తెరుచుకున్న తుంగభద్ర గేట్లు..

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు.. దిగువకు నీరు విడుదల

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి.

గద్వాల(మహబూబ్‏నగర్): కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి. ప్రాజెక్టుకు 75,612 క్యూసెక్కుల ప్రవాహాలు చేరగా 58 గేట్లకు గాను 21 గేట్లను ఎత్తి 62,612 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు
ప్రాజెక్టు సామర్థ్యం 105.79 టీఎంసీలకు.. ప్రస్తుతం 75.84 టీఎంసీలున్నాయి. దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1,09,777 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఏపీ, తెలంగాణ(AP, Telangana) విద్యుదుత్పత్తి కోసం 56,998 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 169.86 టీఎంసీలున్నాయి.

తుంగభద్ర గేట్లు తెరవడంతో శ్రీశైలానికి వరద మరింత పెరిగే అవకాశముంది. ఇక ఆల్మట్టికి వరద స్థిరంగా కొనసాగుతోంది. 94,767 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. లక్ష క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా 14గేట్ల ద్వారా 95,566, విద్యుదుత్పత్తి ద్వారా 29,494 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

కోటగుళ్లలోని మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలి. 

కోటగుళ్లలోని మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలి. 

బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో టూరిజం వాల్ల ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలని బీజేవైఎం కళాశాలల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైందని పనులు పూర్తయి ఆరు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించడం లేదన్నారు దీంతో కోటగుళ్లకి వచ్చే పర్యాటకులు ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ , టూరిజం శాఖ వారు స్పందించి వెంటనే మరుగుదొడ్లను ప్రారంభించి వాడుకలోకి తేవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి చెలిమల్ల ప్రవీణ్ కుమార్ బీజేవైఎం నాయకులు కర్క అన్వేష్ చరణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version