భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ షేక్ సజావుద్దీన్,
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంతో పాటు వివిధ గ్రామాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ షేక్ సజావుద్దీన్ సూచించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో చెరువును వాగులు, వంకల దగ్గర పిల్లలు కాని పెద్దలు గాని వెళ్లొద్దని అలాగే గ్రామాలలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని రోడ్డు వెంబడి ఉన్న కల్వర్టు దగ్గర నీరు ప్రవహించేటప్పుడు బండ్లతో దాటే ప్రయత్నం చేయరాదని ఆయన ప్రజలకు సూచించారు.