కవిన్ సరసన ప్రియాంక…

కవిన్ సరసన ప్రియాంక…

అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ కిట్ లో మరో అవకాశం వచ్చి పడింది. ప్రముఖ తమిళ నటుడు కవిన్ సరసన ఆమె ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయబోతోంది.

మూడు పదుల వెన్నెల సోన ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) కు ఇంకా గ్రాండ్ విక్టరీ దొరకలేదు. అయితే… తమిళంలో ఆమె నటించిన ‘డాక్టర్ (Doctor), డాన్ (Don)’ చిత్రాలు కొంతలో కొంత ఊరటను కలిగించాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘ఓజీ’ (OG) లో నటిస్తోంది ప్రియాంక అరుల్ మోహన్. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘ఓజీ’ పై అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది.

తెలుగులోనూ ఇప్పటికే నటిగా తన సత్తా చాటడానికి శతవిధాలా ప్రయత్నించింది. నానిస్ ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక… ఆ తర్వాత శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ‘గ్యాంగ్ లీడర్’లో ఆమె చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందుకే మరోసారి నాని సరసన ‘సరిపోదా శనివారం’ (Saripoda Sanivaaram) లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో మిస్ ఫైర్ అయింది.

ఇదిలా ఉంటే… ప్రియాంక అరుల్ మోహన్ కు ఇప్పుడో కొత్త ప్రాజెక్ట్ లభించింది. హీరో కవిన్ (Kavin) తొమ్మిదో చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కెన్ రాయ్ సన్ దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. థింక్ స్టూడియోస్ సంస్థ ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ప్రొడ్యూస్ చేబోతోంది. ‘కొత్త ప్రయాణం… కొత్త సినిమా’ అంటూ వీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కవిన్ సరసన ప్రియాంక తొలిసారి నటిస్తోంది. మరి సెప్టెంబర్ 25న రాబోతున్న ‘ఓజీ’తో ప్రియాంక స్టార్ హీరోయిన్ కేటగిరిలోకి చేరిపోతుందేమో చూడాలి.

పూజా కిట్ లో మరో తమిళ మూవీ..

పూజా కిట్ లో మరో తమిళ మూవీ..

హీరో ధనుష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే విజయ్, రాఘవేంద్ర లారెన్స్ మూవీస్ లో నటిస్తున్న పూజా… రజనీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది.

పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ కు ఇక ఫుల్ స్టాప్ పడిపోయినట్టు అనుకుంటున్నప్పుడల్లా ఫీనిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తోంది. గత కొంతకాలంగా పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ బరిలో సందడి చేయలేదు. దాంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇక పూజా తట్టాబుట్టా సర్దుకోవడమే తరువాయి అనుకుంటున్న టైమ్ లో మళ్ళీ చిత్రంగా ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం పూజా హెగ్డే… తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సౌతిండియన్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) లో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. వీటితో పాటు రాఘవేంద్ర లారెన్స్ ‘కాంచన -4’ (Kanchana -4)లోనూ పూజా నటిస్తోంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌ (Dhanush) 54వ సినిమాలోనూ ఆమె హీరోయిన్ గా ఎంపికయినట్టు తెలుస్తోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా ను ఈ నెల రెండో వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళి 90 రోజులలో పూర్తి చేస్తారని తెలుస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version