వంటనూనెల జీఎస్టీ రీఫండ్స్ ఆంక్షలు ఎత్తేయండి – ఐవీపీఏ విజ్ఞప్తి.

వంటనూనెల జీఎస్టీ రీఫండ్స్‌పై విధించిన ఆంక్షలు ఎత్తేయండి.. ఐవీపీఏ విజ్ఞప్తి

 

 

వంటనూనెలకు సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ రీఫండ్‌పై ఆంక్షలను ఎత్తేయాలని ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఆంక్షల వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: వంటనూనెలకు సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్స్‌‌పై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రీఫండ్స్ లేని కారణంగా వర్కింగ్ క్యాపిటల్, నగదు లభ్యత తగ్గి చిన్న,మధ్య తరహా సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని పేర్కొంది. ఈ రంగంలో పెట్టుబడులు తగ్గుతున్నాయని కూడా పేర్కొంది.

రీఫండ్స్‌కు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ 2022 జులైలో ఆంక్షలు విధించిందని ఐవీపీఏ తెలిపింది. వంటనూనెలకు సంబంధించి ఇన్‌వర్టెడ్ సుంకాలు, ఆంక్షల కారణంగా తమ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుకుపోతున్నాయని తెలిపింది. ఫలితంగా నగదు లభ్యత తగ్గుతోందని, ఇది చిన్న, మధ్య తరహా సంస్థలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. ‘వర్కింగ్ క్యాపిటల్‌కు కొరత ఏర్పడుతోంది. నగదు లభ్యతకు అవాంతరాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా మారింది’ అని ఐవీపీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

రీఫండ్స్ లేని కారణంగా ఈ అదనపు ధరాభారం వినియోగదారులకు బదిలీ కావడంతో వంట నూనెల రేట్లు పెరుగుతున్నాయని ఐవీపీఏ తెలిపింది. రేట్లు తట్టుకోలేక కొందరు వినియోగదారులు తక్కువ నాణ్యత గల ప్రత్యామ్నాయాలవైపు మళ్లుతున్నారని తెలిపింది. బటర్, నెయ్యి వలెనే వంటనూనెలకు సంబంధించి ట్యాక్స్ క్రెడిట్స్ రీఫండ్ తక్షణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రీఫండ్స్ విధానంలో సుస్థిరత వస్తే దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుందని ఐవీపీఏ తెలిపింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2030-31 నాటికి దేశంలో వంటనూనెలకు డిమాండ్ 30 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. ఆహార నూనెల మార్కెట్ 2023-28 మధ్య కాలంలో 5.26 వార్షిక వృద్ధి రేటుతో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సహేతుకమైన రీఫండ్ పాలసీ దేశంలో ఆహారభద్రతకు బాటలు వేస్తుందని కూడా ఐవీపీఏ పేర్కొంది.

నిర్బంధాలు ఎందుకు ఇదేనా ప్రజాపాలన.

నిర్బంధాలు ఎందుకు ఇదేనా ప్రజాపాలన హరీశ్ రావు హాట్ కామెంట్స్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సదర్భంగా రైతులతో పాటు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘x’ (ట్విట్టర్) వేదిక ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం పర్యటన ఉన్న ప్రతిసారి ఇలా ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఫైర్ అయ్యారు. మొన్న నాగర్‌కర్నూల్‌ పర్యటనలో చెంచు సోదరులను ఇలానే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.నేడు జహీరాబాద్‌లో రైతులను, రైతు నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని కామెంట్ చేశారు. జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్ట దిగ్బంధనం చేసి, రైతు నాయకులను నిర్బంధించడం అది ఎలా ప్రజాపాలన అవుతుందని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే పాలన అంటూ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఆ హక్కును హరించడం దుర్మార్గమని.. నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు, అరెస్టులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగే పరిస్థితులు లేవని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ హరీశ్ రావు, డీజీపీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా.!

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా పై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

వీణవంక మండల కేంద్రంలో టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ, గత100 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీలో నిరసనలకు నిర్బంధం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు మల్కి,తెలంగాణ సామాజిక ఉద్యమాలకు, ప్రజల తరఫున మాట్లాడే గొంతుకలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని అన్నారు అలాంటి వారి స్వేచ్ఛ హరించే విధంగా ఉన్న సర్కులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతే కాకుండా ఉన్నతమైనటువంటి విద్యాశాఖ ను తన దగ్గర పెట్టుకొని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని కుట్ర మానుకోవాలని హెచ్చరించారు వెంటనే విద్యాశాఖకు మంత్రి నియమించాలని అదేవిధంగా
ప్రజా పాలన పేరుతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పాలనకు చర్మ గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటని విద్యార్థుల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా పాలిస్తున్న ఈ పాలనను ప్రజా పాలన అంటారా ?ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలను తలపించే విధంగా ప్రశ్నించే ప్రతి వారిపై నిర్బంధాలను విధిస్తూ ప్రజాపాలన పేరుతో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలన రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా స్వాగతించడం లేదని వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పై విధించిన నిర్బంధాలను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version