కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్.. ఇది కదా కావాల్సింది!

కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్.. ఇది కదా కావాల్సింది!

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాటలో నడుస్తున్నాడు శుబ్‌మన్ గిల్. బ్యాటర్‌గానే కాదు.. సారథ్యంలోనూ అతడ్ని దింపేస్తున్నాడు. అసలేం జరిగిందంటే..

విరాట్ కోహ్లీ.. ఈ పేరు చెప్పగానే సెంచరీలు, రికార్డులు, భారీ ఫ్యాన్ ఫాలోయింగే గుర్తుకొస్తాయి. క్రికెట్ మైదానంలో లెక్కలేనన్ని రికార్డులతో దిగ్గజ స్థాయిని అందుకున్నాడు విరాట్. అయితే కోహ్లీ అంటే పరుగులు, మైలురాళ్లే కాదు.. అగ్రెషన్ కూడా గుర్తుకొస్తుంది. ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనడం, అవసరమైతే బాహాబాహీకి దిగడం, స్లెడ్జింగ్ చేయడానికి కోహ్లీ వెనుకాడడు. అందుకే అతడి సారథ్యంలో భారత్‌ను చూసి అంతా భయపడేవారు. అదే ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. దీన్ని నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరింత ముందుకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు.

దమ్ముంటే ఆడమంటూ..

గిల్ అనగానే కామ్, కూల్ యాటిట్యూడ్ అనే అంతా అనుకునేవారు. కానీ లార్డ్స్ టెస్ట్‌లో శుబ్‌మన్ రూటు మార్చి తనలోని అగ్రెషన్‌ను బయటకు తీశాడు. మూడో రోజు ఆట ముగింపు సమయంలో ఓవరాక్షన్ చేసిన ఆతిథ్య జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్‌కు మీదకు దూసుకెళ్లాడు గిల్. దమ్ముంటే ఆడండి.. నాటకాలు ఎందుకు చేస్తున్నారంటూ వాళ్లతో బాహాబాహీకి దిగాడు. మాటలతో ఇచ్చిపడేసిన భారత నూతన సారథి.. వేళ్లు చూపిస్తూ బాడీ లాంగ్వేజ్‌తోనూ ప్రత్యర్థులను భయపెట్టాడు. దీంతో కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్ అంటూ అభిమానులు పోల్చడం షురూ చేసేశారు..

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య..

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య.. లెడ్ పాయిజనింగ్తో ఆస్పత్రి పాలైన భర్త

జహీరాబాద్ నేటి ధాత్రి:

Lead Poisoning | వంట( Cook ) చేసేస్తుంటారు. ఎందుకంటే వంట పని అయిపోతే రిలాక్స్ గా ఉండొచ్చని. ఇక త్వరగా వంట అయ్యేందుకు చాలా మంది మహిళలు ప్రెజర్ కుక్కర్ లను వినియోగిస్తుంటారు. అన్నం వండే సమయంలో ఒక రెండు విజిల్స్ పెడితే.. ఐదు నిమిషాల్లో అన్నం రెడీ. ఇక కూరల విషయంలో ఓ ఐదారు విజిల్స్ పెడితే.. 10 నిమిషాల్లో కూర రెడీ. ఇలా ఓ అర గంటలో నాలుగైదు రకాల వంటలు తయారు చేస్తారు.కానీ ఈ ప్రెజర్ కుక్కర్లో వంటలు చేయడం ఏ మాత్రం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకే ప్రెజర్ కుక్కర్ ను ఏండ్ల తరబడి వినియోగించొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఓ మహిళ 20 ఏండ్లుగా ఒకే ప్రెజర్ కుక్కర్లో అన్నం వండుతుంది. ఆమె భర్త ఆ కుక్కర్లో వండిన అన్నం, ఇతర పదార్థాలను తిని లేట్ పాయి జనింగ్ గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.ముంబైకి చెందిన ఓ 50 ఏండ్ల వ్యక్తి.. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్ గబాలే.. బాధిత వ్యక్తిని పరిశీలించి షాక్ అయ్యాడు. అతని శరీరమంతా లెడ్ పాయిజనింగ్ అయిందని వైద్య పరీక్షల్లో తేలింది. అతను మెమోరీ కోల్పోవడం,కాళ్లల్లో తీవ్రమైన నొప్పి, కడుపు నొప్పి రావడం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇదంతా లెడ్ కెమికల్ టాక్సిసిటీ వల్ల జరుగుతుందని డాక్టర్ తెలిపారు.బాధిత రోగిని పరిశీలించి, వైద్య పరీక్షలు చేసినప్పుడు అన్ని రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయి. కానీ హెవీ మెటల్ స్క్రీనింగ్లో అతను లెడ్ పాయిజనింగ్కు గురైనట్లు నిర్ధారణ అయింది. లెడ్ స్థాయిలు డెసిలీటర్కు 22 మైక్రోగ్రాముల చొప్పున అతని శరీరంలో ఉన్నాయి. ఇది దీర్ఘకాలిక లెడ్ పాయిజనింగ్కు దారి తీసిందని డాక్టర్ గబాలే పేర్కొన్నారు. లెడ్ పాయిజనింగ్ వల్ల శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. బ్రెయిన్, కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

మరి లెడ్ పాయిజనింగ్కు ఎలా గురయ్యాడంటే..?

రోగితో పాటు అతని భార్యను విచారించినప్పుడు లెడ్ పాయిజనింగ్కు గల కారణాలు బయటపడ్డాయని డాక్టర్ తెలిపారు. గత 20 ఏండ్ల నుంచి రోగి భార్య ప్రెజర్ కుక్కర్లోనే వంట చేస్తుందని తేలింది. పాత, పాడైన అల్యూమినియం కుక్కర్లలో సీసం ( Lead), అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోతాయని, తద్వారా లెడ్ పాయిజనింగ్కు గురవుతారని నిర్ధారించారు. దీంతో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి, మెదడు పని నెమ్మదిస్తుందన్నారు. రోగికి కీలేషన్ థెరపీ నిర్వహించామని, ప్రస్తుతం కోలుకుంటున్నాయని డాక్టర్ గబాలే పేర్కొన్నారు.

చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

దామెర కుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల మరణం చెందిన గౌడ సంతోష్ పిఆర్టియు టీఎస్ క్రియాశీల సభ్యునికి వారి గృహంలో శాసనమండలి సభ్యులు శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఒక లక్ష 70 వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు . ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పి ఆర్ టి యు టి ఎస్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి సంఘం రక్షణ కవచంగా ఉంటుందని , అలాగే సంతోష్ కుటుంబానికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు ,ఉద్యోగ కల్పన ఇప్పించే బాధ్యత తనదేనని , రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత చికిత్స అందించే హెల్త్ పాలసీని రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ,ఉపాధ్యాయులకు కాంట్రాక్టు సిబ్బందికి అందరికీ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఉత్తర్వులు ఇప్పిస్తానని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ ఉద్యోగులకు డెత్ గ్రాట్యూయిటి మరియు ఫ్యామిలీ పెన్షన్ పి ఆర్ టి యు ఇప్పిచ్చిందని , రాబోయే కాలంలో ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించేలా ప్రభుత్వాన్నీ ఒప్పిస్తానని తెలియజేశారు . గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కారుణ్య నియామకం ఉద్యోగి మరణించిన నెలలోపు వారి కుటుంబ సభ్యులకు వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేగూరి సుభాకర్ రెడ్డి , కుసునపు కిరణ్ కుమార్ హనుమకొండ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి , కాటారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంగోత్ రవీందర్ ,అనపర్తి తిరుపతి భూపాలపల్లి మండల అధ్యక్షులు హరిప్రసాద్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాబురావు  పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version