రెండో షెడ్యూల్‌లో ఎన్సీ 24
నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ చిత్రం ఎన్సీ 24 వర్కింగ్ టైటిల్ తెరకెక్కుతోంది.
నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ చిత్రం (ఎన్సీ-24-వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. బీవీఎ్‌సఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు యూనిట్ తెలిపింది. నెలరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. ఈ సందర్భంగా యూనిట్ నాగచైతన్య పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో తాడుతో మాస్ లుక్‌లో నాగచైతన్య ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రఘుల్ ధరుమాన్