బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్;
గణపురం నేటి ధాత్రి;
ఈగణపురం మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో (వెళ్తుర్లపల్లి క్రాస్ నుండి సీతారాంపూర్) బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల వలన మోరంచ వాగు ప్రవహించి అటు వెళ్ళు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య ఉంది. గత ప్రభుత్వాలకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు.
construction works
ఈ సమస్యను పరిష్కారం కోసం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జికి సుమారు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు,అధికారులకు సూచించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే పలు గ్రామాలకు రాకపోకలకు రవాణా సౌకర్యాలు సులభతరం అవుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ .డబ్ల్యూ. ఎస్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు ఆయా గ్రామాల ప్రజలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పరకాల పట్టణ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా జ్యోతి మాట్లాడుతూ నిధులు,నీరు,నియామకాల్లో అనే నినాదలతో 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్నారు.తెలంగాణ సాధన కోసం బీఆర్ఆఎస్ పుట్టిందని అన్నారు.పార్టీ ఏర్పాటు నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేసిందని రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పోరాడారని గుర్తుచేశారు.పరకాల పట్టణం నుండి సభకు నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపు..
నర్సంపేట, నేటిధాత్రి:
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా చితికిపోయింది, రైతులు మానసిక ఒత్తిడికి గురైతున్నారు.రైతులకు ఆర్దికంగా చేయూతలేదు.పంటల నష్టం జరిగితే ఏ నాయకుడు రైతులకు మొఖం చూపెట్టలేని పరిస్థితి వచ్చిందని తెలంగాణ ఉద్యమనేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.బిఆర్ఎస్ పార్టీ 25 యేండ్ల రజితోత్సవ సభ ఏర్పాట్లు,సభ సక్సెస్ పట్ల నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ 2 వ పంటకు సరిపడా నీళ్లు ఇవ్వక అవి చేతికిరాకముందే పశువులను మేపే పరిస్థితి,అలాగే కరెంట్ సరిపడా ఇవ్వకపోవడంతో కరెంట్ మోటార్ల తోనే రైతులు జీవిస్తూన్నారని పేర్కొన్నారు.వ్యవసాయం అంటేనే కేసీఆర్ అని వ్యవసాయాన్ని పండుగగా చేసి చూపించిన ఘనత ఆయనకే దక్కిందని వివరించారు.ఏరికోరి కొని తెచ్చుకుంటే రైతులను నట్టేట ముంచుతున్నదని ఆరోపించారు. అకాల వర్షలతో రైతులు
Congress
పంటలు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు ఉండదా అని పేర్కొన్నారు. రజితోత్సవ సభ బాధ్యతలో ఉన్నానని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గం నుండి కదిలే పార్టీ శ్రేణులు,ప్రజలు స్పష్టమైన రూట్ మ్యాప్ ఇస్తాంన్ పార్కింగ్ స్థలాల వద్ద ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సౌకర్యాలు చేపడుతున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ఈ. కలెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నర్సంపేట నియోజకవర్గం నుండి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, డీసీఎం, ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు వాహనాలతో సుమారుగా 26 వేలకు పైగా నియోజకవర్గ ప్రజలను తరలిస్తామని ప్రత్యేకంగా పదిలక్షల మజ్జిగ ప్యాకెట్లు, పదిలక్షల వాటర్ బాటిల్ సభకు సర్వం సిద్ధం చేసినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ గోగులోత్ రామస్వామి నాయక్, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ , బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్,పట్టణ ప్రధాన కార్యదర్శి వెనుముద్దల శ్రీధర్ రెడ్డి,మాజీ జడ్పిటిసి బాలు, మాజీ కౌన్సిలర్లు నాగిశెట్టి ప్రసాద్, దేవోజు సదానందం, మండల శ్రీనివాస్,బండి ప్రవీణ్, శివరాత్రి స్వామి, పట్టణ యువజన విభాగం ప్రథాన కార్యదర్శి నాయిని వేణుచంద్,ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్,బీరం అనంతరెడ్డి,నల్ల రవీందర్ తదితరుల పాల్గొన్నారు.
మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల- ఫిల్టర్ బెడ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్ ల ప్రధానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఎంఈఓ దత్తుమూర్తి ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మజ హాజరై ఉత్తీర్ణత సర్టిఫికెట్ లు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం ఉపాద్యాయులు ఎంతో కృషీ చేస్తున్నారని అన్నారు. వినూత్న రీతుల్లో విద్యాబోధన చేస్తూ ఉపాద్యాయులు విద్యార్థులకు సేవలను అందిస్తున్నారని అభినందించారు. పాఠశాల ప్రత్యేకతలు,అడ్మిషన్ ల ప్రారంభం తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు.
Education
ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.తల్లితండ్రులు పెద్దఎత్తున హాజరై ఆద్యంతం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి , విద్యార్ధుల ప్రతిభను అభినందించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసాచారి,ఉపాద్యాయులు జనగామ ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత, గుడివెనుక రవి, అమ్మ ఆదర్శం పాఠశాల పాఠశాల చైర్మన్ దూలం అంజలి, పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా లోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ.
500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆదివారం నాగర్ కర్నూల్ నియోజికవర్గంలో కురిసిన అకాల వర్షంతో పంటలు నేలకొరిగిన పంటలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అంచన వేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలoలో గల రైతు వేదిక భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన సదస్సు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను సరిచేసి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేయడం జరిగిందని అన్నారు.
protecting the rights of the common man.
భూ భారతి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరైన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లా డుతూ పది సంవత్సరాలు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన లక్షలాది మంది విజ్ఞప్తుల మేర కు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ధరణి పోర్టర్ ను తొలగించి భూభార తి చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు.
protecting the rights of the common man.
మార్పులుచేర్పులకు గతంలో అవకాశం లేదని ప్రస్తుత చట్టంలో రెవెన్యూ అధికారులకు అన్ని అనుమతులు ఇవ్వడం వల్ల రైతులకు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. చట్టంలో తీసుకు వచ్చిన మార్పులను స్థాయిలో రైతులకు వివరించి రైతులను చైతన్యం చేయాలని కోరారు అధికారులు తప్పు చేస్తే సహించేది లేదన్నారు.
protecting the rights of the common man.
భూ సమస్యలపట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మండల ఎమ్మా ర్వో సత్యనారాయణ ఎంపీడీవో ఫణి చంద్ర, ఆర్ ఐ, వ్యవసా య అధికారులు, చిoదం రవి, మార్కండేయ, బాసని శాంత- రవి , బాసని చంద్రప్రకాష్, మారపేల్లి రవీందర్, కట్టయ్య రాజేందర్, దుబాసి కృష్ణ మూర్తి, వలి ఐదర్, చింతల రవిపాల్, వైనాల కుమార స్వామి, అబ్బు ప్రకాష్ రెడ్డి, తిరుపతి, రాజిరెడ్డి, మోత్కూరి భాస్కర్, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమా నులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికా రులు పాల్గొన్నారు.
అకాల వర్షం కు దెబ్బతిన్న పంటలు పరిశీలించిన ఎంపీ ధర్మపురి
ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి
మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామంలో గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వడగండ్ల వర్షాలకి నష్టపోయిన పంటలను పరిశీలించిన నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంట నష్టం పై సత్వరమే సర్వే నిర్వహించి, నష్టపోయిన పంటకి ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం అందజేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక పంపాలి అని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటే పంటకు జరిగిన నష్టం పరిహారం అందెదని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాని అమలు చేయకుండా ఇప్పుడు రైతులకు నష్టం జరిగిదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, సుకెందర్ గౌడ్ జిల్లా నాయకులు వాడేపల్లి శ్రీనివాసన్,వెంకట్ రెడ్డి,సదశివ్,రుద్ర శ్రీనివాస్,సుదవేణి మహేష్, తుకారాం గౌడ్, తిరుమల వాసు,శ్రీనివాస్,నవీన్,శ్రీధర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, మండల నాయకులు సుంచు రణధీర్, పంతగి వెంకటేష్, తిరుమల చారి,రాజారెడ్డి, మహేష్, సురేష్,వెంకట స్వామి, గణేష్, కౌడా రమేష్,ఆనంతు, రవి, అభి,మల్లేష్, రాజేందర్, రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పాల్గొనాలి……
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి మండల ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27.వ .తారీఖున వరంగల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రజదోత్సవ సభ సమావేశంలో మండల కేంద్రం నుంచి కనీసం 300 నుంచి పైనే కార్యకర్తలు పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ జాతిపిత కెసిఆర్ ప్రవేశపెట్టిన సభకు పెద్ద ఎత్తున మండలం నుండి పార్టీ కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు మండల అధ్యక్షుడు రాజన్న పట్టణ శాఖ అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో సభకు వచ్చే వారి జాబితాను సిద్ధం చేస్తూ వారికి అవగాహన సదస్సు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎగుడు మామిడి వెంకట రమణారెడ్డి పడిగల రాజు తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ రవి అనిత వెంగళ రమేష్ కందుకూరి రామ గౌడ్ మహిళా మాజీ సర్పంచ్ కోడం సంధ్యారాణి మహిళా నాయకురాలు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
వృద్ధాప్య పెన్షన్ ను రజితోత్సవ సభకు విరాళమివ్వడం అభినందనీయం.
వితంతు వృద్ధురాలు నీలమ్మను అభినందించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది..
నర్సంపేట నేటిధాత్రి:
గత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చి ప్రభుత్వాన్ని చేజార్చుకోవడం అటు ఇటు అయినప్పటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందించిన సంక్షేమ పథకాలతో వృద్ధులలో, ప్రజల గుండెల్లో నిలిచిపోయారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నేత, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈనెల 27న కెసిఆర్ తలపెట్టిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున జరగనున్న నేపథ్యంలో అందుకు అయ్యే ఖర్చులకోసం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రూరల్ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బయ్య నీలమ్మ అనే వితంతు మహిళ తనకు నెలకు రూ.2 వేల చొప్పున కేసీఆర్ అందించిన పెన్షన్ ను తన కుమారుడు భయ్యా నవీన్ తో కలిసి నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేసింది.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇకనుండి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడిచి పెట్టకపోతుందని మూర్ఖులకు నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు మహిళా తన ఒక నెల పెన్షన్ ను విరాళంగా ఇవ్వడం,వృద్ధులు,ప్రజలు, పేదోళ్ల గుండెల్లో మాజీ సీఎం కేసీఆర్ పాతుకుపోయారని అందుకు ఈ సంఘటన ఉదాహరణ బయ్య నీలమ్మ అని ఎమ్మెల్యే పెద్ది వివరించారు.
BRS Silver Jubilee Celebration.
కెసిఆర్ అందించిన సంక్షేమ పథకాలు, పెన్షన్ దారులు, రోజువారి కూలీలు సైతం రోజువారి కూలీ డబ్బులు,చందాలను, కెసిఆర్ వల్ల పొందిన పెన్షన్లు ఇతర లబ్ధిలను పోగుచేసుకొని గ్రామ గ్రామాల నుండి రజితోత్సవ సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు వృద్ధ మహిళ బయ్య నీలమ్మ తను కెసిఆర్ వల్ల లబ్ధిపొందానని కృతజ్ఞతతో ఒక నెల పెన్షన్ 2000 రూపాయలను రజితోత్సవ సభ నిర్వహణ ఖర్చు కోసం విరాళంగా అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. విరాళం అందించిన నీలమ్మ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని బిఆర్ఎస్ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఒడిసి ఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్,మాజీ కౌన్సిలర్లు, నాగిశెట్టి పద్మ ప్రసాద్,దేవోజు తిరుమల సదానందం,పాషా, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు నాయకులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వితంతు మహిళా పెన్షన్ విరాళం.
BRS Silver Jubilee Celebration.
నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బయ్య నీలమ్మ అనే వితంతు మహిళా బిఆర్ఎస్ అధినేత,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన రూ. 2 016 పెన్షన్ ను అందుకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లాలో తలబెట్టబోయే బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు విరాళంగా రూ.2 వేల16 ఒక నెల పెన్షన్ ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సోమవారం నర్సంపేట పట్టణంలోని అందజేశారు. ఈ సందర్భంగా వితంతు ఫెన్షన్ దారురాలు నీలమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు నెలకు 200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని తెలిపారు.నేడు కేసీఆర్ ప్రభుత్వం నుండి 2 వేల రూపాయల పెన్షన్ తో నెల రోజుల పాటు గడిచే విధంగా అనుకూలంగా ఉందని అన్నారు.పెన్షన్ దారులకు ప్రతీ నెల క్రమం తప్పకుండా అందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఖర్చుల కోసం తన వంతుగా కృతజ్ఞతతో అందించినట్లు నీలమ్మ పేర్కొన్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నీలమ్మను అభినందించారు.
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్ తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్ లక్షణాలు బయటపడితే జిల్లాస్థాయి క్యాన్సర్ చికిత్స కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపెల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జైపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజలు సైబర్ క్రైమ్ లకు గురవుతున్నారని,ప్రలోభపెట్టేమాటలకు లొంగకూడదని,ముక్కు మొహం తెలియని వారిని నమ్మి నగదు లావదేవీలు చేయకూడదని,ఏదైనా అనుమానంగా అనిపిస్తే తప్పకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
యువకులారా మత్తును వీడండి
నేటితరం యువత గంజాయికి, మాదకద్రవ్యాలకు, మద్యానికి,మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని,యుక్త వయసులోనే వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తాగి వాహనాలు నడుపుతూ ఘోర ప్రమాదాలకు గురవుతున్నారని,జల్సాలకు అలవాటు పడి మద్యం,గంజాయి మత్తులలో క్షణికా ఆవేశాలకు లోనై నేరాలు చేస్తూ చేతులారా భవిష్యత్తును చెరసాలలో బందీగా మార్చుకుంటున్నారని వాపోయారు.సోషల్ మీడియా ప్రభావానికి లోనై అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని,ఆన్లైన్ లో బెట్టింగులు కాస్తూ డబ్బులు కోల్పోయి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని,ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,ఇవన్నీ చాలా విచారకరమని అన్నారు.యువకుల్లారా మత్తును వీడండి.చెడు అలవాట్లను వదిలేసి చదువు పైన దృష్టి సారించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని,విద్యలో బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు,కుటుంబానికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగించాలని, సత్ప్రవర్తన తోని జీవించాలని తెలిపారు.
Chief guest
తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి*
పిల్లల ప్రవర్తనలో మార్పు గురించి ముందుగా తల్లిదండ్రులకి తెలుస్తుందని, పిల్లలను మార్చుకునే శక్తి తల్లిదండ్రులకే ఎక్కువగా ఉంటుందని,ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూనే ఉండాలని,వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ప్రతి పల్లెటూరు లో సీసీ కెమెరాలు ఉండటం చాలా అవసరమని, దొంగతనాలు,నేరాలు జరగకుండా చూడడానికి, ఒకవేళ జరిగిన నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరా ఎంతగానో సహాయపడతాయని,నిఘా నేత్రాల ద్వారా ప్రజలకు పోలీసులకు ఎంతో ఉపయోగం ఉందని,గ్రామస్తులంతా కలిసి సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.
పోలీస్ శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది
ప్రజలకు ఏ కష్టం వచ్చినా,ఏ సమయంలోనైనా 100 నెంబర్ కు డయల్ చేయాలని చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో పోలీసులు అందుబాటులోకి వస్తారని మీ సమస్యలను పరిష్కరిస్తానని,రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు శాంతి భద్రతలకు రక్షణ వలయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ప్రజలు కూడా బాధ్యతగా పోలీసు వారితో సహకరించాలని కోరారు.ప్రజలందరూ కూడా సామరస్యంగా తమ యొక్క సమస్యలను తీర్చుకోవాలని,క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మంచిది కాదని, జనాలు తెలిసి తెలియక తప్పులు చేసి కేసులలో ఇరుక్కొని పోలీస్ స్టేషన్ చుట్టూ,కోర్టు చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారని,ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా మంచిగా సమాజంలో ప్రతి ఒక్కరితో ఐకమత్యంగా జీవించాలన్నారు.పోలీస్ శాఖ ఎల్లప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని న్యాయం కొరకు పోరాడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై శ్రీధర్,పోలీసులు,స్థానిక నాయకులు,మిట్టపల్లి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
సిరిమల్లె చెట్టు కింద రాగులమ్మ జానపద గేయ చిత్రీకరణ..
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పాట సిరిమల్లె చెట్టు కింద రాగులమ్మ పాట చిత్రీకరణ ములుగు జిల్లా తాడ్వాయి మండలలోని గంగారాం పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిగింది, నరేష్ మాట్లాడుతూ ఎన్నో పాటలు యూట్యూబ్ ఛానల్ కు పాటలు రాశారని పేర్కొన్నారు సామాజిక నేపధ్యంలో సాగే పాట అతి త్వరలోనే ఎన్ ఎస్ ఆర్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ లో ఈ పాట విడుదల కాబోతుంది అని చెప్పారు ఈ పాట లో హీరో నాగునాయక్, హీరోయిన్ సత్య ఈషా, విష్ణు మహంకాళి,కెమెరా మెన్ శ్రీరాజు నాగేళ్ళ, ప్రొడ్యూసర్ లకావత్ రాములు సత్తమ్మ పర్యవేక్షణలో ఈ పాట రాబోతుందనీ అందరూ ఆ పాటను ఆదరించాలని కోరారు కార్యక్రమంలో స్థానిక తాడ్వాయి మండలమాజీ ఎంపీపీ నరేష్, రేణికుంట్ల సంతోష్ , చింతల రమేష్ ,పుల్ల రవి, కాట్రేవుల ఐలయ్య, సరిగొమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కబ్జాకు గురవుతున్న ఈత వనమును పరిరక్షించాలి: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
కబ్జాకు గురవుతున్న ఈత వనమును పరిరక్షించాలని, ఈత వనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలనితెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో ఉన్న ఈత వనమును కబ్జాకు గురి కాకుండా పరిరక్షించాలని కోరుతూ కల్లుగీత కార్మికులు ఈత వనం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా ఈత వనంలో ఉన్న కంపచెట్లను తొలగిస్తున్నారని, ఎవరైనా పర్మిషన్ తీసుకొని కంప చెట్లను తొలగించడంతోపాటు ఈత వనంలో ఉన్న కంపమొద్దులను తొలగించే విధంగా చొరవ తీసుకొని ఈత వనం ను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈత వనంలో ఉన్న కంప చెట్లు విపరీతంగా పేరిగాయని, వాటిని తొలగించాలని ఆయన అన్నారు. ఈత వనం ఉన్న భూమిలో కొందరు మా భూమి అని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి ఈత వనం ఉన్న భూమిని కాపాడాలని గీత కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని ఆయన అన్నారు.సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన సర్దార్ సర్వాయ పాపన్న నేడు సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని, భారత రాజ్యాంగంలో చెప్పినట్లుగా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం కై ఉద్యమించాలని ఆయన అన్నారు. 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లు గీతకార్మిక సంఘం గ్రామ శాఖఅధ్యక్షులు బుర్కల అంజయ్య గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం నాయకులు బండమీది వెంకటయ్య, బోడిగే నగేష్ గౌడ్, యాదయ్య గౌడ్, శంకర్ గౌడ్, బురకల శేఖర్, రాజ్ కుమార్, సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ.. తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మొగుడుంపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ మాధురితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం:
నేటిధాత్రి
తేదీ: 21-04-2025 నాడు జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ఆధునికరణ కొరకై పాఠశాల పూర్వ విద్యార్థి గుండేటి ప్రసాద్ మమత దంపతులు గారు విరాళాలు అందజేయడం జరిగినది. ఇట్టి కంప్యూటర్ గదిని వారి తల్లి గారైన గుండేటి గంగుబాయి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎం అర్జున్ గారు మాట్లాడుతూ నేటి యుగంలో పిల్లలకు తప్పనిసరిగా కంప్యూటర్ విద్యపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి కంప్యూటర్ గది ఆధుని కొరకు సహకరించిన గుండేటి రాజేంద్రప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. బోగోరి గంగాధర్ లక్ష్మీ నర్సు, ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశం, పి దరందీప్, పి శశిధర్, డి ఏడుకొండలు, జి అశోక్ ,రాజ్యలక్ష్మి, లక్ష్మి, ఉమాదేవి, నీలిమ, షాహినా, రవీందర్, సుమన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
బాలికల గురుకుల పాఠశాలలో పోషణ పక్వాడ్ పై అవగాహన కార్యక్రమం
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలకేంద్రము లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రిన్స్ పాల్ బిక్షపతి సమక్షంలో పోషణ పక్వాడ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద నిర్వహించడం జరిగింది,ఈసాద్7 ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమము యొక్క ఉద్దేశం 11 నుండి 18 సంవత్సరాల బాలికలు తీసుకోవలసిన సమతులఆహారము వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత ఆడపిల్లలయినందన ఇంటి పనులు వంట పనులు కూరగాయల తోటలు పండ్లు పూల మొక్కలు పెంచుకోవడం మొబైల్ కి దూరంగా ఉండడం విద్య యొక్క ప్రాముఖ్యత బయట వారు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మవద్దని 18 సంవత్సరాలు అయ్యే వరకు వివాహ ఆలోచన చేయరాదని అన్ని రంగాలలో ఆడపిల్లలు అని వెనకడుగు వేయకుండా క్రీడారంగాలు వ్యాయామము క్రికెట్ అన్ని వృత్తి కోర్సులను చదువుతోపాటు నేర్చుకోవాలని వివరించడం జరిగింది,అనంతరం సూపర్వైజర్ మాధవి పిల్లలందరితో పోషకహార ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి అరుణ జ్యోతి భాగ్యమ్మ ప్రతిభ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయురాలు మాధవి, సూపర్వైజర్హాజరైనారు
ప్రభంజనం ప్రభంజనం దుంపేట యు.పి.యస్ పాఠశాల ప్రభంజనం
నేటిధాత్రి
జిల్లా స్థాయి క్విజ్ పోటీలో మా 5వ తరగతి విద్యార్థి ఊడుగుల శ్రీవాన్ టీం జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించినందున ఊడుగుల శ్రీవాన్ కి పాఠశాల ఉపాధ్యాయుల బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, గ్రామ పెద్దలు, పాఠశాల శ్రేయోభిలాషులందరి తరుపున హార్దిక శుభాకాంక్షలు. ఇంతటి ఘనత సాధించినందున మా విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ ఉపాధ్యాయుల బృందం యు.పి.యస్ దుంపేట
పిఆర్టియు జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ద్వితీయ వార్షికోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి,చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షులు వేముల ప్రభావతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మందల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అన్నారు,మాజీ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అన్ని వసతులు కల్పించబడి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా రూపొందించబడిందని, తల్లిదండ్రులు అందరూ ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అన్నారు. వేముల ప్రభావతి మాట్లాడుతూ శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా చర్లపల్లి పాఠశాలకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయ అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిధులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను, గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్, మేకల సత్యపాల్, పోలంపల్లి విజేందర్,నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,రమేష్,ఆయాలు సరోజన,రమ,సుశీల,అరుణ, విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆన్లైన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందుతుడు దాసరి మురళి వ్యక్తిని జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం జరిగినది.
ఈ ప్రకటనలో జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే మాట్లాడుతూ గత కొద్దికాలం నుండి మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి దేశవ్యాప్తంగా NCRP లో నమోదు అయిన 38 పిటిషన్లలో సుమారుగా 45,00,000/- లక్షల మోసాలు పాల్పడుతూ భివండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటు వచ్చిన డబ్బుతో జీవనం కోసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అనే వ్యక్తులతో కలసి ఒక ముఠాగా ఏర్పడి మురళి అనే వ్యక్తి ఆన్లైన్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకొని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని తను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని నాకు రోజు వారిగా నాకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి.
అని నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ ల అకౌంట్ లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకొని వారి అకౌంట్ లోకి వచ్చిన నగదు ను ఐదుగురు పంచుకుంటూ మోసాలకు పాల్పడటం జరుగుతుంది అని తెలిపారు .
అందులో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ ను మరియు సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి అనే నిందుతుడు వారిని మోసం చేయగా అట్టి యజమానులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వేములవాడ పట్టణ పోలీస్ వారు కేసు నమోదు చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నాలుగురు వ్యక్తులువిలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని,పరారీలో ఉన్న దాసరి మురళి అనే వ్యక్తి కోసం వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రమేష్ సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్,కానిస్టేబుళ్లు ఇమ్రాన్, షమీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా కోరూట్ల వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
ఈ సమావేశంలో వేములవాడ టౌన్ ఎస్.ఐ రమేష్, సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, కానిస్టేబుళ్లు ఇమ్రాన్,షమీ పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక సోషల్ వెల్ఫేర్ వెలుగు బాలికల గురుకుల పాఠశాలలో రిటైర్డ్ డిడబ్ల్యు ఓ అధికారి చిన్నయ్య ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్నిసోమవారం రోజున గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించా:రు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు.
అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు , ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీజ చిట్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు చిలుకల రాయకోమురు, దబ్బేట అనిల్ శ్రీనివాసు రాజమౌళి మార్కండేయ తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.