గుడ్ ఫ్రైడే (శుభశుక్రవారం) సందర్బంగా దివ్య కారుణ్య యేసు క్యాతలిక్ సంఘం ఫాదర్ బాలరాజు ఆధ్వర్యంలో ఉదయం బస్టాండ్ కూడలినుండి మొదలై పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట సిలువ యాత్రను చేపట్టారు.అనంతరం యూదుల రాజైన యేసుక్రీస్తు వారు ఈలోకంలో జీవించే జనాంగం కోసం సిలువలో ఎలా వేయబడ్డారని కళ్ళకు కట్టినట్టుగా యేసుక్రీస్తు వేశాధారణతో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మడికొండ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటి నాయకులు,మాజీ ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్,డాక్టర్ మడికొండ శ్రీను,క్రైస్తవ సోదర సోదరీమణులు,సంఘ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వనపర్తి జిల్లాలో శుభాకార్యాలలో ఊరేగింపుల్లో,డీజే నిషేధం ఎస్పీ వనపర్తి నేటిదాత్రి ;
ప్రజలు డిజె సౌండ్ సిస్టమ్ సాంప్రదాయానికి స్వస్తి పలకాలని చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా,.శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ శబ్దాలతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నామని ఎస్పీ అన్నారు వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల డీజే యజమానులు, నిర్వాహకులకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వాహకులకు అవగాహన కల్పించారు అధిక శబ్ద తీవ్రత గల డిజె సౌండ్ సిస్టమ్ ను పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ర్యాలీలో ఉపయోగించడం వల్ల అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అందరికీ తెలుసనీ ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు ఈ డీజే సంపదాయానికి అలవాటు పడి తప్పతాగి విచ్చలవిడిగా చిందులు వేయడం ఒక ఫ్యాషన్ గా మారిందని ఆయన వివరించారు. సాంప్రదాయ బద్దంగా జరగాల్సిన పెళ్ళిళ్ళు శుభకార్యాలలో కూడా డీజే సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారిందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉండడంతో పాటు చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
wanaparthi
అంతే కాక సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై వనపర్తి జిల్లా పరిధిలో ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్ మరియు బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను పరిరక్షణ చట్టం సెక్షన్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు ఈ నిషేదిత ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, లక్ష జరిమానా ఉంటుందని ఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ, ఉమామహేశ్వరరావు, వనపర్తి డిఎస్పీ,వెంకటేశ్వరరావు, వనపర్తి సీఐ, కృష్ణ, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు .
గ్యాస్ గోదాంలో ప్రమాద నివారణ చర్యల గురించి వివరించిన ఫైర్ సిబ్బంది
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ పరిధిలోని ఆర్ఆర్ ఇండియన్ గ్యాస్ గోదాంలో శుక్రవారం ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్యరంలో 6వ రోజు వారోత్సవాలు నిర్వహించారు.గ్యాస్ గోదాం వద్ద మేనేజర్,సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణకు తగు చర్యల గురించి అవగాహన కల్పించారు.అందులో భాగంగా ఫైర్ ఎక్సటింగుషర్స్ ఏర్పాటు చేసుకోవాలని,నిర్దేశించిన సమయంలో వాటిని రిఫిల్ చేసుకోవాలని మరియు ఎలా ఉపయోగించాలి అని అవగాహన కల్పించారు.వాటర్ హైడ్రెన్డ్స్, స్పింక్లార్ల్ను ఏర్పాటు చేసుకోవాలని,రేడియం ఎగ్జిట్ సూచికలు అత్యవసర సమయంలో అందరికి కనిపించే విధంగా ఉంచాలని అతి ఉష్టాన్ని వెలువరిచే విదుత్ దీపాలను నియమించి, హలొజెన్ దీపాలను వాడవలని తెలిపారు.అత్యవసర సమయాలలో గోదాము సిబ్బందికి,సెక్యూరిటీకి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పరకాల అగ్నిమాపక శాఖ కార్యాలయ సిబ్బంది ఎల్ఎఫ్.చారి,డ్రైవర్ గణేష్,అగ్ని మాపకులు అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు.
సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి:-
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ :-
హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ శుక్రవారం ఉదయం హనుమకొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ ప్రసంగిస్తూ ఏ వివాదమైనా, ఒక వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తి సమూహాల మధ్యనో ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారన్నారు. అటువంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీ కి చెందిన పెద్దవారు వారికి నచ్చచెప్పినట్లయితే వివాదాలు సహృద్భావ వాతావరణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని, ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు. మొదటిసారిగా భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఈ విధానం విజయవంతం అయిందని, సమాజంలోని కమ్యూనిటీ పెద్దలు కోర్టుల దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరిష్కరించారన్నారు. ఆ తరువాత ఈ విధానం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చేరి అక్కడ కూడా విజయవంతమైందన్నారు. అయితే 2023వ సంవత్సరంలో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందని ఆయన అన్నారు.
Community
ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా భార్యాభర్తల మధ్య తగాదాలు మరియు తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగాదాలు సమాజంలో పెరిగిపోతున్నాయని వీటికి చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ఇంటిలో సర్ది చెప్పే పెద్దలు లేకపోవడం భార్యాభర్తల మధ్య ఈగో లు వారి మధ్య వివాదాలకు ఎక్కువగా కారణం అవుతున్నాయని వీటిని సమాజ కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానాలలో కేసులు ఉంటే, ఇరుపక్షాలలో ఒకరు గెలిస్తే మరొకరు పైకోర్టుకు వెళ్తారని కానీ కమ్యూనిటీ మీడియేషన్ విధానంలో వివాదం పరిష్కారమైతే వ్యక్తులే కాకుండా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని ఇటువంటి గురుతర బాధ్యతను పెద్దలు తమ భుజస్కంధాల మీద వేసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో ఒక విశ్రాంత వైస్ ఛాన్స్లర్ కమ్యూనిటీ మీడియేటర్ గా సాధించిన విజయాలను వివరించారు. కలహిస్తున్న భార్య భర్తలకు ఒక తండ్రి లాగా తాత లాగ నచ్చచెప్పి వారిని కలిపినట్లు ఆయన చెప్పారన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి మాట్లాడుతూ నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ లో ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు విజయవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. గత ఏప్రిల్ ఏడవ తారీకున కామారెడ్డి లో ఒకేసారి 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి. నిర్మలా గీతాంబ, సి.హెచ్. రమేష్ బాబు ఇతర జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమా దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు
-ఉచిత ఉపాధి శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
రాయికల్ నేటి ధాత్రి. . . .
ఏప్రిల్ 18.రాయికల్: పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనాన్ని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సందర్శించారు.. ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో… జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, హోమ్ ఎయిడ్ హెల్త్, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత ఉపాధి శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణ పొందుతున్న కోర్సుల్లో
వృత్తి నైపుణ్యాలు నేర్చుకుంటూ యువత సేవా భావాన్ని అలవర్చుకుంటే ప్రగతి పతంలో దూసుకెళ్లి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడతారని అన్నారు.శిక్షణ కేంద్రంలో నీటి సమస్యను గురించి సిబ్బంది తెలపగా వెంటనే బోరు వెల్ ను మంజూరు చేశారు. ప్రధాన ద్వారం వరకు సిసి రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు,పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు,ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి, నాయకులు కోల శ్రీనివాస్, డాక్టర్ మహేందర్ బాబు, మాజీ సర్పంచ్ డాక్టర్ రాజారెడ్డి, జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేందర్, చిరంజీవి,వనిత,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
-అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
-అసత్యపు ప్రచారాలు..వినతి పత్రాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు
-భూపాలపల్లి ఎమ్మెల్యేకు రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్న తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలయ్యేలా ముఖ్యమంత్రిని ఒప్పించండి
-నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలిస్తున్న చందుపట్ల కీర్తిరెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రెక్కల కష్టాన్ని నమ్ముకొని పంటలు పండించిన రైతన్నకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయని..చేతికొచ్చిన పంట కళ్ళముందే కొట్టుకుపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు కూరుకుపోతున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈనెల 15న రాత్రి ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల పంటలను శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి, నేతృత్వంలోని బిజెపి బృందంతో పర్యటించి పంటలను పర్యవేక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వానకు వరి, మామిడి, మొక్కజొన్న అరటి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెంటనే స్పందించి అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే చేయించి..పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ:50 వేలు ఇప్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అసత్యపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉండి వినతి పత్రాలు ఇస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. దేశవ్యాప్తంగా బీమా యోజన అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. దీంతో అకాల వర్షాలకు..ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణలో ఫసల్ బీమా యోజనను అమలు చేసే విధంగా కృషిచేసి రైతులను ఆదుకోవాలే తప్ప..మీ చేతకానితనాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నమునేని భూమారావు బలుగూరి రాజేశ్వరరావు లోకుల బోయిన తిరుపతి మండల ఉపాధ్యక్షులు బలుగూరి కిషన్ రావు రంగపురం మాజీ ఉప సర్పంచి వైనాల ప్రియాంక శివకుమార్ బలుగూరి తిరుపతిరావు అరికాంతపు కృష్ణారెడ్డి చిలకమర్రి రాజేంద్రప్రసాద్ రంగపురం బూత్ అధ్యక్షులు తక్కలపల్లి విజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు
మొగుడంపల్లి మండల నూతన నాయబ్ తహశీల్దారుగా మొహమ్మద్ జుబేర్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఇక్కడ మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా విధులు నిర్వహించిన పవన్ కుమార్ నారాయణ ఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్ మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా బదిలీ అయ్యారు. అతని స్థానంలో ఇంతవరకు నారాయణ ఖేడ్ డివిజన్ పరిధిలోని కంప్టీ మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా విధులు నిర్వహించిన మొహమ్మద్ జుబేర్ అహ్మద్ ఇక్కడి మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా బదిలీపై వచ్చి, బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నేటి ధాత్రి ‘ తో మాట్లాడుతూ తమ పరిధిలోని బాధ్యతలను సమర్ధవంతంగా నేరవేర్చడంలో తన వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటూ, ప్రభుత్వ పథకాల అమలుకు చర్యలు తీసు కుంటామని ఆయన చెప్పారు. తమ తహశీల్దారు వారి అనుమతితో ప్రధానంగా సన్నబియ్యం పథకం (ప్రజాపంపిణీ రేషన్ బియ్యం) అమలుతో పాటు భూ భారతి చట్టం అమలుకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది సహకారంతో స్థానిక రెవిన్యూ సమస్యలను వెనువెంటనే ప్రాధాన్య క్రమంలో పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి కొత్త ఆర్ ఓఆర్ చట్టంపై రెవిన్యూ సిబ్బందికి, రైతులకు అవగాహన కల్పించడానికి ఈనెల 21వ తేదిన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు రైతులు, అన్ని రాజకీయపక్షాల నాయకులు, అధికారులు, అనధికారులు విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు.
విసికె పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులుగా అంబాల అనిల్ ఎన్నిక.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం లోని అంకుశపూర్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ను విముక్త చిరుతల కచ్చి పార్టీ తెలంగాణ రాష్ట్ర యూత్ యువజన రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళ నాడు లోని చిదంబరం పార్లమెంట్ సభ్యులు తిరుమవళవన్ నియమించారు. వారు మాట్లాడుతూ యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాడాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధించే దిశగా ముందుకు సాగాలని బహుజన రాజ్యాధికారం సాధించే పోరాటంలో ముందుకు సాగాలని భారత దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛను సమానత్వాన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సామ్రాజ్యాన్ని నిర్మించడం కోసం ఉద్యమించాలని తలైవర్ పార్లమెంటు సభ్యులు తోల్ తిరుమవళవన్ సూచించారు.ఇతనివెంట విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా జీలుకర శ్రీనివాస్ జాతీయ అధ్యక్షులు తమిళనాడు చిదంబరం ఎంపీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోల్ తిరుమవళవన్ విసికె పార్టీ ఆస్థాన కవి రచయిత సింగర్ ప్రముఖ బహుజన వాగ్గేయకారులు మచ్చ దేవేందర్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెరుపెల్లి ఆనంద్ మరియు పార్టీ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు, నాకు సహకరించిన అందరికీ పేరుపేరునా ఉద్యమ జై భీములు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు,
పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి
జైపూర్,నేటి ధాత్రి:
పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి తెలంగాణలోని వాహనదారులకు భారీ షాక్ తగలనుంది.2019కి ముందు కొన్న వెహికిల్స్ అయితే వాటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ ప్లేట్లను సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించింది.లేకుంటే ఆ వాహనాలను అమ్మడానికైనా, కొనడానికైనా వాహనంపై ఉన్న ఇన్సూరెన్స్,పొల్యూషన్ వర్తించవని వెల్లడించింది.ఒకవేళ అలాంటి వాహనాలు రోడ్డుపై తిరిగితే వాటిని పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.
ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్య మకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ
ఉద్యమకారులు అందరూ తరలిరావాలి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం( టి యు ఎఫ్) మండల అధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్ ఆధ్వర్యంలో ఈనెల ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్యమ కారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్క రించడం జరిగింది.ప్లీనరి సమా వేశానికి పాల్గొనడం కోసం చర్చించడం జరిగింది. ఉద్యమకారులు ప్లీనరీ సమావే శానికి తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గజ్జి శంకర్ ,ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ పొడిశెట్టి గణేష్ మండల అధ్యక్షులు పోలపెల్లి శ్రీనివాస రెడ్డి బలిజేనరసింహారాములు, గంట శ్యాంసుందర్ రెడ్డి , ఉద్య మకారులఫోరం రాష్ట్ర అధ్య క్షుడు చీమ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారి సురే ష్, మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస రెడ్డి,ఉపాధ్య క్షులు వనం దేవరాజ్ ,మండల నాయకులు ఎండి రఫీ ,అడుప ప్రభాకర్, సముద్రాల లింగ మూర్తి, కానుగుల నాగరా జ్ ,తుమ్మ ప్రభాకర్, దూదిపాల జోగిరెడ్డి ,అరకిల వీరయ్య, కోలఆనందం, బాసని సాంబమూర్తి ,బత్తుల రాజేష్, కొడపాక సంజీవరావు శంకర్ రెడ్డి బొంతల నాగరాజు శాయంపేట టౌన్ ప్రెసిడెంట్ రంగు మహేందర్, దామర కొండ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కర్టసి డే సందర్బంగా నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ బస్టాండులోని ప్రయాణికులకు మర్యాదపూర్వకంగా గులాబీ పుష్పాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.బస్సులో రెగ్యులర్ ప్రయాణం చేస్తన్న నర్సంపేటకు చెందిన మెండు సారంగం,నారక్కపేట గ్రామానికి చెందిన లెంకల ప్రనీతలను శాలువాలతో సన్మానం చేసి గులాబీ పుష్పాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ,ఏడిసి మల్లికార్జున్, రవీందర్,రాంబాబు,తేజశ్వినితో పాటు డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నెక్కొండ మండలంలోని గొట్ల కొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారద లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచనలు క్రమం తప్పకుండా పాటించి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యాసంగి పంటలో వరి సాగు పెరిగిందని వరి ధాన్యం కొనుగోలలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
Farmers
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, డి సి ఎస్ ఓ కిష్టయ్య, సివిల్ సప్లై డి ఎం సంధ్యారాణి, డి పిఎం భవాని, తాసిల్దార్ రాజకుమార్, ఎంపీడీవో ప్రవీణ్, నెక్కొండ వ్యవసాయ అధికారి నాగరాజు, ఏపీఎం శ్రీనివాస్, లతోపాటు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, బక్కి అశోక్, పార్వతమ్మ, పెండ్యాల హరిప్రసాద్, చల్ల శ్రీపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, తిరుమల్ చౌహాన్, చల్ల పాపిరెడ్డి, సాయి కృష్ణ, భాను ప్రసాద్, సింగం ప్రశాంత్, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, దూదిమెట్ల కొమురయ్య, నైజాం, గొట్లకొండ వివో అధ్యక్షులు సునీత, సరోజ, పార్వతి, జ్యోతి, నీలమ్మ, వి ఓ ఏలు సూర్య, ఏకాంబరం, గొట్లకొండ గ్రామ రైతులు, మహిళా సంఘల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ధాన్యంగింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పని
పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
*రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని మందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలుకేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 2320,కామన్ రకానికి రూ.2300 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17 శాతం మాయుచర్ ఉండాలని అన్నారు. నిబంధనల మేరకు తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, లారీలలో మిల్లులకు తరలించిన ధాన్యాన్ని అన్లోడ్ చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలనీ సూచించారు. కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బొనస్ లభిస్తుందన్నారు.
government.
రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదని ప్రతి ఒక్క రైతుకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,డిసిఓ నీరజ,సివిల్ సప్లైస్ జిల్లా అధికారి డి.కిష్టయ్య,సివిల్ సప్లైస్ డిఎం సంధ్యారాణి,ఏడీఏ దామోదర్ రెడ్డి ,తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, అగ్రికల్చర్ మండల ఆఫీసర్ మాధవి,కొనుగోలు కేంద్రాల మండల నోడల్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి,సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,సొసైటి ఇంచార్జీ సిఈఓ భిక్షపతి, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రెల బాబు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సొసైటీ వైస్ చైర్మన్, సొసైటీ డైరెక్టర్లు, పలువురు వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లక్ష రూపాయల నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిందని, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మొత్తం 1023 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశామని అన్నారు. జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లలో 300 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడత ఆర్థిక సహాయం లక్ష రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రోసిడింగ్స్ పొందిన లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని, ప్రభుత్వం నాలుగు దశలలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తుందని, హౌసింగ్ శాఖ అధికారులు నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వేగంగా నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
పోగొట్టుకున్న మొబైల్స్ ని తిరిగి అప్పజెప్పిన సిఐ మల్లేష్.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ చిట్యాల పోలీస్ స్టేషన్లో చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ గారితో కలిసి చిట్యాల సిఐ మల్లేష్ 2 మొబైల్స్ లని తిరిగి బాధితులకు అందించారు, జూకల్ గ్రామానికి చెందిన సిరిగిరి రవీందర్ తను 2 నెలల క్రితం తన ఒప్పో ని పోగొట్టుకొని, మరియు చిట్యాల మండలం వెంక్కట్ రావుపల్లి చెందిన ఉప్పుల రవీందర్ నెల క్రితం తన రెడ్ మీ ఫోన్ ని పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో తమ మొబైల్ ఫోన్లు పోయాయని దరఖాస్తు ఇవ్వగా, అట్టి మొబైల్ ఫోన్ సీఈ ఐ అర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి ఈరోజు శిరిగిరి రవీందర్ కి మరియు ఉప్పల రాజేందర్ కి అందించడం జరిగింది, అట్టి మొబైల్ ఫోన్స్ నీ గుర్తించడంలో సహాయపడిన సీఈ ఐ ఆర్ కానిస్టేబుల్ లాల్ సింగ్ నీ సిఐ అభినందించారు అలాగే గత కొన్ని రోజులుగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అని తెలిపి, సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి మొబైల్ ఇచ్చే ముందు చైల్డ్ మోడ్ ఆన్ చేసి ఇవ్వాలని, కొందరు అదునాథ టెక్నాలజీ ఏ ఐ నీ వాడి ఫోటోలని మార్ఫింగ్ చేస్తున్నారు కావున పర్సనల్ ఫొటోస్ నీ సోషల్ మీడియా లో పెట్టొద్దు అని తెలిపారు, ఎవరైనా సైబర్ క్రైమ్ కి గురి ఐతే వెంటనే 1930 కి కాల్ చేయాలని తెలిపారు.
నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై ఎక్సైజ్ అధికారులు నిరంతర దాడుల్లో బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేలు భారీ జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు.ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై దాడులు నిర్వహిస్తున్న క్రమంలో మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన జరుపుల రమ గతంలో నాటుసారా విక్రయిస్తూ అధికారులకు పట్టుబడగా నర్సంపేట తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఆమె బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నాటు సారాను విక్రయిస్తూ పట్టుబడగా ఆమెను అరెస్టు చేసి నర్సంపేట తహసిల్దార్ రాజేష్ ఎదుట హాజరుపరచగా బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జరుపుల రమకు రూ. 50 వేల జరిమానా విధించగా ఆమె చలానా రూపంలో చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. బైండోవర్ ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే ఆరు నెలలు వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తాసిల్దార్ రాజేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి ఎస్సై శార్వాణి సిబ్బంది పాల్గొన్నారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహించే ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఝరాసంగం మండల ఆయా గ్రామలలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు: నేతృత్వంలో మైనారిటీ సంఘాలు శాంతియుత ర్యాలీ, నిరసనలు తెలియజేస్తూ హైదరాబాద్లో జరిగే ఈనెల 19న బహిరంగ ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్ కోరారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు సయ్యద్ మజీద్ ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లుకు ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా హైదరాబాద్ దారు సలాం లో జరిగే ఈ నిరసన సభను విజయవంతం చెయ్యాలని తెలిపారు. ఈ సవరణలు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
బస్టాండ్ స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలి.
డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన స్వచ్ఛంద సంస్థలు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నియమ నిబంధనలు పాటించని శ్రీ లక్ష్మీగణపతి స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఎల్హెచ్ పిఎస్, డిబిడిఎస్ ప్రజాసంఘాలు,స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం డిబిడిఎస్ వ్యవస్థాపకులు అందే రవి మాదిగ,ఎల్హెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్,ఎమ్మార్పీఎస్(టీ.ఎస్) జిల్లా అధ్యక్షులు మైసి శోభన్ మాదిగ ,ధరణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఈదునూరి రమేష్ మాట్లాడుతూ నర్సంపేట బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్కూటర్ స్టాండ్ కాంట్రాక్టు నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకుండా వారి యొక్క స్టాండ్ నడుపుచున్నారన్నారు సదర్ స్కూటర్ స్టాండ్ కు పొందిన అనుమతిలో ఒకవైపు మాత్రమే దారి కలదు కానీ ఆయా నిర్వహకులు పొందిన ఒకవైపు దారి కాకుండా మరో మూడు దారులను ఏర్పరచుకొని ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఈ విధంగా అనుమతులను భేఖాతరు చేయడం వలన ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యానికి గురికావలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ విధంగా వ్యక్తం చేశారు.
అంతే కాకుండా బస్సులు బయటకు వెళ్లే దారిని నిబంధనలకు విరుద్ధంగా స్కూటర్ స్టాండ్ కు వెళ్లే దారిగా ప్రధానంగా నిర్వాహకుడు ఉపయోగించడం వలన పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని దీనితో ఆ కాంట్రాక్టు వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున తక్షణమే విరుద్ధంగా ఉన్న దారులను మూసివేసి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల భద్రతపై పూర్తిస్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.లేని యెడల ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తడుగుల విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి రాష్ట్ర నేత, ఆరేపల్లి బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోట డేవిడ్ మార్గ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, కట్ల రాజశేఖర్ మాదిగ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్,నేలమారి నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.
పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు..
హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం
నర్సంపేట,నేటిధాత్రి:
వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు.
ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.
నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు గల నూతన ఏర్పాటు చేసిన ఒక కమ్యూనిస్టు పార్టీకి చెందిన గుడిసెల ఎదురుగా కిన్నెరపు ఉమా అనే మహిళ తన ఇంట్లో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నది.
ఇతర ప్రాంతాల నుండి మహిళలను వ్యభిచార రొంపులో దింపి తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది.
Police
నర్సంపేట పట్టణానికి చెందిన కిన్నెరపు ఉమా నర్సంపేట మండలంలోని బానోజీపేట గ్రామానికి చెందిన కొయ్యల రమేష్,అదే బానోజీపేట గ్రామానికి చెందిన విద్యార్థి కొయ్యల నితిన్ అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన కేసనపల్లి విక్రమ్ అనే యువకుడు ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కలిసి వ్యభిచార నిర్వహిస్తున్నది.
పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, నర్సంపేట ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందన్నారు.
ఇందులో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళాతో పాటు ఒక విద్యార్థి,మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
కాగా ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కాపడినట్లు సీఐ తెలిపారు.
వ్యభిచారం గృహంలో తనిఖీలు చేపట్టగా 29 హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,5 సెల్ ఫోన్లు,1 ద్విచక్ర వాహనం,రూ. 2750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపి నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ కె. శ్రీధర్,డబ్ల్యూఏ ఎస్.ఐ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ,కానిస్టేబుల్ బి.రాజు,బి. నరేష్, ఎం.గణేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా మామిడి పంటకు భారీ నష్టం.
జహీరాబాద్. నేటి ధాత్రి:
కోహిర్ మండల్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని గ్రామాలను భారీ వర్షం మరియు వడగళ్ల వాన ముంచెత్తింది, దీనితో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందారు. మరోవైపు, చెరకు, టమటా, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో రైతులు, మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మరియు గురువారం సాయంత్రం, అకస్మాత్తుగా భారీ వర్షం మరియు బలమైన గాలులతో కూడిన వడగళ్ళు పడ్డాయి, దీని ఫలితంగా పీడ్ కమల్, బిలాల్ పూర్, మన్యార్ పల్లి మరియు బేడంపేట్ గ్రామాలలో భారీ వడగళ్ళు పడటంతో నేలపై మంచు పలక కనిపించింది మరియు మామిడి తోటలలోని మామిడి చెట్ల కింద అనేక టన్నుల మామిడి కాయలు పడి ఉన్నాయి. మరియు మామిడి వ్యాపారులతో మాట్లాడినప్పుడు, వారు మిలియన్ల నష్టాలను నివేదించారు మరియు వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా సంభవించిన నష్టాన్ని మరమ్మతు చేయడానికి లేదా భర్తీ చేయడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం సిఫార్సు చేయాలని వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ, కోహిర్ మండల్ అధికారులు మరియు సీనియర్ అధికారులను కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.