యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు..

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పూల బొకే ఇచ్చి శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం రూ.42.64 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏటీసీలో రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి పాస్ అయిన భూపాలపల్లి నియోజకవర్గ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కోర్సుల వివరాలని ఎమ్మెల్యే తెలిపారు. ఏడాది కోర్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, పార్టిషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, రెండేళ్ల కాలపరిమితితో ఉన్న కోర్సులు బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్సుడ్ సిఎంసి మిషన్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ పురుషులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 172 సీట్లు ఉన్నాయని, నియోజకవర్గం విద్యార్థులు ఇటి అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అంతకుముందు ఉదయం మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కోర్సుల వివరాలను తెలిపే గోడపత్రికని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పం కిషన్ దాట్ల శ్రీనివాస్ పిప్పాల రాజేందర్ కురిమిళ్ళ శ్రీనివాస్ తోట రంజిత్ ఉడుత మహేందర్ భౌతి విజయ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version