కేంద్ర జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం.

కేంద్ర జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం

బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణన, కులగణన చేపడతామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని, కులగణనతో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్రం నిర్ణయానికి ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఈ విజయం తమదే అంటూ గొప్పులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.60 యేండ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కులగణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణన, జనగణనలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే భారతీయులందరూ భాగస్వాములు కావాలని సందీప్ పేర్కొన్నారు.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో రెండవ దశ ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్ష విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎనబై మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఫలితాలను పెంపోందించెందుకు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి అవకాశాలను విద్యార్థులకు అందేలా ప్రోత్సహించాలని, ఈకార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వసతులు కల్పిస్తూ, ప్రోత్సాహన్ని అందిస్తున్న ఆల్పోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ప్రస్తుతం యాభై ఏడు మంది నుండి మూడవ బ్యాచ్ డెబ్బై ఐదు మందిగా తిరిగివచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కోరారు. ఈకార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, రామడుగు తాహశీల్దార్ రాజేశ్వరి, విఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం.

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

◆ సందర్భంగా పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ
శుభాభినందనలు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ సందర్భంగా జహీరాబాద్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ సోదర, సోదరీమణులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. “పత్రికా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభం. సత్యాన్ని వెలికి తీసే కర్తవ్య నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాత్రికేయులు చూపే నిబద్ధత, ధైర్యం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. సమాజంలో వారి సేవ అమూల్యం” అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం.. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించటం మీడియా కర్తవ్యం.. నిష్పక్షపాతంగా వృత్తి నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులకు వందనం..ఒక సందేశంలో పేర్కొన్నారు.

నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

పహల్గామ్ దాడికి నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతంగా కొసాగింది. ఈ బందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించారు. అమాయకులైన పర్యాటకులను ముష్కరులు లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడడం హేయనీయమైన చర్య అని అందుకే స్వచ్ఛందంగా బందు పాటిస్తున్నామని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు

మంగపేట నేటి ధాత్రి

 

 

మంగపేట మండలంలో శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో శివాలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కస్తూరిబాయి వృద్ధాశ్రయంలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ,జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ, పి ఎ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,మండల సీనియర్ నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,వాలీబాబా, తడూరి రఘు ,మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, మేడారం మాజీ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్, పి ఎ సి ఎస్ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు ,జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, మండల నాయకురాలు పార్వతి, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ నూతన సీఐగా పదవి బాధ్యతలను చేపట్టిన లేతాకుల రఘుపతి రెడ్డిని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.అనంతరం పుష్పగుచ్చం అందించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ అయూబ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు దూదేల సాంబయ్య, వేముల సారంగం, నర్సంపేట పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నాంపల్లి వెంకటేశ్వర్లు,నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజ్ మురళీ, మాజీ వార్డు సభ్యులు గాజుల రమేష్, గండి గిరి, నాగుర్లపల్లి మాజీ సర్పంచ్ రాజహంస, 1వ వార్డు అధ్యక్షులు లాక్కార్స్ రమేష్, 5వ వార్డు అధ్యక్షులు పున్నం నరసింహారెడ్డి, 8వ వార్డు అధ్యక్షులు గిరగని రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగొని శ్రీనివాస్, 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, ఎరుకల రమేష్, హిందు రాజు, దేశి సాయి పటేల్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఐఎన్టియుసి కార్యాలయంలో ఐఎన్టియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంఘం సభ్యులు జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. కనీస వేతనాల బోర్డు చైర్మన్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ రాంబాబు, ఐఎన్టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘ బుచ్చయ్య, ఏరియా సెక్రెటరీ బత్తుల వేణు, సిహెచ్పి ఫిట్ సెక్రటరీ రాములు, సివిల్ ఫిట్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, కాసర్ల ప్రకాష్ ఐ ఎన్ టి యు సి నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం.

మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆ ర్ సి

వనపర్తి నేటిదాత్రి :

 

 

మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వరలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులో రాష్ట్ర రాజకీయ మాజీ కార్యదర్శి శ్రీశైలంమల్లికార్జున నిత్య అన్నదాన సత్రం డైరెక్టర్ కలకొండ రమేష్ చంద్ర ఆధ్వర్యంలోగుర్రం జగదీశ్వరయ్య
మల్లికార్జున్ లోటస్ సెలూన్ రామకృష్ణ కలిసిపూలబోకె ఇచ్చి శాలువతో రావులను ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

అధికారులు మారినా బోర్డులు మారలే.!

అధికారులు మారినా బోర్డులు మారలే..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల తహసిల్దార్ కార్యాలయంలో నయబ్ తహసిల్దార్ బదిలీ అయి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు మాత్రం పాతదాన్నే కొనసాగిస్తోన్నారు. ఈ బోర్డులో సమాచారాన్ని అం దించే అధికారుల పేర్లు లేకపోవడంతో ప్రజలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలనే అయోమయంలో ఉన్నారు. ఇందులో సీనియర్ సహాయకులు ఎవరన్నది ఇప్పటి వరకు బోర్డులోను, కార్యాలయంలోను లేకపోవడం గమనార్హం. కొత్త అధికారుల వివరాలతో బోర్డును నవీకరిం చకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, వెంటనే బోర్డు మార్చాలని వివిధ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా.!

వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా మే 6వ తేదీ మంగళవారం జహీరాబాద్‌లో జరిగే మహిళల నిరసన సమావేశంలో పాల్గొనమని విజ్ఞప్తి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రారంభించిన దేశవ్యాప్త నిరసన ఉద్యమం “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్”లో భాగంగా, “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్” అనే పేరుతో మహిళల చారిత్రాత్మక కేంద్ర సర్వసభ్య నిరసన సమావేశం 2025 మే 6 మంగళవారం ఉదయం 10:01 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు స్థానిక ప్రచారకర్త హజ్రత్ మౌలానా అతిక్ అహ్మద్ కాస్మి అధ్యక్షతన జరుగుతుందని ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి కానో మరియు ఎండోమెంట్స్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ జహీరాబాద్ తెలియజేశారు. ఈ సమావేశానికి హజ్రత్ మౌలానా ఘియాస్ అహ్మద్ రషాది, కన్వేజ్, వక్ఫ్ బచా క్యాంపెయిన్, తెలంగాణ, శ్రీమతి న్యాయవాది జలీసా యాస్మిన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ఇంచార్జి, వీరితో పాటు జామియా గుల్షాన్ గర్ల్ టీచర్స్ డిపార్ట్‌మెంట్ హెడ్, జామియా గుల్షన్ హనీస్ ఖైరీ- జమాతే ఇస్లామీ మహిళా విభాగం అధిపతి బుష్రా అఫ్రోజ్, సున్నీ దావత్-ఏ-ఇస్లామీ మహిళా విభాగం ఇన్‌చార్జి జహీర్ అబా, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ – ముఫ్తీ నజీర్ అహ్మద్ హస్సామీ, మిస్టర్ ముహమ్మద్ నజీముద్దీన్ ఘోరీ, స్థానిక జమాత్ ఘోరీ ఈ సమావేశానికి సయ్యద్ జియావుద్దీన్ మౌలానా మసూమ్ ఆలం కూడా హాజరుకానున్నారు. జహీరాబాద్ నగరం మరియు హదీసు పరిసర ప్రాంతాల మహిళలు మరియు బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ జాతీయ ఐక్యత మరియు ఇస్లామిక్ మద్దతును ప్రదర్శించాలని జమియత్ ఉలేమా, జమాతే-ఇ-ఇస్లామి, సఫా బైతుల్ మల్, సున్నీ దావత్-ఇ-ఇస్లామి, జమియత్ అహ్లే యాత్ ముస్లిం యాక్షన్ కమిటీ మరియు అన్ని ఇతర సంస్థల నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఉద్రిక్తతల నడుమ కోలుకుంటున్న కాశ్మీరం

ఆర్థికంగా దెబ్బకొట్టిన ఒకే ఒక సంఘటన

మూకుమ్మడిగా బుకింగ్‌లు రద్దుచేసుకున్న పర్యాటకులు

రద్దు చేసుకున్నవారిలో ముంబై, పూణె, బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌ పర్యాటకులు

స్థానికుల్లో ఉగ్రవాదులపట్ల ఆగ్రహావేశాలు

జీవనోపాధిని దెబ్బకొట్టారన్న బాధ

ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న పర్యాటకులు

పరిస్థితి చక్కబడితే మళ్లీ పర్యాటకుల సందడి 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26మంది అమాయక పర్యాటకును ఉగ్రమూకలు పొట్టనపెట్టుకున్న సంఘటన జరిగి పదిరోజులు కావస్తోంది. ఇప్పటికీ పహల్గామ్‌ ప్రాంతం ఈ షాక్‌నుంచి తేరుకోలేదు. అయితే ఇప్పుడిప్పుడే పర్యాటకులు వస్తుండటంతో స్థానికుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పదిరోజులవరకు పోటెత్తిన పర్యాటకులతో కళకళలాడిన పహల్గామ్‌ ప్రాంతం ఉగ్రసంఘటనతో ఒక్కసారిగా వెలవెలపోయింది. అప్పటివరకు పర్యాటకుల వల్ల వస్తున్న ఆదాయంతో ఎంతో సంతోషంగా వున్న స్థానికుల్లో జీవనాధారం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. శీతాకాలం వారికి ఎటువంటి ఆదాయం వుండదు. ఈ ఎండాకాలంలోనే సంపాదించుకునే ఆదాయమే కశ్మీరీలకు ఏడాది పొడవునా కడుపునా జీవనం గడవడానికి ఆధారం. అటువంటిది ఒక్కసారిగాఆదాయం కోల్పోవడంతో వారిలో తీవ్రమైన నిరాశ ఆవహించిందన్న మాట వాస్తవం. ఎందుకంటే కశ్మీర్‌ సందర్శించే ఒక పర్యాటకుడు రోజుకు సగటున రూ.10వేలు ఖర్చు చేస్తాడు. పర్యాట కుల సంఖ్యను బట్టి ఈ ఆదాయాన్ని లెక్కిస్తే, ఈ రంగం ఎంత చక్కటి జీవనోపాధిని కలిగిస్తున్నదీ అర్థమవుతుంది. ఎంతోకష్టపడి నిర్మించుకున్న ఆకాశహార్మ్యాన్ని ఒక్క అగ్గిపుల్లతో భస్మీపటలం చేయొచ్చు. ప్రస్తుతం పహల్గామ్‌ సంఘటన ద్వారా ఉగ్రవాదులు చేసిన పని ఇదే. పర్యాటక ‘హార్మ్యాన్ని’ కుప్పకూల్చడానికి యత్నించారు.

పర్యాటకానికి తాత్కాలిక బ్రేక్‌

 1988ా89 ప్రాంతంనుంచి అశాంతి, హింసాకాండ మధ్య నలిగిపోయిన కాశ్మీరంలో, 370 అధికరణం రద్దు తర్వాత ప్రగతి ఉషోదయ కాంతులు ప్రారంభమయ్యాయి. మాల్స్‌, సినిమా ధియేటర్లు తెరుచుకున్నాయి, హోటళ్లు, రిసార్టులు పర్యాటకులతో కళకళలాడాయి. స్థానిక కశ్మీరీలు తమ జీవనోపాధికి సంపాదించుకునే అవకాశాలు మళ్లీ మామూలు స్థితికి చేరుకోవడంతో వారి లో సుఖ సంతోషాలు మళ్లీ ప్రారంభయ్యాయి. గత ఆరేళ్లుగా ఎటువంటి ఉగ్రసంఘటన లేకపోవడంతో కశ్మీర్‌ వేగంగా మామూలు స్థితికి చేరుకుంది. సరిగ్గా ఇదేసమయంలో పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులను పొట్టనపెట్టుకోవడంతో ఇన్నేళ్లుగా క్రమంగా నెలకొంటూ వచ్చిన మామూలు స్థితికి బ్రేక్‌ పడిరది. ఒక్కసారిగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. తమ జీవితాలు మళ్లీ కొడిగట్టిపోతాయన్న భయం స్థానికుల్లో వ్యక్తమైంది. నిర్మానుష్యంగా వున్న ఈ ప్రాంతం మాదిరిగానే, కళతప్పిన కళ్లతో మళ్లీ స్థానికుల్లో దీనావస్థ మొదలైంది. జీవనోపాధి కోల్పోయిన స్థానికుల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ సంఘటన నేపథ్యంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

కట్టిపడేస్తున్న కశ్మీర్‌

కానీ భూతల స్వర్గమైన కశ్మీర్‌ పర్యాటకులను తన అందచందాలతో కట్టిపడేస్తూ పదేపదే వచ్చేలాఆహ్వానిస్తూనే వుంటుంది. ఇప్పుడు సరిగ్గా జరుగుతున్నదిదే. ఉగ్ర సంఘటన తర్వాత నిస్తేజంగా మిగిలిన పహల్గామ్‌ ప్రాంతంలో మళ్లీ పర్యాటకుల రాక మొదలైంది. నిజానికి ఉగ్రసంఘటన జరిగిన పహల్గామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని బైసరాన్‌ పర్వతాగ్రంపై వున్న పచ్చిక మైదానాల ప్రదేశాన్ని ‘స్విడ్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా’ అని పేర్కొంటారు. ప్రభుత్వం కూడా భద్రతా కార ణాల రీత్యా మొత్తం 87 పర్యాటక ప్రదేశాల్లో 48 వరకు ప్రభుత్వం మూసివేసింది. దూష్‌పత్రి, కోకెరాంగ్‌, దుక్సుమ్‌, సింథన్‌ టాప్‌, అచ్ఛాబల్‌, బంగస్‌ వ్యాలీ, మార్గాన్‌ టాప్‌, తోసా మైదాన్‌ వంటి పర్యాటక ప్రదేశాలు మూసివేసిన వాటిల్లో వున్నాయి.బుద్గాం లోని దూధ్‌పత్రి, అనంతనాగ్‌లోని వెరినాగ్‌ వంటి సుందర ప్రదేశాల్లోకి కూడా ప్రస్తుతం పర్యాటకులను అనుమతించరు. వీటి మూసివేతను అధికారికంగా ప్రకటించకపోయినా, వీటి ఎంట్రీ ప్రదేశాలు తాళాలు వేసి వుంటున్నాయి. గుల్‌మార్గ్‌, సోన్‌మార్గ్‌, మొఘల్‌ గార్డెన్స్‌, దాల్‌ లేక్‌ వంటి ప్రముఖ పర్యాటక ప్రాం తాలు ఇంకా తెరిచే వున్నాయని చెబుతున్నప్పటికీ మొఘల్‌ గార్డెన్స్‌లోకి ప్రవేశించే గేట్లు తెరుచుకోవడంలేదు.

ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్లు…

పాక్‌ ప్రేరిత ఉగ్రవాదంతో సతమతమైన ఈ ప్రాంతం, తిరిగి ఇప్పటి స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టిందనేది నిజం. గత ఏడాది కశ్మీర్‌ను సందర్శించిన వారి సంఖ్య 20మిలియన్లను దాటడం, ఇక్కడ పర్యాటకం ఏ స్థాయిలో ఊపందుకున్నదీ వెల్లడిస్తున్నది. అయితే ఉగ్రసంఘటనతర్వాత పూణె, ముంబయి, బెంగళూరు మరియు పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నారనేది టూర్‌ ఆపరేటర్లు చెబుతున్న మాట. 80 నుంచి 90శాతం బుకింగ్స్‌ రద్దయ్యాయని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే అడ్వాన్స్‌ మొత్తాలను చెల్లించిన పర్యాటకులు మాత్రం తమ పర్యాటక ప్రణాళికను యధాతథంగా కొనసాగిస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదిలావుండగా ఈ సంఘటన నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెన ప్రారంభం మరింత ఆలస్యం కాక తప్పదు. ఈ ప్రాంతంలోకి ఇప్పుడిప్పుడే వస్తున్న పెట్టు బడులపై కూడా ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే వున్న వ్యాపారాలు బిక్కుబిక్కు మంటూ కొనసాగించక తప్పని పరిస్థితి! ఇదిలావుండగా జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఏప్రిల్‌ 28న అసెంబ్లీలో చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ, మరణించిన 26మంది పేర్లు చదివి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరిని క్షమించమని అడగడానికి కూడా మాటలు రావడంలేదన్నారు. 

ఒక్క దాడితో మొత్తం తల్లక్రిందులు

నిజానికి 2025లో కశ్మీర్‌ జీఎస్‌డీపీ 7.06%గా వుండగలదని అంచనా. ఇది దేశ జీడీపీ కంటే ఎక్కువ! 2019 నుంచి 2025 వరకు రాష్ట్ర సమ్మిళిత వార్షిక ప్రగతి (సీఏజీఆర్‌) 4.89%గా న మోదైంది. ఫలితంగా 2025 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,703గా న మోదైంది. ఉగ్ర సంఘటనలు కూడా 2018లో 223 జరగ్గా 2023నాటికి 46కు పడిపోయాయి. సోపోర్‌ మండి వార్షిక టర్నోవర్‌ 2024లో రూ.7వేల కోట్లకు చేరుకుంది. కుప్వారా, బండిపుర, బారాముల్లా, బుద్గాం ప్రాంతాల ప్రజల జీవనోపాధిని ఈ మండి సుస్థిరం చేసింది. అదేవిధం గా 2020లో 34 లక్షలమంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శిస్తే, 2024 నాటికి వీరి సంఖ్య 2.36కోట్లకు చేరుకోవడం విశేషం. ఈ నాలుగేళ్ల కాలంలో పర్యాటకుల సంఖ్య ఇంత విపరీతంగా పెరగడం రాష్ట్ర ఆర్థిక పుష్టికి దోహదం చేసింది. ప్రస్తుతం కశ్మీర్‌లో పర్యాటక రంగంపై ఆధారపడి 1500 హౌజ్‌ బోట్లు, మూడువేలకు పైగా హోటల్‌ రూమ్‌లు, టాక్సీ ఆపరేటర్లు, టూర్‌ గైడ్‌లు, చేనేత వస్తువుల అమ్మకందార్లు, చిన్న గుర్రాలు (పోనీ)ల నిర్వాహకులు ఆధారపడి బతుకు తున్నారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ ప్రకటన, తర్వాత నాలుగు రోజులకు జరిగిన ఉగ్రదాడి ఈ మొత్తం కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవనోపాధులను అంధకారంలోకి నెట్టేసిందన డం అతిశయోక్తి కాదు. 

ఆత్మవిశ్వాసంతో పర్యాటకులు

వాస్తవానికి 1989 నుంచి పతాకస్థాయికి చేరిన ఉగ్రవాదం నేపథ్యంలో భద్రతా దళాలపైనే, ముష్కరులు దాడులు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి సాధారణ పర్యాటకులను పొట్టనపెట్టుకోవడంతో, సర్వేసర్వత్రా వారిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పహల్గామ్‌ వంటి ప్రాంతాలు రాష్ట్రానికి పర్యాటకపరంగా అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తాయి. సంఘటన తర్వాత ప ర్యాటకుల సంఖ్య పడిపోతే, స్థానికుల జీవనోపాధి మాత్రమే కాదు, రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పడిపోతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. శాల్వలు అమ్ముకునేవారు, డ్రైవర్లు, రి సార్టుల్లో పనిచేసే వర్కర్లు మొదలైనవారిలో ప్రస్తుతం అయోమయం నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న యాత్రికులతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దాడి తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అతుల్‌ కులకర్ణి వున్నారు. వియత్నాం కు చెందిన పర్యాటకులు కూడా పహల్గామ్‌లో సందడి చేశారు. తాము తొలిసారి కశ్మీర్‌ను సందర్శిస్తున్నామని, ఇక్కడి అందాలు తమను మంత్రముగ్ధులను చేస్తున్నాయని, తాము ఇక్కడి సౌం దర్యాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పడం విశేషం. భదేర్వాప్‌ా ప్రాంతాన్ని నేపాలీ సందర్శకుడు సందడి చేశాడు. ఇక్కడి పచ్చికమైదానంలో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించాడు. అంతేకా దు ఇక్కడికి వస్తున్న పర్యాటకులు కశ్మీర్‌లో పర్యటించాలన్న తమ నిర్ణయంలో ఎటువంటి మా ర్పు లేదని దృఢ నిశ్చయంతో చెబుతుండటం విశేషం. ఏదో ఒక్క సంఘటన జరిగిందని పర్యాటకులు తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకో వద్దని, కశ్మీర్‌ ఎల్లప్పుడూ తన స్వచ్ఛమైన సౌందర్యంతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతూనే వుంటుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్న మాట!

సన్న బియ్యం.. పేదలకు వరం.మిల్లర్లకు ఎప్పుడూ వుంటుంది సహకారం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం సరఫరా, మిల్లర్ల సమస్యలపై ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ ‘‘దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌’’ ఇచ్చిన సమాధానాలు…
`సన్న బియ్యం సరఫరా తెలంగాణ ప్రజల కళ్లలో నిండిన ఆనందం.

`సన్న బియ్యం అందించడం విప్లవాత్మక నిర్ణయం.

`రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల నుంచి ప్రశంసలు.

`నేను కమీషనర్‌గా వున్న సమయంలో ప్రారంభం గొప్ప అనుభూతి.

`నా ఉద్యోగ నిర్వహణలో ఇదొక ఛాలెంజ్‌.

`సన్న బియ్యం సరఫరా సాధ్యమే అని నిరూపించాం.

`పాలకుల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

`సన్న బియ్యం సరఫరాలో మిల్లర్ల పాత్ర కీలకం.

`మిల్లర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు వుంటాయి.

`ఏ మిల్లరైనా సరే నేరుగా వచ్చి వారి సమస్యలు చెప్పుకోవచ్చు.

`మిల్లర్ల వ్యవస్థ ఎంత బాగుంటే సన్న బియ్యం సరఫరా అంత బాగుంటుంది.

`సన్న బియ్యం సరఫరాపై ‘‘ఐఎస్‌ఓ’’ సర్టిఫికేట్‌ కూడా అందించింది.

`‘‘ఫైవ్‌ స్టార్‌’’ రేటింగ్‌తో సన్న బియ్యం సరఫరా సక్సెస్‌ అయ్యింది.

`ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు.

`ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి సన్న బియ్యం సరఫరా మీద వివరాలు తెలుసుకుంటున్నారు.

`తాజాగా జార్ఖండ్‌ నుంచి మంత్రితో పాటు, అధికారులు వచ్చారు.

`వారికి పరవ్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వడం జరిగింది.

`ఇప్పటికే ఐదు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

`వారి రాష్ట్రాలలో అమలు కోసం అవసరమైన సలహాలు తీసుకున్నారు.

`‘‘నలభై ఏళ్ల’’ క్రితం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.

`ఇప్పుడు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడమంటే గొప్ప కార్యక్రమం.

`ఆహార భద్రతలో తెలంగాణ నెంబర్‌ వన్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి

కట్టా రాఘవేంద్రరావు: సార్‌..నమస్తే..

దేవేంద్రసింగ్‌ చౌహాన్‌: నమేస్తే…

కట్టా: ఎలా వున్నారు?

చౌహాన్‌: బాగున్నాను..మీరు.

కట్టా: హపీ సార్‌…సన్నబియ్యం ఒక సంచలనం అంటున్నారు. ప్రజల్లో ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది?

చౌహాన్‌: నిజం చెప్పాలంటే ఇది ఒక అర్భుతమైన ఫీలింగ్‌ అని చెప్పాలి. పేద వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కంటే గొప్ప పథకం ఏముంటుంది. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వాల లక్ష్యం. అందులోనూ కూడు, గూడు, గుడ్డ కూడా సమకూర్చే పథకాల అమలు చేసిన ప్రభుత్వాలు ప్రజల హృదయాలలో నిలిచిపోతాయి. నిజానికి ప్రజలను ఆకలి బాధలు పడకుండా ప్రభుత్వాలు చూడడం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాకపోకపోయినా, సన్న బియ్యం పధకం కొత్తగా వుంది. ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆకలి తీర్చడంమొదలు పెట్టి కొన్ని దశాబ్దాలౌతోంది. కాని ఇంత విసృత స్ధాయిలో ప్రజలకు ఆహారభద్రత కల్పించడం అన్నది కొంత కాలం నుంచి మాత్రమే వస్తోంది. ముఖ్యంగా 1985 నుంచి ఈ పధకం గొప్పగా అమలు జరుగుతోంది. అప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అన్నది ఇప్పటికీ అమలు జరుగుతుండడం మంచి పరిణామం. అయితే రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అమలు మొదలై ఇప్పటికీ 40 సంవత్సరాలు గుడుస్తోంది. అప్పుడు మార్కెట్‌లో బియ్యం రేటు కూడా నాకు తెలిసి రూ.4 వరకు వుండొచ్చు. అప్పట్లో సన్న బియ్యం కూడా అదే ధరలో వుండొచ్చు. తర్వాత ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం సాద్యం కావడంలేదని కిలో బియ్యం రూ.5కు పెంచిన ప్రభుత్వంకూడా వుంది. కాని 1985లో ఎన్టీఆర్‌ సమయంలో రెండు రూపాయలకు కిలో బియ్యం అమలు జరిగిన తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం 1.90పైసలకు కిలో బియ్యం అందించింది. తర్వాత చంద్రబాబు నాయకుడు ప్రభుత్వం దాని ధర పెంచింది. 2004 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి కిలో రెండు రూపాయలకు మళ్లీ ఆ పదకం అమలు చేశారు. అయితే అప్పటికి మార్కెట్‌లో బియ్యం పది రూపాయలకు పైనే వుంది. తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి దానిని రూపాయికి చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బియ్యం సరఫరాచేస్తున్నప్పటికీ సన్నబియ్యం సరఫరా అన్నది ఒక విప్లవాత్మకమైనది. గతంలో ప్రభుత్వాలు హమీలు ఇచ్చాయి. కాని అమలు చేయలేదు. ఇప్పుడు మార్కెట్‌లో సన్న బియ్యం దరలు రూ.50 వరకు పలుకుతున్నాయి. అలాంటి సమయంలో ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఎవరైనా ప్రశంసించాల్సిందే. అంతే కాకుండా అది నేను కమీషనర్‌గా వున్న సమయంలో అమలు కావడం కూడా నా అదృష్టం. మొన్నటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం విషయంలో అనేక రకాల వార్తలు వుండేవి. ఆ బియ్యం ప్రజలు అమ్ముకొని, సన్న బియ్యం కొనుగోలు చేసుకునేవారు అనే వార్తలున్నాయి. కాని ఇప్పుడు ఆ బియ్యం స్ధానంలో సన్న బియ్యం ఇవ్వడం వల్ల, పేద ప్రజలపై కొంత భారం తగ్గింది. అందరూ సన్న బియ్యం తినే సమాజ నిర్మాణం జరిగిందంటే మామూలు విషయం కాదు. సామాన్యులకు సన్న బియ్యం తినాలన్న ఆశ తీర్చిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. బియ్యం తీసుకెళ్లిన వారు ఎంతో సంతోషంగా తింటున్నారు. గతంలో బియ్యం అమ్ముకొని మరిన్ని రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొంత మంది తెచ్చుకునేవారు. కాని ఇప్పుడే పేద, మద్య తరగతి, ఉన్నత వర్గం అన్న తేడా లేదు. తెలంగాణలో అందరూ సన్న బియ్యం తింటున్నారంటే గొప్ప విషయం.

కట్టా: సన్న బియ్యం పధకం అమలుపై ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ వచ్చింది? ఎలా ఫీల్‌ అవుతున్నారు?

చౌహాన్‌: ఇక ఆ సందర్భం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తున్నామా? లేదా? అన్నదే కాదు ఎంత క్యాలిటీ బియ్యం ఇస్తున్నామన్నది కూడా గుర్తించారు. మార్కెట్‌లో లభించే బియ్యం కన్నా, అదనంగా పోషకాలు వుండే బియ్యం కూడా కలిపి, ప్రజలకు ఆహార భద్రతే కాదు, ఆరోగ్య భద్రత కూడా చేకూర్చేలా బియ్యం సరఫరా జరుగుతోంది. అందుకే అంతర్జాతీయ స్దాయిలో తెలంగాణలో సన్న బియ్యం పధకం పేరుగాంచింది. ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ పౌరసరసరఫరాల శాఖకు అందించింది. అది ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రజలు ఎంతో సంబురంగా సన్న బియ్యం తింటున్నారు. వాళ్లంతా ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను.

కట్టా: ఈ పథకం అమలుపై ఇతర రాష్ట్రాలలో ఏదైనా ప్రభావం వుందా?

చౌహాన్‌: తెలంగాణలో సన్న బియ్యం పధకం అమలు అన్నది ఒక సంచనలంగా మారింది. అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్‌ ఊపందుకున్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల నుంచి వారి ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వస్తున్నారు. ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. సమయం కావాలని కోరుతున్నారు. తాజాగా రaార్ఖండ్‌ రాష్ట్ర మంత్రితోపాటు, ప్రతినిధి బృందం రావడం జరిగింది. ఎలా సాద్యమౌతుందన్న దానిపై వారికి పూర్తి వివరాలు అందించడం కూడా జరిగింది. అందుకు అవసరమైన డెమోతోపాటు, పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్లంతా ఆశ్యర్యపోయారు. తప్పకుండా తమ రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం అమలు చేయడం అన్నది నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. అందుకు ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ది, అంకితభావం వుంటే తప్ప జరగదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మానస పుత్రికగా సన్న బియ్యం పధకం అందరూ చెప్పుకుంటున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నబియ్యం పదకం అమలు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆ బాద్యతలు నిర్వర్తిన్న నాకు కూడా ఎంతో సంతోషంగా వుంది.

కట్టా: మీకు మరో ప్రశ్న. సన్న బియ్యం పదకం అమలులో కీలకమైన రైస్‌ మిల్లర్లు వారి సమస్యలున్నాయంటున్నారు?

చౌహాన్‌: నిజమే… సన్నబియ్యం పదకం అమలులో కీలకమైన పాత్ర పోషిస్తున్నది రైస్‌మిల్లర్లే. వారు బాగుంటేనే ఈ పదకం అమలు ఇంకా గొప్పగా సాగుతుంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.

కట్టా: మిల్లర్లు మీ దగ్గరకు రాలేకపోతున్నారట? వారి సమస్యలు చెప్పుకుంటారట?

చౌహన్‌: తప్పకుండా…రాష్ట్రంలోని ఏ మిల్లరైనా సరే నా వద్దకు రావొచ్చు. వారి సమస్యలు చెప్పుకోవచ్చు. అందుకు నేను ఎప్పుడూ సిద్దంగా వుంటాను. ఎలాంటి అపోహలు వద్దు. ఇంత పెద్ద సన్నబియ్యం కార్యక్రమం విజయవంతంగా అమలు జరగాలంటే ప్రతి మిల్లర్‌ కూడా ఎంతో ముఖ్యమే. అందులో చిన్నా పెద్దా అనే తేడాలేదు. మీ దృష్టికి వచ్చిన సమస్యలు కూడా మాకు చెప్పొచ్చు. మీ వద్దకు వచ్చి, సమస్యలు చెప్పిన మిల్లర్‌ను నా వద్దకు పంపించండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పాయింట్‌ మెంటు ఇస్తాను. వారి సమయం కేటాయించడంలో ఎలాంటి జాప్యం వుండదు. తెలంగాణ ఆహార భద్రతలో నెంబర్‌ వన్‌గా వుందంటే అందులో మిల్లర్ల పాత్ర కూడా వుంది. అలాంటి మిల్లర్లను నిర్లక్ష్యం చేయడం అనే సమస్యే ఉత్పన్నం కాదు. మిల్లర్లు ఒక్కరొస్తారా? లేక కొంతమంది కలిసి వస్తారా? అన్నది వారి ఇష్టం. నేను ఎప్పుడైనా వారికి అందుబాటులో వుంటాను.

కట్టా రాఘవేంద్రరావు: ధన్యవాదాలు సార్‌. మళ్లీ కలుద్దాం.

దేవేంద్ర సింగ్‌ చౌహన్‌: ధాంక్స్‌..ఆల్వేస్‌ వెల్‌కం.

ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ.!

ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా సయ్యద్ మోసిన్

వరంగల్ తూర్పు నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద హాస్పిటల్ అయిన, ఎంజీఎం హాస్పిటల్ నూతన డెవలప్మెంట్ కమిటీ శుక్రవారం హాస్పిటల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా వరంగల్ నగరం 25వ డివిజన్ కు చెందిన సయ్యద్ మోసిన్ నియామకం అయ్యారు. శుక్రవారం రోజు ఎంజిఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా మోసిన్ ఎంజీఎం ఆస్పత్రి లో ప్రమాణ స్వీకారం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గోపాల్ నవీన్ రాజ్, స్థానిక కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఎం డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సయ్యద్ మోసిన్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరి సస్పెండ్.

కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరి సస్పెండ్.
మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం పొనకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోరగాని రమేష్,బోరగాని మణికంఠ వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అసభ్య పదజాలంతో దూషించినందుకు గాను అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో గతంలో పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపారు.అయినా వారి ప్రవర్తనలో మార్పు జగగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పొనకల్ గ్రామ కమిటీ తీర్మానం చేయగా దానిని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయసినట్లు ఎర్రల్ల బాబు పేర్కొన్నారు.సస్పెండ్ ఐనా వారిద్దరికీ ఇక నుండి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి.

పంట నష్టపరిహారంపై స్పందించని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు…

బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులకు అండగా నిలబడాలి..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, గాలి బీభత్సానికి కోతకు వచ్చిన వరి,ఇతర పంటలు నేలమట్టం కావడంతో రైతులకు తీవ్రనష్టం జరిగిందని మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి
అవేదన వ్యక్తం చేశారు.పంట కోత సమయంలో జరిగిన నష్టం రైతును మానసికంగా కృంగదీసిందని ఆయన పేర్కొన్నారు.గాలి బీభత్సం,అకాల వర్షం వలన నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా పలు రకాల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
డివిజన్ పరిధిలో కొన్నిచోట్ల కోతలు పూర్తి చేసుకుని అమ్మకానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దైందన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని,పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు చెల్లించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఖానాపురం మండలంలో గత పది రోజుల క్రితం కురిసిన వర్షానికి పంట నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో స్థానిక రైతులుబిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తాను పరిశీలించి అధికారులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు,అధికారులు రైతులను పట్టించుకునే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తుండగా పోలీసులతో అరెస్టు చేయించారే తప్ప రైతులకు మాత్రం భరోసా ఇవ్వలేకపోయారని ఆరోపించారు.నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.

కాంగ్రెస్ కు కావల్సింది మాత్రం ఓట్ల గణన.

కాంగ్రెస్ కు కావల్సింది మాత్రం ఓట్ల గణన

బిజెపి కుల గణన అంటే వెనుకబడిన వర్గాల అభివృద్ధి

గద్వాల /నేటి ధాత్రి

 

 

60 ఏళ్ల పాలనలో ఏనాడు కాంగ్రెస్ దేశంలో కుల గణన చేపట్టలేదు. బీసీల హక్కులను కాలరాయడం, బీసీల రిజర్వేషన్లను అణచివేయడమే కాంగ్రెస్ చరిత్రన్నారు. జన గణననలో కుల గణనను చేర్చడం ద్వారా ప్రధాని మోదీ ఈ దేశానికి అభినవ అంబేద్కర్‌గా నిలిచారన్నారన్నారు. ఒడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప, ఒడ్డెక్కినంక బోడ మల్లప్ప అన్నట్టుంది కాంగ్రెస్ వైఖరన్నారు.
శాస్త్రీయ పద్ధతిలో అన్ని కులాల వివరాలు సేకరించి, వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించాలన్న ఉద్దేశంతో కులగణన చేపట్టనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం కులగణనకు ఎప్పుడూ సానుకూలంగానే ఉందన్నారు. శాస్త్రీయమైన కులగణన జరిగితే వెనకబడిన వర్గాలకు ఆర్ధిక – సామాజిక లాభాలు అందుతాయని మా నమ్మకమన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారి విజయమని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, 6 దశాబ్దాలుగా కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.

Abhinav Ambedkar.

 

 

దేశ జనగణనలో భాగంగా కులగణనను చేపట్టి, దాని ఆధారంగా వెనకబడిన వర్గాలకి ఆర్ధిక – సామజిక – సంక్షేమ లాభాలు చేకూర్చాలని ప్రధాని మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, అక్కల రమాదేవి,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, జిల్లా ఓబీసి మోర్చా అధ్యక్షుడు జిల్లా మైనార్టీ మోర్చ అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్,ఐటి సెల్ కన్వీనర్ చిత్తారి కిరణ్,బిజెపి నాయకులు ఢిల్లీవాల కృష్ణ,మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు ,బిజెపి నాయకులు బాలేశ్వర్ రెడ్డి,మోహన్ రెడ్డి, రమేష్,వెంకటేష్, నరసింహ తదితరులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ .!

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ శిక్షణ కేంద్రాల ఇంచార్జీల సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ప్రధాన కార్యాలయంలో సంస్థకు చెందిన శిక్షణ కేంద్రాల ఇంచార్జీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జహీరాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాలరావు పాల్గొన్నారు.ఈసమావేశంలో సెట్విన్ సంస్థ ఇంచార్జీలు,అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

డివిజన్ టాపర్ గా కొత్త కార్తీక్..

నర్సంపేట,నేటిధాత్రి:

 

గత నెల 30న విడుదలైన పదవ తరగతి ఫలితాలలో శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు ప్రతిభ కనబరిచి డివిజన్ టాపర్ లుగా నిలిచారు.అలాగే ఇదే పాఠశాలకు చెందిన కొత్త కార్తీక్ అనే డివిజన్ టాపర్ గా రికార్డు సృష్టించాడు.కాగా డివిజన్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పూల మాలలతో అభినందించారు. 2025 -2026 సంవత్సరంలో 10/10 జీబీఏ 600 మార్కులకు 563 మార్కులు సాధించి డివిజన్ టాపర్ గా నిలిచిన కొత్త కార్తీక్,అలాగే 558 మార్కులు సాధించిన బూర సాత్విక్, 557 మార్కులు సాధించిన మూలా అవినాష్ లను పూల బొకేలతో అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండాలని విద్యార్థులను ఆశీర్వదించారు.

students

ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గౌరవంగా ఉందని తెలియజేశారు.అలాగే గత సంవత్సరం ముగ్గురు విద్యార్థులు 10/10 లు సాధించి జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారని ఈ సంవత్సరం నర్సంపేట డివిజన్ టాపర్ లు గా నిలవడం గౌరవంగా ఉందన్నారు. 62 మంది విద్యార్థులకు 30 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించగా ఆ విద్యార్థులను అభినందించారు.పట్టుదలతో చదివి ఉన్నత మార్కులు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకొచ్చినందుకు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ కవిత, బిక్షపతి, మణికంఠ, శశిధర చారి, ప్రిన్సిపల్స్ స్రవంతి, సుధాకర్, స్వప్న చారి,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ధైర్యం అంటేనే రాహుల్ గాంధీ అంటే హంగు ఆర్భాటం లేని ప్రజానాయకుడు.

ధైర్యం అంటేనే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటే హంగు ఆర్భాటం లేని ప్రజానాయకుడు

నిజాన్ని నమ్ముకున్న మహా నేత మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాథరాజు రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
రాహుల్ గాంధీ దేశంలో జోడో యాత్ర ద్వారా కార్మిక , కర్షక, సబ్బండ వర్గాల స్థితిగతులపై ఏం అంశం తీసుకున్న ఆ అంశం పట్ల హుటాహుటిన చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం..నాడు అధికారుల వంతైతే..
నేడు ప్రతిష్టాత్మకంగా జన గణన తో పాటు కులగణన అంశాన్ని లేవనెత్తి ప్రధాని మోడీ అంతటి నేతనే ఒప్పించిన ఘనత ముమ్మాటికి రాహుల్ గాంధీకే సాధ్యమైంది.. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన నిర్వచించడం చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం భారతదేశ వ్యాప్తంగా కులగల చేయడం శుభపరిణామమని బీసీలు ఇంకనైనా ఆర్థికంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని యావత్ దేశం హర్షించదగ్గ విషయం.. అన్నారు

అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలకు చెక్

అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలకు చెక్

తొర్రూర్ ( డివిజన్ ) నేటి ధాత్రి

 

ఎన్. పి.డి. సి.ఎల్ పరిధిలో మే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున నాంచారి మడూర్ గ్రామంలోని రైతు వేదికలో విద్యుత్ భద్రత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ & సేఫ్టీ ఆఫీసర్ శ్రీ పెద్ది రాజం మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రైతులు మరియు వినియోగదారులు తీసుకోవలసిన అన్ని రకాల జాగ్రత్తలు మరియు సూచనలు విపులంగా తెలియజేశారు. తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో తొర్రూరు డివిజన్ పరిధిలో జరిగిన విద్యుత్ ప్రమాదాల వల్ల 16 గురు మనుషులు మరియు 30 జంతువులు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదాలకు కారణం రైతులు మరియు వినియోగదారులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే జరుగుతున్నాయని కావున నిత్యావసరమైన విద్యుత్ వినియోగించుకుంటున్నప్పుడు అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇళ్లలో బట్టలు ఆరేసుకోవటానికి బిగించుకునే జి.ఐ. వైర్లు పై కప్పుగా వేసుకునే ఇనుప రేకులకి షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్ని ప్రమాదాలు జరిగాయని అలాగే ఆకేరు వాగు వెంట ఉన్న గ్రామాల్లోని చాలామంది యువకులు చేపలు పట్టడానికి కరెంటును వినియోగించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రైతులు తమ పొలం చుట్టూ జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి బిగించుకునే విద్యుత్ కంచె వలన కూడా ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని ఈ విధంగా చేయటం చట్ట ప్రకారం నేరమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ శ్రీ సి.ఎస్. చలపతిరావు, చిన్న వంగర మరియు తొర్రూరు అసిస్టెంట్ ఇంజనీర్లు , విద్యుత్ సిబ్బంది, రైతులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version