తిరుపతి నాయక్ ను పరమర్శించిన మాజీఎమ్మెల్యే సుంకేరవిశంకర్
కరీంనగర్ నేటిధాత్రి:
బిఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభ విజయవంతం కొరకు బస్సుల ఏర్పాట్లు కార్యక్రమంలో ప్రైవేట్ కాలేజీకి వెళ్లిన సందర్భంగా మాజీ కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు తన కాలికి ఫ్రాక్చర్ అయి గాయపడిన విషయం తెలుసుకొని తిరుపతి నాయక్ స్వగృహం చింతకుంట శాంతి నగర్ లో కలిసి పరామర్శించిన చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్.
ఈసందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన విషయాలు తెలుసుకుని త్వరగా కోలుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పార్టీ కార్యక్రమంలో భాగంగా తన కాళ్లకు అయినా గాయాన్ని సైతం లెక్కచేయకుండా రజతోత్సవ సభకు విజయవంతం అవ్వాలని తిరుపతి నాయక్ పడిన తపనకు పార్టీ అధిష్టానం ముందు తప్పక ఉంచుతానని పార్టీ మంచి గుర్తింపు ఇస్తుందని పార్టీ కోసం కష్టపడే వారిని కేసీఆర్ ఎప్పటికీ తమ యదిలో ఉంచుకుంటారని రవిశంకర్ తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు గంగయ్య, తదితరులు ఉన్నారు.