ఘనంగా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ జన్మదిన వేడుకలు
మెట్ పల్లి: మే 2 నేటిదాత్రి
టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా మెట్ పల్లి ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ పుట్టినరోజు వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ అజీమ్ పుట్టినరోజు సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) ప్రింట్ మీడియా అధ్యక్షులు బూరం సంజీవ్, గౌరవ అధ్యక్షుడు ఆగ సురేష్,ఉపాధ్యక్షులు జంగo విజయ్, సాజిద్ పాషా, కోశాధికారి ఎస్.కె మక్సుద్ సహాయ కార్యదర్శి పింజరి శివ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ,ఎం.డి సమియోద్దీన్ , కార్యవర్గ సభ్యులు,మహమ్మద్ అఫ్రోజ్ ,పానిగంటి మహేందర్, కుర్ర రాజేందర్ , కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు కుతుబుద్దీన్ పాష, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో పురుమళ్ల శ్రీనివాస్‌పై పీసీసీ అధ్యక్షునికి-కాంగ్రెస్ ముఖ్యనేతల ఫిర్యాదు
పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్ నేటిధాత్రి:
పీసీసీ అధ్యక్షునితో గాంధీభవన్‌లో భేటి, శ్రీనివాస్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ గత నెల 28 వతేదీ నాటి ఘటనపై నివేదిక తెప్పించుకొని శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంటామని నేతలకు పీసీసీ అధ్యక్షుని హామీ. సానుకూలంగా స్పందించిన మహేశ్‌కుమార్ గౌడ్. గత నెల 28వ తేదీన కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమళ్ల శ్రీనివాస్ పరోక్షంగా దూషణలకు దిగిన అంశంపై ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పార్టీ పరిశీలకులు, ముఖ్యనేతల నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చారు. పార్టీ పరువు తీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, బీజేపీ, బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందం చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్‌పై దూషణలకు దిగుతూ, పార్టీ పరువు తీస్తున్న పురుమళ్లను శ్రీనివాస్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో కరీంనగర్ జిల్లాకు రెండు వందల మంది కాంగ్రెస్ ముఖ్యనేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రెండు వందల మంది స్వచ్ఛందంగా మూకుమ్మడిగా సంతకాలు సేకరించి హైదరాబాద్ లోని గాంధీభవన్‌కు తరలివెళ్లారు. వెలిచాల రాజేందర్ రావు అధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిశారు. మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పురుమళ్ల శ్రీనివాస్‌ను వెంటనే బహిష్కరించాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని విన్నవించారు. ఈసందర్భంగా పురుమళ్ల వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడితో సుదీర్ఘంగా చర్చించారు. గత నెల 28వ తేదీన జరిగిన సమావేశంలో పురుమళ్ల మంత్రి పొన్నంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలు, మంత్రిపై అక్కసు వెళ్లగక్కుతున్న వైనం, ఆయనతో పార్టీకి జరుగుతున్న నష్టం, తదితర అంశాలను ముఖ్యనేతలు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని విషయాలను పీసీసీ అధ్యక్షులు ఓపికగా విన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నేతలతో పీసీసీ అధ్యక్షులు మాట్లాడారు. పురుమళ్ల వ్యవహారాన్ని పార్టీ నేతల నుంచి తెలుసుకున్నానని, వెలిచాల రాజేందర్ రావు తన దృష్టికి తీసుకొచ్చారని, పూర్తి వివరాలతో నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. మీరు ఏలాంటి ఆందోళన చెందవద్దు, పార్టీలో అధిష్టానమే సుప్రీం, వారి ఆదేశాలను పాటించాలని సూచించారు. బహిరంగంగా విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీసే వారిని ఉపేక్షించమని, సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై శ్రీనివాస్ వ్యక్తిగతంగా దూషణలకు దిగడం పద్దతి కాదని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి సానుకూలంగా చర్చించుకుంటే బాగుంటుందని తెలిపారు. ఇలా వ్యవహరించడం బాగా లేదని, శ్రీనివాస్ తీరు సరిగా లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, మరో వైపు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పీసీసీ అధ్యక్షులు నేతలకు సూచించారు. పురుమళ్ల పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు-కాంగ్రెస్ ముఖ్యనేతలు పురుమళ్ల శ్రీనివాస్ వ్యవహారం రోజు రోజుకు శృతిమించుతున్నదని, బీజేపీ, బీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని పార్టీలోనే ప్రతిపక్ష నేతలాగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలుగుతున్నదని పీసీసీ అధ్యక్షుని దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చారు. కరీంనగర్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారిందని, శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ పెద్దలే తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గత నెల 28వ తేదీ సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సన్నాహాక సమావేశం జరిగిందనీ, దీనికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ పరిశీలకులు, ఇతర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని వివరించారు. పురుమళ్ల శ్రీనివాస్ కుట్రపూరితంగా అలజడి సృష్టించేందుకు హాజరై మంత్రి పొన్నంపై పరోక్షంగా దుర్భాషలాడారని పేర్కొన్నారు. సమావేశానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకులు, పార్టీ పెద్దల ముందే పార్టీ లైన్ దాటి తమరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే శ్రీనివాస్‌పై తిరగబడ్డారని తెలిపారు. ఇప్పటికే పార్టీ పెద్దలు ఆయనకు రెండు సార్లు షోకాజ్ నోటీస్ అందించారని, అయినా ఆయనపై ఏలాంటి చర్య మాత్రం తీసుకోలేదనీ, పట్టపగ్గాల్లేకుండా నీచంగా పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని విన్నవించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు శ్రీనివాస్ అమ్ముడుపోయారని ఫిర్యాదు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందం చేసుకొని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని, ఇలాంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని కోరారు. లేకపోతే కరీంనగర్లో పార్టీకి భవిష్యత్ ఉండదని పేర్కొన్నారు. ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనద్ రహమాత్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మడుపు మోహన్, తుమ్మనపల్లి శ్రీనివాస రావు, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ పురం రాజేశం, జిల్లా గౌడ్ సంఘ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఆకుల నరసన్న నర్మదా, కోటగిరి భూమా గౌడ్, గంట కళ్యాణి శ్రీనివాస్, మల్లికార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, పత్తెమ్ మోహన్, మాచర్ల ప్రసాద్, మాజీ ఎంపీపీ సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, జక్కని ఉమాపతి బొమ్మ ఈశ్వర్ గౌడ్, బోనాల మురళి, గడ్డం శ్రీరాములు, మాచర్ల అంజయ్య గౌడ్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్, బత్తిని చంద్రయ్య, అనరాసు కుమార్, కుంబాల రాజ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం-బీజేపీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం వారికి మనస్పూర్తిగా యావత్ తెలంగాణ మరియు భారతదేశ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెళ్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు కాడే నర్సింగమ్, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిత్తవేణి అంజిబాబు, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, మండల యువ మోర్చ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, ఉత్తేమ్ కనుకరాజు, దైవల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు వీరనాగమ్మ పండుగను నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామంలో గత రెండు రోజులుగా ఆరెకటిక కులస్తులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తికి ముక్తికి అమ్మవారు ప్రసిద్ధి చెందారు.
కుక్కలు దాడి చేసి జింకను చంపేసాయి. ఈ ఘటన నిజాంపేట మండలం చల్మెడ గ్రామ శివారులో గల మామిడి తోటలో జరిగింది. స్థానికుల వివరాలు జింకను కుక్కలు వెంబడిస్తూ తరుముకుంటూ వస్తున్నా క్రమంలో రైతు సంతోష్ రెడ్డీ అది గమనించి జింకను కుక్కల నుండి రక్షించిన ఫలితం లేకుండా పోయింది. స్థానిక పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, సోహిల్, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.
బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల ప్రకారం రాబోయే జనాభా లెక్కల్లో ,కుల గణన చేర్చాలని తీసుకున్నా నిర్ణయం చారిత్రాత్మకమని ఈ నిర్ణయం తీసుకున్న శుభ తరుణంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇన్నేళ్లు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ ఏనాడు తీసుకొనటు వంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయ మని రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం గణన అనేది కేంద్ర జాబితాలోని 69 అంశం గా ఉందని, జనగణన కుల గణన బాధ్యత పూర్తిగా కేంద్ర పరిధిలోనిదే రాజకీయ దురుద్దేశంతోటే కావాలనే కొన్ని రాష్ట్రాల్లో తమకు అధికారం లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలు అశాస్త్రీయం గా సేకరించాయి ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూ డదు అన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని అంతేకాకుండా ఈ దేశాన్ని 70 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ కులగనానికి ఎప్పుడు వ్యతిరేకమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్వహిం చిన ఏ జనాభా గణనలో కూడా కులగణను కాంగ్రెస్ ప్రభుత్వాలు చేర్చలేదని 2010 అప్పటి ప్రధాన మంత్రి మన్మో హన్ సింగ్ కులగణన అంశాన్ని పరిశీలిస్తామని లోక్ సభకు హామీ ఇచ్చారు అంశంపై అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు అనుకూలంగా వారి అభిప్రా యాలు తెలిపిన కూడా కులగణన చేయలేదని ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటు న్నారని మన రాష్ట్రంలో సర్వేల పేరుతో కులగణన నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం సరైన లెక్కలను చూపెట్టక తప్పులతడకగా చూపెట్టడానికి ఇదొక నిదర్శనం అని ఇలాంటి సర్వేలతో కులగణన చేయడం వల్ల సమాజంలో సందేహాలు వస్తాయని ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని దేశంలోని సున్నితమైన సామా జిక నిర్మాణం రాజకీయల వల్ల చెడిపోకూడదని అంశంతో ఈ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు ఈ కులగణన వల్ల రేపు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగు తుందని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, సీనియర్ నాయకులు,బూర ఈశ్వరయ్య, భూతం తిరుపతి, కోమటి రాజశేఖర్, మేకల సుమ, బూత్ అధ్యక్షులు, కడారి చంద్రమౌళి, కన్నెబోయిన రమేష్, ఎర్ర తిరుపతిరెడ్డి, చిందం గణేష్, బత్తుల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు
అంకుష్, కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ బొల్లె పెల్లి వీరన్న
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన ఎండి అంకుష్ నాలుగు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అనారోగ్య కారణాల వలన హాస్పటల్, లో చేరి శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు పోతుగల్లు గ్రామంలో అంకుష్ కుటుంబాన్ని కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుని ఆత్మ శాంతి చేకూర్చాలని పార్టీహదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన. మాజీ సర్పంచ్ బొల్లపల్లివీరన్న ఈ కార్యక్రమంలో, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు.
*సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.వెంకటరత్నం డిమాండ్..
తిరుపతి(నేటి ధాత్రి) మే 02:
తెలంగాణ చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలని సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటరత్నం డిమాండ్ చేశారు. కగార్ ఆపరేషన్ ను నిరసిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పి వెంకటరత్నం మాట్లాడుతూ మోది నాయకత్వంలో నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ కేంద్రం సాయుధ బలగాలను రంగంలో దింపి అడవులను జల్లెడ పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న అమాయక గిరిజనులు తూటాలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాల దాష్టికాన్ని తట్టుకోలేక గిరిజనులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ప్రకృతిని నమ్ముకుని నివసిస్తున్న అమాయకులను బలి తీసుకోవడం దుర్మార్గమైన చర్యని ఆయన మండిపడ్డారు. నక్సలైట్ల ఏరివేత పేరుతో అటవీ ప్రాంతాల్లోని విలువైన ఖనిజ సంపాదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుందని ఆయన ఆరోపించారు. తక్షణం కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.వెంకయ్య, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ పి.లోకేష్, పి ఓ డబ్ల్యు తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం.అరుణ అలాగే వెంకటేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..
నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయాలని ఉద్దేశంతో జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ ఉమెన్స్ చైల్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిజాంపేట మండలం నస్కల్ లో ఏర్పాటు చేశారు. నిజాంపేట, రామాయంపేట ఉమ్మడి మండల కు సంబంధించి ఆర్ఎంపి పి.ఎం.పి యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు. బిపి, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి అలాగే ఉచిత మందులను అందించి ఆర్.ఎం.పి డాక్టర్లకు సిపిఆర్ గురించి వివరించారు.
భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 అందుకున్న డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ.
చిట్యాల నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి పెళ్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గిన్నారపు ఆదినారాయణపశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో భారతీయ భాషా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 కార్యక్రమంలో తెలుగు భాష నుండి డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ లోహియా అవార్డును బహూకరించారు.భారతీయ భాషలు, సాహిత్యంలో కృషి చేసిన యువ పరిశోధకులు, రచయితలను సత్కరించే ఈ కార్యక్రమంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ సేవలను కొనియాడారు. ప్రొఫెసర్ అనురాధ లోహియా మాట్లాడుతూ, “ఈ యువ అవార్డు గ్రహీతలు భావి సమాజ చైతన్యానికి మార్గదర్శకులు. వీరి సాహిత్య కృషి భారతీయ భాషల సంరక్షణ, ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది,” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో భారతీయ భాషా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కుసుమ్ ఖేమాని, డైరెక్టర్ శ్రీ శంభునాథ్, ఉపాధ్యక్షులు ప్రదీప్ చోప్రా, సుశీల్ కాంతి తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (పార్ట్‌టైమ్)గా సేవలందిస్తున్నారు. కవిగా, రచయితగా గుర్తింపు పొందిన వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి దళిత ఆత్మకథలపై డాక్టరేట్, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంపై ఎం.ఫిల్ పూర్తిచేశారు. ‘నానీల సుగుంధం’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించిన ఆయన, యుజిసి కేర్ లిస్టెడ్ పరిశోధన పత్రికలతో పాటు దిన, మాస పత్రికల్లో అనేక వ్యాసాలు, కవితలు రాశారు.తెలుగు భాష, సాహిత్యంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిదాయకమని, ఈ అవార్డు వారి పరిశోధన, సాహిత్య సేవలకు గుర్తింపు గా నిలుస్తుందని భారతీయ భాషా పరిషత్ పేర్కొంది.
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో గల ఎస్వీకేకే ఫంక్షన్ హాల్ ఘనంగా ప్రమాణ స్వీకారం మహోత్సవం జరుపుకున్నారు. రాష్ట్ర,జిల్లా నాయకులు మాట్లాడుతూ పద్మశాలీల అంతా ఏకతాటిపై నడిచి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు రాజకీయ ప్రాధాన్య త గురి చేస్తూ భవిష్యత్తులో తమకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.సీట్ల కేటాయింపులో వెనుకబడి ఉన్న పద్మశాలీలకు రాజకీయంలోకి రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాలని అన్నారు. జియో టాకింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి చేనేత బీమా, చేనేత భరోసా పథకాలను అందించేలా ప్రభుత్వం దృష్టి చేయాల న్నారు చేనేత సంఘం పటిష్టం కోసం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
Congress party
మండల కేంద్రంలో ఉన్న అన్ని గ్రామాbల అధ్యక్షులను ప్రధాన కార్యదర్శి కోశాధికారులను సమావేశంలో ఘనంగా సన్మానించారు.
బీసీ కుల గణన వెంటనే అమలు చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
కాంగ్రెస్ పార్టీ కులగణను చేపట్టి తర్వాత కేంద్రం దిగివచ్చి కుల గణన చేయడం హర్షణీయమని అన్నారు బీసీ కులదనులకు 150 మందికి ఒక వ్యక్తిని కేటాయించి వాడ వాడల పోస్టర్లు అతికించి ఒక తేదీ ప్రకటించి బీసీ కుల గణన 58.8% గా ఉందని నిర్ధారించారు.96% మంది కుల గణన చేయడానికి అవసరమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన చేసి బీసీ లకు చట్టబద్ధత చేయడం జరుగుతుంది. 2029లో బీసీ కుల గణన చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఉపయోగిస్తారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర,జిల్లా, మండల, గ్రామలలో ఉన్న పద్మశాలం దరూ పాల్గొన్నారు
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25000/- నష్ట పరిహారం అందించాలి –
మాజీ పి ఎ సి ఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
మిల్లర్లు రైతులకు సహకరించాలి
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలంలో అకాల వర్షం కారణంగా మండలంలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని , పంట చేతికచ్చే సమయానికి రైతులపై పకృతి విలయతాండవం చేసిందని, రెండు రోజులుగా కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఇ పరిస్థితులను విపత్తుగా పరిగణలోకి తీసుకొని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 25000/- అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులు, జిల్లా మంత్రి చొరవ తీసుకుని రైతులను ఆదుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు మిల్లర్లు రైతులకు సహకరించాలని, సివిల్ సప్లై అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు భరోసా కల్పించాలని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.
గణపురం మండల కేంద్రంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికి అంది వచ్చిన పంట పొలాలు నీట మునిగి కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గణపురం మండలానికి చెందిన కౌలు రైతు గుర్రం తిరుపతి గౌడ్ అనే రైతు 10 ఎకరాల లో వరి పంట సాగు చేయడం జరిగింది మొన్న కురిసిన అకాల వర్షం కారణంగా వరి పంట మొత్తం నీట మునిగి నష్టం వాటిల్లిందని కౌలు రైతు ఆవేదన వ్యక్తం తెలిపాడు కౌలు రైతులు పంట పొలాలకు ఎంతో పెట్టుబడింది పెట్టి కష్టపడి పండిస్తున్న పంట చేతికి వచ్చే. సమయానికి అకాల వర్షం వల్ల నష్టాలు జరిగే కౌలు రైతులు పెట్టిన పెట్టుబడి చేతికి అందక అప్పుల పాలు అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు గానీ కౌలు రైతులను ఆదుకోవాలి అని తెలిపారు
గణపురం మండల కేంద్రం లో మాట్లాడుతూ కులగనన నిర్వహించడం చరిత్రలో మిగిలి పోయే నిర్ణయం అని దీపక్ పటేల్ అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సంవత్సరాల కలను నిజం చేసి భారతదేశ వ్యాప్తంగా కులగనన చేయడం శుభపరిణామం అని కానియాడారు బీసీ లు ఇకనైనా ఆర్థికంగా, రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పిలపునిచ్చారు ఈకార్యక్రమంలో గండు రమేష్ పటేల్ జంగిలి శ్రీనివాస్ పటేల్ బోట్ల శ్రీనివాస్ పటేల్ మండల మున్నూరుకాపు సంఘము సభ్యులు పాల్గొన్నారు.
కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరామిరెడ్డి గొప్ప సంఘ సేవకులు , విద్యాదాత, మతసామరస్యం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని ప్రతి మనిషికి చదువు తప్పక అవసరమని పేద విద్యార్థుల కోసం ఎన్నో బడులకు, కళాశాలలకు, వసతిగృహాలకు, డబ్బులు దానం చేసిన గొప్పదాత అని అన్నారు. హైదరాబాద్ నగరంలో రెడ్డి పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా రెడ్డి హాస్టల్ ని నెలకొల్పిన వ్యక్తి బహదూర్ వెంకట రామిరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగు మామిడి కృష్ణారెడ్డి ఎడుమల,హనుమంత రెడ్డి,వేసి రెడ్డి రామిరెడ్డి, కుంబాల మల్లారెడ్డి,కంది భాస్కర్ రెడ్డి, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన శ్రీ కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించినందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ ర్యాంకులు,గ్రేడ్లు ప్రాముఖ్యత కాకుండా ఆవరేజ్ విద్యార్థులను తీసుకొని అందరినీ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్న శ్రీ కృష్ణవేణి హై స్కూల్ ఉపాధ్యాయులు యాజమాన్యం ప్రతి సంవత్సరం నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నారు.భవిష్యత్తులో విద్యార్థులు విద్యావంతులు కావడానికి వారే స్వయం నిర్ణయాన్ని తీసుకోవాలని అనేక రంగాలలో ప్రవేశించడానికి( ఐటిఐ, పాలిటెక్నిక్,డిప్లమా కోర్సులు, ఇంటర్మీడియట్) తదితర కోర్సులలో ప్రవేశించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని,ఎవరిని బలవంతం పెట్టకుండా భవిష్యత్తులో మంచి మార్గం ఎన్నుకోవడానికి విద్యార్థులను కృషి చేయాలని కోరారు.
అకాల వర్షానికి కూలిన ఇండ్లు బాధితులకు భరోసా కల్పించిన బీఆర్ఎస్ నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామ పంచాయతీలోని గోపాల్ పూర్,శివ్వారం గ్రామాలలో గురువారం రాత్రి వీచిన గాలివానకు ఇండ్లు పూర్తిగా దెబ్బతిని,పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసం అయి పలు కుటుంబాలకు నిలువ నీడ లేకుండా మారిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో నష్టపోయిన బాధితులను పరామర్శించి,ఆర్థిక సాయం అందించి,బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
ఉప్పల్ భగాయత్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా ఉప్పల్ వార్డు ఆఫీస్ లో జిహెచ్ ఎం సి అధికారులు మరియు ఉప్పల్ హెచ్ఎండిఏ బాగాయత్ రెసిడెన్షల్ వెల్ఫర్ అసోసియేషన్ సభ్యుల సామావేశం లో కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సిబ్బంది నియామకం, డస్ట్ బిన్‌ల ఏర్పాటు వంటి అంశాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు, సిబ్బంది కూడా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఉప్పల్ సర్కిల్‌లోన పారిశుద్ధ్య విభాగం, వీధి దీపాల నిర్వహణకు విద్యుత్ శాఖ అధికారులతో కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య సిబ్బంది నియామక ప్రక్రియ తుది దశలో ఉందని ఈ సందర్భంగా రజితాపరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మొదటి విడతలోనే భగాయత్‌లో పారిశుద్ధ్యం కోసం 25 మంది సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. అతి త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రెండో విడతలో ఇంకా కావాల్సిన పారిశుద్ధ్య కార్మికుల నియామకం జరుగుతుందన్నారు.
Sanitation.
భగాయత్‌లోని వీధుల్లో చెత్త వేయకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్టుగా రజితాపరమేశ్వర్‌రెడ్డి చెప్పారు. భగాయత్‌లోని అన్ని వీధుల్లో చెత్త డబ్బాలను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేశామన్నారు.
వీధి దీపాల నిర్వహణపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా రజితాపరమేశ్వర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే భగాయత్ లో వీధి దీపాల ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏఎంహెచ్ ఓ రంజిత్ ,జి హెచ్ ఎంసీ ఎలక్ట్రికల్ డిఈ రవీందర్, ఏ ఈ టి ఆర్ ప్రసాద్ ,ఉప్పల్ హెచ్ ఎం డి ఎ బాగాయత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రావు గారు సుధాకర్ రెడ్డి ,వంశీ దార్ రెడ్డి ,ఈగ సంతోష్,లింగంపల్లి రామకృష్ణ,చిరంజీవి రెడ్డి ,మహేష్,నరేంద్ర చౌదరి ,మనోహర్ రెడ్డి ,అంజి రెడ్డి ,శివ ప్రసాద్ శుభన్ రెడ్డి సామ్ జంగయ్య పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధం ..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి సుమారు 3500 వరకు మంజూరి అయినవి ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంతకు ముందు ప్రభుత్వం నుండి లబ్దిపొందిన వారు కాకుండా, ఇల్లు లేని వారికి,స్వంత ప్లాటు ఉండి ఇల్లు కట్టే స్థోమత లేని వారికి,దివ్యాoగులకు,ఒంటరి మహిళలకు,వితంతువులకు,అనాదలకు,పాకిపని వారికి,మొదటి ప్రాధాన్యత ఇచ్చి గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది కానీ ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జరిగిన తీరును పరిశీలిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు ఉన్న వారికి,ఇంతకు ముందు లబ్దిపొందిన వారికి కేటాయించినట్లు తెలుస్తున్నది. ఈ ఇండ్లకు ప్రభుత్వం ఇచ్చేది కేవలం 5 లక్షలు మాత్రమే దానికి అధికారులు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టాలని నిర్బంధం చేస్తున్నారు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టితే 2రేట్లు అధిక వ్యయం అయ్యే అవకాశం ఉంది మిగతా డబ్బులు వారు ఎక్కడి నుండి తేవాలి వారు ముందే బీదవారు ఇల్లు కట్టలేని పస్థితిలో ఉన్నప్పుడు ఈ అధిక వ్యయం ఎక్కడినుండి తేవాలి అదనపు భారం కొరకు తప్పని సరి అప్పులు చేయాల్సిన పరిస్థితి అంటే ఇండ్లు పొందిన వారు అప్పుల పాలు కావల్సిందేన కాబట్టి ప్రభుత్వం,అధికారులు కేవలం నాయకులు చెప్పిన వారికి కాకుండా నిబంధనల ప్రకారం అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని,మరియు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు సరిపడే విధంగా ఇంటి ప్లాన్ కుదించాలని,ఆపై ఇల్లు కట్టు కుంటే లబ్ధిదారుల ఇష్టానికి వదలాలని డిమాండ్.ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్శింలు,యస్.గోపాల్,పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి జైపూర్ మండలంలోని ఇందారం,టేకుమట్ల, కిష్టాపూర్,వేలాల గ్రామపంచాయతీలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఎక్కడ ఉండకూడదని,క్రమం తప్పకుండా డ్రై వేస్ట్ కలెక్షన్ చేయాలని,డ్రైనేజీలలో పూర్తిస్థాయిలో మట్టి తీయాలని,క్రమం తప్పకుండా రికార్డులను అప్డేట్ చేయాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది. గనుక ముందస్తుగా గ్రామంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని,అదేవిధంగా నీటిని పంపిణీ చేసే ప్రతిసారి బ్లీచింగ్ పౌడర్ కలపాలని,క్రమం తప్పకుండా నీటిని పరీక్షించాలని,వేస్ట్ కలెక్షన్ రిజిస్టర్,కంపోస్ట్ కంజుమ్షన్ రిజిస్టర్ నిర్వహించాలని,క్యాష్ ఇన్ హ్యాండ్ త్వరగా గ్రామపంచాయతీ సాధారణ నిధికి జమ చేయాలని,విధి నిర్వహణలో ప్రతిక్షణం చాలా అప్రమత్తంగా ఉండాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గురువారం రాత్రి సంభవించిన గాలి దుమారానికి ఎగిరిపోయిన నర్సరీ షేడ్ నెట్ ను సరిచేయాలని,చలివేంద్రంలో వాటర్ క్రమం తప్పకుండా నింపాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,పంచాయితీ కార్యదర్శులు ఏ.సుమన్,ఆర్. శ్రావణి,ఎల్.ప్రశాంత్,రాకేష్ గ్రామపంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.