ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట నీళ్ల పాలైతే పట్టించుకోని ప్రభుత్వం
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ నాయకులుఈ సందర్బంగా భూపాలపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ అకాల వర్షాలకు అన్నదాత ఆగమైతుంటే, ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీళ్ల పాలైతే, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు. మండలం గాంధీనగర్ గ్రామ రైతుల పరిస్థితి మాత్రమే కాదు దాదాపు రాష్ట్రమంతా ఇదే దుస్థితి. ములుగే నక్కపై తాటి పండు పడ్డట్టు రైతు పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది. సొంత మండలం అని గొప్పలు చెప్పుకునే స్థానిక శాసనసభ్యులు కొనుగోల కేంద్రాల్లో కాంటాలు అయి 4,5 రోజుల నుండి ధాన్య బస్తాలు కల్లాలో ఉన్న వాటిని మిల్లు లకు తరలించంచడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ లారీలను కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.గత 4,5 రోజుల నుండి వర్షాలు పడుతు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిచి రైతులు బాధ పడుతుంటే స్థానిక శాసనసభ్యులు కనీసం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల యొక్క వడ్లను కటింగ్ లేకుంటే కొంటామని ధైర్యాన్ని ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు.కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, రైతుల బతుకులు కాపాడాలని మంత్ర ఉత్తంకుమార్ సివిల్ సప్లయిస్ కమిషనర్ , భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నాం బి ఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు తోడుగా ఉంటామని తెలియజేశారు 2, 3 రోజుల్లో వడ్లను పూర్తిగా మిల్లులకు తరలించకపోతే బిఆర్ఎస్ పార్టీ తరపున భారీ ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భైరగాని కుమారస్వామి గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు మామడి రమేష్, ఉపాధ్యక్షుడు రాము , నాయకులు బోట్ల స్వామి, రవి, వాజిత్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు
ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుండెకారి రంగారావు
నర్సంపేట,నేటిధాత్రి:*
ఆరె కుల సంక్షేమ సంఘం ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన గుండెకారి రంగారావును ఎంపికయ్యారు.ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా ఆరెకుల ముఖ్య నాయకుల సలహా సూచన మేరకు కృషి చేస్తానని అన్నారు. తన మీద ఎంతో నమ్మకంతో బాధ్యతను కట్టబెట్టి, కుల సంఘ నిర్మాణంలో, కార్యక్రమాలలో నా వంతు సహాయ, సహకారాలతో పాటు,తనకు గ్రామ,మండల,జిల్లా, రాష్ట్ర కమిటీ నాయకులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.తన నియామకానికి సహకరించిన ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్,స్టీరింగ్ కమిటీ చైర్మన్ దిగంబర రావు,రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తాల చందర్ రావు,క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మారుజోడు రాంబాబు, రాష్ట్ర, జిల్లా కమిటీ ముఖ్య నాయకులకు రంగారావు కృతజ్ఞతలు తెలిపారు.
దామెర కుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల మరణం చెందిన గౌడ సంతోష్ పిఆర్టియు టీఎస్ క్రియాశీల సభ్యునికి వారి గృహంలో శాసనమండలి సభ్యులు శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఒక లక్ష 70 వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు . ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పి ఆర్ టి యు టి ఎస్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి సంఘం రక్షణ కవచంగా ఉంటుందని , అలాగే సంతోష్ కుటుంబానికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు ,ఉద్యోగ కల్పన ఇప్పించే బాధ్యత తనదేనని , రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత చికిత్స అందించే హెల్త్ పాలసీని రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ,ఉపాధ్యాయులకు కాంట్రాక్టు సిబ్బందికి అందరికీ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఉత్తర్వులు ఇప్పిస్తానని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ ఉద్యోగులకు డెత్ గ్రాట్యూయిటి మరియు ఫ్యామిలీ పెన్షన్ పి ఆర్ టి యు ఇప్పిచ్చిందని , రాబోయే కాలంలో ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించేలా ప్రభుత్వాన్నీ ఒప్పిస్తానని తెలియజేశారు . గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కారుణ్య నియామకం ఉద్యోగి మరణించిన నెలలోపు వారి కుటుంబ సభ్యులకు వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేగూరి సుభాకర్ రెడ్డి , కుసునపు కిరణ్ కుమార్ హనుమకొండ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి , కాటారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంగోత్ రవీందర్ ,అనపర్తి తిరుపతి భూపాలపల్లి మండల అధ్యక్షులు హరిప్రసాద్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాబురావు పాల్గొన్నారు
– కొత్త రేషన్ కార్డు ఆశ హవుల నుంచి డబ్బులు వసూలు – – పలు మండలాలలో బహిరంగంగానే చర్చించుకుంటున్న ప్రజలు
మరిపెడ నేటిధాత్రి.
తెలంగాణ రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఏ స్కీంకు అప్లై చేసుకోవాలన్న కానీ కావలసింది రేషన్ కార్డు.
అయితే ప్రతి కుటుంబంలో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు అనేది అవసరం.
అయితే గత ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు లేక ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది గురి కావడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో మీసేవ సెంటర్ల ఆన్లైన్ చేసుకొని ఎమ్మార్వో ఆఫీస్ లో ఇచ్చినచో వెరిఫికేషన్ చేసి వెంటనే కార్డు మంజూరు చెయ్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే దీనికి భిన్నంగా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు.
రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వచ్చిన ప్రజల నుంచి కార్డుకు వెయ్యి రూపాయల చొప్పున కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులపై ప్రజలు ఆరోపిస్తున్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో రెవెన్యూ అధికారులు చేస్తున్న పని తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని చెప్పడంతో రేషన్ కార్డులు లేని ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత తిరిగి ఎమ్మార్వో ఆఫీస్ లో అప్లై చేసుకొని కార్డు మంజూరు చేసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నారు.
ఇది అదును చేసుకొని రెవెన్యూ అధికారులు మాత్రం సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.
రేషన్ కార్డు కావాలని వచ్చిన వాళ్ల నుంచి కొంతమేర డబ్బులు వసూలు చేసుకుని వారికి వెంటనే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కొంతమంది రోజులు గడిచిన గాని రేషన్ కార్డు మంజూరు కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఒకే రోజు ఇద్దరు అప్లై చేసుకోగా అందులో ఒకరికి వారంలో కార్డు మంజూరై మరొకరికి రాకపోవడంతో కంగు తింటునారు.
డబ్బులు ఇస్తేనే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారని రెవెన్యూ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు.
డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు మంజూరు చేసే అధికారుల పైన పై స్థాయి అధికారులు దృష్టి పెట్టి తగిన న్యాయం చేయాలని రేషన్ కార్డు లబ్ధిదారులు కోరుతున్నారు.
హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
◆ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు వేదమంత్రాల నడుమ బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో జహీరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐజీ సత్యనారాయణ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎంపీ కాంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు తదితరులు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు. హుగ్గెల్లిలో బసవేశ్వరుడి విగ్రహం వద్ద వేద పండితులు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బసవేశ్వరుడి విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వగురు బసవేశ్వరుని స్పూర్తి, ఆలోచన విధానంతో బసవేశ్వరుని దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం జన గణనలో కుల గణన చేసి చూపెట్టిందని తెలియజేశారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ అడుగడుగున మహాత్మా జ్యోతి రావు పూలే, మహాత్మా గాంధీ, బసవేశ్వరుడు స్ఫూర్తితో సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ అందజేయాలని ఆయన ఆక్షించారని ఆయన సూచనలతోనే తెలంగాణలో కుల గణన చేసి చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ , జిల్లా ఇంచార్జీ మంత్రి కొండా సురేఖ, ఎంపీ సురేష్ షట్కర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జిల్లా లింగాయత్ సమాజా నాయకులు గురువులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని సి.పి.ఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముషాం రమేష్ మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం తీవ్రంగా తడిసి మొలకెత్తడం జరిగినది. అని తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. అన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యానికి మొత్తం కొనుగోలు చేయాలని సి.పి.ఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి సీజన్లో పంట పండించిన రైతుకు మొత్తం పంట ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా పంటకు ఎప్పుడు ఏమైతదో అని భయం గుప్పిట్లో బతకవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. గతంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న రైతుల రైతుల బతుకులు ఎలాంటి మార్పు జరగడం లేదు. బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల. జెండాలు వేరైనా మోసాలు ఒకటే. విధానాలు ఒకటే రైతే రాజు అని రైతులను మోసం చేసి రైతుల ఓట్లతో అధికారం లోకి వస్తున్నాయి. రైతులు పండించిన పంటకు నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళిక చేయకపోవడంతోనే ప్రతి పంట సీజన్ లో వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.ఇప్పటికైనా రైతులకు నష్టాలు జరగకుండా పండిన పంటను వెంట వెంటనే కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు ఈ సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి,కోడం రమణ పాల్గొన్నారు
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి ముందర సీసీ రోడ్డు కొరకు తవ్వారు
సీసీ రోడ్ వేయలేదు
ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వార్డ్ లో రాష్ట్రప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి ముందర సి సి రోడ్ వేయడానికి రోడ్డు తవ్వి సీసీ రోడ్డు వేయకుండా వదిలివేశారని అదేవిధంగా న్యాయవాది విజయసాయి ఇంటి ముందర రోడ్డును తవ్వి రోడ్డు వేయకుండా వదిలేశారని 33 వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు .వెంటనే జిల్లా కలెక్టర్ వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి స్పందించి చర్యలు తీసుకొని వెంటనే సి సి రోడ్ సీసీ వాహనాదారులు వారి వాహనాదారులు వాహనాలు నడిపే వారు ప్రజలు ఇబ్బందుల కు గురవుతున్నారని వెంటనే సి సి రోడ్డు వేయించాలని 33 వ వార్డు ప్రజలు ఒక ప్రకటనలో తెలిపారు
బసవేశ్వరుడు చూపిన మార్గంలో కాంగ్రెస్ సర్కారు : సీఎం రేవంత్ రెడ్డీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో పయనిస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్ర బాగంగానే బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు బాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు, ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.
కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం…
మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు
కిరాణా షాపుల్లో వస్తువుల చివరి తేదీ చూసుకొని కొనుక్కోండి…
కాంగ్రెస్ నాయకులు గోపతి భానేష్
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ ఏరియాలో కిరాణా దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పడిన నేపథ్యంలో కిరణా షాప్ యజమానులు కాలం చెల్లిన వస్తువులను, గడువు ముగిసిన తినుబండారాలను విక్రయిస్తున్నారని అమ్మ గార్డెన్ ఏరియా కాంగ్రెస్ నాయకులు గోపతి బానేష్ మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ స్పందించి శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్, సంతోష్ లను గద్దె రాగడి ఏరియాలోని కిరాణా దుకాణాలకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించారు.
shops
33 వ రోడ్ నంబర్ షాపుల్లో తనిఖీలు చేస్తుండగా కనకదుర్గ కిరాణా షాప్ లో కాలం చెల్లిన వస్తువులు, బ్రెడ్ లాంటి తినుబండారాలు విక్రయిస్తున్నారని నిర్ధారించుకొని అట్టి కిరణా షాప్ ను సీజ్ చేశారు. కాలం చెల్లిన వస్తువులను, తినుబండారాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని, అధిక ధరలకు అమ్మితే షాప్ లైసెన్స్ రద్దు చేసి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పరిధిలోని దుకాణాల యజమానులు మున్సిపాలిటీ టాక్స్, లైసెన్స్, ఫుడ్ సెక్యూరిటీ లైసెన్స్ లు తప్పనిసరిగా తీసుకోవాలని, లైసెన్సు లు లేకుంటే షాపులను సీజ్ చేస్తామని అన్నారు.
నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రజా పరిపాలన లక్ష్యం….
తంగళ్ళపల్లి నేటి రాత్రి…
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో తంగళ్ళపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్.
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి.
నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటం పాటు అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేని నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తంగళ్ళపల్లి మండలంలోని అంకుసాపూర్ నరసింహపల్లె తాడూరు గ్రామాల్లో లబ్ధిదారులకు .
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను.
అందజేసిన నాయకుడు. అలాగే. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్థిక సమస్యలను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని.
ప్రభుత్వం అమలు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో పార్టీ నాయకత్వం పనిచేస్తుందని అలాగే మహిళలకు ఉచిత బస్సు నుండి నిన్నటి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని.
ప్రజలు ప్రతి ఒక్కరు సీఎం సహాయ నిధి సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ.
ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా పాలన.
ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ.
ఇట్టి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు రావడానికి .
కృషి చేసిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డికి ప్రభుత్వ వి ప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ కి. లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు.
తిరుపతి రెడ్డి. అరపల్లి బాలు. నేరెళ్ల పాక్స్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్.
కాంగ్రెస్ నేత జనార్దన్ రెడ్డి. శ్రీరామ్ గౌడ్. రంగు శ్రీను. లక్ష్మణ్. నరసయ్య. అంజయ్య. వెంకట్ రెడ్డి. నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
విశాలమైన వాతావరణంలో చదువులు నేర్పాల్సిన హయత్ నగర్ పరిధిలోని రవీంద్రభారతి స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా శ్మశానవాటిక వద్ద పాఠశాలను నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ బీసి సంక్షేమ సంఘం,పేదల రిజర్వేషన్ పోరాట సమితితో పాటు పలు సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి,జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి,స్థానిక ఎమ్మార్వో, మండల విద్యాశాఖ అధికారులకు వేరువేరుగా పిర్యాదులు చేశారు.
School
ఈ సందర్భంగా తెలంగాణ బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, తెలంగాణ బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి శివ బహుజన్,పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గిరిగాని బీక్షపతి గౌడ్ మాట్లాడుతూ హయత్ నగర్ మండల కేంద్రంలోని హయత్ నగర్ గ్రామ పరిది కుంట్లూర్ రోడ్డులో స్మశాన వాటిక పక్కనే రవీంద్ర భారతి స్కూల్ గత కోంత కాలంగా విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఆరోపించారు.పాఠశాలలకు అనుకోని శ్మశానవాటిక ఉండడం వలన విద్యార్థులకు,తల్లిదండ్రులకు, స్థానిక ప్రజలకు, తీవ్రమైన అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు.నిత్యం దహన సంస్కారాలు జరుగుతుండడంతో కలుషితమైన విషపుపోగా,దుర్వాసనతో విద్యార్థులు అనారోగ్యాలకు గురైతున్నారని అవేదన వ్యక్తం చేశారు.అలాగే విద్యార్థులు భయాందోళన చెందుతున్నారని తెలిపారు.ఈ విషయం పట్ల పలుమార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
School
సమాచారం తెలిసినప్పటికి విద్యాశాఖ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తుందని వారు పేర్కొన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన రవీంద్ర భారతీ స్కూల్ పై శాఖ పరమైన చర్యలు చేపట్టి తక్షణమే అక్కడి నుండి వేరొక చోటికి తరలించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి,జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి,స్థానిక ఎమ్మార్వో,మండల విద్యాశాఖ అధికారులను కోరినట్లు ఆయా సంఘాల ప్రతినిధులు ఎర్ర శ్రీహరి గౌడ్,శివ బహుజన్, గిరిగాని బీక్షపతి గౌడ్ కోరారు.రవీంద్రభారతి స్కూల్ ను వెంటనే సీజ్ చెయ్యని పక్షంలో అన్ని ప్రజా సంఘలతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జహీరాబాద్ వస్తుంటే నీమ్ఙ్ రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏమిటి..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జహీరాబాద్ కు రావడం మంచిదే కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన పేరుతో రైతులను వారి గ్రామాలకు వెళ్లి రాత్రి వేళలో వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం,మాజీ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ జహీరాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమి చేసింది చెప్పాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం కాదు ప్లై ఓవర్ బ్రిడ్జ్,బసవేశ్వర విగ్రహం,నీమ్జ్ రోడ్డు ఇవన్నీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమి చేశారో చెప్పాలని నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పకుండా తిరిగి ప్రతి విమర్శలు చేయడం సిగ్గు చేటు,గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేసిన నిధులను రద్దు చేయడం జహీరాబాద్ అభివృద్ధికి నిరోధం కాదా? రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
దుగ్గొండి మండలంలోని ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణాల్లో పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు.వర్షాకాలం నేపథ్యంలో నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నారా అని నేపథ్యంలో దుగ్గొండి మండలంలోని విత్తనాల షాపులను దుగ్గొండి సీఐ సాయిరమణ,నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు.
Agriculture.
ఎరువుల దుకాణాల యజమానులకు ఎలాంటి నకిలీ విత్తనాలు, పత్తి గింజలు మిరప గింజలు,మొక్కజొన్నలు,పెసర్లు రైతులకు సంబంధించిన నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడిఏ దామోదర్ రెడ్డి,సీఐ సాయిరమణ హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు, నర్సంపేట ఏవో కృష్ణ కుమార్, దుగ్గొండి ఏవో మాధవి, చెన్నారావుపేట ఏవో గోపాల్ రెడ్డి, దుగ్గొండి ఏఈఓ విజయంతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిర్బంధాలు ఎందుకు ఇదేనా ప్రజాపాలన హరీశ్ రావు హాట్ కామెంట్స్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సదర్భంగా రైతులతో పాటు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘x’ (ట్విట్టర్) వేదిక ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం పర్యటన ఉన్న ప్రతిసారి ఇలా ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఫైర్ అయ్యారు. మొన్న నాగర్కర్నూల్ పర్యటనలో చెంచు సోదరులను ఇలానే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.నేడు జహీరాబాద్లో రైతులను, రైతు నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని కామెంట్ చేశారు. జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్ట దిగ్బంధనం చేసి, రైతు నాయకులను నిర్బంధించడం అది ఎలా ప్రజాపాలన అవుతుందని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే పాలన అంటూ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఆ హక్కును హరించడం దుర్మార్గమని.. నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు, అరెస్టులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగే పరిస్థితులు లేవని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ హరీశ్ రావు, డీజీపీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
– జిల్లా అధికార యంత్రాంగం చో రవ తీసుకోవాలి వివిధ గ్రామాల రైతుల ఆవేదన….
కొల్చారం (మెదక్) నేటిధాత్రి:
ఆరుగాలం పండించిన వరి ధాన్యం పంట అమ్ముకుందామంటే గత వారం రోజుల నుంచి అకాల వర్షం రైతన్నలను వెంటాడుతూనే ఉంది. ఏటు చూసినా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు అకాల వర్షం, మరోవైపు లారీల కొరత ఈ కష్టాలు మాకేనా అంటూ అన్నమొ రామచంద్ర అంటూ రైతన్నలు బోరున విలిపిస్తున్నారు.
Rain haunts
ఒకవైపు సొసైటీ పాలకవర్గాల నిర్లక్ష్యం తోటి రైతుల వరి ధాన్యం తూకం వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. లారీలు రాక వెనుకబడ్డ రైతులకు ఒక్క బస్తాకు సుమారు రెండు రూపాయలకు నుంచి నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాల రైతులు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండిస్తే పండించిన పంట డబ్బులు చేతికొచ్చే వరకు రైతుల కళ్ళల్లో కన్నీరే కాదు రక్త నీరు వస్తున్నాయి.
Rain haunts
ఎటు చూసినా రైతుల కష్టాలు.. రైతుల వైపు కన్నెత్తి చూడని రాజకీయ నాయకులు.. వారికి అవసరం ఉంటేనే పలకరిస్తారు … రైతుల నుంచి ఏ యొక్క రాజకీయ నాయకుడు రైతుల పక్షాన ధర్నా చేసిన దాఖలాలు లేవు. కొనుగోలు కేంద్రాలలో నిలిచిన వరి ధాన్యాన్ని జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన వరి ధాన్యాన్ని అతి తొందరగా తరలించాలని వివిధ గ్రామాల రైతులు జిల్లా అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.
మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి అక్రమంగా ముందస్తు అరెస్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శివరాజ్ శ్రీకాంత్ రెడ్డిలను శుక్రవారం పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని అక్రమ నిర్బంధాలతో, అక్రమంగా హద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీస్ సిబ్బంది ముందస్తు అరెస్టు చేసినారు.
కోహీర్, మండల్ కు చెందిన ప్రముఖ మరియు సుప్రసిద్ధ వ్యక్తి, ముహమ్మద్ సజ్జాద్ పటేల్ చిష్తి, మోహి ఖాద్రీ రిజ్వానీ అహ్మదీ యూసుఫీ,అల్-నైబీ అల్-మిర్జా కలందరీ,సజ్జాదా నషిన్ అస్తానా,ప్రస్తుతం జహీరాబాద్ లో నివసిస్తున్న గురుజువాడ నివాసి అహ్మద్ హుస్సేన్ గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు గురుజువాడ లో సాయంత్రం మగ్రిబ్ ప్రార్థన తర్వాత మృతుడి అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి.పూర్వీకుల స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రాణాలతో బయటపడిన వారిలో అతని భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.
నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి?
◆ రైతులను ముంచేందుకు రెడీ అవుతున్న ముఠాలు
◆ అన్నదాతలకు నకిలీ విత్తనాలు అంటగట్టే కుట్ర
◆ ఏటా రూ. కోట్లలో నకిలీ దందా.. నిండా మోసపోతున్న రైతులు
◆ రైతులకు రక్షణగా అనేక చట్టాలు.. అవగాహన లేక అన్యాయం
ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నది. దీంతో రైతులను నిలువునా ముంచేందుకు నకిలీ కేటు గాళ్లు సిద్ధమైపోతున్నారు. ప్రతి ఏడాది రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టడం.. వారిని నిండా ముంచడం నకిలీ వ్యాపారులకు పరిపాటిగా మారింది. సరైన అవగాహన లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలేదో నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతంగా నకిలీ విత్తనాలను తయారుచేస్తున్నారు. దీంతో రైతులు నకిలీ విత్తనాలు నాటి నిండా మునిగిపోతున్నారు. ఆ తర్వాత పరిహారం కూడా పొందలేకపోతున్నారు. ప్రతి ఏడాది రూ. కోట్లల్లో రైతులు నష్టపోతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి.. ఆశించిన దిగుబడి రాక అగచాట్లు పడుతున్నారు. అయితే విత్తన రక్షణకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నప్పటికీ రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే మోసాలకు గురవుతున్నారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ రైతులు మాత్రం మోసపోతూనే ఉన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు విత్తన పత్తిని సాగు చేస్తుంటారు. ఈ విత్తనపత్తిని సాగుచేసిన అనంతరం విత్తనాలను కంపెనీలకు విక్రయిస్తుంటారు. అయితే వాటిలో కొన్ని విత్తనాలు విఫలమవుతాయి. మధ్య దళారులు వీటిని రైతుల నుంచి సేకరించి అక్రమదందాకు తెరలేపుతున్నారు. కంపెనీల లేబుళ్లు వేసి అచ్చం అసలు విత్తనాలలాగే ఈ కంపెనీలు విత్తనాలను తయారు చేస్తున్నాయి.
Fake seeds
విజిలెన్స్ తనిఖీలు అంతంతే..
రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ తనిఖీలు సైతం అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి విత్తనాలు సేకరించిన కంపెనీలు విఫలమైన విత్తనాల వివరాలను రైతుల పేరుతో సహా వ్యవసాయశాఖకు అందించాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు పెద్దగా అమలు కావడం లేదని తెలుస్తున్నది. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ వ్యవస్థ తనిఖీలు సక్రమంగా లేకపోవటంతో నకిలీ విత్తనాలు నామమాత్రంగానే పట్టుబడుతున్నాయి. ఒకవేళ రైతులు నకిలీ విత్తనాలు సాగు చేసి మోసపోతే ఏం చేయాలి.. వారికి రక్షణగా ఉన్న చట్టాలేమిటిఝ.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ రైతులకు కొన్ని విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు.
నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే ?
నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు.విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి?
అమలులో ఉన్న విత్తన చట్టాలు –
– అభివృద్ధి చేసిన విత్తనాలు & మొలకల చట్టం, 1951 – విత్తనాల చట్టం, 1966 – కొత్త వంగడాల రక్షణ & రైతు హక్కుల చట్టం, 2001 – పత్తి విత్తనాల చట్టం, 2007
పరిహారం పొందే మార్గాలు..
నాణ్యత లేని విత్తనాలు సాగు చేసి రైతులు మోసపోతే వినియోగదారుల ఫోరమ్ లో కేసు వేయొచ్చు. సివిల్ కోర్టులోనూ కేసులు దాఖలు చేయొచ్చు. పత్తి విత్తనాల చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. రిజిస్టర్ అయినా కొత్త వంగడాల్లో నాణ్యతా లోపం అయితే రైతు హక్కుల చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. విత్తనాలు మొలకెత్తకపోయినా.. దిగుబడి ఏమాత్రం రాకపోయినా పరిహారం పొందే అవకాశం ఉంది. విత్తనాల కోసం చెల్లించిన ధరను, సాగు ఖర్చు, దిగుబడి విలువ, రైతుకు కలిగిన మానసిక క్షోభకు సైతం పరిహారం పొందే అవకాశం ఉంది.
రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
విత్తనాలు కొన్నపుడు రసీదు తప్పక తీసుకోవాలి.
విత్తనాలు ఉంచిన డబ్బా/సంచి దాచి ఉంచాలి.
విత్తనాల గురించి సమాచారం తెలుపుతు ఇచ్చిన కాగితాలను దాచి ఉంచాలి
వీలైతే కొన్ని విత్తనాలను కూడా భద్రపరచాలి
పంట నష్టం జరిగిన వెంటనే వ్యవసాయ అధికారికి, సంబంధిత డీలర్/కంపెనీ ప్రతినిధికి తెలియజేయాలి.
నష్ట పరిహారం కోసం కేసు వెయ్యాలి / దరఖాస్తు చేసుకోవాలి.
జహీరాబాద్: నిమ్డ్ రైతుల ముందస్తు అరెస్ట్ లతో మామడ్దిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పోనట్లు పోలీసులు అడ్డుకుంటున్నారు. నిమ్డ్ ప్రాజెక్టుకు సారవంతమైన భూములు తీసుకోవద్దని వేడుకున్నా రైతుల అరెస్ట్ ను రైతు నాయకులు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల పేరు గ్రామానికి పోలీసులు రాగానే వందలాది మంది మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పోలీసుల వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ.
◆ నేడు జహీరాబాద్ కి అక్బరుద్దీన్ ఓవైసీ రాక.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లోని ఈద్గా మైదానంలో 24 మే 2025 నాడు ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలెద్ సైఫుల్లా రహ్మాని గారు అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణగుట్ట శాసనసభ్యులు మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ పాల్గొంటారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ గారు మరియు జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారు మరియు ఈ కార్యక్రమానికి స్థానిక కన్వీనర్ ముఫ్తిసుబూర్ ఖాస్మి వివిధ జమాత్ ల మత పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివిధ ఆర్గనైజేషన్ పెద్దలు పాల్గొని సంబోధిస్తారు కులాలు మతాలకు అతీతంగా పాల్గొనాలని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహియుద్దీన్ గౌరి ముస్లిమ్ ఆక్శన్ కమేటి అధ్యక్షుడు మొహమ్మద్ యూసుఫ్ యమ్.పి.జే అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్ ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బాని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.