతున్న ఆదరణ చూసి తన పంథాను అటు వైపు మల్చుకున్నారు. సనాతన ధర్మంలో గొప్ప దనం గుర్తించారు. అటు వైపు అడుగులేశారు. వైసిపిని బిజేపికి దూరం చేయగలిగారు. తర్వాత కొంత కాలానికి తెలుగుదేశాన్ని బిజేపితో కలిపి, మళ్లీ తన రాజకీయం మొదలు పెట్టారు. తన ప్రాదాన్యత పెంచుకుంటూ వచ్చారు. జనంలో ఆకాంక్షల కన్నా, రాజకీయంలో సరికొత్త ఆలోచనలకు పదునుపెట్టారు. ఎన్నికల్లో గెలవడమే రాజకీయం అనుకున్నారు. సిద్దాంతాలను నమ్ముకుంటే సీట్లు రావని తెలుసుకొని పొత్తుతో పోతే తప్ప జనసేన గెలవలేదని గ్రహించి తెలుగుదేశం పార్టీకి గొడుగు పట్టుకున్నారు. మళ్లీ 2014 నాటి రోజులను ఆవిష్కరించారు. కాకపోతే ఆయన ఎంచుకున్న దారిని మార్చుకున్నారే గాని, తనలోని ఆశలకు రెక్కలు తొగడం మాత్రం వాయిదా వేసుకోలేదు. వేసుకునేందుకు సిద్దంగా లేరు. నిజం చెప్పాలంటే లక్ష్యం లేకుండా ఏ నాయకుడు రాజకీయాలు చేయలేడు. అధికారం సాధించాలన్న కోరిక లేకుండా ఏ నాయకుడు రాజకీయ పార్టీని నడపలేడు. ఇప్పుడు పవన్‌ చేస్తున్నది అదే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజకీయాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక వేళ తాను ఆదమరిచి వున్న సమయంలో ఎక్కడ లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తారో అన్న భయం పవన్‌లో పట్టుకున్నది. తన స్దానంలో మార్పు వస్తుందేమో అన్న ఆలోచన మొదలైంది. చంద్రబాబు నాయకత్వంలో ఇంకా పదిహేనేళ్లయినా పనిచేస్తానని అన్నారు. అంటే చంద్రబాబు నాయకుడుగా వుండే పాలనలోనే తాను వుంటానని స్పష్టం చేసినట్లైంది. కాని లోకేష్‌ నాయకత్వం, తనపై పెత్తనాన్ని అంగీకరించని పవన్‌ సూటిగానే చెప్పినట్లైంది. అసలు పవన్‌ అసలైన స్వరూపం అదే. అందులో తప్పులేదు. పొత్తు దర్మం కుదుర్చుకున్నది చంద్రబాబు కోసమే కాని, లోకేష్‌ కోసం కాదు. అందువల్ల పవన్‌ ఆలోచన తప్పు కాదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పు పట్టాల్సిన పనిలేదు. కాని లోకేష్‌కు ప్రమోషన్‌ను అడ్డుకునే హక్కు పవన్‌కులేదు. లోకేష్‌ పార్టీ వేరు. పవన్‌ పార్టీ వేరు. తెలుగుదేశం పార్టీకి ఏపిలో సంపూర్ణమైన మెజార్టీ వుంది. పవన్‌కు ప్రతిపక్ష హోదాకు అవరమైన సీట్లు మాత్రమే వున్నాయి. అంతకు మించి సీట్లు లేవు. అయినా ఆయన కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే తన మనసులోని మాట చెప్పేశారు. జనసేన చూపించిన దారిలో కూటమి ప్రయాణం సాగని పక్షంలో ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషిస్తామని ముందే చెప్పేశారు. దాన్ని గత కొంత కాలంగా అనుసరిస్తూనే వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే తిరుమల తిరుపతిలో లడ్డూ వివాదాన్ని పూర్తిగా తన భుజాల మీద మోసి, క్రెడిట్‌ కొట్టేయాలనుకున్నాడు. నానా యాగీచేశారు. తిరుమలలో అపవిత్రం జరిగిపోయిందని గత ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా సనాతన దర్మానికి విఘాతం కల్గిందని అగ్రహోదగ్రుడయ్యాడు. కాని అదే సమయంలో చంద్రాబాబుగాని, లోకేష్‌ గాని తమ పని తాను చేసుకుంటూపోయారు. ఎందుకుంటే అది అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు వెళ్తుందో చెప్పలేమని ముందే చంద్రబాబు అంచనా వేశారు. కాని పవన్‌ కళ్యాణ్‌ అంత దూరం ఆలోచించలేదు. ఎందుకంటే సహజంగా ఆయనకు ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. క్రెడిట్‌ అంతా తన ఖాతాలో వేసుకుందామనుకుంటే కుదరలేదు. సుప్రింకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాదానం లేకపోవడంతో, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పడంతో పవన్‌ దూకుడుకు కళ్లెం వేసినట్లైంది. తర్వాత రాష్ట్రంలో కూటమి పాలన సాగుతున్నా వైసిపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదంటూ హోంశాఖ మంత్రి పనితీరును ప్రశ్నించారు. తాను హోం మంత్రిని అయి వుంటే పరిస్ధితి మరో రకంగా వుండేదంటూ కొత్త బాష్యాలు చెప్పారు. అయినా తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్ధుకుపోయారు. కొత్తలో ఇలాగే వుంటుంది లే అనుకున్నారు. ఇక కాకినాడ పోర్టు విషయంలో షిప్‌ద సీజ్‌ అన్నది కొంత కాలం బాగా ట్రెండిరగ్‌ అయ్యింది. ఎందుకంటే మన దేశం నుంచి ఇతర దేశాలకు బియ్యం రవాణ వాణిజ్యం అనేది సర్వసాదారణం. అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా వుంటాయి. అయితే ఆ షిప్‌లలో డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో విచారణ కూడా జరిపించారు. సముద్ర వ్యాపారమంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో వుంటుంది. అవసరమైతే డిల్లీకి వెళ్లి నేను మాట్లాడతా? అన్నారు. వెళ్లారు. అసలు విషయం తెలుసుకొని సైలెంట్‌ అయ్యారు. తన మంత్రిత్వ శాఖలో పనులు వదిలేసి, ఇతర మంతిత్వ శాఖలలో వేలు పెట్టుడం మొదలు పెట్టారు. తన శాఖ ఫైళ్ల క్రియరెన్స్‌ పక్కనపెట్టారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో పదో ర్యాంకుతో సరిపెట్టుకున్నారు. మొదటిసారి ర్యాంకు మొదటిర్యాంకును సాధించిన పవన్‌ ఇప్పుడు పదో ర్యాంకు తెచ్చుకున్నారు. దీనంతటికీ ఈ మధ్య ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రాజకీయాల మీద కేంద్రీకృతం చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్‌ మొదలైందో అప్పటి నుంచే పవన్‌ తన పంధాకు మరింత పదును పెట్టారు. తనకు తానుగానే ప్రత్యేకతను సంతరించుకునేలారాజకీయం చేయాలనుకున్నాడు. లోకేష్‌ మూలంగా కాలం కలిసొసొచ్చేలా వుందని అనుకుంటున్నాడు. లోకేష్‌కు ప్రమోషన్‌ ఇవ్వడాన్ని సాకుగా చూపి పక్కకు తప్పుకోవాలన్నదే పవన్‌ ఆలోచన. అదే సమయంలో ప్రభుత్వం మీద విమర్శలు చేసి, లక్కి బాస్కర్‌ సినిమాలో బాస్కర్‌ తప్పుకొని సానుభూతిని పొందినట్లు పొందాలని చూస్తున్నారు. ఇదే పవన్‌ నయా రాజకీయం. ఎప్పుడైనా ఆయన వేరు కుంపటి ఖాయం. అందువల్ల ముందే తెలుగుదేశం తేరుకోవడం అవసరం.

అమెరికా దుశ్యర్యలపై ప్రధాని మోడీ నోరు విప్పాలి

బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థులపై అక్రమ వలసలు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు చేస్తున్న దుశ్యర్యలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ నోరువిప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మేరు సంఘం భవన్లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.విదేశీ ఉన్నత విద్య కోసం భారతదేశం అమెరికాతో స్నేహ సంబంధాలు కలిగి ఉందని, కానీ డోనాల్డ్ ట్రంపు వచ్చిన తరువాత అక్రమ వలసలు అంటూ విద్యార్థులకు సంకెళ్లు వేస్తూ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడటం సరైందికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ అమలు కోసం తీర్మానం పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన సరిగ్గా జరగలేదని,సర్వే నిష్పక్షపాతంగా దాపరికం ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ అనేక పోరాటాలు చేస్తే సాధించిన వర్గీకరణ అని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేటట్టు చూడాలని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేసే దిశగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో భూ పోరాటాలతో ఇళ్ల స్థలాల కోసం 8 ఏళ్లుగా సిపిఐ పార్టీ నర్సంపేటలో కొనసాగించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలులేని పేద ప్రజలు గుడిసెలు వేసుకున్న ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాల పట్టాలిచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పేద ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చి ఆదుకోవాలని తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ హామీ లాగా రాష్ట్ర ప్రభుత్వ హామీ మిగిలిపోవద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఔట్సోర్సింగ్ లాంటి వారికి బకాయిపడిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై నిర్లక్ష్యం వీడాలి

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తూ రెండో రాజధాని చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.నర్సంపేట పట్టణంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి తో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు.ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చేసేందుకు గిరిజన విశ్వవిద్యాలయం,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు.రెండో రాజధాని వరంగల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఒరగబెట్టిందని,వరంగల్ అభివృద్ధి కావాలంటే ప్రణాళిక సిద్ధం చేసి విడుదల చేయాలన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రాజెక్టులు పరిశ్రమలు రావాలని లేకుంటే సిపిఐ భవిష్యత్తులో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని వాటర్ బెల్ ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల పాఠశాలలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా మొట్టమొదటిసారిగా ఒడిస్సా రాష్ట్ర విద్యాశాఖ అన్ని పాఠశాలలో ఇకపై వాటర్ బెల్ కూడా ఉండాలని ఒరిస్సా విద్యాశాఖ నిర్ణయించింది విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల సమయంలో మూడుసార్లు వాటర్ బెల్ మోగించాలనిఉత్తర్వులు జారీ చేసింది తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా బడిలో నీటి గంటలు వినిపించు సాంప్రదాయానికి జిల్లెల్లస్కూల్ లో శ్రీకారం చుట్టింది అనారోగ్య సమస్యలకు పుల్ స్టాప్ పెట్టేందుకు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఉపాధ్యాయులు సాధారణంగా ఉపాధ్యాయులు వచ్చామా పాటలు చెప్పామా వెళ్ళామా అన్నట్టు ఉంటారు కానీ ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం అలా కాదు విద్యతో పాటు వారి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు వాటర్ తాగకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలియజేస్తూ అందుకే అలాంటి సమస్యలు చెక్కు పెట్టేందుకు వాటర్ తాగిస్తున్నామని పిల్లలు ఇంట్లో కంటే ఎక్కువ సమయం స్కూల్ లో గడుపుతుంటారు అందుకే వారితో ఎక్కువ వాటర్ తాగించాలని ఉద్దేశంతో స్కూల్లో వాటర్ బెల్ పెట్టామని ప్రతి విద్యార్థి ఇంటి నుంచి స్కూలుకి వచ్చి తిరిగి ఇంటికి చేరేవరకు కనీసం ఒక లీటర్ నీళ్లు తాగాలని వీరితోపాటు స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా నీరు తాగుతున్నారు ఈ ఉద్దేశంగా రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో వాటర్ బెల్స్ మోగించే విధంగా వారికి త్రాగునీరు అందించే విధంగా తగిన సదుపాయాలు చేపడతామని ఒడిశా విద్యాశాఖ నిర్ణయించిందని రాష్ట్రంలో విద్యాశాఖ అన్ని పాఠశాలలో ఇకపై వాటర్ బిల్ కూడా ఉంటుందని రాష్ట్రంలో పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జుంజుపల్లి నర్సింగ్ నియామకం

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లాకు చెందిన జుంజుపల్లి నర్సింగ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సంఘం విస్తరణ,బలోపేతం చేయడం కోసం సమర్థవంతమైన నాయకత్వం అవసరం అన్నారు.గతంలో విద్యార్థి, యువజన,ప్రజా పోరాటాల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర ను పోషించి,ఉమ్మడి రాష్ట్రానికి నాయకత్వం వహించిన నర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సమర్థవంతుడని కొనియాడారు.సంఘం బలోపేతం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాలను ఐక్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా పనిచేయాలని కోరారు.దాని కొరకు సంఘంలో ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన నర్సింగ్ మాట్లాడుతూ.. నా పట్ల విశ్వాసంతో సంఘం బలోపేతం కోసం బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.

రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

సామాజిక సమానత్వం కోసం పోరాడిన యోధురాలు రమాబాయి అంబేద్కర్*
అని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారు.
శుక్రవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అధ్యక్షతన రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు జరిగాయి .రామాబాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* విచ్చేసి మాట్లాడుతూ రమాబాయి సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయురాలు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ ఏబియస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోల్కొండ సురేష్ పాటల రచయిత సాంస్కృతిక కార్యదర్శి దాసారపు నరేష్ మండల నాయకులు కట్కూరి రాజేందర్ సరిగొమ్ముల రాజు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం:- జిల్లా కలెక్టర్ సత్య శారద.

 

తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు భీమా సౌకర్యం కల్పించడం అభినందనీయం.

వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద చేతుల మీదుగా జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా పత్రాల అందజేత

యూనియన్ జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా పత్రాలు అందజేత. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం

*_ టీ.ఎస్.జే.యు రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం గౌడ్.

వరంగల్, నేటిధాత్రి.

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో, యూనియన్ లో ఉన్న జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం గౌడ్ నారగోని అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా జర్నలిస్టులకు బీమా పత్రాలు అందజేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టులు వ్యక్తిగత జీవిత భీమా ఉండాలని, తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, నరేష్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు కందికొండ గంగరాజు, లింగబత్తిని కృష్ణ, బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, భాగ్యరాజ్, ఈద శ్రీనాథ్, అడుప అశోక్, నాగపురి నాగరాజు, అశోక్, అవినాష్, మోహన్, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ కార్మికులకు కూలి పెంచాలి

కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని శ్రామిక భవన్లో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య హాజరైనారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరోగమనంగా ఉందనీ, అది దేశ అభివృద్ధికి శాపంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు
కూలి పెంచాలి భూమి లేని వారికి ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇవ్వాలి అన్నారు. వృషలేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో భూమిని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పంచితే ఒక్కొక్క కుటుంబానికి 5 ఎకరాల భూమి వస్తుంది అని అన్నారు. భూమి పంచటం వలన ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన పని లేదన్నారు. భూమి పంచడం వలన ప్రజలు తమ అవసరాలు వారే తీర్చుకుంటారని అన్నారు. బడాబాబుల బొజ్జలను మరింతగా నింపేలా, మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్‌ ఉందన్నారు. ప్రమాదకరమైన విధానాలు అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహంగా ఉన్న ఈ బడ్జెట్‌ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా బరితెగించి ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించటం తప్ప మరో మార్గం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధానాల ఫలితంగానే దేశం తిరోగమిస్తున్నదని బడ్జెట్‌ కంటే ముందురోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎకనామిక్‌ సర్వేలో చాలా స్పష్టంగా బట్టబయలైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ఎకనామిక్‌ అడ్వైజర్‌గా ఉండే వ్యక్తి పర్యవేక్షణలో రూపొందిన రిపోర్టును సైతం పరిగణనలోకి తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ అభివృద్ధి వెనుకపట్టుపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తి అంచనాలు భిన్నంగా పడిపోయాయని చెప్పారు. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే నన్నారు. ఈ కాలంలో నిత్యజీవితావసరాల సరుకులను సాధారణ ప్రజలు పెద్దగా కొనుగోలు చేయలేదన్నారు. ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు. కాని ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఆహార సరుకుల ధరలు మరింత గా పెరిగాయని గుర్తు చేశారు. ఇది కష్టజీవుల జీవితాలను అతలాకుతలం చేసిన చర్య తప్ప మరేమిటని ప్రశ్నించారు. ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించకపోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్ల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం కాక మరేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్‌ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసగించిందని విమర్శించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 74 శాతం నుంచి 100 శాతం పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమేనని చెప్పారు. ఆర్ధిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పాలెం చిన్న రాజేందర్, జిల్లా నాయకులు గట్టు శంకర్, రాజలింగు, కోడం శంకర్, ఆర్ రమా, అశోక్, రాజమణి, వావిళ్ళ రమ, తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ కార్మికులకు కూలి పెంచాలి

కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని శ్రామిక భవన్లో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య హాజరైనారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరోగమనంగా ఉందనీ, అది దేశ అభివృద్ధికి శాపంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు
కూలి పెంచాలి భూమి లేని వారికి ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇవ్వాలి అన్నారు. వృషలేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో భూమిని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పంచితే ఒక్కొక్క కుటుంబానికి 5 ఎకరాల భూమి వస్తుంది అని అన్నారు. భూమి పంచటం వలన ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన పని లేదన్నారు. భూమి పంచడం వలన ప్రజలు తమ అవసరాలు వారే తీర్చుకుంటారని అన్నారు. బడాబాబుల బొజ్జలను మరింతగా నింపేలా, మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్‌ ఉందన్నారు. ప్రమాదకరమైన విధానాలు అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహంగా ఉన్న ఈ బడ్జెట్‌ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా బరితెగించి ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించటం తప్ప మరో మార్గం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధానాల ఫలితంగానే దేశం తిరోగమిస్తున్నదని బడ్జెట్‌ కంటే ముందురోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎకనామిక్‌ సర్వేలో చాలా స్పష్టంగా బట్టబయలైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ఎకనామిక్‌ అడ్వైజర్‌గా ఉండే వ్యక్తి పర్యవేక్షణలో రూపొందిన రిపోర్టును సైతం పరిగణనలోకి తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ అభివృద్ధి వెనుకపట్టుపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తి అంచనాలు భిన్నంగా పడిపోయాయని చెప్పారు. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే నన్నారు. ఈ కాలంలో నిత్యజీవితావసరాల సరుకులను సాధారణ ప్రజలు పెద్దగా కొనుగోలు చేయలేదన్నారు. ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు. కాని ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఆహార సరుకుల ధరలు మరింత గా పెరిగాయని గుర్తు చేశారు. ఇది కష్టజీవుల జీవితాలను అతలాకుతలం చేసిన చర్య తప్ప మరేమిటని ప్రశ్నించారు. ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించకపోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్ల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం కాక మరేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్‌ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసగించిందని విమర్శించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 74 శాతం నుంచి 100 శాతం పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమేనని చెప్పారు. ఆర్ధిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పాలెం చిన్న రాజేందర్, జిల్లా నాయకులు గట్టు శంకర్, రాజలింగు, కోడం శంకర్, ఆర్ రమా, అశోక్, రాజమణి, వావిళ్ళ రమ, తదితరులు పాల్గొన్నారు.

షష్టిపూర్తి మహోత్సవంలో మోకుదెబ్బ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేట చెందిన గౌడ పారిశ్రామిక సహకార సంఘం మాజీ కార్యదర్శి
బూరుగు సాంబయ్య గౌడ్ భాగ్యలక్ష్మి దంపతుల షష్టిపూర్తి 60వ వివాహ మహోత్సవ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నాయకులు హాజరైనారు.ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్ గౌడ్,జిల్లా కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,రాష్ట్ర నాయకుడు మద్దెల సాంబయ్య గౌడ్,గోపా నాయకుడు రామగోని సుధాకర్ గౌడ్, మోకుదెబ్బ పట్టణ కమిటీ కార్యదర్శి నాగరాజు గౌడ్,గౌడ సంఘ బొట్టు పెద్దమనిషి కందుకూరి వెంకటేశ్వర్లు గౌడ్ పాల్గొని షష్టిపూర్తి మహోత్సవ దంపతులను శాలువాలతో సన్మానం చేశారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్, నేటిధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న మహిళా పొదుపు సంఘాలకు శుక్రవారం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రూ.కోటి చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొదుపు సంఘాల ద్వారా
తీసుకున్న రుణాన్ని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి తోడ్పాటును ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్క మహిళ సంఘం సభ్యురాలు సమాజంతో ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. భూత్పూర్ మున్సిపాలిటీలో కొత్త ట్రాక్టర్లను ప్రారంభించారు.

చెన్నూరు వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే వివేక్

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా సందర్శించారు.నియోజకవర్గ పరిధిలో డయోరియా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రోజున చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించారు. రోగులను పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకొని, వారికి అందుతున్న వైద్యం పట్ల ఆరా తీశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటిస్తూ, మెరుగైన వైద్య సేవలను అందించాలని,గ్రామీణ ప్రజలకు వ్యాధి లక్షణాల గురించి,తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా వివరించాలని సూచించారు.దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేరోగులకు సరైన సౌకర్యాలతోపాటు వైద్యం అందించాలని సూచించారు.వైద్యులు,సిబ్బంది,విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి,ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.

వ్యాపారుల కబంధహస్తాల్లో ఎనుమాముల మార్కెట్

కనీస ధర రాక నిండా మునుగుతున్న మిర్చి రైతులు

కేంద్ర నూతన మార్కెటింగ్ చట్టం అమలయితే రైతుల పరిస్థితి అధోగతే

మిర్చికి క్వింటా కనీస మద్దతు ధర 25 వేల రూపాయలు ప్రకటించాలి

మార్క్ ఫెడ్, నాఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి

రైతుల పంటలను దోచుకునే మార్కెట్ దోపిడిని అరికట్టాలి

ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ సోమిడి శ్రీనివాస్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను మార్కెట్ మాయాజాలంలో దోపిడి చేస్తూ నిండా ముంచుతున్నారని ఆరోపించారు. వ్యాపారుల కబంధహస్తాల్లో మార్కెట్లు నడుస్తున్నాయని వారికి మార్కెట్ అధికారులు అండగా నిలుస్తున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మండిపడ్డారు.
శుక్రవారం అఖిలభారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్), తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి రైతుల పంటల కొనుగోలు పరిస్థితి, కనీస వసతులు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్,సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏనుమాముల మార్కెట్ రైతుల పంటల దోపిడీకి అడ్డగా మారి రైతుల పంటలను చేస్తున్నారని వ్యాపారుల కనుసనల్లో మార్కెట్ వ్యవస్థ నడుస్తున్నదని వ్యాపారులందరు సిండికేటయ్యి వారి లాభాల కోసం పంటల ధరలను నిర్ణయిస్తూ జెండా పాట పెడుతున్నారని ఆరోపించారు.వాటిల్లో కనీసం ఆ జెండా పాట అయినా రైతులందరికీ ఉత్పత్తులకు వర్తింప చేయకుండా కుంటిసాకులతో మోసం చేస్తున్నారని తామే మార్కెట్ వ్యవస్థ అన్నట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వారికి మార్కెటింగ్ అధికారులు అండగా నిలుస్తున్నారని రైతు సంఘాలు రైతులకు అండగా నిలవకుండా మార్కెట్ సందర్శించకుండా అనేక ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో మిర్చి రైతులు ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండించి మార్కెట్కు తీసుకువస్తే అంతర్జాతీయంగా మిర్చి పంటకు డిమాండ్ ఉన్న ఎనుమాముల మార్కెట్లో మాత్రం కేవలం క్వింటాకు 13,400 రూపాయల జెండా పాట పాడి ఆచరణలో ఎనిమిది వేలకు మించి కొనుగోలు చేయడంలేదని తెలిపారు. దీంతో రైతులకు కూలీలకు సరిపడా డబ్బులు సైతం వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని అమలు చేస్తే రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మార్క్ ఫెడ్,నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయించి కనీస మద్దతు ధర కింటాకు 25వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. మార్కెట్లో కనీస వసతుల సదుపాయాలను మెరుగుపరచాలని మార్కెట్ దోపిడిని అరికట్టి శాస్త్రీయ పద్ధతిలో పంటల ధరల నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక మార్కెట్ కార్యదర్శి పోలేపాక నిర్మలకు పలు డిమాండ్ లతో కూడిన మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్, సహాయ కార్యదర్శి గోనె రామచందర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓదెల రాజన్న,జిల్లా కోశాధికారి ఊరటి హంసల్ రెడ్డి, ఏఐకేఎఫ్ జిల్లా నాయకులు ఐతమ్ నాగేష్, జక్కుల అశోక్జి అప్పనపురి నరసయ్య, మాలి ప్రభాకర్, పరిమళ గోవర్ధన్, రాజు, ఊకంటి గోపాల్ రెడ్డి, లడె మోహన్ రావు, బొల్లు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మైనంపల్లి హనుమంతరావు ను ఆహ్వానించిన డాక్టర్ మోహన్ నాయక్

నిజాంపేట, నేటి ధాత్రి

లీలా గ్రూప్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్ శుక్రవారం మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలిసి రామాయంపేట లో నిర్వహించే నల్ల పోచమ్మ బోనాలు ద్వితీయ వార్షికోత్సవానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. ఈనెల 16న తన క్షేత్రంలో గల నల్ల పోచమ్మ బోనాల పండుగ చేయడం జరుగుతుందని అందుకు మైనంపల్లి హనుమంతరావు తప్పకుండా హాజరవుతారని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ తాండ మాలోతు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version