అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ బేనర్‌పై కంకణాల ప్రవీణ్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రానికి…
అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ బేనర్‌పై కంకణాల ప్రవీణ్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రానికి ‘లవ్ జాతర’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్‌మెంట్‌పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సిద్ధార్థ్ డీఓపీగా వ్యవహరిస్తున్నారు.
ఒక పథకం ప్రకారం సన్ నెక్స్ట్ ఓటీటీలోనూ అదరగొడుతోంది…
ఒక పథకం ప్రకారం జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది.
పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ (Sairam shankar) కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’ (Oka Pathakam Prakaram) . వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్‌తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తామని యూనిట్ చేసిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. థియేటర్‌కు ఒకరు చొప్పున 50 థియేటర్ల నుంచి 50 మంది విజేతలను ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది. మీడియా ప్రతినిధులకు వేసిన షోతో పాటు మిగతా థియేటర్లలో విజేతలకు డబ్బులు అందజేసింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో చక్కటి విజయాన్ని అందుకున్న ‘ఒక పథకం ప్రకారం’ జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో సాయిరామ్ శంకర్ చక్కటి కమ్ బ్యాక్ ఇచ్చారని ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో హీరో సాయిరామ్ శంకర్ నటించారు. విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యల మీద అతని మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. నిజంగా ఆ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేదంటే వాటి వెనుక వేరొకరు ఉన్నారా? అనేది సినిమా. (Sun next ott)
సినిమా థియేటర్లు
నిర్మాతలు గార్లపాటి రమేష్, వినోద్ విజయన్ మాట్లాడుతూ ”మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. ఓటీటీ రిలీజ్ ప్లానింగ్, ప్రొసీజర్స్ విషయంలో మాకు సహాయం చేసిన సన్ నెక్స్ట్ కంటెంట్ హెడ్ శశి కిరణ్ నారాయణ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా దర్శక నిర్మాణంలో నాకు అండగా నిలబడిన మా హీరో సాయిరామ్ శంకర్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ థాంక్స్” అని చెప్పారు.
ఇలా ముగించారేంటి స్క్విడ్ గేమ్ 3 ఫైనల్ సీజన్ రివ్యూ
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురు చూసిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి హాడావుడి చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game Season 3) జూన్ 27 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి హాడావుడి చేస్తోంది. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి సంచలన విజయం సాధించిన ఈ సీరిస్ ప్రతీ సారి ప్రేక్షకులకు అదిరిపోయే థ్రిల్ అందించింది లీ జంగ్ జే (Lee Jung-jae), పార్క్ హే సూ, హోయాన్ జంగ్లతో పాటు యిమ్ సి-వాన్ (Im Si-wan), కాంగ్ హా-న్యూల్, పార్క్ గ్యు-యంగ్, లీ జిన్ కీలక పాత్రల్లో నటించారు. హ్వాంగ్ డాంగ్-హ్యూక్ (Hwang Dong-hyuk) దర్శకత్వం వహించాడు.. మరి కొత్తగా వచ్చిన ఫైనల్ సీజన్ ఎలా ఉందో చూద్దాం.
మొదటి సీజన్లో.. స్క్విడ్ గేమ్ (Squid Game) గెలిచిన 456 నంబర్ ప్లేయర్ తిరిగి ఆ గేమ్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని, అందులోని ప్లేయర్స్ ను రక్షించాలని , అక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ముందస్తుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గేమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడ కొంతమందితో టీమ్‌గా ఏర్పడి గేమ్ నిర్వాహకులపై ఎదురు దాడికి దిగుతాడు. కానీ వాళ్లలో చాలామంది చనిపోగా 456 నంబర్ ప్లేయర్ పట్టుబడి మళ్లీ గేమ్ ఆడాల్సిన పరిస్థితితో రెండో సీజన్ ముగించారు. ఇప్పుడీ ఈ మూడో సీజన్ మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో ఒక్కొక్కటి గంట నిడివితో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
అయితే.. తిరిగి గేమ్‌లోకి వచ్చిన హీరో నా పొరపాటు వళ్లే అంతమంది చనిపోయారనే బాధలో ఉంటూ అక్కడున్న వాళ్లకు దూరంగా ఉంటుంటాడు. మరోవైపు అక్కడి గార్డ్స్ లో ఒకరు గాయపడిన ఓ ప్లేయర్‌ను చనిపోకుండా రక్షించి అక్కడి లీడర్‌పై దాడికి సిద్ధమౌతుంది. మరోవైపు మేనేజ్మెంట్ చివరగా మూడు గేమ్స్ స్టార్ట్ చేస్తుంది. కాగా అప్పటికే గర్బవతిగా ఉన్న నం 222 బిడ్డకు జన్మనిస్తుంది. అదేవిధంగా అప్పటివరకు కలిసి ఉన్న తల్లీ కొడుకుల జంట విడిపోయి ఆడాల్సి రావడం, కొడుకు చనిపోవడం జరుగుతాయి. అంతకుముందు జరిగిన ఘటనలో నీ తప్పేం లేదని ఇకపై నం 222, తన బిడ్డను రక్షించే బాధ్యత తీసుకోవాలని వృద్ద తల్లి నిరుత్సాహంగా ఉన్న హీరోకు చెప్పి సూసైడ్ చేసుకుంటుంది.
ఇదిలాఉంటే బయటి నుంచి ఈ గేమ్‌ను కండక్ట్ చేసేందుకు డబ్బులు చెల్లించే పలువురు వీఐపీలు అక్కడకు స్వయంగా వచ్చి అక్కడి గేమ్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటు, ఆపై ఆటను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ బాధ్యతను హీరోకు ఇచ్చి తల్లి సైతం ఆటలో చనిపోతుంది. దీంతో తల్లి స్థానంలో ఆ పాపను నం222గా పరిగణిస్తూ ఆ ఆటలో ప్లేయర్‌గా లెక్కేస్తారు. దీంతో అక్కడి ప్టేయర్స్ ఎలాగైనా ఆ పాపను చంపితే ఆ భాగం మాకే వస్తుందనే ఆశలో ఆ పాపను టార్గెట్ చేయడం హీరో ఒంటరిగా ఆ బేబీని రక్షిస్తూ ఉంటాడు. రెండో గేమ్‌కు వచ్చేసరికి బేబీతో కలిపి కేవలం 9 మంది మాత్రమే మిగులుతారు. అందులో సెల్పీష్ అయిన పాప తండ్రి కూడా ఉంటాడు. ఇక చివరి ఫైనల్ గేమ్‌కు వచ్చేసరికి హీరో, పాప, ఆ పాప తండ్రి ముగ్గురు మాత్రమే బరిలో ఉంటారు.
ఈ నేపథ్యంలో ఆ ముగ్గురిలో ఎవరు బతికారు, ఫ్రైజ్‌మనీ ఎవరికీ వచ్చింది, పోలీసులు ఆ గేమ్ జరిగే ప్రాంతాన్ని కనుగొనగలిగారా లేదా తిరగబడ్డ ఆ గార్డ్ ఏం చేసింది అనే ఆసక్తికర కథకథనాలతో ఈ సిరీస్ సాగుతుంది. అయితే మదటి రెండు సీజనల కన్నా ఈ ఫైనల్ సీజన్లో ఎమోషన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు. క్లైమాక్స్ ఎపిసోడ్ చాలామందికి అనేక రకాల జవాబులు ఇస్తుంది. మనషులు సొంత వారైనా ఏ క్షణానికి ఎలా ఉంటారనే పాయింట్‌ను మరోసారి బలంగా చూయించారు. అక్కడక్కడ లాగ్ అనిపించినా ఇప్పుడీ ఫైనల్ సీజన్ శుక్రవారం (జూన్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో కొరియన్ భాషతో పాటు తెలుగు ఇతర భాషల్లో అందదుబాటులో ఉంది. ఎక్కడా ఎలాంటి అశ్లీల సన్నివేశాలు లేవు, ఎక్కడో ఓ చోట రెండు మూడు భూతులు వస్తాయి తప్పితే ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయవచ్చు. ముగింపులో ఇచ్చిన హింట్స్‌తో ఈ సిరీస్‌కు ముగింపు లేతు కంటిన్యూ అవుందనేలా ఉండడం గమనార్హం.
ఇదేక్కడి టీజర్‌రా ఇంత షాకింగ్‌గా ఉంది బిగ్‌బాస్ ఫృథ్వీ అదరగొట్టావ్…
తెలుగు బిగ్‌బాస్8 ఫేమ్ ఫృథ్వీ షెట్టి హీరోగా తెలుగు కన్నడ భాషల్లో తెరకెక్కిన చిత్రం అనంతకాలం
తెలుగు బిగ్‌బాస్8 ఫేమ్ ఫృథ్వీ షెట్టి (Prithviraj Shetty) హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన చిత్రం అనంతకాలం (Anantha Kaalam). వాలియంట్ విజన్ క్రియేషన్స్ (Valiant Vision Creations) నిర్మించిన.
ఈ సినిమాకు విజయ్ మంజునాథ్ (Vijay Manjunath) దర్శకత్వం వహించాడు. తాజాగా శనివారం ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూస్తే ప్రతి ఒక్కరికీ గూస్బంప్స్ వచ్చేలా ఉంది.
హీరో ఓ సిటీలో మిడ్నైట్ ఓ ప్రాంతంలో సిగరేట్ తాగుతూ ఉండగా ఓ వింత ఆకారంలో ఉన్న మనిషఙ బెలూన్ తీసుకోండి సార్ అంటూ గంభీరంగా చెప్పడం.. ఆపై ఈ ప్రపంచం బయట ఉన్న జనాలను తనలో బందీ చేసుకుంటే నువ్వు మాత్రం ఓ చోట ఇరుక్కుంటావ్..
దానిని నుంచి బయటకు వచ్చినా నువ్వు మళ్లీ మళ్లీ అదే చోటకు వెళ్లి ఇరుక్కుంటావ్ నువ్వు చచ్చే రోజులు దగ్గర పడ్డాయ్ అంటూ చెప్పి వెళుతుంటాడు.
అప్పుడేగా సడన్‌గా ఓ వాహానం వచ్చి గుద్దడంతో హీరోను రోడ్డుపై పడిపోయి చావుతో కొట్టు మిట్టాడుతుంటాడు. అప్పుడు బెలూన్ వ్యక్తి వచ్చి ఆ బాడీ పక్కనే పడుకుని ఇక కథ మొదలు పెడదామా అంటుండగానే…
హీరో చేతికి ఉన్న కంకణం ప్రకాశంతంగా మారి హీరో లేచి నిలబడి.. నువ్వు కాదురా నేను మొదలు పెడతా కథ అని షాక్ ఇస్తాడు. అదే సమయంలో ఓ భారీ వాహానం అ బెలూన్ వ్యక్తిని రోడ్డుపై ఢీ కొట్టి వెళ్లి పోతుంది.
ఇలా టీజర్ అద్యంతం ఆసక్తి కరంగా కట్ చేశారు కాగా ఈ అనంతకాలం (Anantha Kaalam) సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నట్లు సమాచారం.
ప్రముఖ నటుడు విజయ్ సేతు పతి కుమారుడు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
సినిమా టైమింగ్స్ఏ విషయంలోనైనా తన కుమారుడు సూర్య స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలన్నదే తన కోరిక అని ప్రముఖ నటుడు విజయ్ సేతు పతి (Vijay Sethupathi) అన్నారు.
ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫోనిక్స్ (Phoenix ). సూర్య విజయ్ సేతుపతి (Surya Sethupathi), అభినక్షత్ర, వర్ష హీరో, హీరోయిన్లుగా నటిస్తోండగా వరలక్ష్మి కరణ్ కుమార్, సంపత్ ప్రధాన పాత్రలను పోషించగా శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు.
ఇలీవల జరిగిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకకు విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్ రిలీజ్ చేసి మాట్లాడుతూ.
‘దర్శకుడు ఆనల్ అరసుకు ప్రత్యేక దన్యవాదాలు. 2019లో ఈ కథ చెప్పినప్పటికీ ఆ సమయంలో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు వీలుపడలేదు. ఆ తర్వాత ఈ స్టోరీలో నటిస్తే ఎలా ఉంటుందని సూర్వ అడిగాడు. ఒక వైపు సంతోషం, మరోవైపు భయం.
ఏ నిర్ణయమైన నీవే స్వతంత్రంగా తీసుకోవాలని చెప్పా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చిస్తా కానీ, సూర్య విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని సూచించా.
నా బిడ్డకు ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. నా కంటే నా భార్యకు సంతోషంగా ఉంది’ అన్నారు.
సినిమా టైమింగ్స్
హీరో సూర్య మాట్లాడుతూ.. ‘ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు దన్యవాదాలు. కొన్ని సందర్యాల్లో నిరుత్సాహంగా ఉన్న సమయంలో చిత్ర యూనిట్ ఎంతగానో ప్రోతసహించారు.
సీనియర్ నటి దేవదర్శిని సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ అమ్మలాంటిదే కూడా నామ వంటివారు.
దర్శకుడు ఆనల్ అరను అనేక విషయాలు నేర్పించారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నా’ అన్నాను. దర్శకుడు ఆనల్ అరను మాట్లాడుతూ.. ‘దాదాపు 200కు పైగా చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేశా. కానీ దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం ప్రతి ఒక్కరూ అశీర్వదించాలని కోరాడు.
ఇటాలియన్ మోడల్లా కనిపిస్తావు అన్నారాయన అదే నా ధైర్యం…
ధనుష్ .. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. రఘువరన్ బీటెక్‌తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ తమిళస్టార్… శేఖర్ కమ్ముల ‘కుబేర’లో మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు.
ధనుష్(Dhanush)… పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. ‘రఘువరన్ బీటెక్’తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ తమిళస్టార్… శేఖర్ కమ్ముల ‘కుబేర’లో (kubera) మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు. ఇటీవల ధనుష్ పంచుకున్న కొన్ని ఆసక్తికర కబుర్లివి…
అమ్మాయి కోసమే ట్యూషన్లో చేరా… మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే నాకు అర్థమవుతోంది. నేను చదువుకోవాల్సిన సమయంలో తెగ అల్లరి చేసేవాణ్ని. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసమే ట్యూషన్లో చేరా.
ట్యూషన్ టీచర్ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేకపోయేవాణ్ని. కొన్ని రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్ మానేశా. కానీ స్నేహితురాలిని కలుసుకునేందుకు బయట వేచి చూసేవాణ్ని. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్‌తో సౌండ్ చేసేవాణ్ని. దాంతో టీచర్…
‘మీరంతా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉంటారు. కానీ బయట బైక్ మీద ఉన్నవాడు మాత్రం పెద్దయ్యాక వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందే’ అని అన్నారట. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… అప్పట్లో చదువు ఎందుకు అశ్రద్ధ చేశానా? అని బాధపడుతుంటా.
అందుకే ఆ పేరు… నేను, అనిరుధ్ (సంగీత దర్శకుడు) కలసి ‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’ అనే హాలీవుడ్ చిత్రం చూశాం. ఆ సినిమాలో అందరూ ‘వండర్‌బార్’ అనే పదం పదేపదే వాడుతుంటారు. నిజానికి అదొక జర్మన్ పదం.
ఎందుకోగానీ అది మైండ్‌లో బాగా రిజిస్టరైపోయింది. కట్‌చేస్తే కొన్ని రోజుల తర్వాత నేను ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నా. రెండో ఆలోచన లేకుండా నా నిర్మాణ సంస్థకు ‘వండర్‌బార్ ఫిల్మ్స్’ అని పేరు పెట్టా.
సినిమా టైమింగ్స్
ఆయన ప్రేరణతో… కెరీర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ‘హీరో మెటీరియల్ కాదు. లుక్స్ బాగాలేవు’ అని విమర్శలు గుప్పించారు. దాంతో ఆత్మన్యూనత భావన కలిగింది. సరిగ్గా అప్పుడే దర్శకుడు బాలు మహేంద్ర…
‘నువ్వు ఇటాలియన్ మోడల్లా కనిపిస్తావు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు’ అని చెప్పారు. ఆ మాటలు నన్ను ప్రేరేపించాయి.
జోక్ చేస్తున్నారనుకున్నా.. ‘కుబేర’ తమిళ్లో నాకు 51వ సినిమా. తెలుగులో రెండో స్ట్రయిట్ చిత్రం. ‘సార్’ కన్నా ముందే నాకు శేఖర్ కమ్ముల ఈ కథ చెప్పారు. ఈ సినిమా కోసం నన్ను శేఖర్ సన్నబడమని చెప్పినప్పుడు మొదట నమ్మలేదు.
‘నిజంగానే చెబుతున్నారా? లేక జోక్ చేస్తున్నారా’ అని అడిగా. ఎందుకంటే నా పర్సనాలిటీ చూసి, నన్ను సన్నబడమని చెప్పిన డైరెక్టర్ ఇప్పటిదాకా లేరు. మొత్తానికి సన్నబడి యాచకుడిగా నటించా. డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయానంతే.
7 గంటలపాటు డంప్‌యార్డ్‌లో మాస్క్ లేకుండా నటించా. నా మనసుకు చాలా దగ్గరైన చిత్రమిది.
సినిమా టైమింగ్స్
చెఫ్ అయ్యేవాడిని… ఒకసారి మా నాన్నగారికి సరదాగా ఆమ్లెట్ వేసి పెట్టా. అది ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత రోజు వేరే వంటకం చేసి పెట్టా. దాన్ని కూడా ఆయన చాలా ఆస్వాదించారు. దాంతో నాకు చెఫ్ అవ్వాలనే కోరిక కలిగింది.
వంట చేసి, వడ్డించేటప్పుడు ఎదుటివారి కళ్లలో కనిపించే ఆనందం చాలా సంతృప్తినిస్తుంది. ఇప్పటికీ మా ఇంటికి ఎవరైనా వస్తే, నేను నా స్వహస్తాలతో వారికి వడ్డిస్తుంటా. హీరోని కాకపోయుంటే కచ్చితంగా చెఫ్ అయ్యేవాడిని.
*-PRGI కఠిన ఆదేశాలు – ఊహాజనిత వార్తలపై చర్యలు తప్పవు…*
నేటిధాత్రి : న్యూఢిల్లీ, జూన్ 28
* దేశవ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో RNI (రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా) నమోదు లేకుండా నడుస్తున్న పత్రికలపై కేంద్ర ప్రభుత్వం గట్టి వేటు వేయనుంది. ఆధారాలు లేని, ఊహాజనిత వార్తలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (PRGI) రాష్ట్రాల సమాచార పౌర సంబంధాల శాఖలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
* TEL నెంబర్ లేకుండా, నిర్ధారణలేని కథనాలు ప్రచురిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఇకపై RNI లేని పత్రికల వార్తలను అధికారికంగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి పత్రిక భాషను ఉపయోగించాలో, ఎలా వ్యవహరించాలో స్పష్టమైన మార్గదర్శకాలను కూడా PRGI విడుదల చేసింది.
* ఈ చర్యల వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా సీనియర్ పాత్రికేయులు ఎస్. నరహరి నాగేశ్వర ప్రసాద్ చేసిన ఫిర్యాదు కీలకంగా మారింది. సోషల్ మీడియాలో అనధికారికంగా ప్రచారం అవుతున్న PDF పత్రికలు ఫేక్ న్యూస్‌కు కేంద్రబిందువుగా మారాయని ఆయన పేర్కొన్నారు.
* దీనిపై లోతుగా పరిశీలించిన PRGI, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది. త్వరలో జిల్లావారీగా పత్రికలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని, జిల్లా పౌర సంబంధాల అధికారి (DPRO) లకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
* అక్రమంగా నడుస్తున్న పత్రికల జాబితాను సేకరించి రాష్ట్ర సమాచార శాఖకు అందించాలనే ఆదేశాలు జిల్లాల DPRO లకు త్వరలో చేరనున్నాయి. భావప్రకటన స్వేచ్ఛను కాపాడడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
-అన్ని జిల్లాలకు అందిన 36 వేల యూనిట్లలో కార్లెన్ని?
-వేలాది వాహనాలు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి!
-దళిత బంధును నీరు గార్చిన వారెవరు?
-దళిత బండ్లు ఆంద్రాలో ఎలా తిరుగుతున్నాయి!
-దళిత బండ్లు అమ్మడానికి, కొనడానికి వీలు లేదు!
-లబ్ధి దారుల చేతుల్లోకి రాకుండానే రాష్ట్రం ఎలా దాటి పోయాయి?
-దళిత బంధు కార్లు ప్రతి ఏటా ఫిట్ నెస్‌కు రావాలి!
-ఆర్టీవో అధికారులు ఏం చేస్తున్నారు!
-దళిత బంధు అందినా దళితులు ఎందుకు పేదలుగానే మిగిలారు?
-దళిత బంధు పక్కదారి పట్టకుండా దళిత అధికారులకు బాధ్యతలు అప్పగించారు!
-అయినా దళిత బంధు కార్లు ఎలా మాయమయ్యాయి!
-దళితులను మోసం చేసిన వారిలో దళిత అధికారుల పాత్ర ఎంత?
-దళితులను మోసం చేసిన కార్ల డీలర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు!
-కారు కళ్లారా చూడకుండానే వదులుకున్న దళితులెందరు?
-కార్ల ముందు ఫోటోలు దిగినా చేతికి రాని వాళ్లు ఎంత మంది?
-ప్రతి దళిత బంధు కారుపై పథకం స్టిక్కర్లు వుండాలి.
-తెలంగాణ దళిత బంధు కార్లు తెలంగాణలోనే వుండాలి.
-ఆంద్రాలో మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు!
-కార్లు రాష్ట్రం దాటించిన ఆర్టీఐ అధికారులెవరు?
-దళిత బంధు మొత్తానికి నీరు గార్చిందెవరు?
-వేలాది కోట్ల రూపాయల ఖర్చు చేసినా లక్ష్యం నెరవేరలేదెందుకు?
-దళితులను తప్పు దోవ పట్టించిందెవరు?
-అమాయక దళితులను నిండా ముంచిందెవరు?
-దళిత బంధు యూనిట్లు 47 రకాలు!
-అందులో కార్లు ఒక్క అంశమే!
-మిగతా యూనిట్లపై వరుస కథనాలు మీ నేటిధాత్రి లో..
…………………………
దళితులకు దక్కకుండా పోయిన యూనిట్లు రికవరీ చేయండి?
-మోసపోయిన దళితులకు మళ్ళీ ఆ యూనిట్లు అప్పగించండి
-దళితుల జీవితాలలో వెలుగులు నింపండి
-ఇందిరమ్మ రాజ్యానికి అసలైన నిర్వచనం చెప్పండి
-దళితుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని మరోసారి నిరూపించండి
-దళిత బంధును మింగిన రాబందుల నుంచి కక్కించండి
-దళితుల మేలు కాంగ్రెస్ వల్లనే సాధ్యమని చాటి చెప్పండి
హైదరాబాద్,నేటిధాత్రి:
దళిత బంధు పదకంలో మద్య దళారులు చేరి, రాబంధులై దోచుకున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ సొమ్ము చేరకుండా చేశారు. వారికి అందాల్సిన యూనిట్లను అందకుండా, ఎంతో కొంత చేతిలో పెట్టి వాటిని తీసుకెళ్లారు. అలాంటి దళిత బంధు పధకంలో యువకులు అందజేసిన కార్లు ఎక్కుడ. ఆ రెండు సంవత్సరాల కాలంలో దళితులకు అందిన కార్లు ఎన్ని? అందకుండానే దళారుల చేతుల్లోకి వెళ్లినబండ్లు ఎన్ని? తెలంగాణలోని అన్ని జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుతోపాటు, అమలు జరిగిన ప్రాంతాల్లో అందిన 36వేల యూనిట్లు ఎక్కడున్నాయి? దళితుల చేతుల్లో ఎన్ని వున్నాయి? దళితుల బలహీనతలను ఆసరాగా చేసుకొని దళారులు తీసుకెళ్లినవి ఎన్ని వున్నాయి? ఈ యూనిట్లలో కార్లు ఎన్ని మంజూరయ్యాయి? డీలర్లనుంచి ఎన్ని కార్లు రోడ్లమీదకు వచ్చాయి? ఎన్ని ఇప్పుడు వారి చేతుల్లో వున్నాయి? ఎన్ని కార్లు దళారులు తీసుకెళ్లారన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ఎందుకంటే దళితులకు దళిత బందు పధకం కింద ఇచ్చిన ఏ యూనిట్‌నైనా సరే అమ్ముకోవడానికి వీలులేదు. ఆ యూనిట్లను ఎవరూ కొనుగోలు చేయకూడదు. ఈ సంగతి తెలిసినా ఎలా కొనుక్కున్నారు. ఎలా తీసుకెళ్లిపోయారు? ఇంకా విచిత్రమేమిటంటే లబ్ధిదారులు కనీసం చూడకుండా వెళ్లిపోయిన కార్లు వేలల్లో వున్నాయి. లబ్దిదారులు చేతుల్లోకి రాకుండానే వెళ్లిపోయినకార్లు వేలల్లో వున్నాయి. ఇలా దళిత బందు పేరు మీద ఇచ్చిన కార్లు కేవలం టాక్సి ప్లేట్‌తో నడుపుకోవాల్సి వుంటుంది. అలాంటి వాహానాలు ప్రతి ఏటా ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి ఫిట్ నెస్ చెక్ చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం ఆ కార్ల ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన అవసరం వుంటుంది. మరి ఆ వాహనాలు ప్రతి ఏటా వస్తున్నాయా? వాటిని చెక్ చేస్తున్నారా? మళ్లీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారా? అన్నది కూడా తెలియాల్సిన వుంది. ఎందుకంటే ఈ కార్లను పొరుగు రాష్ట్రమమైన ఆంద్ర ప్రదేశ్ నుంచి దళారులు వచ్చిన కొనుగోలు చేసుకొని పోయినట్లు సమాచారం వుంది. ఆ కార్లకు దగ్గరుండి ఆర్టీఏ అదికారులు అప్పగించినట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ కూడా పెద్దఎత్తున గోల్ మాల్ జరిగింది. ముడుపులు తీసుకొని, ప్రభుత్వానికి చెందిన దళిత బంధు కార్లను ఆర్టీయే అదికారులు దగ్గరుండి అప్పగించినట్లు తెలుస్తోంది. సహజంగా ఏ వాహనానికైనా నెంబర్ రావాలంటే వారం సమయం పడుతుంది. కాని దళిత బంధు వాహనాలకు ఒక రోజులోనే నెంబర్ అందించారు. ఇది కూడా దళారులకు బాగా కలిసి వచ్చింది. వారికి సహకరించేందుకు ఆర్టీయే అదికారులకు వెసులుబాటు కల్గింది. అలా ఆర్టీయే అదికారుల కనుసన్నల్లో రాష్ట్రం దాటిన కార్లుకు ఏపిలో కూడా మళ్లీ కొత్త నెంబర్లు జారీ అయినట్లు కూడా చెబుతున్నారు. నిజానికి ఆ కార్లకు ఖచ్చితంగా దళిత బంధు స్టిక్కర్లు వేయాలి. అవి శాశ్వతంగా వుండేలా చూసుకోవాలి. కాని ఎలాంటి స్టిక్కర్లు లేకుండా వాహనాలు అందించి, దళారులకు ఆర్టీయే అదికారులు సహకరించినట్లు అర్దమౌతోంది. అలా దళిత యువతకు అందాల్సిన కార్లన్నీ వెళ్లిపోయాయి. ఇక్కడ జరిగిన మోసం కూడా కొన్ని వేల కోట్లలో జరిగింది. నిజానికి ఏక కాలంలో కొన్ని వేల కార్లు తయారు చేయడం ఏ కంపనీకి సాద్యం కాదు. ఆ సంగతి తెలిసి కూడా కార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దాంతో లబ్ధిదారులను పిలిచి, కార్ల కంపనీలకు చెందిన డీలర్లు కార్లు వచ్చేందుకు చాలా సమయం పడుతుందని చెప్పి, కొంత చేతిలో పెట్టి, కారు తీసుకున్నట్లు కూడా సంతకాలు చేసుకున్నారు. అలా కూడా దళిత యువతను మోసం చేశారు. ప్రభుత్వం నుంచి చెక్కులునేరుగా డీలర్లకు వెళ్లడం కూడా వారికి కలిసి వచ్చింది. కార్లు అందే అవకాశం వున్న యువత వద్దకు వెళ్లి కారు మెంటేనెన్స్ అంత సులభం కాదు. డ్రైవర్‌ను పెట్టుకొని, నెల నెల సర్వీసింగులు చేయించుకుంటూ వుండడం అందరి వల్ల సాధ్యం కాదు. సరైన కిరాయిలు దొరక్కపోయినా ప్రతి నెల డ్రైవర్‌కు జీతాలు ఇవ్వాల్సి వుంటుందని భయపెట్టి, కార్లను కొనుగోలు చేసుకొని వెళ్లిపోయిన వారున్నారు. ఇలా కార్ల లబ్దిదారులని అందరూ కలిసి నిండా ముంచేశారు. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే దళితుల అభ్యున్నతి కోసం అమలు చేసిన దళిత బంధు పధకం దళిత అధికారులైతే పకడ్బందీగా అమలు చేస్తారని అప్పటి ప్రభుత్వం నమ్మింది. దళిత బందు అమలు బాద్యత రాష్ట్ర స్దాయి నుంచి జిల్లా స్దాయి వరకు దళిత అదికారులకే బాద్యతలు అప్పగించింది. అయినా ఈ పథకం పక్కదారి పట్టింది. దళితులను దళిత ఉద్యోగులే మోసం చేశారన్నది స్పష్టమైంది. పైగా దళిత బంధు పథకం పక్కదారి పడుతున్న దానిపై అప్పట్లో నేటిధాత్రి కధనాలు రాస్తే ఆ అధికారులు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేఉస్తామని బెదిరించిన సందర్భాలున్నాయి. అంటే దళిత బంధు సక్రమంగా అమలు చేసి, దళితులను లక్షాధికారులను చేయాలని నేటిధాత్రి వార్తలు రాస్తే దళిత అదికారులకు ఇబ్బంది కలిగింది. దళితులకు ఏ మాత్ర నష్టం జరగకుండా చూసుకోవాల్సిన దళిత ఉద్యోగులే అప్పుడు మోసం చేశారన్న ఆరోపణలు కూడా అనేకం వున్నాయి. దళిత బందు పథకం పక్కాగా అమలు చేయాలని దళిత అదికారులకు బాద్యతలు అప్పగించినా కార్లు ఎలా మాయమయ్యాయి? దళిత బంధు పథకంలో ఏ యూనిట్ ఇచ్చినా, ప్రతి నెల వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారుల మీద వుంది. మరి ఆ పని అధికారులు చేస్తున్నారా? దళితుల వద్ద లేకుండాపోయిన కార్లు వివరాలు సేకరించారా? ఉన్నతాదికారులకు పంపించారా? ప్రభుత్వం మారిపోయిందని చేతులు దులుకున్నారా? ఫైళ్లు పక్కన పడేశారా? అన్నది కూడా తెలియాల్సి వుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ ఫ్రభుత్వం వచ్చినా, వాటి పర్యవేక్షణ వద్దని చెప్పలేదు. కాని అదికారులు మాత్రం వాటి సంగతి వదిలేశారు. దళితులను మోసం చేసిన వారిలో వున్న దళిత అదికారులపాత్ర కూడా ఎంత అన్నది తేలాల్సి వుంది. దళితులను మోసం చేసిన కార్ల డీలర్లను గుర్తించారా? వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నం అప్పుడైతే జరగలేదు. దళిత బంధు పక్కదారి పడుతోందని అప్పుడే నేటిదాత్రితో సహా అనేక మీడియాలు చెప్పాయి. కాని అప్పటి ప్రబుత్వం కదల్లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజా ప్రభుత్వం దృష్టిపెడితే పక్క దారి పట్టిన వేల కోట్లను కూడా రికవరీ చేయొచ్చు. దళితులకు చెందాల్సిన కార్లను మళ్లీ తిరిగి ఇప్పించొచ్చు. మంజూరైన కార్లను కళ్లారా కూడా చూడకుండా వదులుకున్న దళితయువత బాధను అర్దం చేసుకోండి. కారు ముందు ఫోటో దిగి క్షణం కూడా కారులో కూర్చోకుండానే దళారులకు అప్పగించాల్సి వస్తే వారి మానసిక సంఘర్షణ ఎలా వుంటుందో తెలుసుకోండి. ప్రభుత్వం కోసం కారు ముందు దిగిన పోటో తప్ప కారు ఇంటి ముందు లేదు. ఉపాధికి పనికి రాలేదు. దళారులు ఇచ్చిన అడ్డికిపావుసేరు పైసలు ఎప్పుడో అయిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఉపాది కోసం దళిత యువత ఎదురుచూడాల్సిన పరిస్దితి వచ్చింది. తెలంగాణ దళిత బంధు కార్లు తెలంగానలోనే వుండాలి. కాని దగ్గరుండి రాష్ట్రం దాటించిన ఆర్టీఏ అధికారులను గుర్తించాల్సిన అవసరం వుంది. లంచాలకు ఆశపడి, ప్రభుత్వ పధకాన్ని నీరు కార్చారు. దళితుల ఆశలను నిర్వీర్యం చేశారు. వారి అమాయకత్వాన్ని వాడుకొని కోట్లకు పగడగలెత్తారు? అసలు దళితబందు పథకం నీరు గారడానికి కారకులు ఎవరు? అన్నది కూడ తేల్చాలి. వేలాదికోట్ల రూపాయలు ఖర్చు చేసినా లక్ష్యం నెరవేరకపోవడానికి కారకులు ఎవరు? పధకం ఎంతో గొప్పది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసింది. కింది స్ధాయికి వచ్చే సరికి మంచుగడ్ద ముక్క కరిగిపోయినట్లు కరిగిపోయింది. లబ్ధిదారుల చేతికి నీటి బింధువు చేరింది. అసలు దళితులను తఫ్పుదోవ పట్టించింది ఎవరు? అమాయక దళితులను నిండా ముంచిందెవరు? ఈ దళిత బంధు పధకంలో కార్లు ఒక్కటే కాదు 47 రకాల యూనిట్లు వున్నాయి. వాటిన్ని పరిస్దితి ప్రత్యేకంగా లేదు. అన్నీ యూనిట్ల పరిస్దితి ఇలాగే వుంది. వాటిపై కూడ ఒక్కొ అంశంపై మీ నేటిధాత్రిలో వరస కథనాలు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం టేకుమట్ల మండలంలోని కస్తూరి భా గాంధీ గురుకుల పాఠశాలలో 2.30 కోట్ల తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగ శాల భవనాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూపాలపల్లి కలెక్టర్ గా విధులలో చేరిన సంవత్సర కాలంలో విద్యా, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మండల ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్ సైతం గురుకుల పాఠశాలల్లో తనికీలు చేపడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు అడిగిన మేరకు పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి, చేతిపంపు, డయాస్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. జిల్లా లోని అన్ని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలలో కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని విద్యాశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో గవర్నమెంట్ పాఠశాలలో సీట్లు కోసం రికమెండ్ చేసే రోజులు రాబోతున్నాయని అన్నారు. గురుకులాల నుండి పాఠశాలలకు బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించే రోజులు త్వరలో రాబోతున్నాయని. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్యా బోధన అందించేందుకు మన నియోజకవర్గంలో ఘనపురం మండలం గాంధీ నగర్ గుట్ట వద్ద 30 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్ క్యాంప్లెక్స్ ను నిర్మించబోతున్నామని తెలిపారు. తన ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు పాఠశాలలకు 7 కోట్లు వరకు కేటాయించడం జరిగిందని ప్రభుత్వ గురుకుల పాఠశాలలులో విద్యార్థుల కు వేడి నీళ్లు కొరకు గీజర్లు , దుప్పట్లు అందించామని త్వరలో గురుకులాల్లో కావలసిన బెడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థులు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిసిడిఓ శైలిజ, తహసీల్దార్ విజయ లక్ష్మీ, ఎంపీడీవో అనిత, ప్రిన్సిపల్ సప్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జూరాలలో ఐరన్ రోప్ లు తేగడంపై రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటనలో
పరిశీలన చేయకపోవడంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శ
వనపర్తి నేటిదాత్రి :
జూరాల ప్రాజెక్టు పర్యటనలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఐరన్ రో ప్ లు తెగిపోవడంపై కనీసం పరిశీలన కూడా చేయలేదని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని ఆయన తెలిపారు
తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్
నేటి ధాత్రి, పఠాన్ చేరు
తెలంగాణ సచివాలయంలో పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ శనివారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి గారితో చర్చించారు. మంత్రి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారాని ఆయన తెలిపారు
*కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమంలో మోకుదెబ్బ నాయకులు..*
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి శనివారం ప్రారంభించడం జరిగింది..జిల్లా బీసీ సంక్షేమ శాఖ, ఆబ్కారీ శాఖల ఆధ్వర్యంలో డివిజన్ లోని ఆరు మండలాలకు చెందిన 214 మంది గీత కార్మికులకు కిట్లు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుస్పలత,కందాల శంకరయ్య గౌడ్,ఆబకారి సీఐ నరేష్ రెడ్డి,ఎస్ఐ శార్వాణి,గౌడ జనహక్కుల పోరాటం సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,పొగాకు వెంకటేశ్వర్లు, రమేష్ గౌడ్,పోగాకు సాయితేజ గౌడ్,భూపతి మల్లంపల్లి గౌడ సంఘం సభ్యులు అరేల్లి ప్రకాష్ గౌడ్, కక్కేర్ల రాజు,రమేష్,రాజు,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఠాగూర్, సౌదే కర్ బీడీ యాజమాన్య కంపెనీలు ఆరు నెలల నుండి ఇవ్వడం లేదు
లేనిపక్షంలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తాము
*బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ముశం రమేష్*
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి. వై నగర్ అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ.. ఠాగూర్ సౌదే కర్ బి.డి కంపెనీ యజమాన్యం కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది గత ఆరు మాసాల నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు ఈరోజు కూలి వస్తే ఆ రోజు పూట గడిచే కార్మికులకు ఆరు నెలల నుండి వేతనాలు యజమానికి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య పనిచేసిన అప్పులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చింది.చేసిన అప్పుకు మిత్తి కట్టలేక అప్పులు తెంపలేక తీవ్ర ఇబ్బందిలకు గురవుతున్నారు.దీనికి తోడు కార్మికులను విపరీతంగా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు కంపెనీ సెంటర్ల కిరాయిలు కూడా కార్మికుల కూలి నుండి వసూలు చేయడం జరుగుతుంది.ఇలాంటి చర్యలను బీడీ యజమాన్యం మానుకోవాలని వెంటనే కార్మికులకు రావలసిన ఆరు నెలల వేతనం మొత్తం అందించాలని లేనిపక్షంలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామని కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీడీ జిల్లా నాయకులు ,సూరం పద్మ శ్రీరాముల రమేష్ చంద్ర, జిందం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు
యాదవ జాతి ముద్దు బిడ్డ అఖిల భారతీయ యాదవ సంఘం మహాసభ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం వృత్తి దారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు “శ్రీ సందనవేన మహేంద్రనాథ్ యాదవ్” గారి జన్మదిన సందర్భంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, స్విట్స్ పంపిణీ చేయడం జరిగింది. మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కన్నెవేణి ఐలయ్య యాదవ్, మండల ఉపాధ్యక్షులు కాటవేణి రాజయ్య యాదవ్, కాట్రేవుల నవీన్ యాదవ్, పర్శవేని నగేష్ యాదవ్, ములుకల తిరుపతి యాదవ్, పిడుగు బాపు యాదవ్, దాసరి దేవేందర్ యాదవ్, సిద్ది శంకర్ యాదవ్, బత్తిని మల్లేష్ యాదవ్, అఖిల్ యాదవ్, కొమురయ్య యాదవ్, రాకేష్ యాదవ్, జాగరి రాజయ్య యాదవ్, రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు…*
భారత ఆర్థిక సంస్కరణలలో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చిన పివి
నడికూడ నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మరియు ఉపాధ్యాయ బృందం పి వి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ పాములపర్తి వేంకట నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడనీ ఈయన బహుభాషావేత్త, రచయిత,ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు,ఒకే ఒక్క తెలుగువారని,భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి అని,అదే సమయంలో దేశ లౌకిక విధానమునకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగిందనీ, 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి., ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడనీ,భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన గొప్ప పరిపాలన దక్షతకు నిదర్శనం అని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ అని కూడా అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్, మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనపూర్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు
వనపర్తి నేటిధాత్రి
ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జరుపుకున్నారు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం చేశారు ఈ వేడుకలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షుడు గంజాయి రమేష్ జిల్లా డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షులు నరేందర్ గౌడ్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం దేవన్న యాదవ్ మున్నూరు జయకర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దేవుజా నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కే బాల్ రెడ్డి, చిట్యాల లింగస్వామి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు
నేతాజీ డిగ్రీ కాలేజ్ లో అంగరంగ వైభవంగా ఉద్యోగ కల్పన భాగంగా (ఆరంబ్) కార్యక్రమం
సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఇంటర్న్‌షిప్ (INTERNSHIP) ప్రోగ్రాంలో Gatnix Company ద్వారా సిరిసిల్ల టౌన్ సి.ఐ కృష్ణ మరియు కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీదర్ రావు, కరస్పాండెంట్ నాయిని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్ చేతుల మీదుగా 50 మందికి ఆఫర్ లెటర్స్ ని అందించడం జరిగినది.
Netaji Degree College.
అంతేకాకుండా గత రెండు నెలల నుండి కళాశాలలో జరిగిన కంప్యూటర్ కోర్సెస్ పూర్తి చేసిన 180 మంది విద్యార్థులకు అందించడం జరిగినది. ఈ విద్యా సంవత్సరం కళాశాలలో చేరినటువంటి విద్యార్థిని విద్యార్థులకు (ARAMBH) ప్రోగ్రామ్ ద్వారా కల్చరల్ యాక్టివిటీస్ ని కూడా పూర్తి చేసుకోవడం జరిగినది. ఈ కళాశాల కార్యక్రమంలో ఉన్నటువంటి అధ్యాపాక బృందం మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
పి హరి ప్రసాద్ బాబు. గీసుగొండ మండల వ్యవసాయ అధికారి.
కాశిబుగ్గ నేటిధాత్రి
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొనాయమాకుల కేంద్రంగా శనివారం నాడు రైతు వేదికలో ఈ ఖరీఫ్ సీజన్లో డీలర్లు తీసుకోవలసిన జాగ్రత్తల పై మండల వ్యవసాయ అధికారి పి హరి ప్రసాద్ బాబు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.మండలంలో ఉన్న 28 మంది డీలర్లు ఈ అవగాహన సదస్సుకు హాజరైయ్యారు.డీలర్లను ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి పి.హరి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు.రైతులకు అమ్మిన ఎరువుల బస్తాల వివరాలు రిజిస్టర్ లో పొందుపరచాలని,రైతుకు ఉన్న వ్యవసాయ భూమికి సరిపడా మాత్రమే విడతల వారీగా పంపిణీ చేయాలని సూచించారు.సీజన్ మొత్తానికి ఒకేసారి కొనుగోలు చేసుకోకుండా అమ్మకం జరిపేటప్పుడు రైతు వేసే పంట వివరాలు తెలుసుకొని ఆ నెలకు సరిపడా మాత్రమే తీసుకునేటట్లుగా ఒప్పించాలన్నారు.నానో యూరియాను,నానో డీ.ఏ.పీ ని వాడే విధంగా రైతులను ప్రోత్సహించాలని,వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ విషయంపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారని,అందరం కలిసి నానో ఉత్పత్తులను రైతులు వాడే విధంగా చూడాలని కోరారు. గ్రామాల్లో గ్లైఫోసేట్ అక్రమ మార్గాల్లో నిలువచేసిన,అమ్మిన అట్టి సమాచారాన్ని వెంటనే వ్యవసాయ అధికారులకు అందజేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.డీలర్లు ఎవరు కూడా అనుమతి లేకుండా గ్లైఫోసేట్ కొనడం గాని, అమ్మడం గాని చేయకూడదని హెచ్చరించారు.డీలర్లు ఎప్పటికప్పుడు తన దగ్గర ఉన్న పురుగుమందుల స్టాకులను పరిశీలిస్తూ వాటి పరిమిత కాలం చెల్లని స్టాక్ లను వెంటనే వేరు చేసి ప్రత్యేకమైన బాక్సులో వాటిని ఉంచి అట్టి బాక్సు పై డేట్ ఎక్స్పైర్ స్టాక్ అని రాసి రోజు అమ్మే స్టాక్ కు దూరంగా పెట్టాలని సూచించారు.అట్టి స్టాకు వివరాలను డేట్ ఎక్స్పైర్ స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేసి వ్యవసాయ అధికారి తో సర్టిఫై చేయించుకోవాలని ఆదేశించారు.అనంతరం మండల తాహసిల్దారు రియాజుద్దీన్ మాట్లాడుతూ డీలర్లు జిల్లా అధికారుల ఆదేశానుసారం నడుచుకోవాలని,రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల అమ్మకాలు చేయాలని,ఈ సీజన్లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు తనిఖీలు చేపడతామని అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే చట్టప్రకారం చర్యలుఉంటాయన్నారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎరువుల షాపు డీలర్లు పాల్గొన్నారు.
జహీరాబాద్ జూలై 2-7-2025 బుధవారం సాయంత్రం 6:30 గంటలకు జహీరాబాద్ బస్టాండ్ పక్కనగల షెట్కర్ ఫంక్షన్ హాల్ నందు బుద్ధుని నాటక ప్రదర్శన ఉంటుంది. ఈ యొక్క నాటక ప్రదర్శనకు దాదాపుగా లక్షకు పైగా ఖర్చు అవుతుంది కావున ఈ యొక్క నాటక ప్రదర్శన నిర్వహించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మీ అందరిని పేరుపేరునా కోరుచున్నాము అని నిర్వాహకులు తెలిపారు. ఫోన్ పే చేయవలసిన నంబర్ 9989069468
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జియంతి వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు
వనపర్తి నెటిదాత్రి :
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వేడుకలు ఘనంగా నిర్వహించామని టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ పార్టీనేతలు లక్కకుల సతీష్ బి కృష్ణ చందర్ నక్కరాములు చుక్కరాజు జి జె శ్రీనివాసులు పార్టీ నేతలు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.