చిరంజీవి అభిమాని కుటుంబానికి వెలిచాల…

చిరంజీవి అభిమాని కుటుంబానికి వెలిచాల రాజేందర్ రావు సాయం అందజేత

కరీంనగర్, నేటిధాత్రి:

మెగా స్టార్ చిరంజీవి అభిమాని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ)లోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఇరవై వేల చెక్కును అందజేశారు. కమలాపుర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన చెరిపెల్లి కిరణ్ కుమార్ గత ఇరవై సంవత్సరాల నుంచి చిరంజీవి అభిమానిగా ఉంటూ అనేక సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించారు. మూడు సంవత్సరాల క్రితం కిరణ్ కుమార్ మృతి చెందాడు. కిరణ్ కుమార్కు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో కిరణ్ కుమార్ భార్య, పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వచ్చింది. దీంతో చిరంజీవి సూచనల మేరకు చిరు స్నేహితుడు బస్వారాజ్ శ్రీనివాస్ భారత సహకార సేవా ఫోరం ద్వారా కిరణ్ కుమార్ పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. పిల్లలు చదువు పదవ తరగతి పూర్తయ్యే వరకు ఈసాయం అందజేయనున్నారు. ఈనేపథ్యంలో బస్వారాజ్ శ్రీనివాస్ ఆర్థిక సాయం కింద పంపించిన ఇరవై వేల రూపాయల చెక్కును కిరణ్ కుమార్ భార్య చెరిపెల్లి స్వప్నకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అందజేశారు. రాబోయే రోజుల్లో కిరణ్ కుమార్ కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, కోడూరి హరికృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవి పాట రీమిక్స్ లోనూ ఆయనే…

చిరంజీవి పాట రీమిక్స్ లోనూ ఆయనే…

పాత పాటలు రీమిక్స్ చేసి యంగ్ హీరోస్ నటించడం చూశాం. కానీ, ఇప్పుడు తన ఓల్డ్ సాంగ్ ను రీమిక్స్ చేసి, అందులో తానే నర్తించడానికి సిద్ధమయ్యారు మెగాస్టార్. ఆ ముచ్చటేంటో చూద్దాం.

కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) అభిమానులను ఊరిస్తూనే ఉంది ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం. జనవరిలో సంక్రాంతి కానుకగా వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశ కలిగింది. తరువాత అదుగో ఇదుగో అంటూ కాలం కరిగిపోతోంది. ఈ చిత్రంలోని కొన్ని లిరికల్స్ అభిమానులను అలరించాయి. ఇటీవల ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారని విశేషంగా వినిపిస్తోంది. అది ఓ రీమిక్స్ సాంగ్ అనీ చెబుతున్నారు. అంతేకాదు – అది చిరంజీవి నటించిన సాంగ్ కు రీమిక్స్ అనీ తెలుస్తోంది. అదే ఇప్పటి విశేషం! ఇంతకూ అది ఏ సినిమాలోని సాంగ్ అంటే చిరంజీవి హిట్ మూవీ ‘అన్నయ్య’ (Annayya) లోని ‘ఆట కావాలా. పాట కావాలా…’ అంటూ సాగే ఐటమ్ సాంగ్. అప్పట్లో నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సిమ్రన్ ఆ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఈ సాంగ్ రీమిక్స్ రూపంలో ‘విశ్వంభర’లో ఉందని తెలిసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.

‘విశ్వంభర’లో తన పాట రీమిక్స్ లో చిరంజీవి తానే నర్తిస్తూ ఉండడం ప్రస్తుతం విశేషంగా మారింది. గతంలో ఇలా ఎవరూ చేయలేదా అంటే పౌరాణికాల్లో పద్యాలు, సీన్స్ లో యన్టీఆర్ (NTR) ఏ నాడో రీమిక్స్ లో నటించేశారు. సోషల్ మూవీస్ లో చేయలేదా అంటే కృష్ణ ఉన్నారు. 1968లో కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ సినిమాలోని ‘ఓ చిన్నదాన.’ పాటను తరువాత 1995లో తాను హీరోగా నటించిన ‘డియర్ బ్రదర్’లో ఉపయోగించు కున్నారు.

గతంలో పేరడీ సాంగ్స్ లో తమ పాత పాటలకు తామే నర్తించి అలరించిన స్టార్స్ ఉన్నారు. కానీ, ఒకే పాటను వేరేగా రీమిక్స్ చేసి నటించిన వారు అంతగా కానరారు. ఆ రూటులో చిరంజీవి సాగుతూ, నవతరం ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ‘అన్నయ్య’ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. అందులోని పాటను ఈ సారి రీమిక్స్ చేయడానికి భీమ్స్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ‘విశ్వంభర’కు కీరవాణి సంగీతం అందించారు. కానీ, ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ‘అన్నయ్య’ రీమిక్స్ కు వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కంపోజ్ చేయించారని సమాచారం. మరి ‘అన్నయ్య’లోని రీమిక్స్ తో చిరంజీవి ఫ్యాన్స్ ను ఎలా చిందేయిస్తారో చూద్దాం.

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్.

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

 

 

 

 

 

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా గురించి వార్తలు విశేషంగా వినిపిస్తున్నాయి- కానీ, ఆ మూవీ రిలీజ్ డేట్ మాత్రం తెలియడం లేదు.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కు భీమ్స్ ట్యూన్స్ అందిస్తూ ఉండడం ఇప్పుడు విశేషంగా మారింది.

 

మొదటి నుంచీ ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహిస్తూ సాగుతున్నారు చిరంజీవి…

ఆయన రీ ఎంట్రీ తరువాత ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు అంతగా అలరించలేకపోయాయి…

‘భోళాశంకర్’ పరాజయం చిరంజీవి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది…

దాంతో ‘విశ్వంభర’ ద్వారా అభిమానులకు ఆనందం పంచే దిశగా సాగుతున్నారు చిరంజీవి.

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే చిరంజీవి ఈ సినిమాలో డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చారు…

అతను కూడా శక్తివంచన లేకుండా ‘విశ్వంభర’ను రూపొందించారు…

ఓ పాట మినహా ‘విశ్వంభర’ పూర్తయింది…

ఈ సాంగ్ ఐటమ్ నంబర్ గా రూపొందనుంది… .

ఇందులో చిరంజీవితో చిందేసే ముద్దుగుమ్మ కోసం అన్వేషణ సాగుతోంది…

ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు…

ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా రీ-రికార్డింగ్ లో బిజీగా ఉన్నారు…

అందువల్ల ఈ ఐటమ్ నంబర్ కు మాత్రం భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ ఎంచుకున్నారట…

ఈ యేడాది బంపర్ హిట్ గా నిలచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ భలేగా పనిచేశాయి…

ఈ చిత్రంలోని పాటలు మాస్, క్లాస్ అన్న తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి…

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రానికి కూడా భీమ్స్ స్వరకల్పన చేస్తున్నారు…

ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ చిత్రంలోని ఐటమ్ నంబర్ కు భీమ్స్ బాణీలు ఉపయోగించుకోవాలని చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ నిర్ణయించారు…

చిరంజీవి సినిమాలో ఐటమ్ నంబర్ అంటే ఇరగదీసేలా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు…

మరి వారి అంచనాలకు తగ్గట్టుగానే భీమ్స్ బాణీలు ఉంటాయని టాక్!

అప్పుడలా… ఇప్పుడిలా…

దాదాపు 21 సంవత్సరాల క్రితం చిరంజీవి ‘అంజి’ సినిమా అప్పట్లో జనాల్లో విశేషమైన క్రేజ్ క్రియేట్ చేసింది…

ఆ సినిమాకు ముందు శ్రీ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు…

ఓ పాటను కూడా చిత్రీకరించారు…

తరువాత పలు మార్పులు జరిగి, మణిశర్మ బాణీలతోనే ‘అంజి’ రిలీజయింది…

అప్పట్లో గ్రాఫిక్స్ తో ‘అంజి’ అలరించే ప్రయత్నం చేసింది…

ఇప్పుడు ‘విశ్వంభర’లోనూ జీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది…

అంతేకాదు, ‘విశ్వంభర’ విడుదలలోనూ జాప్యం జరుగుతోంది…

అయితే అప్పుడు శ్రీ స్థానంలో మణిశర్మ వచ్చి ఒక పాట మినహా అన్నీ పూర్తి చేశారు…

ఇప్పుడు కీరవాణి బిజీ వల్ల భీమ్స్ వచ్చి ఓ పాటకు ట్యూన్స్ కడుతున్నారు…

ఏది ఏమైనా చివరగా మిగిలిన పాట పూర్తయితే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

మరి కీరవాణికి బదులుగా ఓ పాటకు బాణీలు కడుతున్న భీమ్స్ ఈ ఐటమ్ నంబర్ ను ఎలా రూపొందిస్తారో చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version