పల్లెటూరి సరదాలు
మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు.
మనోజ్ చంద్ర, మోనికటి, ఉషా బోనెల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. రానా దగ్గుబాటి సమర్పణలో గోపాల కృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. ఈనెల 18న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. మనోజ్ చంద్ర రికార్డ్ డ్యాన్స్ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా ఈ చిత్రంలో చూపించబోతున్నామని చిత్రబృందం పేర్కొంది.