ఎగిరి గంతేసిన అభిమాని! వీడియో వైర‌ల్‌..

ప‌వ‌న్ కళ్యాణ్‌తో ఫొటో.. ఎగిరి గంతేసిన అభిమాని! వీడియో వైర‌ల్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు స‌క్సెస్ మీట్‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu) చిత్రం నిన్న (గురువారం) ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి స‌ర్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళుతున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో చిత్ర బృందం నిన్న సాయంత్రం స‌క్సెస్ మీట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ ప‌లు అస‌క్తిక‌ర వ్యాక్య‌లు సైతం చేశారు. అలాగే సినిమాప వ‌స్తున్న కామోంట్ల‌కు త‌న‌దైన శైలిలో కౌంట‌ర్లు ఇచ్చారు. అయితే కార్య‌క్ర‌మం స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది.

వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను ఒకసారి కళ్లారా చూడాలని, ఫోటో దిగాలని కోట్ల‌లో అభిమానులు ఎగ‌బ‌డుతుంటారు. ఎంత కష్టమైనా వెనకాడరు. అలాంటిది నిన్న జ‌రిగిర ఈవెంట్‌లో ప‌వ‌న్ మాట్లాడుతుండ‌గా ముందు వ‌రుస‌లో నిల్చున్న నివిక అనే ఆర్టిస్టును గుర్తించి మీరు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో న‌టించారు క‌దా అని అడ‌గి ఆమెను స్టేజీకి పైకి ఆహ్వానించారు. ఆపై నివిక గురించి నిధి ఆగ‌ర్వాల్‌కు ప‌రిచ‌యం చేసి బాగా న‌టించారు అంటూ కితాబిచ్చారు. అనంత‌రం నివిక ఇంకా నాకు షాకింగ్‌గా ఉంద‌ని, మీ అభిమానినని నాకు ఓ ఫోటో కావాల‌ని కోర‌గా ప‌వ‌న్ ఫొటోలు దిగారు. అనూహ్యంగా నిమిషాల వ్య‌వ‌ధిలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఆమె షాక్‌కు గురై ఆనందం ప‌ట్ట‌లేక స్టేజీపైనే ఎగిరి గంతేసింది.

ఈ సన్నివేశం అక్కడ ఉన్నవారిని కూడా ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ప్రతి సారి పవన్ ప్రజల్లోకి వస్తే అభిమానులు ఆయనను చూసేందుకు ఎంత‌లా పోటీ పడతారనే విష‌యం ఈ సంఘటన మ‌రో సారి రుజువు చేయ‌గా పవన్ ఎంత ప్రజాదరణ ఏ రేంజ్‌లో ఉంటుంద‌నేది ఈ ఘ‌ట‌న‌ మరోసారి నిరూపించింది. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సినిమాలు, అభిమానులపై చూపించే ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

అందాల‌కే విందు.. కుషిత వీడియో వైర‌ల్.

అందాల‌కే విందు.. కుషిత వీడియో వైర‌ల్

ఇన్నాళ్లు చీర‌క‌ట్టులో మ‌న ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూ సంద‌డి చేసే హైద‌రాబాదీ బ్యూటీ కుషిత క‌ల్ల‌పు మ‌రోసారి రెచ్చిపోయింది.

అచ్చ తెలుగు సోయ‌గం కుషిత క‌ల్ల‌పు (Kushitha kallapu) రెచ్చిపోయింది. ఎప్పుడూ చీర‌క‌ట్టులో మ‌న ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూ సంద‌డి చేసే ఈ హైద‌రాబాదీ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అందులో ఒదిగిపోయి త‌న అందంతో ఎదుటి వారిని మెస్మ‌రైజ్ చేసేది.

అప్పుడప్పుడు చూయించి చూయించన‌ట్లు అందాల ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ ఒక్క‌సారిగా రూట్ మార్చి ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయి అందాల‌ను బాహాటంగా ప‌రుస్తూ చూసే వారికి షాకిచ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మూడు నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన బ్యూటీ ఎక్క‌డా స‌రైన గుర్తింపు రాక పోయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మిలియ‌న్‌కు పైగానే ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది.

తాజాగా నిర్మాత‌ ఎస్కేఎన్‌, ద‌ర్శ‌కుడు మారుతి కాంబోలో వ‌స్తున్న త్రీ రోజెస్ వెబ్ సిరీస్ సీక్వెల్‌లో ఓ రోజ్‌గా న‌టిస్తున్న‌ ఈ భామ దానికి సంబంధించిన గ్లింప్స్‌లోనే హీట్ పెంచింది. ఆపై గ‌త ఆరు నెల‌ల నుంచి గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌ణ‌లో ప‌ట్టా ప‌గ్గాలేకుండా ఓ రేంజ్‌లో ఫుల్ మీల్స్ పెడుతూ మ‌గ పుంగ‌వుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది.

తాజాగా హాలీడే ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ అక్క‌డ కేవ‌లం చిన్న గుడ్డ పీల‌క‌తో ఎద అందాల‌ను టైట్‌గా బిగించి వీధుల‌న్నీ క‌లియ తిరుగుతూ క‌ల్లోలం రేపింది. వంటి పై భాగంలో, న‌డుముపై లైవ్‌లో క‌ల‌ర్ ఫుల్‌గా టాటూస్ వేయించుకుని ఎంజాయ్ చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను సైతం పోస్టు ఈ చేసిన ఈ చిన్న‌ది కాసేప‌టికే ఆ వీడియోను డిలీట్ చేసి దాని స్థానంలో ఫొటోలు షేర్ చేసింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట దుమార‌మే రేపుతున్నాయి. మీరూ ఓ లుక్కేసి మీ క‌నులారా ఆస్వాదించండి మ‌రి.

టీమ్‌లో నుంచి అతడ్ని తీసెయ్..

టీమ్‌లో నుంచి అతడ్ని తీసెయ్.. పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ మాట్లాడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడ్ని తీసెయ్ అంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో విజయానికి చేరువలో ఉంది టీమిండియా. ఇంకో 7 వికెట్లు తీస్తే గెలుపు మనదే. లీడ్స్ టెస్ట్‌లో ఓడి సిరీస్‌లో 0-1తో వెనుకబడిన గిల్ సేన.. తాజా మ్యాచ్‌లో ఐదో రోజు గనుక చెలరేగి ఆడితే సిరీస్‌ను సమం చేయొచ్చు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టేందుకు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలసి స్కెచ్ వేస్తున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఏయే బ్యాటర్‌ను ఎలా ఔట్ చేయాలా? అని పథకాలు రచిస్తున్నాడు. ఈ తరుణంలో అతడ్ని తీసెయ్ అంటూ పంత్‌తో గంభీర్ మాట్లాడుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

కపిల్ శర్మ షోలో గంభీర్, పంత్, అభిషేక్ శర్మ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పంత్-కపిల్ మధ్య సాగిన జోక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ శాలరీ (రూ. 27 కోట్లు) అందుకున్నావ్ కదా.. నీ టీమ్‌లో ఏదైనా తక్కువ వేతనం అందుకునే ఆటగాడు నీ కంటే బాగా ఆడితే ఏం చేస్తావంటూ పంత్‌ను ఆటపట్టించాడు కపిల్. నువ్వు స్టేజ్ మీద ఉన్నప్పుడు నీ కంటే ఇంకెవరైనా బాగా కామెడీ చేస్తే ఏం చేస్తావంటూ కపిల్‌కు రివర్స్‌ కౌంటర్ వేశాడు పంత్. వీళ్ల మధ్య ఇలా జోక్స్ సాగుతుండగా మధ్యలో గంభీర్ కలుగజేసుకున్నాడు.

టీమ్‌లో నుంచి అతడ్ని తీసేస్తానని చెప్పమంటూ పంత్‌కు సూచించాడు గంభీర్. నీ కంటే ఎవరైతే బాగా ఆడతారో ఆ ప్లేయర్‌ను డ్రాప్ చేస్తానని చెప్పమని గంభీర్ అన్నాడు. దీంతో పంత్, అభిషేక్, కపిల్ సహా షోలోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. గంభీర్ ఎక్కువగా సైలెంట్‌గా ఉంటాడు. అలాంటోడు జోక్ వేయడం, అది బాగా పేలడంతో అంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పంత్-గంభీర్ మామూలోళ్లు కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజంగానే అమల్లో పెడతారా? ఏంటి అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

వైరల్‌ వయ్యారి.

వైరల్‌ వయ్యారి

గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ జూనియర్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బేనర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు.

గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘జూనియర్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బేనర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ‘జూనియర్‌’ నుంచి రెండో పాటను యూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. ‘వైరల్‌ వయ్యారి’ అంటూ సాగే ఈ గీతానికి కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించారు. దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలందించడంతో పాటు హరిప్రియతో కలసి ఆలపించారు. దేవి సంగీతంతో పాటు కిరీటి రెడ్డి, శ్రీలీల స్టెప్పులు ఈ పాటకు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె. కె. సెంథిల్‌ కుమార్‌

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్ మతి పోవాల్సిందే.!

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్… మతి పోవాల్సిందే !

 

నేటిధాత్రి:

 

 

 

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భర్త విడాకులు ఇచ్చినప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ ను లీడ్ చేస్తోంది సమంత. హీరోయిన్ గా, అలాగే నిర్మాతగా.. బిజినెస్ మ్యాన్ గా దూసుకు వెళ్లోంది సమంత. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ໐໕໖ (Tollywood Industry) .

అయితే అలాంటి సమంత.. తాజాగా దుబాయ్ లో (Dubai ) పర్యటించారు. ఈ సందర్భంగా దుబాయ్ అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పంచుకుంటున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి సమంత దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడికి ఓ ఖరీదైన హోటల్లో దిగిన సమంత.. ఎడారి దిబ్బలు, నైట్ లైఫ్, ఇలా అన్ని ఎంజాయ్ చేస్తోంది.

ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఓ బోల్డ్ ఫోటోను పంచుకుంది. బ్లాక్ డ్రెస్ లో స్నానం చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలను స్వయంగా సమంత పంచుకోవడంతో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏం అందం రా బాబు.. అంటూ సమంతను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉండగా 2021 లో అక్కినేని నాగచైతన్య- సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version