ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్ల పల్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపెళ్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో పోస్టర్ విడుదల చేయడంజరిగింది. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపెళ్లి యుగంధర్ రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో నిరుద్యోగ సమస్య అధికమైందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాలయాపన చేయడం మూలంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదని వారు విమర్శించారు. ఉపాధి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఏప్రభుత్వం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని వారు అన్నారు. పాలకులు ఎంతసేపటికీ ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలపైనే ఆధారపడటం ద్వారా దేశ ఆర్థిక సమతుల్యత సాధ్యం కాదని వారు అన్నారు. ఈ చర్యల మూలంగా దేశంలో గత పది సంవత్సరాలుగా వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని, దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సైన్యం పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే 2025 మే 15-18వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరగనున్నాయని, ఈమహాసభలలో ప్రధానంగా నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, పాలకుల విధానాలు తదితర అంశాలపై బోధనలు, చర్చలు, తీర్మానాల ద్వారా నిర్ణయాలు ఉంటాయని, ఈజాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుండి సుమారు ఎనిమిది వందల మంది డెలిగేషన్ నాయకత్వం పాల్గొంటారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎనభై మంది డెలిగేషన్ పాల్గొంటున్నట్లు, మే15న తిరుపతిలో జరగనున్న మహాసభల ర్యాలీ, బహిరంగ సభకు వెయ్యి మంది పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.
ఈపోస్టర్ ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు వెంకటేష్, చిన్న సదాశివ్, అవినాష్, రమేష్ , దామోదర్, అఖిల్, మురళి, భాస్కర్, రవి, రమేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం.

బుద్ధారంలో గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం

గణపురం నేటి ధాత్రి 

గణపురం మండలం బుద్దారం గ్రామం లో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు భాగ్యలక్ష్మి గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ పీపీసీ సెంటర్ ను మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగపెల్లి భాస్కర్ వివో అధ్యక్షులు బిక్కినేని రజిత కలసి ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ డీపీఎం నారాయణ సీసీ బాబా సభ్యులు బియ్యాల కవిత.. అల్లెపు మంజుల. మల్లెవెని పుష్పలిల. వివో ఏ పద్మ.విజేందర్. రైతులు  హాజరైనారు

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇబ్బందులు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం.. లబ్ధిదారుల ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు, సరఫరా సమస్యలు, నిర్మాణ వ్యయం పెరుగుదల వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పునాది రుణాలు, ఉచిత ఇసుక సరఫరా, నమూనా ఇళ్లపై స్పష్టత లేకపోవడం, ఐకేపీలపై అవగాహన లోపం సమస్యలుగా ఉన్నాయి. లబ్ధిదారులు ఈ సమస్యల పరిష్కారాన్ని కోరుతున్నారు. ఈ వారంలో రెండో విడత లబ్ధిదారుల జాబితా విడుదల కానుంది.

100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

‘100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..

ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్రత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు.

Students

 

 

అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పారు.

హిందువులను చైతన్యం చేసేందుకే ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో మీద పీఠాధిపతులు, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

నిజాంపేట నూతన ఎమ్మార్వో గా శ్రీనివాసులు.

నిజాంపేట నూతన ఎమ్మార్వో గా శ్రీనివాసులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల కేంద్రానికి నూతన ఎమ్మార్వోగా శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిసిఎల్ కమిషనర్ ఆఫీసులో పనిచేసిన ఆయన బదిలీపై నిజాంపేట మండలనీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

దేశవ్యాప్త కుల గణన చారిత్రాత్మక నిర్ణయం అని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు గత రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్త కులగనన చేయడం హర్షించదగ్గ విషయమని శుక్రవారంనాడు చిట్యాల మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి బీసీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి రుణపడి ఉన్నారని ఎన్నో సంవత్సరాలుగా బీసీలను జెండాలు మోసే బానిసలుగానే వివిధ రాజకీయ పార్టీలు చూసాయని కానీ భారతీయ జనతా పార్టీ బీసీలకు రాజ్యాధికారం అందాలని ప్రతి ఒక్క బిసి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఆశించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నారని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ అని ఆయన అన్నారు ఇప్పటికైనా మిత్రులందరికీ ఏకతాటి మీద నిలబడి నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ ఓదెల శ్రీహరి నల్ల శ్రీనివాస్ రెడ్డి, మైదం శ్రీకాంత్ అనుప మహేష్ వల్లల ప్రవీణ్ కేంసారపు ప్రభాకర్ రావుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

₹.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులను ప్రారంభం.

ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులను ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి

 

జహీరాబాద్ మండలం మల్చేల్మా గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు గ్రామస్థుల కోరిక మేరకు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గారు*ఇప్పేపల్లి PACS చైర్మన్ మచ్చండర్ ,మరియు మండల గ్రామ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తో కలిసి ప్రారంభించారు .ఈ సంధర్బంగా గ్రామ నాయకులు,ప్రజలు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి,మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గార్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనందం మాజీ ఎంపీటీసీ లు ఇస్మాయిల్,మోయిన్,రాములు, ప్రేమ్ సింగ్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు వహీద్ అలీ, అధ్యక్షులు,మండల బిసి సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,మండల యూత్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచులు చిన్నారెడ్డి,నాయకులు గోరెప్ప,భీమ్ రావ్, దత్తు రెడ్డి,మోహన్ రాథోడ్,శ్రీకాంత్, పిజి శంకర్,యేసు, శ్రీనివాస్, పాపన్న కయ్యుమ్, నసీర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్.!

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

 

 

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జూడో యాత్రలో భాగంగా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బడుగు బలహీన వర్గాల కులాల గురించి అన్ని గ్రామాల్లో కులగణన చేపడతామని, జనగణన తో పాటు కులాల వారీగా
కుల గణన చేపడతామని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్య, వైద్య ఉపాధి, ఉద్యోగ, అవకాశాలపై ఏ కులాలకు ఎంత వాటాల రూపంలో తీర్చేందుకే ఈ కుల గణనను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. ఈ కుల గణన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన విధానం నుంచి వచ్చిందని, అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ద్వారా కులగణన తెలంగాణ ప్రభుత్వంలో చేపట్టడం జరిగినదని.
ఈ కులగణలలో 1,50,000 మంది సర్వేలో పాల్గొనడం జరిగింది అని తెలిపారు. అంతేకాకుండా ఈ కులగణలో బీసీల రిజర్వేషన్ శాతం 56.36%
శాతం ఉన్న బీసీలకు విద్య, వైద్య, ఉపాధి కల్పనా రాజకీయంగా గాని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో 42% శాతం అసెంబ్లీ ఆమోదం నిర్ణయించడం జరిగింది . అంతేకాకుండా కరీంనగర్ బీసీ ముద్దుబిడ్డ, బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కులగణన ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే రాష్ట్రంలో కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాలలో బీసీ కులగనున చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను తోపాటు మన తెలంగాణ రాష్ట్రంలోని బిసి సంఘాలను ఏకం చేసుకుంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా కుల గణన నిరసన తెలుపడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరసన ఒత్తిడి తెచ్చింది అని అందుకు కేంద్ర ప్రభుత్వం కులగననకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమైందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, ఎండి హమీద్, చుక్క శేఖర్, వెంగళ అశోక్, అడ్డగట్ల శంకర్, పైసా ఆంజనేయులు, నేరెళ్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

పెద్దకోడేపాకలో ఇష్టాను సారంగా ఇందిరమ్మ ఇండ్.!

పెద్దకోడేపాకలో ఇష్టాను సారంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ సభ్యుల హవా

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం పెద్దకోడే పాక గ్రామంలో ఇష్టానుసా రంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్ల జాబితా విషయంలో ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ వెనుక రహస్యమేముంది. బహుజన స్టూడెంట్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇల్లు ఇప్పించా లని ఎమ్మెల్యే ప్రధానంగా కార్యకర్తలకు చెబితే కార్యకర్తలు స్వార్థ స్వభావాల తో ఇల్లు లేని గ్రామ ప్రజలకు గుర్తించకుండా ఐదుగురు కమిటీ సభ్యులకు సంబంధిం చిన కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ పేర్లు పెట్టుకుని ఏకపక్ష తీర్మానం చేయడం ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా ఒకేచోట కూర్చుం డబెట్టి తీర్మానం చేసి పై అధికా రులకు పంపించడం జరిగింది. కావున తక్షణమే ఐదుగురు కమిటీ సభ్యులను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇల్లు లేని నిరు పేదలను గుర్తించి ఇల్లు వచ్చే విధంగా చేయాలని ప్రధా నంగా ఎమ్మెల్యే,కలెక్టర్ ను కోరుతున్నాం.లేనిపక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం బృందం అవగాహన కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

 

విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో,పాఠశాలల్లో విద్యార్థినిలకు గ్రామాల్లో,పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,05 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల,కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

District SP.

 

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని , ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని.

ప్రధానంగా మహిళలు,విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని,వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలల్లో కానీ,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్100 లేదా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ గారు తెలిపారు.

 

ఈదురు గాలుల బీభ త్సానికి ఇల్లు ధ్వంసం.

ఈదురు గాలుల బీభ త్సానికి ఇల్లు ధ్వంసం..

దిక్కుతోచని స్థితిలో కుటుంబం..

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఈదురు గాలుల. బీభత్సవo సృష్టించ డంతో బీసీ కాలనీ చెందిన బాసాని రామకృష్ణ ఇల్లు పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి తృటిలో తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్న వారు ప్రకృతి ప్రకోపంతో ఇల్లు ధ్వంసమవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.రెక్కాడితే కాని డొక్కాడని దయనీయ స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభు త్వం ఇందిరమ్మ ఇల్లు మం జూరు చేసి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. 

ఈ ‘‘ప్రశ్న’’కు బదులేది ‘‘రోహిణి’’?

`సిఐడి విచారణ తప్పుల తడక అన రోహిణి యాజమాన్యం చెప్పినట్లేనా?

`సిఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా?

`రోహిణి స్టాంపులు, తప్పుడు తయారు చేసిన వివరాలు ‘‘రోహిణి’’ ఎందుకు బైటపెట్టలేదు?

`వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు?

`‘‘సిఐడి’’ విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడిరచ లేదు?

`వెల్లడిరచినా ‘‘సిఐడి’’ రోహిణి పేరు జాబితాలో చేర్చిందా?

`హన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా ‘‘రోహిణి’’ పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా?

`‘‘రోహిణి’’ ఆసుపత్రికి అనుకూలంగా ‘‘కోర్టు ఆర్డర్‌’’ కాపీ మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు?

`ప్రభుత్వం జారీ చేసిన ‘‘జీవో’’, జాబితా మీడియాలో ప్రచురితం కోసమే విడుదల చేశారు.

`మీడియా తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించింది.

`మీడియాకు గడువు ఇచ్చే హక్కు ‘‘రోహిణి’’కి లేదు.

`ప్రభుత్వ ‘‘జీవో’’ ఆధారంగానే మీడియా వార్తలు రాసింది.

`‘‘రోహిణి’’ ఆసుపత్రి తప్పు చేయకపోయినా ‘‘సిఐడి’’ విచారణ తప్పని యాజమాన్యం చెబుతోంది!

`‘‘సిఐడి’’ వ్యవస్థనే ‘‘రోహిణి’’ యాజమాన్యం శంకిస్తోంది!

`తప్పు ‘‘సిఐడి’’ మీద నెట్టేసి ‘‘రోహిణి’’ తప్పించుకోవాలనుకుంటోంది!

`ఒక రకంగా ప్రభుత్వాన్నే లిరోహిణి’’ యాజమాన్యంసవాలు చేసినట్లైంది!

`మీడియా మీద తోసేస్తే సరిపోతుందా?

`మీడియా కోరుకునేది కూడా అదే నిజమేమిటో నిగ్గు తేలాలి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
‘‘రోహిణి ఆసుపత్రి’’ యాజమాన్యం నుంచి ప్రజలకు, పత్రికా విలేకరులకు స్పష్టీకరణ పేరుతో ఒక నోట్‌ విడుదల చేశారు.అందులో ఇటీవల కొన్ని డిజిటల్‌ పత్రికలు, యూట్యూబ్‌ ఛానల్స్‌ రోహిణి ఆసుపత్రి యాజమాన్యం మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు.ఇదే మాట మీద ఆసుపత్రి యాజమాన్యం నిలబడుతుందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం వుంది.మీడియాలో వచ్చినవి అబద్దాలు, ఆరోపణలు, వాస్తవ విరుద్దాలని రోహిణి ఆసుపత్రి చెబుతోంది. ఇక్కడ యాజమాన్యం గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియాలో వచ్చిన వార్తలు అబద్దాలు కాదు. ఆరోపణలు అసలే కాదు. వాస్తవ విరుద్దమైనవి అని దులిపేసుకుంటే సరిపోదు.’’సిఐడి’’ ద్వారా చేసిన విచారణ తర్వాత రూపొందించిన జాబితాలో ఆసుపత్రి పేరు అనుమానాస్పదంగా వుందని నింద ప్రభుత్వం మీద వేస్తున్నారా? లేక ‘‘సిఐడి’’ విచారణ లోప భూయిష్టంగా వుందని యాజమాన్యం భావిస్తుందా? అదే నిజమైతే యాజమాన్యం ప్రభుత్వం మీద కూడా దావా వేయవచ్చు. ‘‘సిఐడి’’కి కూడా నోటీసులు పంపవచ్చు. యాజమాన్యం ఆ దిశగా ముందుకు సాగుతుందా? స్పష్టం చేయాలి. ఎందుకంటే యాజమాన్యం నేరుగా ‘‘ప్రభుత్వాన్నే స్పష్టంగా దోషి’’ అంటోంది. అనుమానాస్పదంగా జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుందని చెప్పడం ‘‘రోహిణి’’ ఆసుపత్రి చేస్తున్న మరో నేరం. ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధుల అక్రమాల నేపథ్యంలో ‘‘రోహిణి’’ ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లు, లేదా సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడమంటే ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా నిధులు విడుదల చేశారని సూటిగా ఆరోపణలు చేసినట్లు భావించాల్సి వుంటుంది. ప్రభుత్వం ‘‘సీఐడి’’ విచారణకు ఆదేశించినది నిజమే. కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్‌ను అధికారికంగా విడుదల చేయలేదు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి వర్గాలు నిర్థారణకు వచ్చిందా? ఏ అధికారిక సమాచారం మేరకు ఈ విషయం స్పష్టం చేస్తున్నారో చెప్పాలి. ఇక ‘‘సిఐడి’’ నివేదిక అనేది పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టేది కాదు.రహస్య విచారణలకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయదు.ఈ విషయం యాజమాన్యానికి తెలియకపోవడం విడ్డూరం.’’సిఐడి’’ నేరుగా తన నివేదికను బహిరంగ పర్చదు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా జివో విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జివో కాపీలోనే ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును చేర్చడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుంది. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును అనుమానాస్పదంగా ‘‘సిఐడి’’ చేర్చిందనడం కూడా నేరంగా పరిగణిస్తారు. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరుతో ఎవరో నకిలీ స్టాంపులు, బిల్లులు తయారు చేసినట్లు చెప్పి యాజమాన్యం తప్పించుకోవాలని చూసినా చెల్లదు. మరింత కఠినమైన శిక్ష బాధ్యులౌతారు. అంతేకాకుండా ‘‘సిఐడి’’ బోగస్‌ విచారణ చేపట్టిందని, ‘‘సిఐడి’’ విచారణ సరైన పద్ధతిలో జరగలేదని యాజమాన్యం సూటిగా ఆరోపణలు చేసినట్లౌతుంది. ఎవరు నకిలీ, ఏది నకిలి అని తేల్చలేనంత అసమర్థంగా ‘‘సిఐడి’’ విచారణ చేసిందని యాజమాన్యం ప్రతికా ప్రకటన ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీనిని ‘‘సిఐడి’’ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి ఏకంగా ‘‘సిఐడి’’ వ్యవస్థనే శంకిస్తోంది. అంటే నేరుగా ప్రభుత్వానికే సవాలు విసిరింది. ‘‘సిఐడి’’ చేసిన విచారణ తప్పు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి అంటోంది.’’సిఐడి’’ వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. లేకుంటే ‘‘సిఐడి’’ వ్యవస్థకే మచ్చ వస్తుంది. ‘‘సిఐడి’’ నివేదికే బైటకు రాలేదంటున్న ‘‘రోహిణి’’ యాజమాన్యం నివేదికలో ‘‘సిఐడి’’ పొందుపర్చిన పేర్లు ఎలా తెలిసింది? ఆ పేషెంట్లు మా ఆసుపత్రిలో చికిత్స చేసుకోలేదని ఎలా చెబుతున్నారు? మీడియా వద్ద ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ వుందా? అని యాజమాన్యం ప్రశ్నిస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘‘జివో’’ కూడా ‘‘బోగస్‌’’ అని యాజమాన్యం నిర్థారించినట్లేనా? ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ లో వున్న పేర్లు యాజమాన్యానికి ఎలా తెలిశాయి. ‘‘సిఐడి’’ రోహిణి ఆసుపత్రి యాజమాన్యాన్ని విచారణకు పిలువలేదా?ఆసుపత్రికి వచ్చి విచారణ చేయలేదా? మా ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించకుండానే ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ తయారు చేసిందని ‘‘రోహిణి’’ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయా? ‘‘సిఐడి’’ రాలేదని నిర్థారిస్తున్నారా? అందుకు ఐదు రోజుల గడువు సిఐడికి ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధిస్తున్నారా? ఎందుకంటే మీడియాకు గడువు విధించే అధికారం రోహిణి యాజమాన్యానికి లేదు. ప్రభుత్వమే మీడియాకు ‘‘జీవో’’ తో పాటు జాబితాను ప్రచురణ కోసమే విడుదల చేశారు. అధికారికంగా విడుదల చేసిన జాబితాను అనుసరించే మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. యాజమాన్యానికి నిజంగా ధైర్యం వుంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబితా తప్పు అని ప్రకటన చేయాలి. మీడియా మీద తోసేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఇక ‘‘సీఎంఆర్‌ఎఫ్‌’’ నిధులు రోగుల ఖాతాలకు నేరుగా వెళ్లేలా వ్యవస్థ ఉంది. నిజమే…మరి ఈ ఆసుపత్రి పేరుతో నిధులు విడుదల జరుగుతుంటే ఇంత కాలం యాజమాన్యం ఏం చేసినట్లు? ‘‘సిఐడి’’ విచారణకు వచ్చినప్పుడు ఆ బిల్లులు మా ఆసుపత్రికి సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు? చెబితే ‘‘సిఐడి’’ విచారణ ఆ దిశగానే జరిగేది. తెలంగాణలో ఇన్ని ఆసుపత్రులు వుండగా 28 ఆసుపత్రులు తప్పులు చేసినట్లు తేలింది? ఇక మీడియాను సవాలు చేసిన యాజమాన్యం కోర్టు ఉత్తర్వులు ఎందుకు పొందుపర్చలేదు? రోహిణి యాజమాన్యం ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలి.

జనగణనతో పాటు కులగణన

కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం

`విపక్షాలను డిఫెన్స్‌లో పడేసిన బీజేపీ

`కులగణనపై విపక్ష దాడులకు చెక్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం

`ఈ నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ కూటమికి గెలుపు అవకాశాలు మరింత మెరుగు

`బిహార్‌, కర్ణాటక, తెలంగాణల్లో కులగణన నిర్వహించిన ప్రభుత్వాలు

`రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం కులగణనపై వుండే అవకాశం

`జనాభాలెక్కలతో పాటే నిర్వహిస్తే కచ్చితమైన ఫలితాలు రాగలవు

`కులవ్యవస్థ మరింత బలపడే అవకాశం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) బుధవా రం సమావేశమై కులగణన విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ అంశాన్ని ఒక అస్త్రంగా మలచుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు గట్టి షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ కులగణన అంశాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏన్డీఏ కూటమికినేతృత్వం వహిస్తున్న జేడీయూ, గతంలో మహాఘట్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కులగణన చేసింది. ఈ గణన ప్రకారం రాష్ట్రంలో 75శాతం వెనుకబడిన వర్గాలున్నట్టు తేలింది. అయితే కులగణను బీజేపీ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నది. కులాలుగా, వర్గాలుగా హిందువులను ముక్కలుగా చీల్చే ప్రక్రియగా దీన్ని పేర్కొంటూ వచ్చింది. బిహార్‌లో కులగణను ప్రధాన అస్త్రంగాచేసుకొని కాంగ్రెస్‌ తదితర విపక్షాలు ప్రచారం కొనసాగించడం భాజపాకు మింగుడు పడటం లేదు. ఎన్నికల వాతావరణం తమకే సానుకూలంగా వున్నాయన్న సంకేతాలు స్పష్టంగా వెలువడు తున్నప్పటికీ, తమకు ప్రతికూలంగా మారే ఏ చిన్న అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో, కులగణనపై తన అభిప్రాయాన్ని మార్చుకోవడం ద్వారా, విపక్షాలకు ముందరికాళ్లకు బంధం వేసేవిధంగా, జనాభాలెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టడానికి నిర్ణయించింది. సీసీపీఏ తీసుకున్న నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్‌ యునైటెడ్‌, రాష్ట్రీయ లోక్‌సమతాపార్టీ నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌ సహా విపక్షాల దాడిని ఎదుర్కోవడంలో డిఫెన్స్‌లో పడిపోయిన ఈ పార్టీలు ఇప్పుడు, విపక్షాలపై తమ ప్రతిదాడులను మరింత తీవ్రం చేసేందుకు ముందడుగులు వేస్తున్నాయి.

వాయిదా పడుతున్న జనగణన

నిజానికి జనగణన 2020లో చేపట్టాల్సివుంది. కానీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదాపడిరది. రాజ్యాంగ నిర్దేశం ప్రకారం ప్రతి పదేళ్లకోమారు జనగణన చేపట్టాలి. దీని ప్రకారం 2021 నాటికి జనాభా లెక్కల వివరాలు ప్రచురితం కావాల్సి వుంది. కానీ అది ఇప్పటివరకు వాయి దా పడుతూ వచ్చింది. ఇదిలావుండగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సామాజిక న్యా యం జరగాలంటే కులగణన తప్పనిసరని గతంలో గట్టిగా వాదిస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడినవర్గాల వారు విద్యవిషయంలో ఇప్పటికీ అన్యాయానికి గురవుతున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. అన్నివర్గాల ప్రజలకు వనరులను సమాన ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకువరావాలంటే కులగణన తప్పదని కాంగ్రెస్‌ గట్టిగా వాదిస్తోంది. 1927, మార్చి 20న డాక్టర్‌ బాబాసాహెబ్‌అంబేద్కర్‌ కులవివక్షను తీవ్రంగా విమర్శించారు. ఆరోజున నీటికోసం జరిపిన మహద్‌ సత్యాగ్ర హం సందర్భంగా మాట్లాడుతూ, ‘నీటికోసం మాత్రమేకాదు, గౌరవం, సమానత్వం కోసం జరిపేపోరాటం ఇది’ అంటూ పేర్కొన్న అంశం ప్రస్తావనార్హం. ఇదిలావుండగా భాజపా రాహుల్‌పై ఎ దురుదాడి చేస్తూ కుటుంబ పాలనలో కాంగ్రెస్‌ తమపార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల ను ఎంతగా అవమానించిందో తెలుసుకోవాలని కోరింది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులను పైకి ఎదగనీయకుండా తొక్కేసిన చరిత్ర కాంగ్రెస్‌దంటూ భాజపా ఆరోపిస్తూ వచ్చింది. అయితే కుల గణన ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయని రాహుల్‌ గాంధీ కూడా ఎదురుదాడి చేయడం వర్తమాన రాజకీయ పరిణామం. 

కులగణన రాజకీయం

రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయాలను విలేకర్లకు వివరిస్తూ కేంద్ర రైల్వేశాఖ మం త్రి అశ్విన్‌ వైష్ణవ్‌, కేవలం తమ రాజకీయ లబ్దికోసమే కులగణను ఇండీ కూటమి పార్టీలు లేవ నెత్తుతున్నాయని విమర్శించారు. కాగా రాజ్యాంగంలోని 246వ అధికరణలోని 69వ నిబంధన జనగణనను కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా స్పష్టంగా పేర్కొంది. అయితే బిహార్‌, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకుండా కులగణన పూర్తిచేశాయి. అయితే ఇది కేవలం రాజ కీయ కోణంలోనే తమ ప్రయోజనార్థం చేపట్టిన కార్యక్రమమని, ఇందులో ఎటువంటి పారదర్శకత లేదని అశ్వనివైష్ణవ్‌ స్పష్టం చేస్తూ, కేంద్రం జనగణనతో పాటు చేపట్టే కులగణన ఎంతో పారదర్శకంగా, నిక్కచ్చిగా వుండబోతున్నదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు కులగణన పేరుతో ని ర్వహించిన సర్వేలు సమాజంలో అనుమానాలు రేకెత్తించేవిగా వున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే కులగణను, జనాభాలెక్కలతో పాటు చేపడితే స్పష్టమైన ఫలితాలు వస్తాయన్నారు. పదేళ్ల క్రితం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటకలో కులగణన నిర్వహిం చింది. అయితే రాష్ట్రంలో బలమైన వర్గాలుగా వున్న వక్కళిగలు, లింగాయత్‌లనుంచి తీవ్ర వ్యతి రేకత రావడంతో ఆ నివేదికను ఇటీవలి కాలం వరకు ప్రభుత్వం బయటపెట్టడం సాధ్యంకాలే దు. బలీయమైన కులాల ప్రభావ తీవ్రతను ఇది మరోసారి బహిర్గతం చేసింది. ఈ కులగణనలో తమకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని ఇప్పటికీ ఈ రెండు వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నా యి కూడా. 

బిహార్‌లో తొలి కులగణన

కులగణన అవసరాన్ని నొక్కి చెబుతున్న విపక్ష పార్టీలు, దీనివల్ల ప్రతి కులంలో జనాభా సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది కనుక దీని ఆధారంగా ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు పరచ వచ్చునని వాదిస్తున్నాయి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం విపక్షాలు హిందూసమాజాన్ని ముక్కలుగా విడగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తునాయనేది భాజపా వాదన. అధికార,విపక్ష పార్టీల మాట ఎట్లా వున్నా, దేశంలో కులగణన జరిపిన మొట్టమొదటి రాష్ట్రం బిహార్‌. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 36శాతం రాష్ట్రజనాభా అత్యంత వెనుకబడిన స్థా యిలో వున్నట్టు తేలింది. బిహార్‌ రాష్ట్రం మొత్తం జనాభా 13కోట్లలో 27.13% మంది ప్రజలు వెనుకబడిన వర్గాల కిందికి వస్తారు. 15.52% సాధారణ కేటగిరి ప్రజలుగా తేలింది. ఈ కులగణను రెండు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో కుటుంబాల వారీగా జరపగా, రెండో దశలో సామాజిక, ఆర్థిక, కులపరంగా నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ప్రస్తుతం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్‌ సదుపాయ పరిమితి 50%ని ఎత్తేస్తామని ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 

ఇప్పటివరకు మూడు కులగణనలు

దేశంలో మొట్టమొదటి కులగణన 1871ా72లో నాటి బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం చేపట్టింది. రెండో కులగణను 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్వహించింది. దాని తర్వాత 2011లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక మరియు కులగణనను నిర్వహించింది. దీని ప్రకారం దే శంలో 46.7లక్షల కుల/ఉపకుల గ్రూపులున్నట్టు తేలింది. అయితే సేకరించిన సమాచారం స్థి రంగా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి కులగణన వల్ల లాభనష్టాలు రెండూ వున్నాయి. ముందుగా ప్రయోజనాల విషయానికి వస్తే ఏఏ కులాల్లో ఎంతమంది జనాభా వున్నారనేది స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను జనాభా ఆధారంగా రూపకల్పన చేయవచ్చు. ఇదే సమయంలో పేదరికంలో మగ్గే వర్గాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి తేవచ్చు. అంతేకాదు విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఆయా వర్గాల ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. అయితే ఈ కులగణనలో కొన్ని ప్రతికూలతలు కూడా వున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు, వెనుకబడిన కులాల పేర్లలో కొద్ది తేడా మాత్రమే కనిపిస్తుంది. ఉదాహరణకు ‘సెన్‌’ అనే కులం బెంగాల్‌లో అగ్రవర్ణం కాగా, ‘సెయిన్‌’ ఓబీసీ వర్గానికి చెందినది. చిన్న స్పెల్లింగ్‌ తప్పు జరిగినా పథకాల అమలు తారుమారు కావడం ఖాయం. బిహార్‌ కులగణనలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్న సంగతిని గుర్తుంచుకోవాలి. బిహార్‌ కులగణనలో ఎన్యూమరేటర్లకు సరైన శిక్షణ ఇవ్వలేదని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల కారణంగా సమాచారాన్ని తారుమారుచేసే అవకాశాలు అధికమన్న విమర్శలు వచ్చాయి. సమాజంలో కులవ్యవస్థ మరింత కఠినంగా మారే ప్రమాదం ఏర్పడిరది. ఈ కులగణన నేపథ్యంలో, అధిక జనాభా కలిగిన కులాలవారు తమ నిష్పత్తికి అనుగుణంగ ప్రయోజనాలు కల్పించాలన్న డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను కులాల ఆధారంగా అమలు చేయడమనేది ఒక ప్రామాణికతను సంతరించుకునే పరిస్థితి నెలకొంది. కులగణన చేపట్టేముందు ఇటువంటి ప్రతికూలతలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో వుంచుకోవాలి. కాకపోతే ఈ కులగణన చేపట్టిన రాష్ట్రప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం ప్రజల సంక్షేమం అనేదానికంటే, అధిక జనాభా కలిగిన వర్గాలకు ఎక్కువ రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా రాజకీయ లబ్దిపొందాలన్న ఉద్దేశం మాత్రమే కనిపిస్తోంది. ఎందుకంటే మనదేశంలో స్వాతంత్య్రానంతరం కాలక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి రాజకీయాలకు సమాధికట్టి, దానికి ఎప్పటికప్పుడు పాలరాతితో అద్భుతమైన ‘అవినీతి’ కళాఖండాలను జోడిస్తూ ప్రపంచపు వింతల్లో ఒకటిగా పరగణించే ‘తాజ్‌మహల్‌’ను తలదన్నే స్థాయిలో తీర్చిదిద్దాయి. దీనికి ఎప్పటికప్పుడు మరింత నగిషీల సొబగులు చేర్చడం తప్ప సంక్షేమం అమల్లో చిత్తశుద్ధి అనేదానికి ఎప్పుడో ‘తర్పణాలు’ వదిలేశాయి. ఒక్కపక్క కులరహిత సమాజం రావాలని సుద్దులు చెప్పే పార్టీలు తమ స్వార్థం కోసం కులవ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. నిజంగా పార్టీలకు చిత్తశుద్ధి వుంటే, సమాజంలో ‘ధనిక’, ‘పేద’ అనే రెండు వర్గాలనే గుర్తించి (కుల,మతాలకతీతంగా) పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు మాత్రమే అంబేద్కర్‌ ఆశయాలను సాధించినట్టుగా పరిగణించాలి. అంతేకాని స్వార్థం కోసం ఆ మహనీయుని పేరును ఉపయోగించుకోవడం అలవాటు కాకూడదు!

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా.

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా మేడే నిర్వహన.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి 139 వ మేడే పిలుపు.

కారేపల్లి నేటి ధాత్రి.

 

 

 

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 139 వ మే డే సందర్భంగా సింగరేణి మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఘనంగా మేడే జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సినియర్ మండల నాయకులు తాతా వేంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 86 లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో వేలాదిమంది కార్మికులు 8 గంటల పని దినాలు ఉద్యోగ భద్రతకై పెట్టుబడిదారీ వర్గం మీద తిరుగుబాటు చేసి ఆరుగురు కార్మికులు అమరత్వం పొంది ఏడుగురు ఉరిశిక్షలకు గురి అయ్యి ఫాసిస్టు పోలీస్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాదిమంది గాయాలపాలై చరిత్రకెక్కిన సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక వర్గ దినోత్సవం గా మేడేను ప్రకటించింది నాటి అమరత్వం పోరాటాల సందర్భంగా భారత కార్మిక వర్గం 8 గంటల పరిధినాలను ఉద్యోగ భద్రతను హక్కులను చట్టాలను కార్మిక వర్గం పొందినది ఎన్నో త్యాగాలతో సాధించుకున్న వివిధ కార్మిక రైతాంగ చట్టాలను మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం 44 కోడులుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి 8 గంటల పని దినాలను మార్చి 12 గంటల పని దినాల అమలుకు పూనుకున్నది దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు బహుళజాతి కంపెనీలకు భూములతో సహా ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టింది నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తుందని కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు గతంలో సాధించుకున్న వన్ ఆఫ్ సెవెంటీ వీసా 2006 అటవీ హక్కుల చట్టాలను అమలు చేయకపోగా 2022 నూతన అటవీ సంరక్షణ నియమావళి చట్టాన్ని తీసుకువచ్చి పై వాటి రద్దుకు పూనుకుంది ఢిల్లీ రైతాంగానికి ఇచ్చిన హామీలను మూడు నల్ల చట్టాలను నాలుగు లేబర్ కోడలు రద్దు చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తిరిగి వాటి అమలుకు పూనుకున్నది దేశంలో రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ కవులు కళాకారులు అభ్యుదయవాదులపై ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ పై దాడులకు హత్యలకు పూనుకొని ప్రశ్నించే గొంతులను నొక్కువేస్తుంది ఆపరేషన్ కగార్ పేరుతో మద్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో 20 లక్షల లక్షల పోలీస్ బలగాలను దింపి వందలాదిమంది అమాయక ఆదివాసి గిరిజన పేద ప్రజలపై గ్రామాలపై దాడులు హత్యాకాండను నిర్బంధాలను కొనసాగిస్తున్నది నక్సలిజం 2006 వరకు నిర్మూలన పేరుతో అమిత్ షా మోడీ 500 మంది అమాయకులను ఆదివాసులను బలి తీసుకున్నది ఎన్కౌంటర్లను కొనసాగిస్తున్న వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఈ చర్యలను ఖండించి ఐక్యమై సాధించుకున్న హక్కులకై మేడే స్ఫూర్తితో ముందు బాగాన నిలబడి పోరాటాలలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సినియర్ నాయకులు తాతా వేంకటేశ్వర్లు ఉంగరాల సుధాకర్ పాటి అనంత రామయ్య పుచ్చకాయల శ్రీను మాంగు హర్సింగ్ నాగళ్ళ చంద్రం లచ్చయ్య తనకేం విజయ్ తనకేం చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణం లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అరికపురం రాజేశ్వరి అనే నిరుపేద మహిళ ఇటీవల అనారోగ్య రీత్యా మరణించింది.దశదినకర్మ సైతం చేయలేని దిన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సట్ల మహేందర్,కోశాధికారి తూముల సురేష్ , ఉపాధ్యక్షుడు బొద్దుల సతీష్ సభ్యులు జెట్టి శ్రీనివాస్, జె సతీష్, మోటం తిరుపతి , కొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు

వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్.

వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్
ప్రకృతి పెంచమంటుంది కరెంటు స్తంభం తుంచుమంటుంది
చోద్యం చూస్తున్న అధికారులు
ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరుకుతున్న కాంట్రాక్టర్

జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట మండల పరిధిలోగల కోరపల్లి గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం జరిగింది ఇట్టి సబ్స్టేషన్ ప్రారంభించడానికి సన్నద్ధమై ఉంది ఈ సబ్ స్టేషన్ కు కరెంటు సప్లై కోసం జమ్మికుంట నుండి ప్రత్యేకంగా పోల్స్ ద్వారా కరెంటు తీసుకురావడం జరిగింది తీసుకువచ్చే క్రమంలో దాదాపు రెండున్నర కిలోమీటర్లు సైదాబాద్ శివారు కోరపల్లి శివారు ఆర్ అండ్ బి రోడ్డు ప్రక్కన పెట్టినటువంటి పెద్ద పెద్ద చెట్లను అనుమతి లేకుండా ఏ అధికారి పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా చెట్లను నరకడం జరిగింది . దాదాపు పది సంవత్సరాల క్రితం పెట్టినటువంటి చెట్లు ఎన్జీఎన్ఆర్ఇజేఎస్ పథకం కింద ప్రభుత్వం వ్యయం చేసి చెట్లను పెంచడం జరిగింది . వాస్తవానికి అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకుని టెండర్ ద్వారా ఈ చెట్లను తొలగించాలి కానీ వాళ్లు చెట్టు ఉన్నది తెలిసి కూడా చెట్టు పైన లైన్ వచ్చే విధంగా ఫోల్స్ పాతడం అది కావాలని తప్పు చేయడమే ఎందుకంటే రోడ్డు పక్కన చాలా స్థలంఉంది చెట్లను వదిలిపెట్టి కూడా పోల్స్ వేయచ్చు గతంలో కూడా నిర్మాణ సమయంలో ఇట్టి నిర్మాణం చెరువులో చేస్తున్నారని కోరపల్లి గ్రామస్తులు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి నిర్మాణం మొట్టమొదటి నుండి వివాదాస్పదంగానే జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పును గుర్తించి చర్యలు తీసుకోవాలని రహదారి వెంటే పోయేటువంటి ప్రయాణికులు కోరుతున్నారు.

మే డే సందర్బంగా జెండా ఎగరావేసిన ఓసీ త్రి కార్మికులు.

మే డే సందర్బంగా జెండా ఎగరావేసిన ఓసీ త్రి కార్మికులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం పరశురాంపల్లి గ్రామ పరిధిలో సింగరేణి ఓసీ త్రి ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతుంది ఓసీ లో పనిచేసే ప్రైవేట్ కార్మికులు నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్. అధ్యక్షులు మాచర్ల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు దిడ్డి బాలకృష్ణ పటేల్ బుర్ర శంకర్ గౌడ్ మొదటి సారి (మే డే) పురస్కరించుకొని కార్మికులు ఉత్సాహంగా జెండా ఎగరవేశారు.ఓసీ త్రి లో నూతనంగా ఏర్పడిన యూనియన్ కార్యవర్గం, కార్మికులు పాల్గొన్నారు.

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం.

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం

మే 20న సార్వత్రిక సమ్మె లో కార్మికులందరూ భాగస్వాములు కావాలి

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

 

సిరిసిల్లా పట్టణ కేంద్రంలోని ఈరోజు జరిగిన మేడే బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తమ హక్కుల సాధన కోసం తుపాకీ గుళ్ళకు ఎదురేగిన కార్మికులు, ఉరికంబాలెక్కిన నాడు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని సి.ఐ.టి.యు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు.

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సి.ఐ.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 వ. మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలో లేబర్ అడ్డా వద్ద , రైతు బజార్ వద్ద , మున్సిపల్ ఆఫీస్ వద్ద , సివిల్ హాస్పిటల్ వద్ద , నెహ్రు నగర్ , చంద్రంపేట , గణేష్ నగర్ , బి.వై. నగర్ ఏరియాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేశారు బి.వై. నగర్ లో మేడే అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇట్టి బహిరంగ సభకు సి.ఐ.టి.యు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మేడే అమరవీరులు సాధించిన హక్కులను నేటి కేంద్ర బిజెపి సర్కార్ హరించి వేస్తుందని ఆ హక్కుల రక్షణ కోసం మే 20న జరుగు సార్వత్రిక సమ్మె లో అన్ని రంగాల కార్మికులు , కష్టజీవులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.కార్మికులు ఉదయం 10 గంటలకు పనికి వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తున్నారంటే కారణం నాడు మేడే కార్మికులు చిందించిన రక్తం నేనని చెప్పారు అందులో అధికారంలో ఉన్న బిజెపి కార్మికులు పోరాడి సాధించుకుంటున్న ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్ దిగ్గజాలకు కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు 29 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ సర్కారు ఒక కలం పోటుతో రద్దుచేసి నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చిందని విమర్శించారు అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం పిఎఫ్,ఈఎస్ఐ వంటి కనీస హక్కులు కూడా లేవన్నారు దుర్బర దారిద్రం అనుభవిస్తున్నారని చెప్పారు.

మేడే కార్మిక దినోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదని అది ఒక వర్గ పోరాట స్ఫూర్తి దినమని పేర్కొన్నారు.

కార్మిక వర్గం ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా సమాజంలోకి అన్ని రకాల అంతరాలను నుండి విముక్తి చేయటానికి కృషి జరపాలన్నారు రోజువారీగా పెరుగుతున్న ధరలు కార్మికులకు వస్తున్న చాలీచాలని జీతాలు తో కార్మిక వర్గం దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తుందన్నారు బిజెపి పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి పెంచిందన్నారు మే 20 న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చేస్తున్న సమ్మెతో మోడీ మెడలు వంచి కార్మిక వర్గ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

ఇట్టి కార్యక్రమాలలో CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ , మూషం రమేష్ , అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , మిట్టపల్లి రాజమల్లు , రాపెల్లి రమేష్ , నక్క దేవదాస్ , సిరిమల్ల సత్యం , కుమ్మరికుంట కిషన్ , గుండు రమేష్ , కుడిక్యాల కనకయ్య , బెజుగం సురేష్ , ఎక్కల్దేవి జగదీశ్ , ఉడుత రవి , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , సుల్తాన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించిన.

గాంధీనగర్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జి.ఎస్.ఆర్

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version