ఓంకార్ అనుసరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరం
శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంసిపిఐ(యు) నేతలు
నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,
నేటిధాత్రి:
దేశంలో పెరిగిపోతున్న అసమానతలకు వర్గ సామాజిక ఐక్య పోరాటాలే పరిష్కారం చూపుతాయని ఈ క్రమంలో అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఆచరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోనె కుమారస్వామి, హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి అన్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్లో ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ ప్రచార వాల్ పోస్టర్లను పార్టీ రాష్ట్ర జిల్లా నేతలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక అంతరాలు పెరిగిపోయి నూటికి 70 శాతం మంది ఎంత శ్రమపడిన కనీస అవసరాలు తీరలేని స్థితికి నెట్టి వేయబడుతున్నారని పాలకుల దోపిడీ విధానాలు కార్పొరే ట్ పెట్టుబడుదారి శక్తుల దోచుకునే పద్ధతులు రోజురోజుకీ విస్తృతం అవుతున్నాయని మరోవైపు కులం మతం ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వైశాల్యాలను సృష్టిస్తున్నారని మభ్యపెట్టే హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని అందరికీ సమానంగా దక్కాల్సిన సంపద కొద్దిమందికే చెందుతున్నదని ఇలాంటి పరిస్థితులలో ఆదర్శవంతమైన రాజకీయాలు శ్రమజీవుల కోసం పాటుపడే నేతలు మార్క్సిజం లెనినిజం పునాదుల మీద మరింత శక్తిని కూడగట్టుకుని పనిచేయాలని అందుకు అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఆశయాలను ఆచరణను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అందులో భాగంగా కామ్రేడ్ ఓంకార్ శత జయంతి వార్షికోత్సవం సందర్భంగా మే 12న మచ్చాపూర్ స్తూపం వద్ద ప్రారంభ సభ నిర్వహిస్తున్నట్లు ఈ సభకు కమ్యూనిస్టు వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు కవులు కళాకారులు హాజరవుతారని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంద రవి, కేంద్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు నర్ర ప్రతాప్, రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, కుసుంబ బాబూరావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా నాయకులు ఐతం నాగేష్, ఎగ్గని మల్లికార్జున్, రాజు తదితరులు పాల్గొన్నారు.
కమ్మపెల్లి పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని కమ్మపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2004-05 సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆనాటి ప్రధానోపాధ్యాయులు అప్పారావు హాజరై మాట్లాడారు.20 సంవత్సరాల తర్వాత విద్యార్థులు అందరూ కలిసి ఉపాధ్యాయులను గౌరవించడం సంతోషంగా ఉందన్నారు. కాగా కమ్మపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో ఉన్న అనుబంధాలను తీపి గుర్తులను నెమరేసుకున్నారు.ప్రభుత్వ పాఠశాలను జీవితంలో మరిచిపోలేనని ఇక్కడి విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరారని అన్నారు. మీ పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివిపించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా కృషి చేయాలని సూచించారు.అనంతరం పూర్వాపు విద్యార్థులు అందరూ తమ తీపి గుర్తులను అనుభవాలను అందరితో కలిసి పంచుకున్నారు. అనంతరం విద్యార్థులంతా కలిసి ఆట పాటలతో అలరించారు.ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు మల్లికార్జున్ వీరయ్య శంకర్ బాయ్ మదన్ మోహన్ లతోపాటు పూర్వపు విద్యార్థులు కాలే రాజు,ఏడేల్లి మహేందర్ రెడ్డి ,భాషబోయిన రాజు,తంగళ్ళపెల్లి గణేష్,తుమ్మ వెంకటేశ్వర్లు,గట్ల రాజు,ఆరేళ్లి గౌతమి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటన
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన అనాథ, నిరాశ్రయులు మరియు నిరుపేద బాలికలకు 3సం.రాల డిప్లామా కోర్సులలో ప్రవేశానికి గాను దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ, హైదరాబాద్ లో ప్రవేశానికి ధరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. కోర్సుల వివరాలు: డిప్లామా ఇన్ సివిల్ ఇంజనీర్ (DCE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానికల్ (DEEE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ (DCME) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (DECE) విభాగంలో (60 సీట్లు) కలవు. ఇందుకు గాను 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన బాలకల యొక్క కులం మరియు ఆదాయదృవీకరణ పత్రం (not for Orphans), తల్లిదండ్రుల యొక్క మరణ దృవీకరణపత్రము (in case of Orphans), బోనఫైడ్, ట్రాన్సఫర్ సర్టిఫికేట్, స్టడీ కేర్టిఫికేట్ మరియు 10 వ తరగతి మార్కుల మేమో ను సంబందిత ధరఖాస్తు ఫామ్ తో జత పరచవలెను. తేది: 20.05.2025 లోపు పూర్తి చేసిన ధరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్దుల శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా లో సమర్పించగలరని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
తిరుపతి నాయక్ ను పరమర్శించిన మాజీఎమ్మెల్యే సుంకేరవిశంకర్
కరీంనగర్ నేటిధాత్రి:
బిఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభ విజయవంతం కొరకు బస్సుల ఏర్పాట్లు కార్యక్రమంలో ప్రైవేట్ కాలేజీకి వెళ్లిన సందర్భంగా మాజీ కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు తన కాలికి ఫ్రాక్చర్ అయి గాయపడిన విషయం తెలుసుకొని తిరుపతి నాయక్ స్వగృహం చింతకుంట శాంతి నగర్ లో కలిసి పరామర్శించిన చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్. ఈసందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన విషయాలు తెలుసుకుని త్వరగా కోలుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా తన కాళ్లకు అయినా గాయాన్ని సైతం లెక్కచేయకుండా రజతోత్సవ సభకు విజయవంతం అవ్వాలని తిరుపతి నాయక్ పడిన తపనకు పార్టీ అధిష్టానం ముందు తప్పక ఉంచుతానని పార్టీ మంచి గుర్తింపు ఇస్తుందని పార్టీ కోసం కష్టపడే వారిని కేసీఆర్ ఎప్పటికీ తమ యదిలో ఉంచుకుంటారని రవిశంకర్ తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు గంగయ్య, తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలోని తొర్రూరు హై స్కూల్, చెర్లపాలెం హై స్కూల్, మాటేడు హై స్కూల్, అమ్మాపురం హై స్కూల్ మరియు హరిపిరాల హై స్కూల్ లలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్)తేదీ 6-05-2025 నుండి 20-05-2025 వరకు (15 రోజులు), ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు నిర్వహించడం జరుగుతుంది. సమ్మర్ క్యాంపులో ఈ క్రింద తెలుపబడిన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. 1 ఇండోర్ గేమ్స్ 2 ఆటలు మరియు పాటలు 3 స్పోకెన్ ఇంగ్లీష్ 4 బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ 5 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ 6 డ్రాయింగ్ స్కిల్స్ 7 క్రాఫ్ట్ (కుట్లు మరియు అల్లికలు) 8 కమ్యూనికేషన్ స్కిల్స్ 9 డాన్స్ 10 వాలీబాల్ ,షటిల్ గేమ్స్ పైన సూచించిన కార్యక్రమాలతో పాటు ఇతర కొత్త కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున తమరు అందరూ ఐదవ తరగతి నుండి పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరనైనది. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయుల సమావేశంలో MEO మహంకాళి బుచ్చయ్య కోరారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘంవైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి నేటిధాత్రి :
గోపాల్ పేట్ మండల్ జయన్న తిరుమలాపురం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆసుపత్రి కి అయిన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిదికి దరఖాస్తు చేసుకోగా 60,000 వేల రూపాయల విలువ గల చెక్కును రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ చిన్నారెడ్డి బాధితురాలుకు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలుస్తుంది అని చిన్నారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ మండల్ కాంగ్రెస్ పార్టీజనరల్ సెక్రెటరీ జిల్లెలప్రవీణ్ కుమార్, రెడ్డి,బాలేశ్వర్, పర్వతాలు పాల్గొన్నారు.*
కథలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరని ముఖ్యంగా ఒగ్గు కథలంటే తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టమని తెలుసుకున్న నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు నర్ర సతీష్ యాదవ్ బృందం చే ఒగ్గు కథ పాట ను ఆదివారం రోజున చెప్పించడం జరిగింది.నర్ర సతీష్ యాదవ్ సామాన్య జనాల మనసుకు అతుక్కు పోయే విధంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రత్యేకతలను ఒగ్గు కథ రూపంలో వివరించడం జరిగింది.అదేవిధంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించాలని,ఆ పాఠశాల యొక్క ప్రత్యేకతలను తల్లిదండ్రులకు ఒగ్గు కథ పాట ద్వారా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒగ్గు కథ పాట ఉపాధ్యాయ గ్రూపులలో మరియు గ్రామాల గ్రూపు లలో వాట్సాప్ లో చెక్కర్లు కొడుతున్నది.సామాజిక మాధ్యమాల ద్వారా బడిబాటను ప్రచారం చేస్తున్న చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయ బృందమును, ఒగ్గుకథ కళాకారుడు నర్ర సతీష్ యాదవ్ ను మరియు అతని బృందాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషిని నడికూడ మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు అభినందించారు.
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో. నిర్వహించిన ప్రజావాణి లో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడుసత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు ప్రజావాణికి మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి –
ఘనంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు
గణపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, నిండు నూరేళ్ళు ప్రజా సేవలో, ప్రజా క్షేత్రంలో ప్రజల పక్షాన పనిచేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పోలసాని నరసింహా రావు, బీఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు మేకల రజిత, నాయకులు బైరాగాని కుమారస్వామి, డాక్టర్ జన్నయ్య, మంద అశోక్ రెడ్డి, దాసరి రవి, బీఆర్ఎస్ యూత్ నాయకులు, ఆయా గ్రామాల గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు
గణపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, నిండు నూరేళ్ళు ప్రజా సేవలో, ప్రజా క్షేత్రంలో ప్రజల పక్షాన పనిచేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పోలసాని నరసింహా రావు, బీఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు మేకల రజిత, నాయకులు బైరాగాని కుమారస్వామి, డాక్టర్ జన్నయ్య, మంద అశోక్ రెడ్డి, దాసరి రవి, బీఆర్ఎస్ యూత్ నాయకులు, ఆయా గ్రామాల గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారిని కలిసి మెమొరండా ఇవ్వడమైనది. అనంతరం దనసరి రాజేష్ రాష్ర్ట జాయింట్ సెక్రటరీ ఆదివాసి సంక్షేమ పరిషత్ మాట్లాడుతూ. పూర్తి ఏజెన్సీ మండలం అయినటువంటి బయ్యారం మండల పరిధిలోని ధర్మాపురం రెవేన్యూ గ్రామం నామలాపాడు గ్రామపంచాయతీ పరిధిలో గిరిజన రైతులు మట్టితోలకాలకు అనుమతులు కావాలని గనులు మరియు భూగర్భ శాఖకు దరఖాస్తు చేసుకున్నారని వారు 6000 మెట్రిక్ టన్నుల మట్టి తోలకాలకు పెసా గ్రామసభ తీర్మానం చేసి పంపమని చెప్తున్నా మైనింగ్ AD చెప్తున్నారు తప్ప ఆ మట్టిని రైతు పొలాల్లోకా లేక వ్యాపారవేతలకా అని చెప్పకపోవడం వారిచ్చే సర్కిలర్ లొ ఎంత లోతు మట్టి తవ్వకాలు జరుగుతాయి అని ఏం తెలుపకుండా పేసా కమిటీ ద్వారా తీర్మానం చేసి పంపండి అని చెప్పడం దురదృష్టకరం. ఇక్కడ మైనింగ్ అధికారులు మట్టి తోలకాల అనుమతులపై పూర్తి సమాచారం ఇవ్వకుండా ఒక సర్కులర్ పంపి ఆ తీర్మానం ఇవ్వండి అంటున్నారే తప్ప ఇప్పటివరకు మట్టి తోలకాలు చేసినటువంటి వారు మట్టి తోలకాల ద్వారా ఆ ఆదాయం ద్వారా ఆ గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు చెల్లించాలి అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతూ గిరిజనుల పేరుతో ఈ మట్టి దందలో గిరిజనేతరులను ప్రోత్సహించడం సిగ్గుచేటు ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమ మట్టి దంద పైన ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరలకు అనుమతులు ఇస్తున్న గనులు మరియు భూగర్భ శాఖ అధికారులను తప్పుడు గ్రామ సభ తీర్మానాలు ఇస్తున్న గ్రామపంచాయతీ సెక్రటరీలను విధుల నుండి తొలగించాలని ఈ అక్రమ వ్యాపారం పైన గత రెండు సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ గారికి రెండు సంవత్సరాల నుండి దరఖాస్తులు ఇచ్చినా కూడా అక్రమ మట్టి తోలకాల పైన అక్రమ ఇటుక బట్టీల పైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్ తో మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపినారు.
అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టానికి విరుద్ధంగా ధర్మపురం రెవెన్యూ, కొత్తపేట రెవేన్యూ, గంధంపల్లి రెవేన్యూ మరియు కాసినపల్లి రెవేన్యూ పరిధిలో గిరిజనేతరులు అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను తొలగించాలి జిల్లా అధికారులు చిత్తశుద్ధితో అనుమతులు లేని ఇటుక బట్టీల పై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్,ఉపాధ్యక్షులు మంకిడి సురేష్ డివిజన్ అద్యక్షులు తాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
· Civil Supplies Commissioner Devendrasingh Chauhan gave interview to ‘Neti Dhathri’ Editor Katta Raghavendra Rao
· Fine rice distribution caused people to feel happy
· ‘Fine rice’ distribution is a revolutionary decision
· People are appreciating the State Government in this regard.
· ‘It is fortunate for me to launch this programme during my tenure’.
· ‘This remains a challenge in discharging my duties’.
· ‘We have proved that distribution of fine rice is possible.
· This remains an example for the sincerity of the Government
· Millers have key role in distribution of fine rice
· All types of required assistance extended to millers
· Any miller can approach me to explain their problems
· Fine rice distribution is depends on the strength of millers system
· ‘ISO’ also issued certificate for distribution of fine rice
· ‘Five Star’ rating remains an example for the success of fine rice distribution
· People are now feeling happy
· Representatives from other states inquiring about this fine rice distribution
· Jharkhand minister and officials came here to know about his fine rice distribution
· We explained them with power point presentation
· Representatives from five states already came here and observed at field level
· They took some advises regarding the distribution method of this fine rice.
· Four decades back then Govt. Implemented one kg rice for Rs.2/-
· Now present Govt. Successfully implementing this free rice distribution.
· Telangana remains No.1 in food security.
Katta Raghavendra Rao: ‘Namaste Sir’
Devendra Sing Chowhan: ‘Namaste’
Katta: ‘How are you sir?’
Chowhan: ‘Fine…what about you?’
Katta: “Happy sir…there is wide spread positive talk on fine rice. How is the impact of this fine rice distribution among the people?
Chowhan: Really speaking this is an excellent feeling. Providing sufficient food to poor people is really a best scheme. No other scheme can be compared with this scheme. This is mainly meant to fulfill the daily needs of the people. Especially the schemes related to food, shelter, cloth remains in the hearts of people forever. Such governments those implementing these schemes will always receive the support of the people. Providing daily essentials to people is not new. In previous so many governments implemented them. But distribution of fine rice to poor is totally different when compare with them because it provides food security for the needy people. Rs.2/- per kg rice scheme had been implemented since 1985, which provided food security to people. This scheme implemented just four decades back. In those days I think fine rice cost around Rs.4/- per kg. After some time some other governments felt it is not possible to distribute rice at a cost of Rs.2/- per kg and raise the cost to Rs.5/-. After NTR government, during the tenure of Kotla Vijayabhaskar Reddy as Chief Minister, rice distributed to poor with a cost of Rs.1.90 per kg. Later Chandrababu Naidu government increased the rate. After winning the 2004 elections, Dr. YS Rajasekhar Reddy implemented Rs.2/- per Kg. Rice scheme. Then the market price of rice was around Rs.10/- per kg. Later Kirankumar Reddy reduced the cost further to Rs.1/- per kg. Since then, rice distribution has been continuing with affordable prices to poor. When compare to previous schemes, the present distribution of fine rice is unique one and revolutionary in nature. At present fine rice market price is around Rs.50/- per kg. In this situation free distribution of fine rice is really an appreciable one. In previous when ‘doddu biyyam’ distributed, people used to sell out it in the market and continue to purchase fine rice. News regarding this situation published in news papers also. Now distribution of fine rice caused some burden free on poor people. Now it is very happy to see that entire society transformed to the level of consuming the fine rice. Especially the poor people are very happy towards the government for providing them fine rice. They are also happy to consume such fine rice. In previous, these poor people used to sell out their ‘doddu biyyam’ in the market and used to purchase fine rice paying higher prices. Now that situation has been changed. There is no difference in between poor, middle class and upper class. All people have been consuming fine rice equally.
‘Katta’: How you are feeling on receiving ‘ISO’ certificate?
‘Chowhan: ‘I can’t explain this happiness in words. While issuing the certificate they identified the fact about quality rice being distributed to poor. This rice contains more nutrients than the fine rice that available in the market. That means Government not only concentrating on food security but also on health security. This is the main reason name and fame received for ‘fine rice’ scheme implementing in Telangana. In this back ground ISO certificate issued to Civil Supplies department. Now people are happily consuming the fine rice. I wish them all to lead happy and healthy life.
Katta: What is the impact of this scheme in other states?
Chowhan: The implementation of fine rice scheme created repercussions in other states. Now there is growing demand for fine rice distribution in other states. Government representatives from other states are telephoning to give some time to know about this scheme. Jharkhand minister along with government officials came here and observed how this scheme has been implemented. They felt astonished on successful implementation of this scheme. We have explained them with power point presentation on how the scheme being implemented in Telangana. After knowing about this, they returned to their state with fixed mind to implement this scheme. Really speaking this scheme is the brain child of Chief Minister Revanth Reddy. Minister Uttamkumar Reddy also has been working hard for proper implementation of this scheme. As head of implementing authority I feel very happy for the success of this scheme.
Katta: Rice millers have key role in implementation of this scheme. But it is said that they are also facing some problems.
Chowhan: Yes Rice millers play key role in implementing this scheme. On this occasion I express my congratulations to them.
Katta: It is said that millers wants to meet you to detail their problems.
Chowhan: They are always welcome to meet me. They can tell me the problems being faced. I am available for every miller and they can meet me any time to get proper solutions for the problems being faced. There is no discrimination between small and big miller. Even if you know about any problem they faced, can bring it to my notice. I will immediately attend and resolve the issue being faced. I am ready to give appointment to any miller who wants to meet me. Millers have key role in making success this fine rice scheme in the state. There is no question of negligence. Any miller in single or in group will get immediate appointment with me. I am always being available for them.
Katta Raghavendra Rao: Thank you sir. Let us meet once again.
రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం పై డిమాండ్
బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోటఆగయ్య
సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలులో కనీస అవసరాలు తీర్చలేకుండా పోయిందని, ఐకెపి సెంటర్లో గానీ, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కనీస అవసరాలు లేకుండా పోయిందని, నేడున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పట్ల వివక్షపాతంతో కనీస అవసరాలు తీర్చకుండా మద్దతు ధర ప్రకటించకుండా ఈ ప్రభుత్వం కాలం గడుపుతూ పని చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా రైతుల ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు ఖాతాలో ఇంతవరకు డబ్బులు పడకుండా ఉండకపోవడం దారుణమని తెలియజేశారు ఇలాంటి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అదోగమనంగా ఉందని వివరించారు. నేడు పాకాల వర్షంతో అనేక మంది రైతులకు పంట నష్టం వాటిల్లిన వారికి తగిన పరిహారం ప్రభుత్వం కల్పించాలని తెలియజేశారు. అంతేకాకుండా నేడు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా పాలన అని చెప్పి, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ,రైతుల సమస్యలు , నిరుద్యోగు లను పట్టించుకోకుండా, చేనేత కార్మికులు కూడా పట్టించుకోకుండా కాలం గడుపుతూ ముందుకు సాగుతుంది అని తెలియజేశారు, అడ్డదారి పీఠమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏమి పట్టించుకోక, అవినీతి పాలనగ రాష్ట్ర మేలుతున్నారని తెలియజేశారు. అంతేకాకుండా ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తూ రైతులకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, టౌన్ ఉపధ్యక్షులు ఎండి సత్తార్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజబీకార్ రాజన్న, వరస కృష్ణహరి, గుండారపు కృష్ణారెడ్డి, వెంగళ శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, మాట్ల మధు, గుండు ప్రేమ్ కుమార్, ఇమ్మనేని అమర్నాథ్, బండి జగన్ ఒగ్గు బాల్ లింగం, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగలులోని మార్కెట్ చైర్మెన్ శ్రీమతి యాట గీతా నర్సింహ సొంత డబ్బుతో రైతుల కోసం బోజనాలు ఏర్పాటు చేసి మంచి మనసు చాటుకున్న మార్కెట్ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ ముదిరాజ్ మార్కేట్ ఆవరణలోని రెైతులు బోజనాలు చేస్తూ సంతొషం వ్యక్తం చేశారు.
ఆమనగల్లు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ లో వడ్లు అమ్మటానికి వచ్చిన రైతుల కోసం సోమవారం నుండి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ బోజనాలు, మంచి నీళ్ళ వసతులు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రెైతులు బోజనాలు చేస్తూ సంతొషం వ్యక్తం చేస్తూ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహకు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటి వరకు ఈ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతుల కోసం ఎవ్వరూ బోజనాలు ఏర్పాటు చేయలేదు, మొదటి సారి రైతుల కోసం బోజనాలు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ ముదిరాజ్ గారికి మరొక్కసారి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
అలాగే రైతుల కోసం క్వింటాల్ కి రూ 500 బోనస్ ఇస్తున్న ప్రజా ప్రభుత్వంకి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని అన్నారు.
రైతులను ఆదుకోవాలని సంకల్పంతో రైతుల కోసం ఎన్నో చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎప్పటికి రుణపడి ఉంటాము అని పలువురు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న మంచి పనుల పై సంతొషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ వస్పుల శ్రీశైలం, తాళ్ళ రవీందర్, అజీమ్,రమేష్ గౌడ్, నరేష్ నాయక్,అంజయ్య గుప్తా, శ్యామసుందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ చేగురి వెంకటేష్, యూత్ కాంగ్రెస్ కల్వకుర్తి ఉపాధ్యక్షుడు షాబుద్దీన్ , మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వస్పుల శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజానాయకుడు ఆపద వస్తే అండగా ఉండే నాయకుడు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘనంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 60 వ జన్మదిన వేడుకలు
*-కేక్ కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేస్తున్న బి ఆర్ఎస్ నాయకులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పేదల పెన్నిధిగా..ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని..ఆపదొస్తే అండగా ఉండే భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ లు కేక్ కట్ చేసి, సీట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన గండ్ర వెంకట రమణారెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, అభివృద్ధి అంటేనే గండ్ర వెంకట రమణారెడ్డి గుర్తుకు వచ్చేలా..భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే సున్నితమైన మనసు కలిగిన గండ్ర వెంకట రమణారెడ్డి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో..నిండు నూరేళ్లు..ఆయురారోగ్యాలతో..అష్టైశ్వర్యాలతో..మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు చేసే యోగ్యం కల్పించాలని ఆ దేవున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.
49 సార్లు రక్తదానం చేసిన పీ ఇ టి మురళీకృష్ణ ను సన్మానం చేసి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అభినందించారు ప్రజలకు అత్యవసరమైన సేవలలో రక్తం తయారు చేసేది కాదని ఒకరూ ఇస్తేనే వస్తుంది అలాంటిది 49 సార్లు ఇచ్చి 49 మందిని రక్షించిన మురళీకృష్ణ సమాజానికి ఎంతో సేవ చేశాడని, రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని కొత్త రక్తం వచ్చి మన ఆరోగ్యం గా ఉంటామని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఆపదలో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడలని కోరా రు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు రిటైర్డ్ ఎం ఈ ఓ ధర్మారెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు అహ్మద్, ఎస్సీ ,ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు,ఐక్యవేదిక నాయకులు గౌనికాడి యాదయ్య, కురుమూర్తి,శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రాజెక్టు తెలంగాణలో ప్రారంభమైన నేపథ్యంలో మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలిపారు.కాగా రాష్ట్ర వ్యాప్త నమోదు కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని అని మండలాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఏ.డీ.ఏ మాట్లాడుతూ రైతుల విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు త్వరలో మీ సేవ కేంద్రాల్లోనూ చేసుకోవచ్చని అన్నారు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన, పట్టాదారు పాసుపుస్తకంలోని భూయాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డును కేటాయిస్తారని పేర్కొన్నారు.రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు పథకాలు అమలు చేస్తోందని వాటికి సరైన గణాంకాలు, ధ్రువీకరణలు, నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడంలేదని కేంద్రం గుర్తించిందని ఏడీఏ వివరించారు.ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోని భూములు,పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయని, రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్రా సమాచారం అందడం లేదని దీంతో వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారిందని పేర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తిచేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ‘అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.కాగా ప్రక్రియ పట్ల మండల వ్యవసాయ అధికారులు (ఎంఏవో), వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు శిక్షణ ఇచ్చిందన్నారు.
విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు వ్యవసాయ శాఖ..
Agriculture
విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కోసం భూయాజమాన్య పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్, ఫోన్ నంబర్‌తో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.కాగా ఎంఏవో లేదా ఏఈవో వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారని ఏడీఏ దామోదర్ రెడ్డి తెలిపారు.ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్‌లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పథకాలకు సంబంధం లేదు..
రైతుల విశిష్ట సంఖ్యకు.. రాష్ట్రంలో అమలయ్యే రైతుభరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు..రాష్ట్రంలో చట్టబద్ధ భూయాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొందని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలియజేశారు.
మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ప్రధానోపాధ్యాయురాలు ఏ.భద్రమ్మ తెలిపారు.
Students
ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 19 వరకు నిర్వహించబడుతుందని చెప్పారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డ్రాయింగ్, డాన్స్ క్రాఫ్ట్ కరాటే, గేమ్స్ మరియు స్పోర్ట్స్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పలు శిక్షణలు ఉంటుందన్నారు.ఈకార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులుజ్ మాజీ సర్పంచ్, గ్రామ కార్యదర్శి దేవేందర్,ఉపాధ్యాయులు కృపాల్,దేవేందర్,తాజుద్దీన్,కిషన్, పద్మశ్రీ,వాలంటీర్స్ పాల్గొన్నారు.
సంఘీ ఎలేందర్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షులు
వరంగల్, నేటిధాత్రి
రాజీవ్ యువ వికాస పథకాన్ని సిబిల్ స్కోరు ఆధారంగా అమలు చేయడం వలన అసలు లబ్ధి పొందాల్సిన పేద ప్రజలకు ఇది అందని ద్రాక్షగా మారుతుందన్న ఆవేదనను తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీ ఎలేందర్ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బ్యాంకు బాధితులుగా మారిన ఎంతో మంది పేద కుటుంబాలు గతంలో తీసుకున్న లోన్లు, వాటికి సంబంధించిన చెల్లింపులు కట్టని కారణంగా వారి సిబిల్ స్కోర్ దెబ్బ తినడం జరిగింది. ఇప్పుడు అదే సిబిల్ స్కోర్‌ను రాజీవ్ యువ వికాస పథకానికి అర్హతగా మారుస్తే, దాదాపు 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది అన్నారు. ప్రస్తుతం 16.25 లక్షల మంది పథకానికి దరఖాస్తు చేసిన నేపధ్యంలో, ఇంత పెద్ద సంఖ్యలో పేదలు ఈ అవకాశాన్ని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పథకం కింద నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడతాయి కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బ్యాంకు అధికారులతో చర్చించి, సిబిల్ స్కోరు వంటి అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది అని ఆయన విజ్ఞప్తి చేశారు.
దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యమని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు. నర్సంపేట మాదన్నపేట రోడ్ సిపిఐ కాలనీ వద్ద ఉన్న కామ్రేడ్ పంజాల చంద్రమౌళి 8 వ వర్ధంతి సందర్భంగా స్తూపం ఏర్పాటు చేశారు.కాగా స్థూపం వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మేకల రవి మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి పేదప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించి
దున్నేవాడికి భూమి కావాలని నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కావాలని అనేక భూ పోరాటాలు చేసి భూములను సాధించిన చరిత్ర కలిగిన పంజాల చంద్రమౌళిది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ సభకు అధ్యక్షత వహించగా సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శిలు ఎస్కే బాష్మియా పనస ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు లక్ష్మణ్ అక్క పెళ్లి రమేష్ తోట చంద్రకళ జిల్లా నాయకులు కందిక చెన్నకేశవులు గడ్డం యాకయ్య మియాపురం గోవర్ధన్ పాలక కవిత భానోతు వీరు నాయక్ చింతకింది కుమారస్వామి అయిత యాకయ్య గడ్డం నాగరాజు అక్బర్ ఇల్లందులసాంబయ్య యాదగిరి సతీష్ మమతా శైలజ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.