వైరల్ వయ్యారి
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జూనియర్ రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బేనర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు.
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బేనర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ‘జూనియర్’ నుంచి రెండో పాటను యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ‘వైరల్ వయ్యారి’ అంటూ సాగే ఈ గీతానికి కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలందించడంతో పాటు హరిప్రియతో కలసి ఆలపించారు. దేవి సంగీతంతో పాటు కిరీటి రెడ్డి, శ్రీలీల స్టెప్పులు ఈ పాటకు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె. కె. సెంథిల్ కుమార్