బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ – భారత్‌కు నీటి యుద్ధం సంకేతమా?

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ – భారత్‌కు నీటి యుద్ధం సంకేతమా?

బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మించిన భారీ డ్యామ్ ఇప్పుడు ఆసియా ఖండంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. భారత్‌లో ఈ ప్రాజెక్టును నీటి యుద్ధానికి పునాదిగా భావిస్తున్నారు.

తిబెట్‌లోని మెడోగ్ ప్రాంతంలో యర్లంగ్ జంగ్‌బో నదిపై చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ — భారత్‌లో బ్రహ్మపుత్రగా ప్రసరిస్తుంది — ప్రస్తుతం ప్రారంభ దశలోకి వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఒకటిగా దీనిని చైనా ప్రకటిస్తోంది.

అసలు సమస్య ఏంటి?

ఈ డ్యామ్ నిర్మాణం భారతదేశానికి, ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆందోళనకరమైన పరిణామాలను తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. బ్రహ్మపుత్ర నది తిబెట్‌లో జన్మించి, భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చైనా ఎప్పుడు ఎంత నీటిని నిలుపుతుంది, ఎంత నీటిని విడుదల చేస్తుంది అన్న దాని గురించి భారత్‌కు ముందుగానే సమాచారం ఉండదు.

ఈ విషయం వరదలకూ, కరవులకూ కారణమవుతుంది. అనేక మంది విశ్లేషకులు చైనా ఉద్దేశపూర్వకంగా నీటి ప్రవాహాన్ని నియంత్రించే అవకాశాన్ని ఖండించడం లేదు. ఇది నీటి ఆధిపత్యానికి చైనా ప్రయత్నంగా చూస్తున్నారు.

భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?

ఈ డ్యామ్ వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లోని మానవ జీవితం, వ్యవసాయం, పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వరదల ముప్పు పెరగొచ్చు. మరోవైపు, కరవు పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఉంది.

ముఖ్యంగా, చైనా ముందుగా సమాచారం ఇవ్వకుండా భారీగా నీటిని విడుదల చేస్తే, ఆ ప్రాంతాల్లో ప్రజలపై భారీ విపత్తుల ప్రభావం ఉంటుంది.

ప్రభుత్వ స్పందన:

భారత ప్రభుత్వం ఇప్పటికే చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య 2002లో “ట్రాన్స్ బౌండరీ రివర్స్” పై ఓ ఒప్పందం ఉన్నా, ఆ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం, చైనా ఏదైనా చర్య తీసుకునే ముందు భారత్‌కు సమాచారం ఇవ్వాలి.

నిపుణుల హెచ్చరిక:

ఈ ప్రాజెక్ట్ ఒక సాధారణ విద్యుత్ ప్రాజెక్ట్ కాదని, ఇది భవిష్యత్తులో జల రాజకీయాల పేలుడు బిందువుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా ఆధిపత్య ప్రయత్నాన్ని భారత్ నిర్లక్ష్యం చేయకూడదని, నీటి భద్రతపై భారత ప్రభుత్వం మరింత వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

నర్సంపేటలో భారీఎత్తున కార్మిక సంఘాల ర్యాలీ

నర్సంపేటలో భారీఎత్తున కార్మిక సంఘాల ర్యాలీ.

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి

అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నర్సంపేట పట్టణంలో ఆల్ ట్రేడ్ యూనియన్, సిఐటియు, బిఆర్టియు ఎఐటియుసి,ఏఐఎఫ్టియున్యూ, ఐఎఫ్టియు, టియుసిఐ సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు కూడలి నుండి జయలక్ష్మి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడం మల్లేశం, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఇసంపెల్లి బాబు, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి గుంపెల్లి మునీశ్వర్,సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పంజాల రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదన్నారు.రోజుకు ఎనిమిది గంటల పని విధానానికి స్వస్తి పలికి 10 గంటలు పని చేయాలని చెప్పడం కార్మిక వర్గాన్ని శ్రమదోపిడికి గురి చేయడమని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

 

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని రైతులపై బలవంతంగా రుద్దుతున్న నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సమ్మెకు మద్దతుగా సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతు తెలిపి ప్రదర్శనలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ ,ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గడ్డం సమ్మయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు హనుమకొండ శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బాలకృష్ణ,సిఐటియు పట్టణ కార్యదర్శి రాజు, మున్సిపల్ యూనియన్ యశోద,ఆశా యూనియన్ సుజాత, ఏఎఫ్టీయు నాయకులు జనార్ధన్ రమేష్,ఏఐటీయూసీ నాయకులు గోవర్ధన చారి, ఎడ్ల నాగులు, కొత్తగట్టు నరసింహం, కిషోర్, కనకమల్లు, సిపిఐ కార్యవర్గ సభ్యుడు అక్క పెళ్లి రమేష్, ఐ ఎఫ్ టి యు నాయకులు సుమన్ మొగిలి బాలు కృష్ణ మల్లయ్య స్వరూప పివైఎల్ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి,టియుసిఐ జిల్లా కార్యదర్శి అడ్డురి రాజు,జిల్లా నాయకులు కట్టన్న తదితరులు పాల్గొన్నారు.

 ఇరాన్‌లో భారీ విధ్వంసం.

 ఇరాన్‌లో భారీ విధ్వంసం…

ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌లో భారీ విధ్వంసం జరుగుతోంది. శనివారం తెల్లవారుజాము వరకు ఇరాన్‌ క్షిపణి కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌..

తొలిసారి ఆర్థిక మూలాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌

బుషెహర్‌, సౌత్‌పార్స్‌ చమురు క్షేత్రాలపై దాడి

ఇరాన్‌ చుట్టూ 78 ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు

150 టార్గెట్లపై దాడులు 78 మంది మృతి

ఆర్మీ, ఎమర్జెన్సీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల దుర్మరణం

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతిదాడిలో ముగ్గురి మృతి

టెల్‌అవీవ్‌/న్యూఢిల్లీ, జూన్‌ 14:
ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌లో భారీ విధ్వంసం జరుగుతోంది. శనివారం తెల్లవారుజాము వరకు ఇరాన్‌ క్షిపణి కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌.
సాయంత్రం తొలిసారి ఆర్థిక మూలాలపై విరుచుకుపడింది. బుషెహర్‌ చమురు క్షేత్రాలు (ఇక్కడే అణు విద్యుత్తు కేంద్రం ఉంది), సౌత్‌ పార్స్‌ న్యాచురల్‌ గ్యాస్‌ క్షేత్రాలపై దాడులు చేసింది.
ఆ ప్రాంతాల్లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ తస్నీమ్‌ న్యూస్‌ పేర్కొంది.
ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ ఇంటికి సమీపంలోనూ క్షిపణులు పడ్డాయని వెల్లడించింది.
ఐక్య రాజ్య సమితి(ఐరాస) అణు విభాగం చీఫ్‌ రాఫెల్‌ గ్రోసీ కూడా ఓ ప్రకటన ద్వారా ఇరాన్‌లోని నటాంజ్‌(షాహిద్‌ అహ్మదీ రోషన్‌) అణు కేంద్రం ధ్వంసమైనట్లు నిర్ధారించారు.
ఇరాన్‌ మొత్తం తమ టార్గెట్‌లో ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించగా..
ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 9 మంది కీలక సైంటిస్టులు, 16 మంది మిలటరీ జనరళ్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) వెల్లడించింది.
వీరిలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ముఖ్య సలహాదారు షంఖానీ, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఆఫ్‌ ఇరానియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మహమ్మద్‌ బఘేరీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ చీఫ్‌ గులామ్‌ అలీ రషీద్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గులామ్‌-అల్‌-మర్హాబ్‌, ఇస్లామిక్‌ రివొల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ) కమాండర్‌ హుస్సేన్‌ సలామీ, ఐఆర్‌జీసీ ఎయిర్‌ కమాండర్‌ ఆమిర్‌ అలీ హాజీజాదే,డ్రోన్ల విభాగం కమాండర్‌ తాహెర్‌ పుర్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ కమాండర్‌ దావూద్‌ షిహ్యాన్‌, క్షిపణి విభాగం కమాండర్‌ మహమ్మద్‌ బఘేరీ ఉన్నారు.
దీంతో ఇరాన్‌ త్రివిధ దళాలు పెద్దదిక్కులను కోల్పోయినట్లయింది.
ఆర్మీ కమాండర్‌ ఆమిర్‌ మౌసావీ, ఐఆర్‌జీసీ గ్రౌండ్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ మహమ్మద్‌ పాక్‌పౌర్‌, ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండర్‌ ఇస్మాయిల్‌ ఖ్వానీ, ఐఆర్‌జీసీ నేవీ కమాండర్‌ అలీరెజా తంగ్సీరి మాత్రమే ఇరాన్‌ సెక్యూరిటీ చైన్‌లో సజీవ కమాండర్లుగా ఉన్నట్లు తెలిపింది.
శనివారం సాయంత్రం నెతన్యాహు మాట్లాడుతూ.
మరో 90 నిమిషాల్లో ఇరాన్‌కు పెద్ద దెబ్బ తగులుతుందని ప్రకటించారు.
ఆయన ప్రకటన వెలువడిన 90వ నిమిషం నుంచి ఇజ్రాయెల్‌ వైమానిక దళం క్షిపణులతో ఇరాన్‌పై విరుచుకుపడడం గమనార్హం..! 150 టార్గెట్లను ఛేదించామని పేర్కొంటూ.
అందుకు సంబంధించిన ఫుటేజీని ఐడీఎఫ్‌ తన అధికారిక టెలిగ్రామ్‌ చానల్‌లో విడుదల చేసింది. శుక్ర, శనివారాల్లో జరిపిన దాడుల్లో చనిపోయిన ఇరాన్‌ శాస్త్రవేత్తల వివరాలను ప్రకటించింది.
ఆ జాబితాలో న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు ఫ్రెదోన్‌ అబ్బాసీ, అహ్మద్‌ రజా దరియానీ, ఫిజిక్స్‌ నిపుణులు మహమ్మద్‌ మెహ్దీ తెహ్రాన్షీ, ఆమిర్‌ హసన్‌ ఫఖీ, అబ్దుల్లామిద్‌ మినుష్షర్‌, మన్సూర్‌ అస్ఘరీ, మెకానిక్స్‌ నిపుణుడు అలీ బౌఖాయ్‌ ఖత్రిమీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు అక్బర్‌ మతాలిజాదా, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు సయీద్‌ బార్జీ ఉన్నట్లు తెలిపింది.
ఇరాన్‌ మీడియా కూడా ఇజ్రాయెల్‌ దాడుల్లో 78 మంది మరణించారని, 320 మంది గాయపడ్డారని పేర్కొంది.

ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో ఇరాన్‌లోని ప్రముఖులు రష్యాకు పారిపోతున్నట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా స్పష్టం చేస్తోంది. సుప్రీం లీడర్‌ ఖమేనీ ఇంటి సమీపంలోనూ క్షిపణి దాడులు జరగడం.

ఆయన ముఖ్య సలహాదారు సహా, ఆర్మీ అధికారులు చనిపోవడంతో వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ జెట్లు పెద్ద సంఖ్యలో రష్యాకు చేరుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ వార్తాసంస్థ ‘వైనెట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇందులో ఓ విమానం ట్రాకింగ్‌ మధ్యలో కనుమరుగైందని, అందులో ఖమేనీలాంటి ప్రముఖ వ్యక్తి ఉండి ఉంటాడని పేర్కొంది.

రష్యా-ఇరాన్‌ ద్వంద్వ పౌరసత్వం ఉన్న ప్రముఖులు కూడా ప్రైవేట్‌ జెట్లలో దేశాన్ని వీడుతున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు, ఇజ్రాయెల్‌ దాడుల పట్ల ఇరాన్‌లోనే పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ప్రతీ 47 ఏళ్లకు ఇరాన్‌కు స్వాతంత్య్రం వస్తుందనుకుంటా. ఇప్పుడు కూడా సుప్రీంలీడర్‌ పాలన నుంచి విముక్తి దొరుకుతుందని భావిస్తున్నా’’ అంటూ ఓయువతి పేర్కొంది.

ఎస్‌సీవో ప్రకటనకు భారత్‌ దూరం:

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడులను షాంఘై సహకార సంస్థ(ఎ్‌ససీవో) తీవ్రంగా ఖండించింది. అయితే.. ఎస్‌సీవో ప్రకటనకు భారత్‌ దూరంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) స్పష్టం చేసింది.

ఈ అంశంపై ఎస్‌ఈఏ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ భారత్‌ పాల్గొనలేదని వివరించింది.

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తాము ఇరు దేశాలను కోరుతున్నట్లు తెలిపింది.

కాగా… పాలస్తీనాలో నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని బయట తిరగొద్దని సూచించింది.

ఇక అమెరికాతో చర్చలు అర్థరహితం:

ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణుచర్చలు జరపడం అర్థరహితమని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికారి అబ్బాస్‌ అరగ్చి అంతర్జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.

అమెరికా-ఇరాన్‌ మధ్య ఆదివారం ఒమన్‌లో అణు చర్చలు జరగాల్సి ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

 ఇదే విషయాన్ని ఆయన ఐరోపా సమాఖ్య రాయబారి ఖాజా కల్లా్‌సకు తెలిపానని వెల్లడించారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా ప్రత్యక్ష మద్దతు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

నెతన్యాహు కుమారుడి పెళ్లి వాయిదా:

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కుమారుడు అవ్నర్‌ నెతన్యాహు వివాహం వాయిదా పడింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెతన్యాహు కుటుంబం ప్రకటించింది.

అవ్నర్‌ పెళ్లి సోమవారం అమిత్‌ యార్డెనీతో జరగాల్సి ఉంది. వాయిదా పడ్డ పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారని సమాచారం.

ఇజ్రాయెల్‌లో ముగ్గురి మృతి:

శుక్రవారం రాత్రి ఇరాన్‌ జరిపిన బాలిస్టిక్‌ క్షిపణి దాడుల్లో టెల్‌అవీవ్‌ శివార్లలోని రామత్‌గన్‌లో కోహెన్‌ ఏంజెల్‌(87), రిషోన్‌యెజిలోన్‌లో ఇజ్రాయెల్‌ అలోనీ(67), ఎట్టీ అనే మహిళలు చనిపోయారని, ఏడుగురు సైనికులు సహా 80 మందికి గాయాలైనట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.

క్షతగాత్రుల్లో 34 మంది పారామెడికల్‌ బృందాలకు చెందినవారని తెలిపింది.

టెల్‌అవీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం బెన్‌ గురియన్‌ వద్ద పేలుడు సంభవించినట్లు ఇరాన్‌ వార్తాసంస్థలు చెబుతుండగా.

యుద్ధం ప్రారంభానికి ముందు నుంచి ముందుజాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను నిషేధించామని ఐడీఎఫ్‌ పేర్కొంది.

ఇరాన్‌ దాడుల్లో రామత్‌గన్‌, రిషోన్‌యెజిలోన్‌ నగరాల్లో నివాస గృహాలు, వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. అయితే.. పౌరులను ముందుగానే బంకర్లకు తరలించడం వల్ల ప్రాణనష్టం తప్పిందని ఐడీఎఫ్‌ చెబుతోంది.

పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పాల్గొనాలి.

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పాల్గొనాలి……

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి మండల ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27.వ .తారీఖున వరంగల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రజదోత్సవ సభ సమావేశంలో మండల కేంద్రం నుంచి కనీసం 300 నుంచి పైనే కార్యకర్తలు పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ జాతిపిత కెసిఆర్ ప్రవేశపెట్టిన సభకు పెద్ద ఎత్తున మండలం నుండి పార్టీ కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు మండల అధ్యక్షుడు రాజన్న పట్టణ శాఖ అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో సభకు వచ్చే వారి జాబితాను సిద్ధం చేస్తూ వారికి అవగాహన సదస్సు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎగుడు మామిడి వెంకట రమణారెడ్డి పడిగల రాజు తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ రవి అనిత వెంగళ రమేష్ కందుకూరి రామ గౌడ్ మహిళా మాజీ సర్పంచ్ కోడం సంధ్యారాణి మహిళా నాయకురాలు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version