ప్రతీ ధాన్యంగింజను రాష్ట్ర ప్రభుత్వమే.!

ప్రతీ ధాన్యంగింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పని

పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

*రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని మందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలుకేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 2320,కామన్ రకానికి రూ.2300 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17 శాతం మాయుచర్ ఉండాలని అన్నారు. నిబంధనల మేరకు తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, లారీలలో మిల్లులకు తరలించిన ధాన్యాన్ని అన్లోడ్ చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలనీ సూచించారు. కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బొనస్ లభిస్తుందన్నారు.

government.

రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదని ప్రతి ఒక్క రైతుకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,డిసిఓ నీరజ,సివిల్ సప్లైస్ జిల్లా అధికారి డి.కిష్టయ్య,సివిల్ సప్లైస్ డిఎం సంధ్యారాణి,ఏడీఏ దామోదర్ రెడ్డి ,తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, అగ్రికల్చర్ మండల ఆఫీసర్ మాధవి,కొనుగోలు కేంద్రాల మండల నోడల్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి,సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,సొసైటి ఇంచార్జీ సిఈఓ భిక్షపతి, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రెల బాబు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సొసైటీ వైస్ చైర్మన్, సొసైటీ డైరెక్టర్లు, పలువురు వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version