గ్రామాలలో పడకేస్తున్న పారిశుధ్యం..

గ్రామాలలో పడకేస్తున్న పారిశుధ్యం..

◆: కరువైన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ

◆: సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు సోకె అవకాశం

◆: పంచాయతీల్లో నిధులు లేక అనేక అవస్థలు

◆: పారిశుధ్యాన్ని పాటించక చేతులెత్తేస్తున్న కార్యదర్శులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : మండలంలోని 35 గ్రామపంచాయతీలలో వివిధ గ్రామాలలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది.డీజిల్ కు డబ్బులు లేక పారిశుధ్య కార్మికులు పనిచేయడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు సొంత తన జేబులో డబ్బులు ఇచ్చి డీజిల్ కి చిన్నచిన్న రిపేర్లకు వారి జీతంలో నుండి పెట్టుబడి పెడుతున్నామని వాపోతున్నారు. గ్రామపంచాయ తీలో నిధులు లేక ఇబ్బందులతో పనులను చేయలేక పోతున్నామన్నారు. ఇప్పటివరకు 35 గ్రామ పంచాయతీలలో కొన్ని గ్రామపంచాయతీలలో సపాయి కార్మికులుగా పనిచేస్తున్న కొంతమంది పనిచేయకుండా జీతాలు అడుగుతున్నారని మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బడ్జెట్ లేక మేము ఏమి చేయలేకపోతున్నాము ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలరని అధికారులు పంచాయతీ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి మండలం లోని గ్రామంలోని 35 గ్రామపంచాయతీలో గల పారిశుధ్య పనులు చక్కబెట్టి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. ప్రత్యేక అధికా రులను నియమించిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు.

చిరంజీవి పాట రీమిక్స్ లోనూ ఆయనే…

చిరంజీవి పాట రీమిక్స్ లోనూ ఆయనే…

పాత పాటలు రీమిక్స్ చేసి యంగ్ హీరోస్ నటించడం చూశాం. కానీ, ఇప్పుడు తన ఓల్డ్ సాంగ్ ను రీమిక్స్ చేసి, అందులో తానే నర్తించడానికి సిద్ధమయ్యారు మెగాస్టార్. ఆ ముచ్చటేంటో చూద్దాం.

కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) అభిమానులను ఊరిస్తూనే ఉంది ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం. జనవరిలో సంక్రాంతి కానుకగా వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశ కలిగింది. తరువాత అదుగో ఇదుగో అంటూ కాలం కరిగిపోతోంది. ఈ చిత్రంలోని కొన్ని లిరికల్స్ అభిమానులను అలరించాయి. ఇటీవల ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారని విశేషంగా వినిపిస్తోంది. అది ఓ రీమిక్స్ సాంగ్ అనీ చెబుతున్నారు. అంతేకాదు – అది చిరంజీవి నటించిన సాంగ్ కు రీమిక్స్ అనీ తెలుస్తోంది. అదే ఇప్పటి విశేషం! ఇంతకూ అది ఏ సినిమాలోని సాంగ్ అంటే చిరంజీవి హిట్ మూవీ ‘అన్నయ్య’ (Annayya) లోని ‘ఆట కావాలా. పాట కావాలా…’ అంటూ సాగే ఐటమ్ సాంగ్. అప్పట్లో నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సిమ్రన్ ఆ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఈ సాంగ్ రీమిక్స్ రూపంలో ‘విశ్వంభర’లో ఉందని తెలిసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.

‘విశ్వంభర’లో తన పాట రీమిక్స్ లో చిరంజీవి తానే నర్తిస్తూ ఉండడం ప్రస్తుతం విశేషంగా మారింది. గతంలో ఇలా ఎవరూ చేయలేదా అంటే పౌరాణికాల్లో పద్యాలు, సీన్స్ లో యన్టీఆర్ (NTR) ఏ నాడో రీమిక్స్ లో నటించేశారు. సోషల్ మూవీస్ లో చేయలేదా అంటే కృష్ణ ఉన్నారు. 1968లో కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ సినిమాలోని ‘ఓ చిన్నదాన.’ పాటను తరువాత 1995లో తాను హీరోగా నటించిన ‘డియర్ బ్రదర్’లో ఉపయోగించు కున్నారు.

గతంలో పేరడీ సాంగ్స్ లో తమ పాత పాటలకు తామే నర్తించి అలరించిన స్టార్స్ ఉన్నారు. కానీ, ఒకే పాటను వేరేగా రీమిక్స్ చేసి నటించిన వారు అంతగా కానరారు. ఆ రూటులో చిరంజీవి సాగుతూ, నవతరం ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ‘అన్నయ్య’ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. అందులోని పాటను ఈ సారి రీమిక్స్ చేయడానికి భీమ్స్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ‘విశ్వంభర’కు కీరవాణి సంగీతం అందించారు. కానీ, ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ‘అన్నయ్య’ రీమిక్స్ కు వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కంపోజ్ చేయించారని సమాచారం. మరి ‘అన్నయ్య’లోని రీమిక్స్ తో చిరంజీవి ఫ్యాన్స్ ను ఎలా చిందేయిస్తారో చూద్దాం.

అందరి దృష్టి స్టార్ కిడ్ పైనే…

అందరి దృష్టి స్టార్ కిడ్ పైనే…

సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఇప్పుడు హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అతని రెండో సినిమా సర్ జమీన్ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) ఇదే యేడాది ‘నాదానియన్’ (Nadaaniyan) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వీక్షకులను పెద్దంత ఆకట్టుకోలేదు. అంతేకాదు… సైఫ్ అలీఖాన్ కొడుకు కాబట్టే.. ఇబ్రహీంతో కరణ్ జోహార్ (Karan Johar) ఈ ప్రాజెక్ట్ చేశాడని, ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదని చాలామంది పెదవి విరిచారు. నెపోటిజమ్ కు వ్యతిరేకంగా గళం ఎత్తిన చాలామంది నెటిజన్స్ ఈ సినిమాను విమర్శించారు.

అయినా వెనుకడుగు వేయకుండా ఇబ్రహీం అలీఖాన్ సినిమాలు చేస్తున్నాడు. అలా జనం ముందుకు రాబోతున్న అతని రెండో సినిమా ‘సర్ జమీన్’. మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ దేవ్ గన్ (Kajol Devgon) జంటగా నటించిన ఈ సినిమాలో ఇబ్రహీం అలీఖాన్ వారి కొడుకుగా నటిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా రిలీజ్ డేట్ ట్రైలర్ ను చూసిన వారు అప్పుడూ ఇబ్రహీం నటనను చూసి పెద్దంతగా ప్రశంసించలేదు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ తో వారి అంచనాలు మారిపోయాయి. ఇందులో ఇబ్రహీం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాడని, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ సీన్స్ కూ ఆస్కారం ఉందని అర్థం చేసుకుంటున్నారు. దేశకోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ ఆఫీసర్ గా పృథ్వీరాజ్ నటిస్తుంటే, ఇటు భర్త, అటు కొడుకు మధ్య నలిగిపోయే తల్లిగా కాజోల్ యాక్ట్ చేస్తోంది. తండ్రి నిర్లక్ష్యంతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే స్పాయిల్డ్ చైల్డ్ పాత్రను ఇబ్రహీం చేశాడు. కాయోజ్ ఇరానీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ను కరణ్ జోహార్ నిర్మించాడు. ఇది కూడా ‘నదానియన్’ తరహాలోనే థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే వస్తోంది. ఈ నెల 25 నుండి జియో హాట్ స్టార్ లో ఈ సినిమా చూడొచ్చు.

పూజా కిట్ లో మరో తమిళ మూవీ..

పూజా కిట్ లో మరో తమిళ మూవీ..

హీరో ధనుష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే విజయ్, రాఘవేంద్ర లారెన్స్ మూవీస్ లో నటిస్తున్న పూజా… రజనీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది.

పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ కు ఇక ఫుల్ స్టాప్ పడిపోయినట్టు అనుకుంటున్నప్పుడల్లా ఫీనిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తోంది. గత కొంతకాలంగా పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ బరిలో సందడి చేయలేదు. దాంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇక పూజా తట్టాబుట్టా సర్దుకోవడమే తరువాయి అనుకుంటున్న టైమ్ లో మళ్ళీ చిత్రంగా ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం పూజా హెగ్డే… తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సౌతిండియన్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) లో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. వీటితో పాటు రాఘవేంద్ర లారెన్స్ ‘కాంచన -4’ (Kanchana -4)లోనూ పూజా నటిస్తోంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌ (Dhanush) 54వ సినిమాలోనూ ఆమె హీరోయిన్ గా ఎంపికయినట్టు తెలుస్తోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా ను ఈ నెల రెండో వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళి 90 రోజులలో పూర్తి చేస్తారని తెలుస్తోంది.

రెండో షెడ్యూల్‌లో ఎన్సీ 24..

రెండో షెడ్యూల్‌లో ఎన్సీ 24

నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం ఎన్సీ 24 వర్కింగ్‌ టైటిల్‌ తెరకెక్కుతోంది.

నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం (ఎన్సీ-24-వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది. బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు యూనిట్‌ తెలిపింది. నెలరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. ఈ సందర్భంగా యూనిట్‌ నాగచైతన్య పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో తాడుతో మాస్‌ లుక్‌లో నాగచైతన్య ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి అజనీష్‌ బి లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రఘుల్‌ ధరుమాన్‌

పల్లెటూరి సరదాలు..

పల్లెటూరి సరదాలు

మనోజ్‌ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు.

మనోజ్‌ చంద్ర, మోనికటి, ఉషా బోనెల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. రానా దగ్గుబాటి సమర్పణలో గోపాల కృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. ఈనెల 18న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. మనోజ్‌ చంద్ర రికార్డ్‌ డ్యాన్స్‌ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా ఈ చిత్రంలో చూపించబోతున్నామని చిత్రబృందం పేర్కొంది.

వైరల్‌ వయ్యారి.

వైరల్‌ వయ్యారి

గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ జూనియర్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బేనర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు.

గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘జూనియర్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బేనర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ‘జూనియర్‌’ నుంచి రెండో పాటను యూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. ‘వైరల్‌ వయ్యారి’ అంటూ సాగే ఈ గీతానికి కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించారు. దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలందించడంతో పాటు హరిప్రియతో కలసి ఆలపించారు. దేవి సంగీతంతో పాటు కిరీటి రెడ్డి, శ్రీలీల స్టెప్పులు ఈ పాటకు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె. కె. సెంథిల్‌ కుమార్‌

నాట్స్ సంబరాలు ప్రారంభం…

టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల వద్ద ప్రవాసాంధ్రుల సందడి ఒకవైపు, సాయంకాలం జోరువాన మరో వైపు వెరసి.. టాంపా తెలుగుదనంలో తడిసి పరవిశించింది.

వేదిక ప్రధాన ద్వారం వద్ద వినాయకుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. నర్తనశాల పేరుతో దిగువ భాగాన్ని, రంగస్థలం పేరుతో పైభాగాన్ని ఈ వేడుకల నిర్వహణ కోసం నామకరణం చేశారు. రంగస్థల వేదికపై బ్యాంక్వెట్ విందు నిర్వహించారు.

సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేశారు. భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ప్రారంభమైన నాట్స్ నేడు అమెరికాలో తెలుగు సంఘాల సేవా కార్యక్రమాల్లోనే కాకుండా మహాసభల నిర్వహణలో సరికొత్త రికార్డు నెలకొల్పిందని, వేడుకలు విజయవంతం చేయడంలో తనకు సహకరించిన వారందరికీ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ టాంపా అనే ఊరు పేరును ఇకపై నది, అమెరికా సంస్కృతి అని కాకుండా.. నాట్స్ సంబరాలు జరిగిన నగరంగా గుర్తుంచుకుంటారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు ఆయన స్వాగతం పలికారు.

ఈ వేడుకలకు ఫ్లోరిడా రాష్ట్ర సెనేటర్ జయ్ కాలిన్స్, అట్లాంటా కాన్సుల్ జనరల్ రమేష్ లక్ష్మణన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన జులై 4వ తేదీన ప్రవాస భారతీయ సంఘమైన నాట్స్ సంబరాల్లో పాల్గొనడం అమెరికాలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. డా. దేవయ్య, రుద్రమ్మ పగిడిపాటి దంపతులకు విశేష సేవా రత్న పురస్కారాన్ని అందజేశారు. రచయితలు కళ్యాణ్ చక్రవర్తిని అధ్యక్షుడు మందాడి శ్రీహరి, రామజోగయ్య శాస్త్రిని మాజీ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌లు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బుల్లితెర నటీనటుల హాస్యవల్లరి అలరించింది.

సినీనటులు దగ్గుబాటి వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, తారలు జయసుధ, రజిత, సుధీర్‌బాబు, దర్శకులు గోపీచంద్ మలినేని, మెహెర్ రమేష్, థమన్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ అతిథుల వద్దకు వెళ్లి వారితో ఫోటోలు దిగి మరీ సభా ప్రాంగణమంతా సందడి చేశారు.

ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, నాదెండ్ల మనోహర్‌లతో పాటు మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, కావలి గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే సినీ నటి మీనా, జయసుధ, నటుడు సాయికుమార్ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. బ్యాంక్వెట్‌కు చంద్రబోస్ ఆధ్వర్యంలో నాటు బ్యాండ్ సంగీత విభావరితో ముగింపు పలికారు.

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు..

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు.. దిగువకు నీరు విడుదల

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి.

గద్వాల(మహబూబ్‏నగర్): కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి. ప్రాజెక్టుకు 75,612 క్యూసెక్కుల ప్రవాహాలు చేరగా 58 గేట్లకు గాను 21 గేట్లను ఎత్తి 62,612 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు
ప్రాజెక్టు సామర్థ్యం 105.79 టీఎంసీలకు.. ప్రస్తుతం 75.84 టీఎంసీలున్నాయి. దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1,09,777 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఏపీ, తెలంగాణ(AP, Telangana) విద్యుదుత్పత్తి కోసం 56,998 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 169.86 టీఎంసీలున్నాయి.

తుంగభద్ర గేట్లు తెరవడంతో శ్రీశైలానికి వరద మరింత పెరిగే అవకాశముంది. ఇక ఆల్మట్టికి వరద స్థిరంగా కొనసాగుతోంది. 94,767 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. లక్ష క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా 14గేట్ల ద్వారా 95,566, విద్యుదుత్పత్తి ద్వారా 29,494 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చెడ్డీపై బాధితుడి నిరసన.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చెడ్డీపై బాధితుడి నిరసన.

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

కోర్టు ఆదేశాల మేరకు రికార్డులో పేరు ఎక్కించి పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌

హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం(Abdullapurmet Tehsildar Office) ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కొన్ని ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేటకు చెందిన శంకర్‌రెడ్డి 2000లో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తట్టిఅన్నారంలోని సర్వే నంబర్‌ 109,110లో 6 ఎకరాలను 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. అనంతరం 2002లో సదరు భూమిని కొనుగోలు చేసేందుకు పట్టాదారుల వద్ద అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య భూ వివాధం తలెత్తడంతో ఇరువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ద్వారా ఫీజు చెల్లించి 2016లో శంకర్‌రెడ్డి 6 ఎకరాలను రిజిస్ర్టేషన్‌ చేసుకున్నాడు.

దీంతో శంకర్‌రెడ్డి పేరుపై రెండు ఎకరాల భూమి రికార్డులో నమోదు అయి పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. మిగతా నాలుగు ఎకరాలకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉన్నది. అయితే అప్పటి నుంచి నాలుగు ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాసుబుక్‌ల కోసం శంకర్‌రెడ్డి కుమారుడు గంగిరెడ్డి గిరిధర్‌రెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.కాగా 2022లో ఆమోద డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం శంకర్‌రెడ్డికి చెందిన 6ఎకరాల భూమిని తప్పుడు పత్రాలు సమర్పించి రికార్డులో శంకర్‌రెడ్డి పేరును తొలగించి ఆమోద డెవలపర్స్‌పై పేరును నమోదు చేయించి పట్టాదారు పాస్‌బుక్‌లను పొందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శంకర్‌రెడ్డి కుమారుడు గిరిధర్‌రెడ్డి తమకు ఎలాంటి నోటీసు, సమాచారం ఇవ్వకుండా రికార్డుల నుంచి తమ పేర్లు ఎలా తొలగిస్తారని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

సదరు భూమిపై స్టేట్‌సకో ఉండగా రికార్డులో మార్పులు ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్‌, తహసీల్దార్‌ డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా రికార్డు మార్పులు చేశారని గిరిధర్‌రెడ్డి ఆరోపించారు. మూడు ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరగడం లేదని శుక్రవారం గిరిధర్‌రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బట్టలు విప్పి చెడ్డీపై కూర్చుని నిరసనకు దిగారు. కోర్టు ఆదేశాల మేరకు 6 ఎకరాలకు వెంటనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గిరిధర్‌రెడ్డిని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నది: తహసీల్దార్‌తట్టిఅన్నారంలోని సర్వే నంబర్‌ 109,110లోని భూమి కోర్టు పరిధిలో ఉన్నది. ప్రస్తుతం దానిపై స్టేటస్‌ కోఆర్డర్‌ ఉన్నది. కేసు కోర్టు పరిధిలో ఉండగా రికార్డులో పేరు మార్చి పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వాలని గిరిధర్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నాడు. వివాదం కోర్టు పరిధిలో ఉండడంతో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని గత నెల 21న గిరిధర్‌రెడ్డికి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

అర్ధరాత్రి ఆర్డర్లూ అధికమే..

అర్ధరాత్రి ఆర్డర్లూ అధికమే..

ఆన్‌లైన్‌(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్‌ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది.

– గతేడాదితో పోలిస్తే ఎక్కువే

హైదరాబాద్‌లో పాలకు డిమాండ్‌

 

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్‌ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది. సంస్థ అధ్యయనం ప్రకారం గడిచిన తొలి ఆరు నెలల్లో ఒక వ్యక్తి ఏకంగా 617కు పైగా ఆర్డర్లు చేశాడు. నగరంలో పాలకు అత్యధిక డిమాండ్‌ ఉంది. ఎలక్ట్రానిక్స్‌, బొమ్మలు, వ్యక్తిగత సంరక్షణ విభాగాలు 117 శాతం వృద్ధితో దూసుకుపోతున్నాయి.

ఇడ్లీ, దోశ పిండి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. బ్యూటీ విభాగంలో లిప్‌ లైనర్లు(Lip liners), మినీ లిప్‌స్టిక్‌లు, లిప్‌ బామ్‌లకు డిమాండ్‌ ఉంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వంటనూనె, ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువులకు, స్నాక్స్‌ విభాగంలో ఇన్‌స్టంట్‌ న్యూడిల్స్‌(Instant noodles)కు డిమాండ్‌ పెరిగిందని సంస్థ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ హరి కుమార్‌జీ తెలిపారు. సగటు డెలివరీ సమయం 11 నిమిషాలుగా ఉందన్నారు.

కాళిగంజ్‌ ఉప ఎన్నిక ఏం సంకేతాలనిస్తోంది?

`ఓట్లశాతం తగ్గినా బీజేపీలో తగ్గని ఆశలు

`సెక్యులర్‌ ముసుగులో మమత బుజ్జగింపు రాజకీయాలు

`ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో హిందువుల కష్టాలు

`క్రమంగా వలసపోతున్న వైనం

`ఓట్లకోసం మమత కుటిల రాజకీయాలు

`హిందువుల ఓట్ల సంఘటితంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ

`ముస్లింల ఓట్లు గంపగుత్తగా తృణమూల్‌కే

డెస్క్‌ ,నేటిధాత్రి: 

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా కాళిగంజ్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తృణ మూల్‌ కాంగ్రెస్‌ విజయాన్ని అందరూ ముందుగా ఊహించిందే. విశేషమేమంటే ఇక్కడ గతంతో పోలిస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓట్ల శాతం పెరగడమే కాకుండా, బీజేపీ ఓట్లశాతం కొంతమేర తగ్గడం గమనార్హం. ఇక లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఓట్ల శాతం కూడా గతంతో పోలిస్తే కొంత మెరుగైన మాట వాస్తవం. ఇక్కడ ఓటమి ముందుగా అంచనా వేసినప్పటికీ, రాష్ట్ర బీజేపీ నాయకుల విశ్లేషణ మరోలా వుండటం గమనార్హం. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల్లో హిందువల ఓట్లు సుసంఘటితమైన అంశాన్ని వారు గుర్తించడమే కాదు, ఈ పరిణామం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా వుండబోతున్నదీ అంచనా వేస్తున్నారు. కాళిగంజ్‌ స్థానం నుంచి ఎన్నికలైన తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నసిరుద్దీన్‌ అహ్మద్‌ గత ఫిబ్రవరి నెలలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆయన కుమార్తె అలీఫా అహ్మద్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇచ్చింది. ఆమె తన సమీప బీజేపీ ప్రత్యర్థి అశీష్‌ ఘోష్‌పై 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. 

ఈ ఎన్నికల్లో విశేషమేంటంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 30.91% ఓట్లు పోలయిన బీజేపీకి ఈసారి 28.29% ఓట్లు మాత్రమే వచ్చాయి. కచ్చితంగా మమతా బెజర్జీకి రాష్ట్రంలో ఇంకా తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతున్నదనడానికి ఇది నిదర్శనం కూడా. అయితే ఇక్కడి బీజేపీ నాయకులు చెప్పేదేమంటే, ఇది ముస్లిం మెజారిటీ కలిగిన నియోజకవర్గం కాబట్టి తృణమూల్‌ కాంగ్రెస్‌ నిలిపిన ముస్లిం అభ్యర్థి గెలుపు సహజం. కానీ ఇదే సమయంలో నియోజకవర్గంలో హిందూ వోట్లు మరింత సంఘటితం కావడం గమనార్హమని వారు చెబుతున్నారు. 

2021 ఎన్నికల్లో పోటీచేసిన అలీఫా అహ్మద్‌కు 1,02,759 ఓట్లు రాగా, సాధించిన ఓట్లు 55.15%. అదే బీజేపీ తరపున పోటీచేసిన అశీష్‌ ఘోష్‌కు 52,710 ఓట్లు పోలయ్యాయి. అంటే 28.29% ఓట్లు సాధించినట్టు లెక్క. ఇక లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థికి 28,348 (15.21%) ఓట్లు పోలయ్యాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నసిరుద్దీన్‌ అహ్మద్‌కు 1,10,696 (53.35%) ఓట్లు రాగా, బీజేపీ తరపున పోటీచేసిన అభిజిత్‌ ఘోష్‌కు 64,709 (30.91%) ఓట్లు పోలయ్యాయి. ఇదే ఎన్నికలో కాంగ్రెస్‌ తరపున పోటీచేసిన అబ్దుల్‌ ఖాసిమ్‌ కు 25,076 (1.98%) ఓట్లు వచ్చాయి. పరిశీలిస్తే బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే 2.62% ఓట్లు కోల్పోగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ 1.8% ఓట్లు అదనంగా పొందింది. ఈ గణాంకాల ను పరిశీలిస్తే బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రజలు మరోసారి తిరస్కరించారని ఎవరైనా ఇట్టేచెబుతారు. ఇదే సమయంలో ‘సెక్యులర్‌’గా తనను తాను చెప్పుకునే మమతా బెనర్జీ ప్రజాస్వా మ్యానికి పెట్టని కోటగా వున్నారని ప్రచారం జరగడం కూడా సహజమే. ఇదే సమయంలో 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ తన ఓటు షేరును 3.23% పెంచుకోవడం (11.98% నుంచి 15.21%కు) విశేషంగానే కనిపిస్తుంది. కానీ 2016 వరకు ఇది లెఫ్ట్‌`కాంగ్రెస్‌లునిలిపిన ఉమ్మడి అభ్యర్థులే తిరుగులేని విజయం సాధిస్తూ వచ్చారు. ఈ పార్టీల నాటి విజయ చరిత్రను పరిశీలిస్తే ప్రస్తుతం వాటి దుర్గతి ఏవిధంగా ఉన్నదీ అర్థమవుతుంది.

బంగ్లాదేశ్‌కు సరిహద్దున వున్న నదియా జిల్లాలోని కృష్ణనగర్‌ లోక్‌సభ స్థానానికి చెందిన అసెంబ్లీ నియోజకవర్గమే కాళిగంజ్‌ . 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2019 నుంచి ఈ కృష్ణనగర్‌ లోక్‌సభ స్థానానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ మహువా మొయిత్రా ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. 1947లో నదియా జిల్లాలో హిందువులే మెజారిటీలుగా వుండేవారు. 1950 నుంచి బంగ్లాదేశ్‌కు సరిహద్దున వున్న జిల్లాల్లోకి పెద్దఎత్తున బంగ్లా ముస్లింలు వలసలు వచ్చి స్థిరపడటంతోఆయా ప్రాంతాల్లో జానాభా సంఖ్యల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా నదియా జిల్లాలో ముస్లిం జనాభా ఇప్పుడు 27%కు చేరుకోగా, కృష్ణనగర్‌ లోక్‌సభ నియోజవవ ర్గంలో వీరి జనాభా 37%గా వుంది. ఇదే లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన కాళిగంజ్‌ అసెంబ్లీ స్థానంలో మెజారిటీ జనాభా ముస్లింలే. 2011 జనగణన ప్రకారం ఈ నియోజకర్గంలో ము స్లింలు 58.51% కాగా హిందువులు 41.36%గా వున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు 14 సంవత్సరాల కాలంలో ఇక్కడ ముస్లిం జనాభా బాగా పెరిగి 61%కు మించిపోయిందని అంచ నా. 

2001 జనగణన ప్రకారం ఇక్కడ ముస్లింల జనాభా 55.59% కాగా హిందువులు 44.25%. ఇక 1991 జనాభాలెక్కల ప్రకారం ముస్లింలు 52.03% కాగా హిందువుల జనాభా 47.96%.1981 జనగణనలో ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా 48.8% కాగా హిందువులు 51.1%గా వున్నారు. అంతకు పదేళ్ల ముందు అంటే 1971 జనగణ ప్రకారం ఇక్కడ హిందువులు 54.6% కాగా ముస్లింలు 45.3% శాతంగా వున్నారు. కాళిగంజ్‌లో హిందువుల జనాభా 1961లో 56.7%, 1951లో 58%గా వుండేది. 

పై విశ్లేషణను పరిశీలిస్తే కాళిగంజ్‌లో ముస్లిం జనాభా నాటకీయంగా పెరుగుతూ రాగా, హిందువుల జనాభా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం జిల్లాకు సరిహద్దున వున్న బంగ్లాదేశ్‌నుంచి పెద్దఎత్తున ముస్లింలు వలస రావడంతో వీరి జనాభా పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో స్థానికంగా వున్న హిందువులు ఈ ప్రాంతాలను విడిచిపెట్టి సురిక్షత ప్రదేశాలకు తరలివెళ్లడం మొదలైంది. ఈవిధంగా జనాభాలో వచ్చిన మార్పు ఇప్పడు కాళిగంజ్‌ అసెంబ్లీ స్థానం ఫలితాన్ని నిర్దేశిస్తున్నది. నిజానికి 2011కు ముందు ఈ నియోజకవర్గం నుంచి హిందు వులే ఎన్నికవుతూ వచ్చారు. కానీ 2011 తర్వాత ఇప్పటివరకు కాళిగంజ్‌ స్థానం నుంచి ముస్లి మేతరులు విజయం సాధించలేదు. నిజానికి నియోజకవర్గంలో హిందువులు మెజారిటీగా వున్న కాలంలో 1951,1962, 1967 మరియు 1969ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నిలిపిన ముస్లిం అభ్యర్థి ఎస్‌.ఎం. ఫజులార్‌ రహమాన్‌ విజయం సాధిస్తూ వచ్చారు. 1957లో కాంగ్రెస్‌ పార్టీకే చెందిన హిందూ అభ్యర్థి మహానంద హల్దార్‌ ఈ నియోజకవర్గంలో గెలుపు సాధించారు. 1971లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మీర్‌ ఫకీర్‌ మహమ్మద్‌ విజయం సాధించగా, 1972 లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిబ్‌శంకర్‌ బందోపాధ్యాయ్‌ గెలిచారు. 1977, 1982 ఎన్నికల్లో వామపక్ష కూటమిలో భాగస్వామిగా వున్న రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) తరపున పోటీచేసిన దేబ్‌శరణ్‌ ఘోష్‌ గెలిచారు. 1987, 1991, 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అబ్దుస్‌ సలాం మున్సీ కాళీగంజ్‌ నుంచి ఎన్నికయ్యారు. 2001 మరియు 2006 ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీకి చెందిన ధ నుంజయ్‌ మోదక్‌ గెలిచారు. 

1951 నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల విశ్లేషణను పరిశీలిస్తే కాంగ్రెస్‌ లేదా ఆర్‌ఎస్‌పీలు బలమైన ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినప్పుడు పార్టీతో సంబంధం లేకుండా గంపగుత్తగా ముస్లింలు అతనికే ఓటు వేయడం కనిపిస్తుంది. అయితే హిందువులుకూడా సంఘటితం గా ఓటు వేయడం 1972, 1977 మరియు 1982 సంవత్సరాల ఎన్నికల్లో కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం 1971 మార్చినెలలో పాక్‌సైన్యం ‘ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌’ పేరుతో జరిపిన అమానుష, దారుణ కృత్యాలను తట్టుకోలేక నాటి తూర్పు పాకిస్తాన్‌ నుంచి పెద్ద సంఖ్యలో పారిపోయి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడిన హిందువులు సుసంఘటితంగా ఓటుచేయడం. 1971లో హిందూ పురుషులు, పిల్లలను దారుణంగా హతమార్చడం, హిందూ మహిళలపై జరిపిన సా మూహిక అత్యాచారాలతో పాటు వారిని బానిసలుగా ఉపయోగించుకోవడం వంటి దారుణాలు వీరి మనోఫలకాలపై పడిన బలీయమైన ముద్ర ఈ సంఘటితత్వానికి కారణమని ఎన్నికల విశ్లేషకుడు అశిష్‌ బిశ్వాస్‌ వివరించారు. 1987 నుంచి ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా మెజారిటీస్థాయికి చేరుకోవడంతో, అప్పటినుంచి వీరి ఓట్లు సంఘటితం కావడం మొదలైంది. అయితే 2001 మరియు 2006 ఎన్నికల్లో ధనుంజయ్‌ మోదక్‌ ఇక్కడ విజయం సాధించడానికి ప్రధాన కారణం వామపక్ష భావజాలం బలీయంగా వుండటమే. అప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రమాదఘంటికలను గుర్తించిన లెఫ్ట్‌ పార్టీలు ఈ రెండు ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో పోరాడాయి. అయినప్పటికీ తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

ప్రస్తుత ఉప ఎన్నిక విషయానికి వస్తే కాళిగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 309 పోలింగ్‌ బూత్‌లున్నాయి. వీటిల్లో 109 పోలింగ్‌ బూత్‌ల్లో హిందువులు మెజారిటీగా వున్నారు. మిగిలిన 200 బూత్‌ల పరిధిలో హిందువుల జనాభా శాతం చాలా తక్కువ. హిందువులు మెజారిటీగావున్న బూత్‌ల్లో కేవలం ఒక్కదాంట్లో తప్ప 108 బూత్‌ల పరిధిలో బీజేపీ అభ్యర్థికి పెద్దఎత్తున మెజారిటీ ఓట్లు పడ్డాయి. కేవలం ఒక్క బూత్‌ (బూత్‌ నెం.12)లో మాత్రం హిందువుల మెజారిటీ ఓట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి పడ్డాయి. ఈ బూత్‌ పరిధిలో 592 ఓట్లుండగా, 351 మంది తమ ఓటుహక్కును వినియోగించకున్నారు. వీటిల్లో కేవలం 132 ఓట్లు మాత్రమే బీజేపీకి అనుకూలంగా పోలయ్యాయి. 108 పోలింగ్‌ బూత్‌ల్లో 73%కు పైగా ఓట్లు సాధించడం హిందువుల ఓట్లు సుసంఘటితమయ్యాయనడానికి ఉదాహరణగా రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నా రు. సాధారణంగా ఉప ఎన్నికలు అధికారపార్టీకే అనుకూలంగా వుంటాయి. దీనికితోడు ముస్లిం మెజారిటీ నియోజకవర్గం. అయినప్పటికీ అద్బుతమైన పనితీరును పార్టీ కనబరచిందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ ఓట్లశాతం తగ్గడానికి వీరు చెబుతున్న ప్రధాన కారణం ఉప ఎన్నిక కావడంవల్ల దీనికి ఎటువంటి ప్రాధాన్యత వుండదు. దీనిలో గెలుపు ఓటములు అధికార మార్పిడికి ఎటువంటి దోహదం చేయవు కనుక చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లిప్త వైఖరి అవలంబించడం. అదీకాకుండా ఎన్నికల సమయంలో విద్యాసంస్థలు మూసివేయడంతో, సెలవులు కారణంగా పెద్దసంఖ్యలో హిందువులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం మరో కారణంగా రాష్ట్ర బీజేపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. 

కాళిగంజ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.34లక్షలు. వీరిలో 1.1లక్షల మంది హిందువులు. వీరిలో 66శాతం మంది హిందువులు (72600) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందు లో బీజేపీకి పోలయినవి 52,710 ఓట్లు. అంటే మొత్తం హిందువుల ఓట్లలో 72.6% ఓట్లు బీజేపీకి పడినట్టు లెక్క. మరి కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓట్లశాతం పెరగడం వెనుక కారణమేంటనేది స హజంగా ఉదయించే ప్రశ్న. తృణమూల్‌ కాంగ్రెస్‌ తాను బలహీనంగా వున్న బూత్‌ పరిధుల్లో బీజేపీ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి, కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటువేయమని తనకున్న కొద్దిపాటి మద్దతు దార్లకు ఆ పార్టీ నాయకులు చెప్పారంటూ బీజేపీ నాయకులు చెబుతున్నప్పటికీ అది అంత విశ్వసనీయంగా లేదు. కాకపోతే లెఫ్ట్‌`కాంగ్రెస్‌ మద్దతుదార్లు మరింత ఎక్కువమంది ఓటుహక్కును వినియోగించుకొని వుండటం కారణంగా భావించడం సముచితంగా వుంటుంది. 

ఇప్పుడు ప్రధానంగా బీజేపీ నేతలు ఆరోపించేది, బెంగాల్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విపరీత బుజ్జగింపు రాజకీయాలు, ప్రతిదానికి వారికే ప్రభుత్వం అండగా వుండటంతో మైనారిటీ వర్గాలు ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం జరుగుతోందని. ఫలితంగా కాళిగంజ్‌ ప్రాంతం నుంచి కూడా హిందువులు క్రమంగా మరింత సురక్షిత ప్రదేశాలకు తరలిపోవడం కొనసాగుతోంది. ఇటీవలం పక్కనేవున్న ముర్షిరాబాద్‌ జిల్లాలో హిందువులపై జరిగిన దాడులు కూడా క్రమంగా రాష్ట్రంలో వీరు సుసంఘటితం కావడానికి దోహదం చేస్తున్నాయని బుర్ద్వాన్‌ యూనివర్సిటీలో బోధకురాలిగా వున్న సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కల్లోల్‌ కంటి భట్టాచార్య కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువుల్లో భయాందోళనలు వ్యక్తమవుతుండటం కూడా రాబోయే ఎన్నికల్లో హిందువులు సు సంఘటితంగా ఓట్లు వేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. మరో సామాజికవేత్త అమియ బసు ప్రకారం, బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింల రాడికలైజేషన్‌ వేగంగా జరుగుతోంది. ఫలితంగా ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో హిందువులపై దాడులు, హింస నిత్యకృత్య మయ్యాయి. 

ఈ పరిణామాల నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఓట్లు మరింత సంఘటితమవుతాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాళిగంజ్‌ ఉప ఎన్నిక ఇందుకు ఒక బలమైన సంకేతాన్నిచ్చిందని భావిస్తున్నారు. బెంగాల్‌ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. 220 స్థానాల్లో హిందువులు సుసంఘటితమైతే మమతా బెనర్జీ ఓటమి ఖాయమన్నది వారి అభిప్రాయం. 102 అసెంబ్లీ స్థానాల్లో ముస్లి ఓటర్లు 30% వున్నారు. 2021లో బీజేపీ వీటిల్లో కొన్ని సీట్లను గెలుచుకుంది. మరో 74 స్థానాల్లో ముస్లిం మెజారిటీ కనుక అక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశా లు లేవు. హిందువుల్లో 80శాతం మంది ఓటింగ్‌లో పాల్గని, వీరిలో 74% మంది బీజేపీకి ఓ టు వేస్తే, పార్టీ అధికారంలోకి రాగలదని రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. మరిది సాధ్యమా? వేచిచూడాలి!!

ఇండ్ల సంబురం..ఇందిరమ్మ రాజ్యం!

-అసలైన గేమ్‌ స్టార్ట్‌ చేసిన సీఎం. ‘‘రేవంత్‌ రెడ్డి’’.

-కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో అమలుకు పడుతున్న అడుగులు.

-పదకొండేళ్ల తర్వాత ఇండ్లకు మోక్షం.

-పదేళ్లు బిఆర్‌ఎస్‌ లో ఎదురుచూసిన జనం.

-అదిగో ఇదిగో అని ఆఖరుకు మాట తప్పిన గత ప్రభుత్వం.

-పల్లెల్లో పట్టు బిగించేందుకు వడివడిగా పరుగులు.

-సన్న బియ్యంతో అన్నం.

-ఇందిరమ్మ ఇంటిలో నివాసం.

-పేదలకు కాంగ్రెస్‌ పాలనే వరం

-పేదల సమస్యలు తీర్చేదే కాంగ్రెస్‌ ప్రభుత్వం.

-మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 ఇండ్లు.

-మూడేళ్ళలలో తెలంగాణ పేదలకు అందనున్న ఇరువైలక్షల ఇందిరమ్మ ఇండ్లు.

-ఇళ్లు లేని పేదలకు గూడు నిర్మాణమే సంకల్పం.

-అందరికీ ఆవాసమే సిఎం. రేవంత్‌ రెడ్డి లక్ష్యం.        

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపకంతో ఒక్కసారిగా పల్లెల్లో పండగ వాతావరణం నెలకొన్నది. నియోజకవర్గానికి సుమారు 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ప్రజల సొంతిళ్లుకోసం గత 11 సంవత్సరాలుగా తెలంగాణలోఎదరుచూస్తున్నారు. ఇంత కాలం తర్వాత సొంతింటి కల నెరవేరుతుందన్న ఆనందం ఆ కుటుంబాలలో వెల్లివిరిస్తోంది. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మఇండ్లు ఇస్తామని వాగ్ధానం చేసింది. ప్రజలు కూడా బలంగా నమ్మారు. అయితే అదికారంలోకి వచ్చిన తొలి ఏడాదినుంచే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టిపెట్టింది. కాని అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. రెండు సార్లు అదికారంలోకి వచ్చిన కేసిఆర్‌ చెప్పిన మాటల నమ్మి, ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించలేదు. కాని మూడోసారి వచ్చినా కేసిఆర్‌ డబుల్‌ బెడ్‌రూంలు ఇవ్వరని ప్రజలు తేల్చుకున్నారు. తమకు ఇండ్లు కావాలన్నా, రావాలన్న కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే తమ కల నెరవేరుతుందని బలంగా నమ్మారు. ఇప్పుడు ఆ నమ్మకం నిజమౌతోంది. తెలంగాణలో తొలివిడత దాదాపు రాష్ట్ర వాప్తంగా ఐదు లక్షల ఇండ్ల నిర్మానం చేపడుతున్నట్లు తెలుస్తోంది. పల్లెలు,పట్టణ ప్రాంతాలన్నీ కలుపుకొని తొలి విడత పట్టాల పంపణీ కార్యక్రమం మొదలైంది. అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింది కూడా అనేక గ్రామాల్లో ఇప్పటీకే చాలా చోట్ల ఇండ్లపట్టాల మంజూరు జరగింది. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా విడుదలయ్యాయి. ఇండ్ల పనులు కూడా ఎప్పుడో మొదలయ్యాయి. దాదాపు పూర్తి దశకు చాలా వరకు చేరుకున్నాయి. కొన్ని పూర్తయి గృహప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ మాసం ఆషాడం కావడం వల్ల శ్రావణ మాసం తొలి వారంలోనే నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు పెద్దఎత్తున గృహప్రవేశాలు ఏకకాలంలో చేయాలని కూడా అదికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పూర్తయిన ఇండ్లను రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా కూడా చేయాలని సిఎం. రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఈనెల రోజుల కాలంలో కూడా పూర్తి స్ధాయిలో ఇండ్ల నిర్మాణాలు కూడా మొదలుకానున్నాయి. అది ఎంత ఆలస్యమైనా దసరా పండుగ వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరిగేందుకు శరవేగంగా నిర్మాణాలు జరనున్నాయి. ఒక్క సంవత్సరంలో సుమారు తెలంగాణ వ్యాప్తంగా 5లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అంటే ఒక రికార్డుగా చెప్పొచ్చు. గతంలో ఉమ్మడిరాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరిగింది. తర్వాత పదేళ్లు ఇండ్ల నిర్మాణం జరగలేదు. ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు ఏటా ఐదు లక్షల ఇండ్లు నిర్మాణం చేసి, వచ్చే ఎన్నికల నాటికి 20 లక్షల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మానం ఎంతో ప్రతిష్టాత్మాకంగా తీసుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ద పెట్టారు. అందుకు ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు నిర్వహించారు. క్షేత్ర స్దాయి పరిశీలనలు కూడా చెపట్టారు. ఏది ఆలసమ్యమైనా సరే ఇందిరమ్మ ఇండ్లు ఆలస్యం కాకుండా చూసేందుకు మంత్రి పొంగులేటి ఎంతో శ్రమించారు. దాని ఫలితమే ఇందిరమ్మ ఇండ్లకు ఇంత త్వరగా మోక్షం లభించిందని అంటున్నారు. పదకొండేళ్ల తర్వాత తమకు ఇండ్లు వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన మాట తప్పే నాయకుడు కాదని ప్రజలు కొనియాడుతున్నారు. అందుకే కేసిఆర్‌ను కాదని కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకున్నామని పల్లెల్లో ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ అంటేనే ఇండ్లు..ఇండ్లు అంటేనే కాంగ్రెస్‌ అని గతంలోనే అనేక సార్లు నిరూపించడం జరిగింది. నిజానికి ఇలా పేదలకు ఇండ్ల నిర్మాణం అనేది ఇందిరాగాందీ కాలంలో మొదలైంది. ఆమె దేశ వ్యాప్తంగా దళితులకు పెద్ద ఎత్తున ఇండ్లు నిర్మాణం చేయించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు. ముఖ్యంగా 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టింది. అయితే అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో వుంది. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో అడిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఆ సమయంలో తొలివిడతలోనే కొన్ని లక్షల ఇండ్లు మంజూరు చేశారు. మొత్తంగా 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 45 నుంచి 50లక్షల వరకు ఇండ్లు నిర్మాణం చేశారు. అందులో తెలంగాణకు సుమారు 25లక్షల ఇండ్లు మంజూరయ్యాయి. ఆ సమయంలో చాల మందికి ఇండ్లు వచ్చాయి. అయితే 2014లో తెలంగాణ వచ్చింది. అప్పటికి ఇంకా కొంత మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ ఎన్నికల సమయంలో అగ్గిపెట్టె లాంటి ఇందిరమ్మ ఇండ్లు కాకుండా పెద్దఎత్తున డబుల్‌ బెడ్‌ రూంలు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ మాటలు ప్రజలు సహజంగానే విశ్వసించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా రెండు మూడేండ్లయినా ప్రజలు డబుల్‌ బెడ్‌ రూంల గురించి అడగలేదు. అలా అడకుండా కేసిఆర్‌ ప్రజలకు మాయ మాటలుచెప్పి కాలయాపనచేశాడు. 2018 ఎన్నికలు వచ్చాయి. 60ఏళ్ల దరిద్రం నాలుగేళ్లలలో పోతుందా? అని చెప్పి, మరో సారి అవకాశమిస్తే ఈసారి పేదవాళ్లందరికీ ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చాడు. మళ్లీ తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ను నమ్మారు. రెండోసారి కూడాకేసిఆర్‌ మాట తప్పాడు. ఒక దశలో డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వడం సాధ్యం కాదని చేతులెత్తేశాడు. 2023 ఎన్నికల్లో కేసిఆర్‌ గెలిస్తే ఇక డబుల్‌ బెడ్‌ రూంల ఇండ్లేమో గాని, ఇందిరమ్మ ఇండ్లు కూడా రాకుండాపోతాయని ప్రజలు ఆలోచించారు. ఇందిరమ్మ ఇండ్లురావాలంటే మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలనికోరుకున్నారు. గెలిపించుకున్నారు. ఆ నమ్మకాన్ని ప్రభుత్వం కూడా నిలుపుకునేందుకు రెండో ఏడాది నుంచే కృషి మొదలు పెట్టింది. ఈ బడ్జెట్‌లోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించింది. తొలి త్రైమాసికం తర్వాత నిధుల విడుదల మొదలు పెట్టింది. ఇటు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల కార్యక్రమం రూపకల్పన జరిగిపోయింది. ఏక కాలంలో జరిగిన రెండు కార్యక్రమాల వల్ల అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యరూపం దాల్చుతోంది. అదిగో ఇదిగో అంటూ పదేళ్ల పాటు సాదగీసిన కేసిఆర్‌ లాగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా వెండాలని వెంటనే ఇందిరమ్మ ఇండ్లకు మోక్షం కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసలైన అభివృద్ది మొదలు పెట్టి గేమ్స్‌ స్టార్ట్స్‌ నౌ అంటున్నట్లే వుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక రెండు తరాలకు ఉపయోగపడే కార్యక్రమం. పైగా గతంలో పల్లెలో వుండే ఇండ్లు ఒక్క తరానికి మాత్రమే ఉపయోగపడేవి. ఇప్పుడు ప్రతి నిర్మానం కాంట్రీట్‌తోనే కావడం వల్ల ఆ ఇండ్లు సుమారు రెండు తరాలకుకూడా ఉపయోగపతాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెండు తరాలు గుర్తు చేసుకుంటారు. ఎవరి హాయంలో ఇల్లు వచ్చిందన్న ప్రస్తావన వచ్చిన ప్రతీసారి రేవంత్‌రెడ్డి పేరు గుర్తు చేసుకుంటారు. ఇదే గతంలో వైఎస్‌ అనుసరించారు. అందుకే ఇప్పటీకీ ఆయనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఇదే విధంగా సిఎం. రేవంత్‌ రెడ్డిని గుర్తుంచుకుంటారని చెప్పడంలో సందేహంలేదు. పైగా తెలంగాణలో సన్న బియ్యం అందించిన నాయకుడిగా కూడా రేవంత్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. రేషన్‌ బియ్యం పంపిణీ జరిగినంత కాలం తెలంగాణలో ప్రజలు రేవంత్‌ రెడ్డిని పదే పదే గుర్తు చేసుకుంటారు. సన్న బియ్యం తింటూ, ఇందిరమ్మ ఇంట్లో వుంటూ రేవంత్‌ రెడ్డిని నిత్యం తల్చుకుంటారు. దేవుడిగా కొలుచుకుంటారు.

‘బంధన్’కు డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసు

ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదు?

మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు.

BANDAN HOSPITAL CRIMES HANAMKONDA

“నేటిధాత్రి”,హనుమకొండ.
బంధన్ ఆస్పత్రి కి హనుమకొండ డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు ప్రైవేటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజులలో వివరణ ఇవ్వాలని హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ను కోరారు.

BANDAN HOSPITAL CRIMES HANAMKONDA

షోకాజ్ నోటీసు వివరాల ప్రకారం.. వరంగల్‌వాసి ఎల్.కృష్ణకు బంధన్‌ ఆస్పత్రిలో వైద్యులు డాక్టర్ నలిన్ కృష్ణ గతేడాది ఫిబ్రవరి 12న అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. దీనిపై బాధితుడు, పేషెంట్ ఎల్.కృష్ణ వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు ప్రైవేటు ఆస్పత్రిలో తనకు సర్జరీ చేయడంలో వైద్యుడు విఫలమయ్యారని, ఆస్పత్రిలో తనకు ట్రీట్‌మెంట్ సరిగా జరగలేదని, పోస్ట్ ఆఫ్ కేర్‌లో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లే పరిస్థితి రాగా, వెంటనే సదరు ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లినట్టు చెప్పారు. అక్కడ తనకు మరో సర్జరీ జరిగిందని, సుమారు 20 రోజుల పాటు వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారని, రూ.14 లక్షలు అక్కడ తనకు ఖర్చయ్యాయని వెల్లడించారు.

BANDAN HOSPITAL CRIMES HANAMKONDA

ఈ నేపథ్యంలో సదరు బాధితుడి ఫిర్యాదు ఆధారంగా డీఎంహెచ్‌వో ఆఫీసు..‘బంధన్’తో పాటు ‘మెడికవర్’ ఆస్పత్రుల నుంచి కేస్‌షీట్లను సేకరించింది. ఇరు ఆస్పత్రులకు సంబంధించిన కేస్ షీట్లను ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఎక్స్‌పర్ట్స్ పంపించింది. ‘ఎంజీఎం’ నిపుణులు వాటి ఆధారంగా నివేదికను సమర్పించారు. దాని ప్రకారం..సదరు బంధన్ ఆస్పత్రిలో మెడికల్ పద్ధతిలో కాకుండా పేషెంట్‌కు ఓపెన్ సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. నిపుణుల కమిటీ ఆ ప్రైవేటు ఆస్పత్రిలో నిర్లక్ష్యం జరిగినట్టు పేర్కొంది. డాక్టర్ ఎన్.నలిన్ కృష్ణ, డాక్టర్ ప్రణీత్ రాజ్‌లు సదరు ఆస్పత్రికి కన్సల్టెంట్ డాక్టర్లు కానప్పటికీ వారి చేత శస్త్రచికిత్స చేయించడం ఆస్పత్రి అసమర్థతతను స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. వైద్యుల అసమర్థత, నిర్లక్ష్యం వల్ల పేషెంట్ పరిస్థితి ‘బంధన్’ ఆస్పత్రిలో తీవ్ర విషమంగా మారిందని నిర్ధారించారు. ఈ సందర్భంలో సదరు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్(రిజిస్ట్రేషన్, రెగ్యులషన్) చట్టం 2010, నియమనిబంధనలు 2011 ప్రకారం ఎందుకు సస్పెండ్ లేదా క్యాన్సిల్ చేయకూడదో.. మూడు రోజులలో వివరణ ఇవ్వాలని ఆస్పత్రి యాజమన్యానికి డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు.

BANDAN HOSPITAL CRIMES HANAMKONDA
BANDAN HOSPITAL CRIMES HANAMKONDA

అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకుని.

మల్లాపూర్ జూలై 4 నేటి ధాత్రి
అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకుని శుక్రవారం రోజున
”సహకార సంస్థల పాత్ర మరియు ప్రాధాన్యత’
విద్యార్థుల కోసం విద్య ప్రోత్సహ కార్యక్రమం
సహకార శాఖ జగిత్యాల పిఎసిఎస్ మల్లాపూర్, సిర్పూర్, చిట్టాపూర్ ముత్యంపేట్ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ మల్లాపూర్ లో నిర్వహించడం జరిగింది .
ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో రమేష్ ,ఎంపీడీవో శశి కుమార్ ఎంఈఓ కె దామోదర్ , మరియు డిస్టిక్ ఆడిట్ ఆఫీసర్ ఎం సత్యనారాయణ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ సహకార సంఘాల పాత్ర ఎలా ఉంటుందో సమాజంలో పిల్లలకు తెలియజేశారు , వారిని ప్రోత్సహించడానికి జామెంట్రీ బాక్సులు పిల్లలకు అందజేశారు ఇట్టి కార్యక్రమంలో పాక్స్ సెక్రటరీలు పాదం భూమేష్ , ఎం రమేష్, ఎం రాజేశ్వర్రెడ్డి ,కె రవితేజ , మరియు సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

వివేకవర్ధినిలో మహనీయుల వర్ధంతి.

వివేకవర్ధినిలో మహనీయుల వర్ధంతి

కేసముద్రం/ నేటి ధాత్రి

మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో శుక్రవారం స్వామి వివేకానంద, దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం యాకాంతం గౌడ్ మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మికత విశిష్టతను హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దార్శనికుడు స్వామి వివేకానంద అన్నారు.
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరి పోసిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు.
మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకొని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గడ్డమీది నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళిన..

చలో హైదరాబాద్ కు
తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

కొత్తగూడ, నేటిధాత్రి:

గ్రామ కమిటీ అధ్యక్షుల మరియు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు విచ్చేసిన
ఏఐసీసీ అధ్యక్షుడు గౌరవ శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ…
ములుగు నియోజకవర్గ
మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు… కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి జేజేలు పలుకుతూ… కార్యకర్తలను చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలించారు
ఈ కార్యక్రమంలో
కొత్తగూడ మండల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు , మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం యువజన నాయకులు తరలి వెళ్లారు.

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య.

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి.

జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మనబోయిన యాకయ్య, సీనియర్ నాయకులు బి వెంకన్న.

తొర్రూరులో జిఎంపిఎస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సభ.

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం గొల్ల కురుమలే కాకుండా సబ్బండ వర్గాల ప్రజలు కృషి చేయాలని, దొడ్డి కొమురయ్య ఉద్యమస్ఫూర్తితో గొల్ల కురుమ యువత తమ హక్కుల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కావాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జీ.ఎం.పీ.ఎస్) జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొమ్మనబోయిన యాకయ్య, సంఘం సీనియర్ నాయకులు బొమ్మనబోయిన వెంకన్న లు పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య 79 వ వర్ధంతి సందర్భంగా గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం తొర్రూరు మండల అధ్యక్షులు ఎద్దు ఐలయ్య ఆధ్వర్యంలో స్థానిక పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమ్మనబోయిన యాకయ్య, బొమ్మనబోయిన వెంకన్న లు సంయుక్తంగా మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణ సాయుధ పోరాటానికి మరింత ఉద్యమాన్ని రగిలించిందని… తెలంగాణ సాయుధ పోరాటంలో ఓ గొల్ల కురుమ యువ నాయకుడు దొడ్డి కొమరయ్య ముందు నడిచి అమరత్వం పొందడం మన గొల్ల కురుమల అందరికీ గర్వకారణమని… వారి బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ దొడ్డి కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఒక గొల్ల కురుమలకే కాకుండా దొడ్డి కొమరయ్య తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ఆయన అమరత్వం బాసటగా నిలిచిందని…. అణగారిన వర్గాల కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం భూమి బుట్టి పేద ప్రజల విముక్తి కోసం అమరుడయ్యాడని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు పోసాని సంతోష్ యాదవ్, నూకల హరీష్, జిఎంపిఎస్ తొర్రూరు మండల కార్యదర్శి మద్దెల రాజు, ఉపాధ్యక్షులు సర్వి నగరాజు, ఎర్రం రాజు, సహాయ కార్యదర్శి పెద్దబోయిన కుమార్, గిరిజన సంఘం నాయకులు భీమా నాయక్, బహుజన సామాజిక కార్యకర్త మాలోత్ సురేష్ బాబు, ఎస్సీ సామాజిక కార్యకర్త, జర్నలిస్టు వెల్తూరి పూర్ణచందర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి, జర్నలిస్టు పున్నం సారయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు కొండ వెంకన్న, వృత్తి ప్రజా, కుల గొల్ల కురుమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ సేన మండల అధ్యక్షడు ఎన్నిక.

కేటీఆర్ సేన మండల అధ్యక్షడు ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కేంద్రంలో కేటీఆర్ సేన మండల అధ్యక్షుడిని ఎన్నుకున్నారు కెటిఆర్ సేన రాష్ట్ర అద్యక్షులు. మెంగాని మనోహర్ అదేశా లమేరకు భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి & జ్యోతి, అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి అధ్వర్యంలో మండల అధ్యక్షు నిగా శానంరాకేష్ ఎన్నుకు న్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు మల్లాపూర్..

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు మల్లాపూర్ మండల నాయకులు
మల్లాపూర్ జూలై 4 నేటి ధాత్రి
మల్లాపూర్ మండలం కొత్త దాంమరాజ్ పల్లి గ్రామానికి చెందిన బద్దం నర్సారెడ్డి ఎక్స్ ఎంపీపీ మెండు గంగారెడ్డి ఎక్స్ ఎంపిటిసి, లింబాద్రి, వార్డు మెంబర్ వీరు హైదరాబాద్ నగరంలో నర్సింగరావు నివాసంలో కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అభివృద్ధి పనుల మీద ఆకర్షితులైనము నర్సింగరావు కృష్ణారావు ఎలల జలపతి రెడ్డి గారు నల్ల రాజన్న పుండ్ర శ్రీనివాస్ రెడ్డి తో కలసి కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్లమై అభివృద్ధిపై మేముకలసి చేస్తామని చెప్పడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version