బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు..

సిరిసిల్ల ఎమ్మెల్యే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) 49వ జన్మదినం సందర్భంగా సిరిసిల్ల గాంధీ చౌక్ లో
బిఆర్ఎస్ పార్టీ నేతలు వైభవంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్లకే ఒక ఒక వరం మన అన్న కేటీఆర్ అని, అలాంటి వారి జన్మదినం ఈరోజు జిల్లాలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అంతేకాకుండా ఈ సిరిసిల్లని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం గత ప్రభుత్వం పాలనాలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరగడం అని కొనియాడారు. అంతే కాకుండా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల తోట ఆగయ్య కూడా మాట్లాడుతూ


ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, మరియు తల్లి శిశువులకు సంబంధించిన కెసిఆర్ కిట్లు హాస్పటల్లో పంచడం జరిగినది తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ మాజీ చైర్పర్సన్ జిందo కళా చక్రపాణి, బోల్లి రామ్మోహన్, ధర్నాo లక్ష్మీనారాయణ, అడ్డగట్ల మురళి, తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పలు గ్రామాల్లో కేటీ రామారావు జన్మదిన వేడుకలు…

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో కేటీ రామారావు జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-96.wav?_=1

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి.కేటీ రామారావు జన్మదిన వేడుకల సందర్భంగా. మండలంలో పలు గ్రామాలలో. దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసి. స్వామి వారి ఆశీస్సులు తీసుకొని. కేటీ రామారావు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని పలుదేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మండలంలో. బద్దెనపల్లి గ్రామంలో కేటీ రామారావు జన్మదిన రోజు సందర్భంగా పలువురు మహిళలకు కెసిఆర్ కిట్లు అందజేశారు ఇట్టి కార్యక్రమంలో కెసిఆర్ కిట్లు తీసుకున్న వారిలో చాలామంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం ప్రతి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఇట్టి కార్యక్రమంలో. బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజ భీంకర్.రాజన్న. మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. మాజీ సర్పంచ్ రవి.పాక్స్. వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. మహిళ నాయకురాలు. సిలువేరి చిరంజీవి.టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-91-1.wav?_=2

రామడుగు, నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదినం సందర్బంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని ప్రశాంత్ భవన్ లో పిల్లలకు నిత్యవసర సరుకులు, బియ్యం, పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు మార్కొండ కిష్టారెడ్డి, తౌటు మురళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మామిడి తిరుపతి, గంట్ల వెంకటరెడ్డి, పూడూరు మల్లేశం, మాజీ మండల అధ్యక్షులు జూపాక కరుణాకర్, మాజీ జిల్లా రైతుబంధు సభ్యులు వీర్ల సంజీవరావు, నాయకులు నాగి శేఖర్, మాజీ సర్పంచులు చాడ చంద్రశేఖర్ రెడ్డి, పంజాల జగన్మోహన్ గౌడ్, వీర్ల రవీందర్రావు, సైండ్ల కరుణాకర్, గుండి ప్రవీణ్, జవ్వాజి శేఖర్, ఊగంటి చంద్రారెడ్డి, చిలుముల ప్రభాకర్, జూపాక మునిందర్, నాయకులు ఎల్లా జగన్ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్లు శనిగరపు అనిల్, బత్తిని తిరుపతి గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు పెగడ శ్రీనివాస్, గునుకొండ తిరుపతి, దొడ్డ లచ్చిరెడ్డి, యూత్ అధ్యక్షులు ఆరపెళ్లి ప్రశాంత్, ఎస్సీసెల్ అధ్యక్షులు శనిగరపు అర్జున్, మినుకుల తిరుపతి, బీరెల్లి అనిల్ రావు,పురాణం రమేష్, కాడే అజయ్, యాచమునేని,నరేష్ విద్యాసాగర్, కట్ల అనిల్, దైవల నారాయణ, పోశెట్టి, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఇందిరా భవన్ లో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు..

ఘనంగా
ఇందిరా భవన్ లో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు..

జగిత్యాల. రాయికల్. జులై 23, నేటి ధాత్రి:

 

కేక్ కట్ చేసి సంబురాలు..

ఏ ఐ సీ సీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీనాక్షి నటరాజన్ చిత్రం తో కూడిన కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి,జన్మదిన వేడుకలు నిర్వహించారు.

అనంతరం మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి తెలంగాణ ఇంచార్జి గా క్షేత్ర స్థాయిలో
పార్టీ బలోపేతమే ధ్యేయంగా పని చేస్తున్నారు.

రాహుల్ గాంధీ ను ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

పదేళ్లు బీ ఆర్ ఎస్ అరాచకాలను ను ఎదురించి నిల్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని కార్యకర్తల్లో భరోసా నింపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు.

మహిళలకు ఉచిత రవాణా, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ప్రతి క్వింటాల్ పై రూ.500 బోనస్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం..

గృహ అవసరాలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం ఒక్కటే అని స్పష్టం చేశారు.

జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్ కల్పించాలనే రాహుల్ గాంధీ ఆలోచన తో
కుల గణన చేపట్టి,42 శాతం రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్నారు.

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడం తో పాటు విద్య, ఉద్యోగాలలో అమలు చేస్తాం.

2017 నాటికి కాంగ్రెస్ లో ఉన్న వారికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం నింపారు.

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

జమ్మికుంట మున్సిపల్ కొత్తపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం.

జమ్మికుంట మున్సిపల్ కొత్తపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం
జమ్మికుంట (నేటిధాత్రి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి 19వ వార్డులో 5 లక్షల రూపాయల సీసీ రోడ్డును దేశ్ ని స్వప్న కోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ప్రారంభించారు సుంకరి రమేష్, ఎర్రం సతీష్ రెడ్డి,ఎలగందుల శ్రీహరి, పిట్టల రమేష్ ఉడత వెంకటేష్,సంకీస సురేష్,రాజ్ కుమార్,రామచంద్రం,శ్రీను ,ఆడపు రాజా నర్సు,ఎండి ఖాదిర్, ఎండి ఖాదీర్ ,రాజ కొంరయ్య,చక్రపాణి,, ఎండి ఇస్మాయిల్ ,జావిద్,ఉన్నారు

రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన.

రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బిజెపి నాయకులు
కొద్దిపాటి వర్షానికే గుంతల మయమైన కొత్త పెల్లి భట్టుపల్లి రోడ్డు
నెలలు గడుస్తున్న పూర్తికాని రోడ్డు పనులు
కంకరపై ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

నేటి ధాత్రి అయినవోలు :-

వర్ధన్నపేట నియోజకవర్గంలో రోడ్డు విస్తరణలో భాగంగా మంజూరైన కొత్తపెళ్లి బట్టుపల్లి రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలల క్రితం రోడ్డు వెడల్పు లో భాగంగా కంకర పోసి వదిలేసిన అధికారులు ఇప్పటికీ తారు రోడ్డు పనులు పూర్తి చేయలేదని తద్వారా చిన్న వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచి గుంతలు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాల గురవుతున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు. బుధవారం అయినవోలు భాజపా మండల పార్టీ అధ్యక్షుడు మాదాస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై నిలిచిన బురద నీటిలో వరి నాట్లు వేయడం ద్వారా నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి కోట కిరణ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్ , మహేష్, భరత్, శివమణి తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ.

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి కొండా సురేఖ

దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.

పేదప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం జిడబ్ల్యుఎంసి పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీ ప్రాంతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు,
జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ప్రతులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అధికారులతో కలిసి దేశాయిపేట ఎస్సీ కాలనీలో కలియ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ..

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని, నియోజకవర్గానికి 3500 ఇల్లు మొదటి విడతలో మంజూరయ్యాయని, రెండో విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. మధ్య దళారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నదని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్యశ్రీ పరిస్థితిని 10 లక్షల రూపాయలకు పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కల ఇందిరమ్మ ఇల్లు సొంతమయ్యేలా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడుదల రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 500 కోట్ల రూపాయలతో నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల దేవదాయ శాఖకు 176 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని మంత్రి తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప గత పది ఏళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. కొండా దంపతులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వల్లే ప్రజలు ఆశీర్వదించడం వల్ల ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని, తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ అన్ని డివిజన్లను పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న షాదిఖానను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
మహిళలు తలచితే ఏదైనా సాధిస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 6 గ్యారంటీలు మహిళల పేరు మీదే నామకరణం చేయడం జరిగిందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడంతోపాటు 200శాతం కాస్మెటిక్ చార్జీలను పెంచడం, పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు మెప్మా ద్వారా కుట్టించిన యూనిఫామ్ లు పాఠ్యపుస్తకాలు అందించి ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలలను బలోపేతం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, తూర్పు లోని 5 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ ద్వారా ఐదు బస్సులను అద్దెపై నిర్వహించుకొనుటకు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి కమ్యూనిటీ హాల్ లకు బదులు మ్యారేజ్ హాల్ లను నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సూచించారు.

District Collector Dr. Satya Sarada.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ..

ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని, పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు సమీక్షలు జరుపుతున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే మేస్త్రీలకు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణం ఇప్పించడం జరుగుతుందన్నారు. 500 ఎస్ ఎఫ్ టి వరకే నిర్మించుకునేలా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ..

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరిలో మధ్య దళారుల సమయం లేకుండా చూడాలని, అలాంటి దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శుభం, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్న రాణి, సీఎంహెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి పట్టణ సమస్యలపై కమ్యూనిస్టుల వినతి పత్రం.

బెల్లంపల్లి పట్టణ సమస్యలపై కమ్యూనిస్టుల వినతి పత్రం.

బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కి పట్టణ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో కలుషిత మురికి నీరు కలిసిన నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నారు. అట్టి నీటి నీ ప్రజలు వాడడం ద్వారా ప్రజల ఆరోగ్యం చెడిపోయి వ్యాధిగ్రస్తులైతున్నారు. కావున స్వచ్ఛమైన నీరును పట్టణ ప్రజలకు అందించవలెను. ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడగలరు.
పట్టణంలోని అన్ని వార్డులలో దోమల బెడద ఎక్కువగా ఉన్నది. దోమల బెడద నివారణకు దోమల మందును స్ప్రే (పోగింగ్) చేయించగలరు.
అన్ని వార్డులలో డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదు. వెంటనే డ్రైనేజీలు క్లీన్ చేయించగలరు.
సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి కన్నాల బస్తి ఫ్లై ఓవర్ వరకు మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ప్రమాదాలు జరుగుచున్నవి. ఈ అసౌకర్యాన్ని తొలగిస్తూ రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేపట్టగలరు.
పైన పేర్కొనబడిన సమస్యల గురించి ఇంతకుముందు మీకు వినతి పత్రము ఇచ్చినాము. దానిమీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరల ఒకసారి మీకు ఈ సమస్యలపై వినతి పత్రము ఇచ్చుచున్నాము. ఇప్పుడైనా స్పందించి పైన సమస్యలు వెంటనే పరిష్కరించగలరని విశ్వసించుచున్నాము. ఈ సమస్యలు పరిష్కరించని పక్షంలో మునిసిపల్ ఆఫీసు ముందు భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనల ను జరుపుతాము అని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొల్లం పూర్ణిమ రాష్ట్ర సమితి సభ్యురాలు,చిప్ప నరసయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు,బొల్లం తిలక్ అంబేద్కర్ పట్టణ సహాయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ ఆడెపు రాజమౌళి
సిపిఐ పట్టణ కార్యదర్శి
తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం భూములను గుర్తించేది ఎర్రజెండా పార్టీ..

ప్రభుత్వం భూములను గుర్తించేది ఎర్రజెండా పార్టీ

#నెక్కొండ, నేటి ధాత్రి:

ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాదారుల నుండి వెలికి తీసే చూపెట్టిన పార్టీ సిపిఐ ఎర్ర జెండా పార్టీ అని వరంగల్ జిల్లా సిపిఐ కార్యదర్శి మేకల రవి అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు అధ్యక్షతన జరిగిన 72వ సిపిఐ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొందరు అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములను, దేవాలయ భూములను, కబ్జా చేసినా కబ్జా కోర్ల నుండి బయటకు తీసి గుడిసెలు వేసి దెబ్బలు పడి, కేసులపాలై, ప్రభుత్వానికి అప్పజెప్పిన ఘనత సిపిఐ పార్టీ , ఎర్రజెండాదని ఇది ఉమ్మడి జిల్లాలో, జిల్లా కేంద్రంలోనే జరిగిందని కాళిదాసు ప్రభుత్వ భూమిని కొందరు భూకబ్జా కోర్ల నుండి బయట తీసి ప్రభుత్వానికి, న్యాయస్థానం ద్వారా ప్రభుత్వానికి అప్పజెప్పారని, ఆ స్థలం లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆడిటోరియంలు నెలకొల్పిందని ఆయన గుర్తు చేశారు. ప్రజా సేవకు ఏ పదవులు అధికారం లేకున్నా ప్రజల అండదండలతో ఎన్నో ఉద్యమాలు చేస్తూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శిలు ఎస్కే భాష్మియా, పనస ప్రసాద్, అక్క పెళ్లి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండె బద్రి ,దండు లక్ష్మణ్, సంఘి ఎలేందర్, ముని,జిల్లా సమితి సభ్యులు మహమ్మద్ అక్బర్ ,అయిత యాకయ్య, మియాపురం గోవర్ధన్, మండల నాయకులు మెరుగు మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

కొత్త గనుల ఏర్పాటులో లోటు పాటు లేకుండా చూడాలి..

కొత్త గనుల ఏర్పాటులో లోటు పాటు లేకుండా చూడాలి

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జైపూర్,నేటి ధాత్రి:

కొత్త గనుల ఏర్పాటులో లోటు పాటు లేకుండా చూడాలి. అలాగే సింగరేణి సంస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా ఏం నిర్ణయం తీసుకున్నా ముందుగా ప్రకటించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ కొత్త గనుల ఏర్పాటులో గతంలో ఏం చేశారు.ఎలా చేశారు. తెలుసుకొని లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు.ఈ విషయాన్ని ఇది వరకే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ప్రస్తావిస్తానని వివరించారు.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-79.wav?_=3

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి..

హిందీ భాష వివాదం.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా హిందీ భాష వివాదం న‌డుస్తుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న విష‌యం తెలిసిందే.

ప‌వ‌న్‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ.. కొంతమందికి ఎప్పుడు అర్థమవుతుంది?! హిందీని రుద్దడం కేవలం భాష గురించే కాద‌ని. ఇది ఉత్తర(ఆర్యులు) భారతదేశంకి చెందిన వారు దక్షిణ (ద్రావిడ) భారతదేశంపై తమ ఆధిపత్యాన్ని చెలాయించడమే. వారు తాము ఉన్నతమైనవారమని, మనం తక్కువవారమని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు హిందీ/ఉర్దూ (రెండు ఒకటే) చాలా బాగా వచ్చు, మరి ఉత్తరాదిలో నివసించే ఎవరైనా తెలుగులో మాట్లాడతారా? వెన్నెముక లేనివారు మన గొంతులను వినిపిస్తే, దక్షిణాది గొంతు ఎప్పటికీ వినిపించదంటూ ప‌వ‌న్‌కి గట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.

వికలాంగుల మహా గర్జన సభను విజయవంతం చేయాలి..

వికలాంగుల మహా గర్జన సభను విజయవంతం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణిగుంట శంకర్ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ శాఖ అధ్యక్షులుగా అడిచర్ల తిరుపతి ఉప అధ్యక్షులుగా రేణికుంట్ట్ల మొగిలి ప్రధాన కార్యదర్శిగా భోగి రవి నీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామచంద్ర వారు హాజరైనారు అనంతరం మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ రూపాయలు 6000 పెంచాలని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత కార్మికుల పెన్షన్ 4000 కు పెంచాలని అలాగే పూర్తిస్థాయి కండ నరాల బలహీనత ఉన్నవారికి 15000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే వికలాంగుల మహా గర్జన విజయవంతం చేయడానికి ఈనెల 25న భూపాలపల్లి లో నిర్వహించబోయే ఈ సభకు వృద్ధులు వికలాంగులు ఇదంతులు హాజరై గీత బీడీ గౌడ అందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. తనను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారు..

తనను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారని ఎమ్మెల్యే శ్రీగణేష్‌ అన్నారు. సోమవారం అడ్డగుట్టలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి మాణికేశ్వర్‌నగర్‌ బస్తీలో ఫలహారబండి ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్తున్న తనపై 10 ద్విచక్రవాహనాలపై వచ్చిన 30 మంది దాడికి యత్నించారని తెలిపారు.

సికింద్రాబాద్‌: తనను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారని ఎమ్మెల్యే శ్రీగణేష్‌(MLA Sri Ganesh) అన్నారు. సోమవారం అడ్డగుట్టలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి మాణికేశ్వర్‌నగర్‌ బస్తీలో ఫలహారబండి ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్తున్న తనపై 10 ద్విచక్రవాహనాలపై వచ్చిన 30 మంది దాడికి యత్నించారని తెలిపారు. సినీ ఫక్కీలో తమ వాహనాలను వెంబడించారని తెలిపారు.
లైట్లు, సీసీ కెమెరాలు(CCTV cameras) లేని చోట తమ వాహనాలు, గన్‌మన్‌పై దాడి చేశారని వివరించారు. హత్యలు, నేరాలు చేసే వ్యక్తులకు భయపడేవాడిని కాదని, నేర చరిత్రగల వ్యక్తితో తనకు ముప్పు ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్‌(North Zone DCP Rashmi Perumal)కు విజ్ఞప్తి చేశారు. దాడి ఘటనపై పోలీసులకు మంగళవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని డీసీపీకి చెప్పానని ఎమ్మెల్యే తెలిపారు.

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన సందర్భంగా.

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

, వనపర్తి నేటిడాత్రి:

అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే. జన్మదినం సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారని మీడియా సెల్ కోఆర్డినేటర్ డి వెంకటేష్ ప్రకటనలో తెలిపారు

మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య జన్మ దిన వేడుకలు..

ఘనంగా.. మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య జన్మ దిన వేడుకలు

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య జన్మదిన వేడుకలు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో.. సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చించోడు అభిమన్యు రెడ్డి హాజరై శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి పలువురికి పంచారు. ముందుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలు నెలకొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్న.

గ్రామ ప్రజలు నెలకొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు.

లింగాల/ నేటి ధాత్రి:

నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన అతిపెద్ద వర్షపాత తీవ్రతకు 1వ వార్డులో రోడ్లపై ఉన్న మురికి కాలువలలో బురద మట్టి ఇంకొన్ని రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం వలన కలుషిత వాతావరణం నెలకొని గ్రామ ప్రజలు అనారోగ్యంతో బాధపడతారు అనే ఉద్దేశంతో, గ్రామ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం, డ్రైనేజ్లను శుభ్రపరచడం,కలుషిత ప్రాంతాలను సొంత ఖర్చులతో మరమ్మత్తులను జరిపిస్తూ ,ఎల్లప్పుడు ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామ ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరుచుతున్న. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు రంగినేని
శ్రీనివాసరావు ఆదేశాల మేరకుగ్రామ డిప్యూటీ సర్పంచ్ జనార్దన్ మండల యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

#రాబోయే స్థానిక ఎన్నికల్లో యువతకే పెద్దపీట.

#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకే మొదటి ప్రాధాన్యత దక్కుతుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని రంగాపురం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ముల్క రాజేష్ తో పాటు 50 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం గ్రామ కూడలిలో జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ. ఈరోజు పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి పల్లెకు నేరుగా నిధులను విడుదల చేసి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా పథకాలను రూపొందించి గ్రామాలు దృశ్యశ్యామలంగా ఈరోజు ఇలా ఉన్నాయంటే దానికి కారణం మోడీ ప్రభుత్వం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం, రైతులకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు పెట్టుబడి సహాయం, ప్రతి గ్రామాలలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డులు, సిసి రోడ్లు, వీధిలైట్ల ఏర్పాటు, పి ఎం జి ఎస్ వై,, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా తారు రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇలాంటి మరెన్నో అభివృద్ధి పనులకు మోడీ ప్రభుత్వం నిధులను సమకూర్చుతున్నది. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం లో ఎక్కువ స్థానాల్లో యువకులకే అవకాశం కల్పించి ప్రజా ప్రతినిధులను చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు ,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి ,జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి ,సీనియర్ నాయకులు వల్లె పర్వతాలు ,మండల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎండీసీ ద్వారా అప్పులు ప్రమాద ఘంటికలు..

*ఏపీఎండీసీ ద్వారా అప్పులు ప్రమాద ఘంటికలు..

తిరుపతి ఎంపీ గురుమూర్తి..

*పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాజ్యాంగ, ఆర్థిక ఉల్లంఘనలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-66.wav?_=4

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 21:

రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపిఎండిసి), రూ.9 వేల కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసింది. ఈ డిబెంచర్లకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష డెబిట్ ఆదేశం ద్వారా ఒక ప్రైవేట్ డిబెంచర్ ట్రస్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుండి నేరుగా నిధులను తీసుకునే అధికారం కల్పించబడిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక అధికరణ 377 ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం పలు ప్రశ్నలను లేవనెత్తుతోందని, రాష్ట్ర ఖజానా నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి శాసనసభ ఆమోదం తప్పనిసరి అని నిర్దేశించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 203, 204 లను ఈ ఆదేశం బైపాస్ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. అలాగే, ఈ డిబెంచర్ల ద్వారా వచ్చిన నిధులు మైనింగ్ లీజులకు ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి మళ్లించబడుతున్నాయి, ఇది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడంతో సమానమన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పు చేయకూడదని నిర్దేశించే ఆర్టికల్ 293(3) నియమావళిని ఉల్లంఘించడం కాదా అని కూడా ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(3)ల నియమావళిని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేసారు.

బాల్నే సర్వేశంను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

 

బాల్నే సర్వేశంను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు బాల్నే సర్వేశం సతీమణి బాల్నే చంద్రకళ సంవత్సరీకం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం బాల్నే సర్వేశంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, పట్టణ ప్రచార కార్యదర్శి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version