శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం.

ఘనంగా శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

 

వరంగల్ నేటిధాత్రి

 

వరంగల్ హెడ్ పోస్టాఫీసు వద్ద ఉన్న శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సానబోయిన సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నవల నాటక సినిమా కథ రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జిగిలి గోస, అనగనగా ఒక కోడి పెట్ట, వీటిపై అనర్గళంగా మాట్లాడారు.

College

తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలుగు భాష యొక్క ప్రాచుర్యం పెంచుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని, మనమందరం తెలుగు భాషను ప్రోత్సహించాలని మన పిల్లలకు తెలుగు భాష మాట్లాడించాలని, మనమందరం మానవ విలువలను పెంపొందించే విధంగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్మెంట్ బిఓఎస్ డాక్టర్ మంతిని శంకరయ్య, కళాశాల అధ్యాపకులు పరశురాం జయకృష్ణ, మేకల లింగమూర్తి, శ్రీధర్ల కుమారస్వామి, శెట్టి దేవరాజు, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ ప్రగతి హై స్కూల్ లో యుకేజి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అంబాటి వేణుకుమార్ హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈకార్యక్రమంలో నూట ముప్పై ఎనిమిది మంది యుకేజి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్లలో తమ తల్లిదండ్రుల సమక్షంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల చైర్మన్ అన్నదానం రాధాకృష్ణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో వారి అనుభవాలను పంచుకున్నారు.

Graduation Day

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముచ్చర్ల మునీందర్ రెడ్డి, డైరెక్టర్ బేతి భూమయ్య, అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల ఇన్చార్జులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత..

నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత

కీరాణం దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం.

మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు.

వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్..

నేటిధాత్రి నర్సంపేట:

 

 

నర్సంపేట పట్టణంలో భారీ ఎత్తున నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,59,000 విలువగల అంబర్ గుట్కాలుగా అంచనా వేశారు. నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డుకు గల మణికంఠ కిరాణం దుకాణంపై పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిషేధిత అక్రమ అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకొని కిరాణం షాపు యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఏసీబీ మధుసూదన్, సీఐ శ్రీధర్ తెలిపారు.

పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి.

పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామ శివారులో గురువారము సాయంత్రం 3:30 పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి. కుప్పా నగర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప.తనకున్న మేకలను మేత కోసం గ్రామ పంట పొలాల్లోకి తోలుకు వెళ్లాడు. ఉరుములు మెరుపులు మొదలు కావడంతో ఓ చెట్టు కిందికి వాటిని నిలిపి.ఒక్కసారిగా పిడుగుపడడంతో.మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు… పిడుగుపాటుకు మేకలు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప కు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్థులు కోరారు.
మేకలు మృతి చెందిన వార్త విన్న వెంటనే కుప్పా నగర్ గ్రామ సెక్రెటరీ స్వప్న ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు ఝరాసంగం మండల ఎంఆర్ఓ తిరుపతి రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు ఝరాసంగం సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ రైతులు పాల్గొన్నారు

రజితోత్సవ సభను విజయవంతం చేయండి..

రజితోత్సవ సభను విజయవంతం చేయండి
– పోస్టర్ ఆవిష్కరణ
– టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి సిరిసిల్ల తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించంకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా హాజరుకావాలని కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ,మ్యాన రవి, ఎండి సత్తార్, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

సివిల్ సప్లై గోదాములలో గోల్ మాల్…

సివిల్ సప్లై గోదాములలో గోల్ మాల్…?

జవాబుదారితనం లేని నిర్వాకులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలోని సివిల్ సప్లై గోదాములలో కొందరు ఉద్యోగలు అవకతవకలకు పాల్పడుతున్నారని కేసముద్రం సహకార బ్యాంకు విశ్రాంత ఉద్యోగి సీఈఓ వెంకటచలం ఆరోపించారు. గురువారం కేసముద్రంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఇనుగుర్తి ధాన్యం కొనుగోలు కేంద్ర మిగిలిన గన్ని బ్యాగుల విషయం సివిల్ సప్లై ఉద్యోగులు అవకతవకలకు పాడుపడుతున్నారని అన్నారు. గన్ని బ్యాగుల 83 కట్టల లో ఉన్న 4,150 ఖాళీగా అన్ని బ్యాగులను కేసముద్రంలోని సివిల్ సప్లై గోదాంలో సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. అట్టి 83 కట్టలకు గాను రూపాయలు 40 చొప్పున 3420 దిగుమతి చార్జీలు కూడా చెల్లించామని అన్నారు కేంద్రం ఇన్చార్జి అయిన సురేందర్ ను 83 కట్టల కాళీ బ్యాగులు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వాలని రసీదు అధికారులను అడగగా రేపు ఇస్తాం మాకు ఇస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా తాను కూడా సివిల్ సప్లై గోదాముకు వెళ్లి అడగగా 42 కట్టలు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వడం జరిగిందని, తక్కువ గన్ని బ్యాగుల కట్టలు రాసి ఇవ్వడమేంటి అని అడగగా 52 కట్టలు దిగుమతి మాత్రమే దిగుమతి అయ్యాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇట్టి విషయంపై అనేకమార్లు అడిగినా కూడా పెడచెవిన పెడుతూ అధికారులు బాధ్యతారహిత్యంగా ఒక విశ్రాంత ఉద్యోగి పైనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేశారు.సివిల్ సప్లై గోదాంలో జరుగుతున్న అవకతకులపై విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులను ఈ సందర్భంగా వారు కోరారు.

వ్యభిచారం గృహంపై పోలీస్,.!

వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.

పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు..

హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు.ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు గల నూతన ఏర్పాటు చేసిన ఒక కమ్యూనిస్టు పార్టీకి చెందిన గుడిసెల ఎదురుగా కిన్నెరపు ఉమా అనే మహిళ తన ఇంట్లో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నది.ఇతర ప్రాంతాల నుండి మహిళలను వ్యభిచార రొంపులో దింపి తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది.నర్సంపేట పట్టణానికి చెందిన కిన్నెరపు ఉమా నర్సంపేట మండలంలోని బానోజీపేట గ్రామానికి చెందిన కొయ్యల రమేష్,అదే బానోజీపేట గ్రామానికి చెందిన విద్యార్థి కొయ్యల నితిన్ అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన కేసనపల్లి విక్రమ్ అనే యువకుడు ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కలిసి వ్యభిచార నిర్వహిస్తున్నది. పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, నర్సంపేట ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందన్నారు.ఇందులో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళాతో పాటు ఒక విద్యార్థి,మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.కాగా ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కాపడినట్లు సీఐ తెలిపారు.వ్యభిచారం గృహంలో తనిఖీలు చేపట్టగా 29 హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,5 సెల్ ఫోన్లు,1 ద్విచక్ర వాహనం,రూ. 2750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపి నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడిలో టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతి అమలు

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

రాష్ట్రంలో ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపటమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. భూభారతి పోర్టల్ అమలులో భాగంగా గుండాల మండలం,ఆళ్లపల్లి మండలల్లో రైతు వేదికలో భూభారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారు అని నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ (ఏ )ను ఏర్పాటు చేసి భూమి విలువ ఐదు లక్షలు లోపు ఉన్న పక్షంలో ఆర్డీవో స్థాయి, ఐదు లక్షల పై గా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని తెలిపారు.
భూమి విషయంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ రోజు నుండి సంవత్సరకాలంలోపు సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ స్థాయిలో సమస్యను పరిష్కారం కానిపక్షంలో సి సి ఎల్ ఏ కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం మండల తాసిల్దార్లు, సబ్ రిజిస్టర్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని, ఇకనుండి చేసే రిజిస్ట్రేషన్ లను అన్ని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభు త్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరి చేసిందన్నారు. భూ భారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా మె యింటెన్‌ చేస్తారని, ప్రతి సంవత్సరం భూముల రికార్డుల ను తీసి ఆ ఫైళ్లను తహసీల్దార్‌ కార్యాలయంలో భద్రపరు స్తామన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో సై తం ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్‌ దృష్టికి తీసుకువెళ్లవచ్చని అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని అ క్కడ కూడా న్యాయం జరక్కపోతే కలెక్టర్‌కు అప్పీలు చేసు కునే అవకాశం భూభారతిలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు భూభారతి పోర్టల్ లో ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ అవగాహన సదస్సులో కొత్తగూడెం ఆర్డీవో మధు, గుండాల తాసిల్దార్ ఇమాన్యుల్ , ఎంపీడీవో సత్యనారాయణ, రైతులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంఘం గ్రామ రేషన్ డీలర్ కంటానం మల్లయ్య స్వామి కుమార్తె సంధ్య – ప్రణవ్ ల వివాహ వేడుక బుధవారం రోజున ఝరాసంఘం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకీ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సిద్దం. ఉజ్వల్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పార్టీ ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్, కేతకీ ఆలయం చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, నర్సింహారెడ్డి., ఎస్సి సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి. నాగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, అశ్విన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ న్యాల్కల్, ఝరాసంఘం మండలాల అధ్యక్షుడు జి. కిరణ్ కుమార్ గౌడ్, రాఘవేందర్, మాజీ యం.పి.టి.సి హఫీజ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, నథానేయల్, నర్సింహా యాదవ్, ఇమామ్ పటేల్, రాజు మరియు ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాసుల కొరకే కోటి విద్యలు.

కాసుల కొరకే కోటి విద్యలు.

రోజుకు 4.8 నుండి 6. 60 లక్షల అక్రమ వసూళ్లు

అక్రమ వసూళ్లలో సత్తా చాటుతున్న క్వారీలు.

వసూళ్ల కె కాంటాల వద్ద టీఎస్ఎండిసి “పోసుడు” తీసుడు”.

అక్రమ ఇసుక రవాణా ఎక్కడ ఆగింది,క్వారీల్లో కూడా ఝాట్కా బకెట్.

దర్జాగా సొమ్ము తీసుకొని, అదుపు ఇసుక రవాణా.

మరో 6 కొత్త క్వారీలు ప్రారంభం, 20 తేదీ నుండి లోడింగ్ కు గ్రీన్ సిగ్నల్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

అదనపు ఇసుక అక్రమ అక్రమ రవాణా అదనపు బకెట్ల వ్యవహారం పై ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేయడంతో, తిన్న పానం ఎలా ఆగుతుంది, ఏదో ఒక ఉపాయం చేయాల్సిందే కదా దానికి పరిష్కారం ఎవరిస్తారు అంటే కేరాఫ్ టీఎస్ఎండిసి అధికారులే, పొట్టకూటి కొరకు కోటి విద్యలు అన్న సామెత ఉంది, కానీ అక్రమ సొమ్ము దూచుకొనుటకు “ఇసుక క్వారీల్లో కాసుల కొరకు కోటి విద్యలు” అనే కొత్త సామెత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మహాదేవపూర్ పుసుపల్లి వన్ తో పాటు కాలేశ్వరం పరిధిలోని, పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలువుల ఆరు, పుసుపల్లి ఒకటో నెంబర్ ఇసుక క్వారీల కాంట్రాక్టర్ టిఎస్ఎండిసి అధికారులు కలిసి “కాసుల కొరకు కోటి విద్యలు” అన్న సామెతను నిజం చేస్తున్నారు. టిఎస్ఎండిసి అధికారులు సిబ్బంది బాధ్యత రహితంగా చేయాల్సిన పనులను, కాంట్రాక్టర్ లకు కీలుబొమ్మలుగా మారి, సీరియల్ నంబర్, లోడింగ్, ఫోక్ లైన్ డీజిల్, కాంటాల వద్ద పోస్టులు తీసుడు, పాసింగ్ పై మరో 300 కిలోలు అదనపు ఇసుక పేర్లతో వసూళ్లు చేస్తూ,ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ సిబ్బంది, టీఎస్ఎండిసి బాధ్యులు, అక్రమంగా దోచుకొని పంచుకుంటున్నారు.

కాసుల కొరకే కోటి విద్యలు.

మండలంలోని మహాదేవపూర్ పుసుపల్లి 1, పలుగుల 8 ,9, పుసుపల్లి పలుగుల ఆరు, పుసుపల్లి 1, ఈ ఇసుక క్వారీల్లో, అదనపు బకెట్ల వ్యవహారం కొనసాగకపోవడంతో, కాసుల కొరకు కోటి విద్యలు అనే విధంగా, లోడింగ్ చార్జి పేరుతో 900 నుండి 1200 వరకు, వీటిలో సీరియల్ నంబర్ పేరుతో మరో నాలుగు వందలు, లోడింగ్ వద్ద 100 నుండి 200, మరోవైపు కాంత వద్ద పోసుడు తీసుడు వ్యవహారం, టీఎస్ ఎంబీసీ సిబ్బంది కూర్చుని, 600 కిలోలకు తక్కువగా 300 కిలోల వరకు పాసింగ్ పై అదునపు ఇసుక వేయడం, అలాగే ఎక్కువ గా వచ్చిన ఇసుకను తీసి 300 కిలోల వరకు లారీలో ఉంచడం కొరకు మరో 200 రూపాలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఎక్ స్త్ర బకెట్ వ్యవహారం ఆగిన పర్వలేదు, 300 కిలోల ఇసుక జట్కాబకెట్ పేరుతో కొనసాగడం, మిగతా సీరియల్ ,లోడింగ్ ,డిజిల్, లాంటి పేర్ల ట్ అక్రమ వసూళ్ల విధానాలు పకడ్బందీగా అమలు చేస్తూ దర్జాగా దోచుకోవడం జరుగుతుంది.

రోజుకు 4.8 నుండి 6. 60 లక్షల అక్రమ వసూళ్లు

educations

ప్రస్తుతం మండలంలో అక్రమ వసూళ్ల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న మహదేవ్పూర్ కాలేశ్వరం పరిధిలోని ఐదు క్వారీల్లో ప్రతిరోజు 400 నుండి 550 లారీలు ఇసుక రవాణా కొరకు ఆయా క్వారీల కు రావడం జరుగుతుంది. ఈ ఐదు క్వారీలు తమ ఒప్పందం ప్రకారం 900 నుండి 1400 రూపాయల తో సుమారు ఒక్కసారి రోజుకు లక్ష 20,000 నుండి 1,60,000 వరకు, అక్రమ వసూళ్లు చేస్తున్నారు.

 

ప్రతిరోజు ఒక్కొక్క క్వారీకి యావరేజ్ గా 90 నుండి 110 లారీలు ఇసుక రవాణా కోసం రాగా, ఈ ఐదు ఇసుక క్వారీలో మొత్తం ఒక్క రోజుకు, నాలుగు లక్షల 80 వేల నుండి ఆరు లక్షల 60 వేల వరకు, అక్రమ వసూళ్లు చేసి, కాంట్రాక్టర్ మరియు టిఎస్ఎండిసి పంచుకోవడం జరుగుతుంది. దీనికి సాక్ష్యం టిఎస్ఎండిసి సిబ్బంది ఈ ఐదు క్వారీలో లారీల వద్ద అలాగే కాంటాల వద్ద కూర్చొని వసూళ్లు చేయడమే దీనికి సాక్ష్యం. అక్రమ వసూళ్లలో ఈ ఐదు క్వారీలు రారాజులుగా దర్జాగా తమ వసూళ్ల వ్యవహారాలను కాంట్రాక్టర్ మరియు టిఎస్ఎండిసి సిబ్బంది కలిసి దోచుకోవడం జరుగుతుంది.

వసూళ్ల కె కాంటాల వద్ద టీఎస్ఎండిసి “పోస

పుసుడు తీసుడు వ్యవహారం అక్రమ వసూళ్లకు ప్రధాన సూత్రధారి పాత్రధారి కూడా, అని చెప్పడంలో సందేహం లేదు, అనేక సాక్షాలు కాంటాల వద్ద టీఎస్ఎండిసి సిబ్బంది, బోసుడు తీసుడు పేరును అక్రమ వసూళ్లకు మారుపేరుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. లోడింగ్ వద్ద ఉండి, లారీ యొక్క కెపాసిటీ పెద్ద చిన్న బకెట్ల లెక్కలు చూసి లారీలో లోడ్ చేయించి బాధ్యత ఉన్నప్పటికీ, టీఎస్ఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ గుడిసెలకు పరిమితమై, వేబిల్ వద్ద వసూళ్లతో పాటు, కాంట వద్ద ఏసుడు తీసుడు వద్ద తమ విధుల్లో ప్రాధాన్యత మైనటువంటి పాత్రగా భావిస్తూ, 200 నుండి 400 రూపాయలు, 300 కిలోల ఇసుక పాసింగ్ పై అదనంగా వేస్తూ సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.

అక్రమ ఇసుక రవాణా ఎక్కడ ఆగింది,క్వారీల్లో కూడా ఝాట్కా బకెట్.

అక్రమ ఇసుక రవాణా ఎక్కడ ఆగింది, పాసింగ్ పై 300 కిలోలు ఒక్క లారీకి, అలాగే మరికొన్ని లారీలకు 500 కిలోల వరకు అదనపు ఇసుక వేస్తూ, 200 నుండి 500 రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంటే అదనపు ఇసుక రవాణా ఏ విధంగా ఆగినట్లు, ఒక్కసారిలో సుమారు రోజుకు 120 లారీల లోడింగ్ ఇసుకను యావరేజ్ గా లోడ్ అయిన క్రమంలో, 60 లారీల్లో 300 కిలోల చొప్పున 18 వేల కిలోల మరో 60 లారీలకు 500 చొప్పున లెక్కచేస్తే 30 వేల కిలోల ఇసుక అంటే మొత్తం ఒకరోజు ఒక క్వారీలో పాసింగ్కు పై 48 వేల కిలోల ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు కాదా దీన్ని ఏమంటారు, టీఎస్ఎండిసి ఉన్నత అధికారులు ఒక్క ఇసుక క్వారీలో ఒకరోజు 48 వేల కిలోల ఇసుక అంటే ఐదు ఇసుక క్వారీలకు కలుపుకొని రెండు లక్షల 40 వేల కిలోల ఇసుక ప్రతిరోజు అక్రమంగా రవాణా జరుగుతుంది అన్నట్లు కదా దీన్ని ఏమంటారో ఉన్నత అధికారులే సమాధానం చెప్పాలి మరి.

మరో నాలుగు కొత్త క్వారీలు, 20 తేదీ నుండి లోడింగ్ కు గ్రీన్ సిగ్నల్.

ఇక మండలంలో టిఎస్ఎండిసి మైనింగ్ శాఖ వ్యవహారం ఎవరికి అర్థం కాని పరిస్థితిగా మారింది, దర్జాగా అక్రమాలు లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవడం జరుగుతుందని సాక్షాలు తెరపైకి తెచ్చిన, నిద్ర మత్తు వీడని అధికారులు, మరో నాలుగు నూతన క్వారీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తోపాటు 20వ తేదీ ఆదివారం నుండి నాలుగు క్వారీల్లో లారీల లోడింగ్ ప్రారంభమవుతుందని తెలపడం జరిగింది,మహాదేవపూర్,1,4,బోమ్మాపూర్,2,3,4, ,ఎల్కేశ్వరం,1 పేరుతో 6 రీచుల నుండి ఇసుక రవాణా చేయడం జరుగుతుంది టి ఎస్ ఎం డి సి శాఖ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కొత్త ఇసుక క్వారీలు ప్రారంభం ఇసుక రవాణా తో ప్రభుత్వం తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కొరకు మేలు జరుగుతుంది అనే ఇది వాస్తవమే కానీ, అక్రమ వసూళ్లు అక్రమ ఇసుక రవాణా అరికట్టడం టిఎస్ఎండిసి బాధ్యత కాదా, కొత్త క్వారీలు ప్రారంభించక ముందు అక్రమాలు చేపడుతున్న క్వారీలపై చర్యలు తీసుకుంటే నూతనంగా ప్రారంభం కాబడుతున్న క్వారీలు కూడా అక్రమ వ్యవహారాలకు దూరంగా ఉండి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టకుండా ఉండడం జరుగుతుంది. శాఖ ఉన్నత అధికారులు అక్రమాలు చేస్తున్న క్వారీల పై గత 15 రోజులుగా వరుస కథనాలు సాక్షాలు వస్తున్న, చర్యలు తీసుకోకుండా కొత్త క్వారీల నుండి ఇసుక రవాణా కొరకు గ్రీన్ సీక్రెట్ ఇవ్వడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇసుక రవాణా తో ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుంది అన్నది వాస్తవమే, కానీ అక్రమ ఇసుక క్వారీలపై చర్యలు మరింత ప్రాధాన్యం అని కూడా ఉన్నత అధికారులు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాధిత కుటుంబానికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్.!

బాధిత కుటుంబానికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ పరామర్శ

వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి 1 క్వింటా బియ్యం అందచేత

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ స్టేషన్ కు చెందిన సామల వీరభద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ గోపా డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి 1 క్వింటా బియ్యాన్ని అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు వీరభద్రం తమ్ముడు సూరయ్య,వీరభద్రం భార్య ఉపేంద్ర, కుమార్తెలు జమున,ఉమా,కళ్యాణి, మమత,సమత లను పరామర్శించి,ఓదార్చి వారికి మా నుండి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి ఎవరి ఇంటిలోనైనా సరే విషాదం నెలకొన్న,అట్టి విషయాన్ని తనకు తెలిపిన వెంటనే స్పందించి తను అందజేస్తున్న సహాయ సహకారాలు మృతుల కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని పలువురు గ్రామస్తులు చెప్పుకొచ్చారు..

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారులు సామల నరసయ్య, మాజీ వార్డు సభ్యురాలు వనపర్తి లలిత, రాజా నాయక్, వెంకటమ్మ, సౌజన్య,సంగీత, సదానందం,మదన్,ధనమ్మ, ప్రవీణ్,మహేష్,మల్లేష్, పుష్ప,ప్రతిభ,నితిన్, కృష్ణ,రాము తదితరులు పాల్గొన్నారు.

క్రీస్తు సువార్త శాంతి ర్యాలీ.

క్రీస్తు సువార్త శాంతి ర్యాలీ. 

నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమను పంచాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

గురువారం కేసముద్రం మున్సిపల్ పట్టణ కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి శాంతి ర్యాలీ ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జెండా ఊపి ప్రారంభించారు. యేసే నిజమైన రక్షకుడు ఆయన మానవుల రక్షణ కొరకు నరావతారం ఎత్తి మనకోసం తన ప్రాణాన్ని పెట్టాడని కొనియాడారు. అదేవిధంగా దైవ సేవకులు కె ఎం పి ఎఫ్ మండల అధ్యక్షులు మునిగె జోసెఫ్ సురేష్ మాట్లాడుతూ సర్వ మానవాళికి యేసే నిజమైన రక్షకుడని అని కొనియాడుతూ , నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిచాలనే మాటను గుర్తు చేస్తూ అలా జీవించాలి అని సూచించారు.అలాగే కె ఎం సి వై ఎఫ్ అధ్యక్షులు వెంకట్ కన్న మాట్లాడుతూ కేసముద్రం ప్రజల కోసం ప్రార్థనలు చేసి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో దైవసేవకులు మల్లెపాక తిమోతి, పిల్లి కుమార స్వామి, ఆశీర్వాదం, ప్రభుజీవన్, థామస్ రెడ్డి, రూబెన్ పాల్, మహేందర్, సుధాకర్, ఫిలిప్, పేతురు, ఇశ్రాయేలు, కశ్మీనాధ్, రవి కుమార్, జాన్ వెస్లీ, జాన్ మెహబూబ్, శ్రీధర్, పీటర్ సింగ్, లాజరస్ గౌడ్, కర్నాకర్, విల్సన్, పృథ్విరాజ్, బనిషెట్టి వెంకటేష్ మరియు ఎం సి వై ఎఫ్ నాయకులు జన్ను మహేందర్, తిప్పర్తి శ్రీధర్, కర్నాకర్ యువకులు, విశ్వాసులు క్రైస్తవులు అంతా పాల్గొన్నారు.

ఘనంగా పదవి విరమణ మహోత్సవం

ఘనంగా పదవి విరమణ మహోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయు లు వనం వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ సన్మాన సమావేశం కన్నుల పండువగా జరిగింది. ఈ పదవి విరమణ కార్యక్రమానికి పిఆర్ టి యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు మల్యాల తిరుపతి రెడ్డి ,పలిత శ్రీహరి , టిఆర్టిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాసిరి. రాజిబాపు ఎంఈఓ రావు శాయంపేట గడ్డం బిక్షపతి , జి హెచ్ ఎం జిల్లా ప్రధాన కార్య దర్శి రామకృష్ణ వివిధ జిల్లా, మండల అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు మండ లంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, వరంగల్ వాయిస్ చీఫ్ ఎడిటర్ గడ్డం కేశవ మూర్తి పాల్గొని ప్రసంగిం చారు. వెంకటేశ్వరరావు బంధుమి త్రులు, మాజీ ప్రస్తుత ఉపాధ్యా యులు, విద్యార్థులు అనంత రం సన్మానగ్రహీత వనం వెంకటేశ్వరరావు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమా న్ని బాలుర ఉన్నత పాఠశాల శాయంపేట సీనియర్ ఉపాధ్యా యులు కాయిత శ్రీనివాస్ సిబ్బంది, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ మరియు సభ్యుల ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.

*ఆర్ హెచ్ వి ఎస్ జిల్లా అధ్యక్షులుగా సుందర కుమార్..

*ఆర్ హెచ్ వి ఎస్ జిల్లా అధ్యక్షులుగా సుందర కుమార్..

*మే 14 నుంచి 26 వరకు బద్రీనాథ్ లో సరస్వతీ పుష్కరాలు…

*త్వరలో ఆర్ హెచ్ వి ఎస్ ప్రాంతీయ కార్యాలయం తిరుపతిలో ప్రారంభం…

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 17:

 

రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ( ఆర్ హెచ్ వి ఎస్ ) జిల్లా అధ్యక్షులుగా కీర్తిపాటి సుందర్ కుమార్ ను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు తెలిపారు. గురువారం స్థానిక మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య సంరక్షకులు మహంతు వైదేహి వల్లభ శరన్ దాస్ మహారాజ్, జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా), జాతీయ ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్ల లచే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హిందూ సామ్రాజ్యం లో రామ రాజ్య స్థాపన కోసం, సనాతన హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను ఈ ఏడాదిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా రామ రాజ్య స్థాపనే ఎజెండాగా ఏర్పాటైన ఆర్ హెచ్ వి ఎస్ వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు. ఈ నెలలో ఆర్ హెచ్ వి ఎస్ ప్రాంతీయ కార్యాలయాన్ని తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్ర ప్రారంభమై అయోధ్య వరకు కొనసాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూపీ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ లతోపాటు శ్రీలంక, మారిషస్ ప్రధానులు, నేపాల్ కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అనిత దేవి సాహూ,తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి,
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉపసభాపతి రఘురామకృష్ణమ రాజు ( ఆర్ ఆర్ ఆర్) ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు సుందర కుమార్ మాట్లాడుతూ హైందవ ధర్మం కోసం, ఆధ్యాత్మిక చింతన కోసం, శ్రీరామ రాజ్య స్థాపన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహా యజ్ఞంలో తమకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తూ తమ వంతు శక్తివంచన లేకుండా ఆర్ హెచ్ వి ఎస్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ హెచ్ వి ఎస్ ఆధ్వర్యంలో సీతా సమేత శ్రీరామ సేవకులను అతి త్వరలో నియమించనున్నట్లు గిరి రాజు తెలిపారు. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ రథయాత్ర విజయవంతా నికి ఇప్పటినుంచి ప్రణాళికాబద్దం గా వ్యవహరించి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారుతమకు ఈ బాధ్యత అప్పగించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా),నవీన్ చంద్ర శుక్ల,దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్,రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు,ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు, టీటీడీ కాంట్రాక్టర్ గిరిరాజు లకు అభినందనలు తెలియజేశారు.

ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా.

* ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా……..
బి ఆర్ ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం
* కేటీఆర్ యువసేనమండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్*

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి మండలంలో గురువారం రోజునవిలేకరుల సమావేశంలో కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణం ధ్యేయంగా 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన టిఆర్ఎస్ (బిఆర్ఎస్ ) ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు తిరుగులేని విజయాలు ఉన్నాయి టిఆర్ఎస్ పురుడు పోసుకుని బి ఆర్ఎస్ గా రూపాంతం చెందిన పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.

గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం.

గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

మండలం లోని కే వెంకటాపూర్ గ్రామంలో అసైన్డ్ రాష్ట్ర భూ సమితి ప్రెసిడెంట్ బైండ్ల నందు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీవో రాజీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఉచిత వైద్య శిబిరం ద్వారా నిరుపేదలకు వైద్య పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామంలో 200 మంది వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ప్రేమలత, మల్లారెడ్డి హాస్పిటల్ సిబ్బంది పూజిత మనిషా దుర్గ స్తుతి లు ఉన్నారు.

సిపిఐ 11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఈనెల 18వ తేదీన సిపిఐ కరీంనగర్ నగర పదకోండవ మహాసభ నగరంలోని గణేష్ నగర్ లో గల బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో ఉదయం 10:30 గంటలకు జరగనుందని ఈయొక్క మహాసభకు నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు కోరారు. ఈయొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈయొక్క నగర మహాసభలో కరీంనగర్ నగరంలోని అరవైవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయుటకు కార్యకర్తలను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు. నగరంలో గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు అటకెక్కాయని గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనేక పనులను శంకుస్థాపనలు చేసి వదిలేసిందని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని, మానేర్ రివర్ ఫ్రంట్ తీగల వంతెన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించి రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని గత మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డందని భూకబ్జాలు, ఇండ్లు కడితే కమిషన్లు, ఇంటి నెంబర్ కు డబ్బులు తీసుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఈసమస్యలతో పాటు నగరంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం అర్హులైన వారికి పెన్షన్ల కోసం రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళుటకు ఈమహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం, ఆరు గ్యారెంటీలు అర్హులైన వారికి అందే వరకు ఉద్యమాలతో ఒత్తిడి తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందే వరకు పోరాట కార్యాచరణ చేస్తామని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తెలిపారు. ఈమహాసభ నగర ప్రజల దశ దిశ మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున నగర ప్రజలు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

లెవల్ వంతెన నిర్మించాలని కలెక్టర్ కు వినతి.

కోడవటంచ లో కిన్నెరసాని వాగుపై హై లెవల్ వంతెన నిర్మించాలని కలెక్టర్ కు వినతి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గురువారం గుండాల మండల భూభారతి అవగాహన సదస్సుకు వచ్చిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు కొడవటంచ గ్రామ ప్రజలు కిన్నెరసాని లో లెవెల్ వంతెన పై ఐలెవల్ వంతెన నిర్మించాలని, కొడవటంచ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఏడు మొలకల వాగుపై ఇసుక మేటలు తొలగించాలని, కొడవటంచ గ్రామంలో అంతర్గత రోడ్లకు సిసి రోడ్లు శాంక్షన్ చేయాలని వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు, పర్షిక రవి, మాట్లాడుతూ కోడవటంచ ,నాగారం ,పాలగూడెం ప్రజలకు వర్షాకాలం వస్తుందంటే కునుకు నిద్ర లేకుండా పోతుందని ఎప్పుడూ కిన్నెరసాని వాగు వస్తుందో అని భయంతో కునుకు తీస్తున్నారని ఈ బాధలను జిల్లా కలెక్టర్ అర్థం చేసుకుని కొడవటంచ కిన్నెరసాని ఏడు మేలకాల వాగుపై హై లెవల్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.
అట్లాగే కొడవటంచ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఏడు మేలుకల చెక్ డ్యామ్ పై వేసిన ఇసుకమేటలను తొలగించి కొడవటంచ, నాగారం ,పాలగూడెం గ్రామ ప్రజలకు సాగునీరు అందించాలని, డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పర్శక రవి, ఈసం మల్లయ్య, వజ్జమంగయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు యువత విద్యార్థి లోకం పెద్ద ఎత్తున తరలాలి
బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.

గంగాధర నేటిధాత్రి :

 

 

బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజితోత్సవ సభకు చొప్పదండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థి లోకం తరలివెళ్లాలని బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ వై నియోజకవర్గ ఇన్‌చార్జ్ బంధారపు అజయ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
గురువారం గంగాధరలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, త్వరలో నియోజకవర్గ స్థాయి యువత, విద్యార్థి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ 25 సంవత్సరాల పాటు ప్రజల మద్దతుతో ముందుకు సాగుతూ, దేశ చరిత్రలో విశేషమైన స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు.
“ఒక్కడితో ప్రారంభమైన బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అనేకమంది నాయకులను, కార్యకర్తలను తయారు చేసింది. వందలాది ఎమ్మెల్యేలు, వేలాది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీలను అందించిన పార్టీ బిఆర్ఎస్. విద్యార్థులు, యువతకు అవకాశాలు కల్పించిన పార్టీ ఇదే,” అని వారు అన్నారు. సమావేశంలో గంగాధర యువత అధ్యక్షులు సుంకె అనిల్, రామడుగు అధ్యక్షులు ఆరెపల్లి ప్రశాంత్, కొడిమ్యాల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ చొప్పదండి పట్టణ అధ్యక్షులు నరేష్ రావణ్, సముద్రాల ఓంకార్, గంగాధర సంపత్, జక్కుల వెంకటేష్, దుబ్బాసి రఘు, యువత, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల వార్షికోత్సవ వేడుకలు.!

ఘనంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగామండల విద్యాధికారి అంబాటి వేణు కుమార్ హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తిరుపతయ్య, మాజీ ఎంపిటిసి గుండి ప్రవీణ్, మాజీ ఉపసర్పంచ్ మేడి శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ చిలువేరి స్వప్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, మ్యాకల నాగరాజు, మడ్డి మనోజ్, ఉత్కం శ్రీనివాస్, మచ్చ పవన్ కళ్యాణ్, మంద రాజశేఖర్, కత్తి సాయి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version