బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు భారీ జరిమానా
నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై ఎక్సైజ్ అధికారులు నిరంతర దాడుల్లో
బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేలు భారీ జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు.ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై దాడులు
నిర్వహిస్తున్న క్రమంలో మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన జరుపుల రమ గతంలో నాటుసారా విక్రయిస్తూ అధికారులకు పట్టుబడగా నర్సంపేట తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఆమె బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నాటు సారాను విక్రయిస్తూ పట్టుబడగా ఆమెను అరెస్టు చేసి నర్సంపేట తహసిల్దార్ రాజేష్ ఎదుట హాజరుపరచగా బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జరుపుల రమకు రూ. 50 వేల జరిమానా విధించగా ఆమె చలానా రూపంలో చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. బైండోవర్ ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే ఆరు నెలలు వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తాసిల్దార్ రాజేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి ఎస్సై శార్వాణి సిబ్బంది పాల్గొన్నారు.