తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.

◆:- నకిలీ పట్టాల సృష్టించిన అక్రమార్కులు

◆:- నలుగురిపై కేసు నమోదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: కొంత మంది అక్రమార్కులు
ఏకంగా తహసీల్దార్ సంతకాలను ఫోర్టరీచేసి నకిలీ పట్టాలను సృష్టించారు. ఇంటి నంబర్ కేటాయిం చాలని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకోగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. జహీరాబాద్ పట్టణంలోని డ్రైవర్ కాల నీ, రాంనగర్, బాగారెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లోని 50, 173, 40, 139 తదితర సర్వే నంబర్ లు కలిగిన ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అర్హులైన పేదలకు రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అధికశాతం మంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ భూముల సర్వేనంబర్ లపై నకిలీ పట్టాలు సృష్టించి తహసీల్దార్ సంతకా లను ఫోర్టరీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా ఇళ్లను నిర్మించుకున్నామని, ఇంటి నం బర్ కేటాయించాలని మున్సిపల్ కార్యాలయంలో నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికెట్లను పరిశీలించిన మున్సిపల్ అధికారులకు అనుమానం కలిగింది. సర్టిఫికెట్లను పరిశీలించి ఇవి ఒరిజనల్వా తెలపాలని రెవెన్యూ అధికారులకు పంపారు. సమగ్ర విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు.. బోగస్ పట్టాలుగా గుర్తించారు. తహసీల్దార్ సం తకం ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలు సృష్టించారని నిర్ధా రించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు నలుగు రిపై జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు.

తహశీల్దార్ కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం.

తహశీల్దార్ కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని శేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ కోసం నెల రోజుల నుంచి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ శేఖర్ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. శేఖర్ ను సిబ్బంది అడ్డుకున్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చెడ్డీపై బాధితుడి నిరసన.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చెడ్డీపై బాధితుడి నిరసన.

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

కోర్టు ఆదేశాల మేరకు రికార్డులో పేరు ఎక్కించి పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌

హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం(Abdullapurmet Tehsildar Office) ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కొన్ని ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేటకు చెందిన శంకర్‌రెడ్డి 2000లో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తట్టిఅన్నారంలోని సర్వే నంబర్‌ 109,110లో 6 ఎకరాలను 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. అనంతరం 2002లో సదరు భూమిని కొనుగోలు చేసేందుకు పట్టాదారుల వద్ద అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య భూ వివాధం తలెత్తడంతో ఇరువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ద్వారా ఫీజు చెల్లించి 2016లో శంకర్‌రెడ్డి 6 ఎకరాలను రిజిస్ర్టేషన్‌ చేసుకున్నాడు.

దీంతో శంకర్‌రెడ్డి పేరుపై రెండు ఎకరాల భూమి రికార్డులో నమోదు అయి పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. మిగతా నాలుగు ఎకరాలకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉన్నది. అయితే అప్పటి నుంచి నాలుగు ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాసుబుక్‌ల కోసం శంకర్‌రెడ్డి కుమారుడు గంగిరెడ్డి గిరిధర్‌రెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.కాగా 2022లో ఆమోద డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం శంకర్‌రెడ్డికి చెందిన 6ఎకరాల భూమిని తప్పుడు పత్రాలు సమర్పించి రికార్డులో శంకర్‌రెడ్డి పేరును తొలగించి ఆమోద డెవలపర్స్‌పై పేరును నమోదు చేయించి పట్టాదారు పాస్‌బుక్‌లను పొందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శంకర్‌రెడ్డి కుమారుడు గిరిధర్‌రెడ్డి తమకు ఎలాంటి నోటీసు, సమాచారం ఇవ్వకుండా రికార్డుల నుంచి తమ పేర్లు ఎలా తొలగిస్తారని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

సదరు భూమిపై స్టేట్‌సకో ఉండగా రికార్డులో మార్పులు ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్‌, తహసీల్దార్‌ డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా రికార్డు మార్పులు చేశారని గిరిధర్‌రెడ్డి ఆరోపించారు. మూడు ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరగడం లేదని శుక్రవారం గిరిధర్‌రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బట్టలు విప్పి చెడ్డీపై కూర్చుని నిరసనకు దిగారు. కోర్టు ఆదేశాల మేరకు 6 ఎకరాలకు వెంటనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గిరిధర్‌రెడ్డిని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నది: తహసీల్దార్‌తట్టిఅన్నారంలోని సర్వే నంబర్‌ 109,110లోని భూమి కోర్టు పరిధిలో ఉన్నది. ప్రస్తుతం దానిపై స్టేటస్‌ కోఆర్డర్‌ ఉన్నది. కేసు కోర్టు పరిధిలో ఉండగా రికార్డులో పేరు మార్చి పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వాలని గిరిధర్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నాడు. వివాదం కోర్టు పరిధిలో ఉండడంతో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని గత నెల 21న గిరిధర్‌రెడ్డికి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….!

* సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….!

నారాయణపురం గ్రామ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు…

ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల డిమాండ్..

తహసిల్దార్ జి.వివేక్ కి వినతి పత్రం అందజేత.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

మా భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వండి సారు అంటూ కేసముద్రం మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నారాయణ పురం గ్రామ రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి నాయక్ మాట్లాడుతూ తాము గత 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1827 ఎకరాల భూములను 2017లో గత ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అటవీ భూములుగా పేర్కొంటూ పట్టాలు రద్దు చేసిందని 1959 సంవత్సరంలోని 2384 జీవో నెంబర్ ప్రకారం నారాయణపురం గ్రామంలోని భూములను 2021 ,ఫిబ్రవరిలో రెవెన్యూ పట్టా భూములుగా తేల్చింది.

 

 

 

 

గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జూన్ 2021 లో ఎంజాయ్మెంట్ సర్వే చేసి 1827 ఎకరాల్లో 1633 ఎకరాలు సాగుభూమిగా తెల్చి ఇందులో 633 ఎకరాలకు పట్టాలు ఇచ్చిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 94 జారీ చేసి రైతు పేరు తండ్రి పేరు అనే చోట వస్తున్న అడవి అనే పదం తొలగించారని కానీ గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఆరు నెలలు గడుస్తున్న అధికారులు కాలయాపన చేస్తూ పాస్ పుస్తకాల జారీ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిశీలించి మా గ్రామ భూ సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేలా కృషి చేయాలని తహసిల్దార్

 

 

 

 

 

 

జి. వివేక్ కుమార్ కి వినతి పత్రం అందజేసి తక్షణమే మా గ్రామ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిచో రైతులందరం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నూతన భూభారతి చట్టంలో తమ భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని..దేశానికి అన్నం పెట్టే రైతన్న అనాధగా మారే పరిస్థితి ఎదుర్కొంటుందని మా గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేక దాదాపు 700 మంది రైతులకు పంట రుణాలు రుణమాఫీ రైతు భరోసా రైతు భీమా ఇతర ప్రభుత్వం పథకాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

 

 

ఈ కార్యక్రమంలో సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, మిరియాల యాకుబ్ రెడ్డి, కొయ్యగూరి రాంరెడ్డి ,జాటోత్ వెంకన్న, బానోత్ భాష గుగులోత్ లక్ పతి, బానోత్ శంకర్ , ధరంసోత్ శ్రీను , దారావత్ వీరన్న, ధరావత్ మాతృ, జాటోత్ రమేష్, గుగులోత్ శంకర్,ఇస్లావత్ సురేష్, గుగులోతు వెంకన్న, ధారావత్ బీమా, ధారావత్ దేవా ,ధారావత్ రమేష్, జాటోత్ సరిత, బానోతు రంగమ్మ, బానోత్ కమల, ధరావత్ కాంసల్య, ధరావత్ కమలమ్మ రైతులు తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం.

తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం

నిజాంపేట: నేటి ధాత్రి

మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఇంచార్జ్ తహసీల్దార్ రమ్య శ్రీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గ్రామానికి చెందిన పాక మైసయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు నాగరాజు చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ రమాదేవి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్ ఐ ప్రీతి, కంప్యూటర్ శ్రీకాంత్ గౌడ్, కళ్యాణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version